👉ఇమ్రాన్ కోసం ఏక‌మైన 14 మంది క్రికెట్ దిగ్గ‌జాలు..👉 ఒంగోలు అభివృద్ధి కై పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసిన ప్రముఖులు..👉నయా మోసం..*40 నిమిషాల్లో మీ బతుకు భస్మం 😱

👉ఇమ్రాన్ కోసం ఏక‌మైన 14 మంది క్రికెట్ దిగ్గ‌జాలు..

పాక్ కు లేఖ‌ ఈ నేప‌థ్యంలోనే ఇమ్రాన్ తో క‌లిసి ఆడిన ప్ర‌పంచ దిగ్గ‌జాలైన క్రికెట‌ర్లు చ‌లించిపోయారు. ఇమ్రాన్ విష‌య‌మై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ పాక్ ప్ర‌భుత్వానికి వివిధ దేశాల‌కు చెందిన 14 మంది క్రికెట‌ర్లు లేఖ రాశారు. ఒక‌టి కాదు రెండు కాదు.. దాదాపు 800 రోజులుగా జైల్లో ఒంట‌రి జీవితం. 70 ఏళ్లకు పైబ‌డిన‌ వ‌య‌సులో బ‌య‌టి ప్ర‌పంచమే తెలియ‌దు. రోజురోజుకు క్షీణిస్తోన్న ఆరోగ్యం.. అస‌లు వైద్యం అన్న మాటే లేదు. ఆయ‌నను చూడాలంటూ కుటుంబ స‌భ్యుల ఆరాటం.. కానీ, క‌ఠిన‌మైన ప్ర‌భుత్వం క‌నిక‌రించింది లేదు.. మ‌రి ఆ దిగ్గ‌జ క్రికెట‌ర్ క‌మ్ రాజ‌కీయ నేత‌ను బ‌య‌ట‌కు తీసుకొచ్చేది ఎలా? త‌న జీవితం జైలు గోడ‌ల మ‌ధ్య ముగిసిపోవాల్సిందేనా? వారి దేశానికి వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ అందించి ప్ర‌పంచ క్రికెట్లో ఉన్నత స్థానంలో నిలిపిన గొప్ప నాయ‌కుడి క‌థకు ఇదేనా ముగింపు? ఇవీ పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ విష‌యంలో ఇటీవ‌లి కాలంలో వ‌రుస‌గా వ‌చ్చిన ప్ర‌శ్న‌లు.. కానీ, స‌మాధానాలు లేవు..ఈ నేప‌థ్యంలోనే ఇమ్రాన్ తో క‌లిసి ఆడిన ప్ర‌పంచ దిగ్గ‌జాలైన క్రికెట‌ర్లు చ‌లించిపోయారు. ఇమ్రాన్ విష‌య‌మై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ పాక్ ప్ర‌భుత్వానికి వివిధ దేశాల‌కు చెందిన 14 మంది క్రికెట‌ర్లు లేఖ రాశారు. వీరిలో మ‌హిళా క్రికెట‌ర్లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.
⭐ప‌ద‌వి కోల్పోయి
స‌రిగ్గా నాలుగేళ్ల కింద‌ట మొద‌లైన ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ర‌ష్యాను స‌మ‌ర్థించారు అప్ప‌టి పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. స‌హ‌జంగానే ఆ త‌ర్వాత ఆయ‌న ప‌ద‌విని కోల్పోయారు. అవినీతి ఆరోప‌ణ‌ల‌తో అనంత‌రం జైలు పాల‌య్యారు కూడా. రెండున్న‌రేళ్ల‌కు పైగా జైల్లో ఒంట‌రి జీవితం గ‌డుపుతున్న ఆయ‌న ఆరోగ్యం క్షీణించింది. కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయిన‌ట్లు ఇమ్రాన్ న్యాయ‌వాదులు తెలిపారు. మూడు నెల‌లుగా త‌న‌కు స‌రైన వైద్యం అందించాల‌ని ఇమ్రాన్ కోరుతున్నా జైలు అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా చెప్పారు. అటు ఈ మాజీ ప్ర‌ధాని కుటుంబ స‌భ్యులు కూడా కొద్ది రోజుల కింద‌ట త‌మ‌వాడి ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.
🌟స‌హ‌చ‌ర ఆట‌గాడి కోసం..
ఇమ్రాన్ గొప్ప ఆల్ రౌండ‌ర్. త‌న త‌రంలో క‌లిసి ఆడిన దిగ్గ‌జాలు ఇమ్రాన్ గురించి ఆవేద‌న చెందుతున్నారు. వీరిలో భార‌త క్రికెట్ లో అత్యంత‌ ప్ర‌ముఖులైన సునీల్ గావ‌స్క‌ర్, క‌పిల్ దేవ్ కూడా ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన గ్రెస్ చాపెల్ స‌హా 14 మంది దిగ్గ‌జాలు మంగ‌ళ‌వారం పాక్ స‌ర్కారుకు లేఖ రాశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆయ‌న సోద‌రి అలీమా ఖ‌నుమ్ వ్య‌క్తం చేసిన ఆందోళ‌న‌ను పేర్కొన్నారు. ఆమె ఆవేద‌న‌తో తాము ఏకీభ‌విస్తున్న‌ట్లు చెప్పారు.
⭐లేఖ రాసింది వీరే..
గావ‌స్క‌ర్, క‌పిల్, క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్‌), డేవిడ్ గోవ‌ర్, నాజ‌ర్ హుస్సేన్, మైకేల్ అథ‌ర్ట‌న్ (ఇంగ్లండ్), స్టీవ్ వా, ఇయాన్ చాపెల్, గ్రెగ్ చాపెల్, అల‌న్ బోర్డ‌ర్ (ఆస్ట్రేలియా), మేకైల్ బ్ర‌య‌ర్లీ,జాన్ రైట్ (న్యూజిలాండ్)తో పాటు ఆసీస్ మ‌హిళ‌ల జ‌ట్టు మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్ ఉన్నారు.క్రికెట్లో పాకిస్థాన్ కు ఇమ్రాన్ అందించిన సేవ‌ల‌ను గుర్తిస్తూ.. ఆయన‌ నాయ‌క‌త్వాన్ని ప్ర‌స్తావిస్తూ..పాక్ ప్ర‌ధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ ఆలోచ‌న‌తో నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు.
👉 మంగళ వారం సి ఆర్ డి ఏ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపాదనలు అందజేసిన ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి,ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు,ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్,ఒంగోలు మేయర్ గంగాడ సుజాత,ఒంగోలు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు

