👉బంగారం ధర ₹ లక్షకు తగ్గుతుందా?*
అమెరికా, రష్యా మధ్య డాలర్తో వాణిజ్యం జరిగితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘US డాలర్తో ట్రేడ్కు రష్యా సిద్ధమవుతోందని బ్లూమ్బర్గ్ చెప్పింది. అదే జరిగితే 10 గ్రాముల గోల్డ్ ₹1 లక్షకు పడిపోవచ్చు. 2027 చివరి నాటికి ₹90 వేలు- లక్ష మధ్య స్థిరపడొచ్చు’ అని స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ అన్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1.57 లక్షలుగా ఉంది.
👉 పరిగి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగి, బోరున విలపించిన కాంగ్రెస్ కౌన్సిలర్.,
కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మోసం చేశాడని నిరసనకు దిగిన ఒకటవ వార్డు కౌన్సిలర్ అక్కమ్మ..
వైస్ చైర్మన్ పదవి ఇస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చి రామ్మోహన్ రెడ్డి మాట తప్పాడని బోరున విలపించిన అక్కమ్మ.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన
👉 సీఐని పోయి బాత్రూంలు కడగమనండి…సీఐ శివకుమార్‌పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం…వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఉద్రిక్తత..సీఐ శివకుమార్ మంత్రికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపాటు…ఈ క్రమంలో బీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో భారీగా మోహరించిన పోలీసులు
👉కూటమి ప్రభుత్వ బడ్జెట్ చూస్తే …గతంలో మాదిరే అపద్దాలు, మోసాలు, కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి.. కడప :
కూటమి ప్రభుత్వ బడ్జెట్ చూస్తే …గతంలో మాదిరే అపద్దాలు, మోసాలు, కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయని వైసీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ రెడ్డి ఆరోపించారు.
గత 3 యేళ్లుగా ఆడబిడ్డ నిధి అనేది ఉసే లేదు…నిరుద్యోగ భృతిని పట్టించుకున్న పరిస్ధితి లేదు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 యేళ్లకు ఇస్తామన్న పెన్షన్ పథకం అతీగతి లేదు.
మిగిలిన వాటిని అరకొర కేటాయింపులే చేశారు …
గత వైసీపీపై బురదజల్లే కార్యక్రమం…చంద్రబాబుకు భజన చెయ్యడం తప్ప..ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిందేమీ లేదు…సూపర్ సిక్స్ మాత్రమే కాదు ఎన్నికల సమయంలో చంద్రబాబు 136 హామీలు.136 హామీల అమలు కథ అటుంచితే సూపర్ సిక్స్ హామీలకే గతి లేదు.
రెండేళ్లలోనే 3.25 లక్షల కోట్ల అప్పులు చేశారు.
గత ప్రభుత్వంలోను 3.19 లక్షల కోట్లు అప్పులు చేశాం.
కానీ సంక్షేమ కార్యక్రమాలను మ్యానిఫెస్టోలో చెప్పినట్లు అమలు చేశాం.
65 శాతం వ్యవసాయం పై అధారపడిన రాష్ర్టంలో …
గత ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్ద పీఠ వేయడం జరిగింది.
రైతు భరోసా, పెట్టుబడి నిధి కింద సాయం చెయ్యడం జరిగింది.
భూసార పరీక్షలు మొదలు విత్తనాలు, ఎరువులు తప్పక సకాలంలో ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో యూరియా కోసం కోట్లాడుకోవల్సిన పరిస్ధితి.
కనీసం డిఎపి కూడా ఇఛ్చే పరిస్ధితి లేదు.
ఈ ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళిక, కేటాయింపులు ఉండటం లేదు.
రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్ధితి లేదు.
రైతులకు ఇచ్చే సున్నా వడ్డీ అసలుకే లేదు.
అన్ని పంటలకు కనీస మద్దతు ధర అసలే లేదు.
ప్రతి పంట సాగు చేసిన రైతులు నష్టపోయిన పరిస్ధితిని చూస్తున్నాం…ఇక బడ్జెట్ ఉద్యోగుల ప్రస్తావనే లేదు..
రాయలసీమ నీరందించే రాయలసీమ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టుల ప్రస్తావన లేదు.
నీరు రాకుంటే తెలంగాణా వాళ్లు తీసుకుంటే మనకు నీళ్లు రావు.ఓటుకు నోటు కేసులో రేవంత్, చంద్రబాబులు తోడు దొంగలు..కాబట్టి ఎపిని రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారు.
కూటమిది లోపభూయిష్టమైన బడ్జెట్ తప్ప మరొకటి కాదు.
వైఎస్ఆర్ హాయంలో నాభూతో నా భవిష్యత్తు అన్నట్లుగా పాలన సాగింది.
ఆరోగ్య శ్రీ ద్వారా పేదలందరికి మెరుగైన వైద్య అందేలా చేస్తే
ఈ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసే పని చేస్తుంది.
గతంలో ఆరోగ్య శ్రీ 2 లక్షల వరకే ఉంటే.. వైఎస్ జగన్ రూ. 25 లక్షలకు పెంచారు
ఇప్పుడు అసలే లేకుండా చేసి.. కేంద్రం ప్రవేశపెట్టిన పథకమే ఇక్కడ అమలు చేసే పని చేస్తున్నారు.
గత ప్రభుత్వం ఆర్ధిక విధ్వంసం అంటూ వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు…
ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేదే అసలైన విధ్వంసం…
సంపద సృష్టి పేరుతో వచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారు…తల్లికి వందనం కింద 30 లక్షల మంది పిల్లలకు ఎగరగొట్టారు…ఈ యేడాది కూడా రూ.1312 కోట్లు అవసరం ఉంటే… రూ.846 కోట్లే కేటాయించారు
రెండవ యేడాది అరకొర గానే అమలు చేశారు.
ఒక్క కొత్త రేషన్ కార్డు లేదు… ఇళ్లు కట్టించింది లేదు ..
ప్రభుత్వం తక్షణం శ్వేత పత్రం విడుదల చెయ్యాలి..
ప్రజలు అన్ని గమనిస్తున్నారు… తగిన బుద్ధి చెప్పడం ఖాయం
👉అవయవదాత చిన్నారికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికిన కేరళ*.
కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాత.. 10 నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహంకు రాష్ట్రం కన్నీటి వీడ్కోలు పలికింది. ఐదుగురికి ప్రాణం పోసి తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఆ చిన్నారికి ఆదివారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక కార్యక్రమానికి వందలాది మంది హాజరై నివాళులర్పించారు. పథనంతిట్ట జిల్లాలోని ఓ చర్చిలో జరిగిన అంత్యక్రియల సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుఃఖాన్ని దిగమింగుతూ తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువుటద్దమని పలువురు కొనియాడారు.
ఫిబ్రవరి 5న జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చిన్నారి అలిన్ తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతయ్యలతో కలిసి ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె ఫిబ్రవరి 12న బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో అలిన్ కాలేయం, కిడ్నీలు, గుండె కవాటాలు, కళ్లను ఐదుగురికి అమర్చారు. “మాటలకు అందని బాధలోనూ ఆ తల్లిదండ్రులు అవయవదానం చేసి కేరళ స్ఫూర్తిని చాటారు” అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసించారు.
👉ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల*
*మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని పచ్చ జెండా ఊపి ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు*.

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు. మన గిద్దలూరు మండలానికి 35 రిక్షాలు, గ్రీన్ అంబాసిడరెస్ అయిన మీరు మీకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరూ 250 గృహాల నుండి చెత్త సేకరించి పరిశుభ్రంగా ఉంచడంలో మీది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కావున గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీతో చెత్త సేకరణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు,సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు*
👉ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తెల్ల కార్డు వారు సహాయం పొందేందుకు విధి విధానాలు…..