👉నయా మోసం..*40 నిమిషాల్లో మీ బతుకు భస్మం 😱
*ఆదమరిస్తే అప్పుల్లో కూరుకుపోతారు*
ఇది సాధారణ ఫోన్ స్కామ్ కాదు…మరింత ప్రమాదకరం!
వాళ్లు మీ డబ్బు, పాస్‌వర్డ్, OTP అడగరు.
వాళ్లు కోరేది కేవలం మీ మంచితనం మాత్రమే!
మొహమాటానికి పోతే ముండకి కడుపైనట్లు అదే మీ కొంప ముంచుతుంది!!…తస్మాత్ జాగ్రత్త!!!
ఇటీవల మాల్స్, మెట్రో స్టేషన్స్, మార్కెట్లు, పబ్లిక్ ప్రదేశాలలో ఒక కొత్త మోసం జరుగుతోంది.
సాధారణంగా బాగా డ్రెస్ వేసుకున్న మధ్యవయసు లేదా వృద్ధులు ఇలా అంటారు:“నా ఫోన్ ఎలా వాడాలో తెలియదు” “పెన్షన్ చెక్ చేయాలి”…“తప్పుగా బటన్ నొక్కాను”“ఒక్కసారి చూసి చెబుతారా ”మీరు సహాయం చేస్తారని ఆశించి ఫోన్ మీ చేతిలో ఇస్తారు.
అసలు ప్రమాదం ఇక్కడ మొదలవుతుంది
ఆ ఫోన్ ఇప్పటికే:వీడియో కాల్‌లో ఉంటుంది లేదా
స్క్రీన్ రికార్డింగ్ ఆన్‌లో ఉంటుంది లేదా
ఫేస్ రికగ్నిషన్ అనుమతులు ఇచ్చి ఉంటుంది
అంటే…ఎవరో మీ ఐడెంటిటీ చూస్తూ ఉంటారు — మీరు మాత్రం సహాయం చేస్తున్నానని అనుకుంటారు
ఇది AI బయోమెట్రిక్ ఐడెంటిటీ స్కామ్.
వారు దొంగిలించేది:మీరు ఫోన్ పట్టుకుంటే → ఫింగర్ ప్రింట్
మీరు మాట్లాడితే → వాయిస్
మీరు స్క్రీన్ వైపు చూస్తే → ఫేస్ డేటా
ఈ మూడు కలిస్తే —మీ డిజిటల్ క్లోన్ తయారు చేయవచ్చు.
తరువాత ఏమవుతుంది?
మీ పేరుతో:ఆన్‌లైన్ లోన్స్…క్రెడిట్ ఫైనాన్స్…క్యాష్ లోన్స్
ఫేస్ & వాయిస్ వెరిఫికేషన్ ఆటోమేటిక్‌గా పాస్ అవుతుంది.
30 నిమిషాల్లో మీ పేరుతో లక్షలు/కోట్ల అప్పు తీసుకుంటారు
మీ డబ్బు పోదు…మీరు అప్పుల్లో మునిగిపోతారు
తప్పక గుర్తుంచుకోండి –
3 నియమాలు..1. పరిచయం లేని వ్యక్తి ఫోన్ ఎప్పుడూ చేతిలో తీసుకోకండి… 2.తెలియని వీడియో కాల్స్ వెంటనే కట్ చేయండి.. 3.కెమెరా ముందు. మాట్లాడమంటే అసలు మాట్లాడకండి….చివరి హెచ్చరిక
“నేను తెలివైన వాడిని — నాకు ఏమీ జరగదు”
అనే నమ్మకాన్నే మోసగాళ్లు వాడుకుంటారు.
మీ కుటుంబ సభ్యులు, పెద్దలు, పిల్లలకు తప్పకుండా చెప్పండి.ఒక్కరికి చెప్పడం = ఒకరిని కాపాడటం.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్