ఆరోగ్యశ్రీ లో కానీ కొన్ని సర్జరీల కోసం ప్రభుత్వం ఇచ్చే LOC (Letter of Commitment) ఒక వరంలా పనిచేస్తుంది. దీని గురించి పూర్తి అవగాహన కోసం ఈ క్రింది విషయాలు తెలుసుకోండి.
అసలు LOC అంటే ఏమిటి?!
LOC అంటే ఒక రకమైన హామీ పత్రం. “ఫలానా రోగికి అయ్యే చికిత్స ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుంది” అని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఆసుపత్రికి ఇచ్చే ఒక నమ్మక పత్రం. ఇది ఉంటే ఆసుపత్రి వారు సర్జరీ చేస్తారు. కొన్ని చోట్ల కొద్దిగా రిమైనింగ్ అమౌంట్ కట్టాల్సి ఉంటుందని గమనించండి.
* స్టెప్ 1: ఆసుపత్రి నుండి ఎస్టిమేషన్ లెటర్ (Estimation Letter) తీసుకోవాలి. ముందుగా రోగిని ప్రభుత్వం గుర్తించిన (Empaneled) నెట్‌వర్క్ ఆసుపత్రిలో చేర్పించాలి. వైద్యులు పరీక్షించి సర్జరీ అవసరమని నిర్ధారించాక దానికి ఎంత ఖర్చవుతుందో వివరిస్తూ ఒక ఎస్టిమేషన్ లెటర్ (దీనినే చాలామంది LOC లెటర్ అంటారు) ఇస్తారు.
* స్టెప్ 2: ఎమ్మెల్యే (MLA) గారి సిఫార్సు.
ఆసుపత్రి ఇచ్చిన ఎస్టిమేట్ లెటర్‌తో పాటు రోగి యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ (బియ్యం కార్డు) ఫోటోకాపీలను తీసుకుని మీ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఎమ్మెల్యే గారి చేత సిఫార్సు లేఖ (Recommendation Letter) తీసుకోవాలి.
* స్టెప్ 3: సీఎం ఆఫీస్ నుండి కమిట్మెంట్ లెటర్.
ఈ పత్రాలన్నింటినీ ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆన్‌లైన్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు లేదా మీరు నేరుగా సచివాలయంలో అందజేయవచ్చు. వివరాలను పరిశీలించాక ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆసుపత్రికి నేరుగా LOC (కమిట్మెంట్ లెటర్) అందుతుంది.
* స్టెప్ 4: సర్జరీ ప్రారంభం..ఆసుపత్రికి ఈ లెటర్ అందగానే వారు రోగికి అవసరమైన ఆపరేషన్ లేదా చికిత్సను ప్రారంభిస్తారు, దీని కోసం మీరు ఆసుపత్రికి నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు కానీ కొన్ని చోట్ల కొంత అమౌంట్ కట్టాల్సిఉంటుంది అది వచ్చిన ఆ రోగం పైన ఆధారపడి ఉంటుంది.
గమనిక: అత్యవసర సమయాల్లో ఈ ప్రక్రియ వేగంగా జరిగేలా స్థానిక ప్రజాప్రతినిధులు సహకరిస్తారు.ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. ఎవరికైనా ఆపద సమయంలో ఇది ప్రాణాలను కాపాడవచ్చు కదా.
👉సివిల్ సెటిల్‌మెంట్లలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారా? మిమ్మల్ని స్టేషన్‌కు పిలిచి బెదిరిస్తున్నారా?*
భూమి గొడవలు, డబ్బు లావాదేవీలు లేదా ఆస్తి తగాదాలు (Civil Disputes) ఉన్నప్పుడు పోలీసులు అందులో తలదూర్చడానికి వీల్లేదు. కానీ చాలా సందర్భాల్లో పోలీసులు ఒక పక్షం నుండి డబ్బు తీసుకుని అవతలి వారిని స్టేషన్‌కు పిలిచి భయపెడుతుంటారు.
⭐ వాస్తవాలు (The Facts):
• సుప్రీంకోర్టు తీర్పులు: సివిల్ గొడవల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో (ఉదా: లలిత కుమారి కేసు) స్పష్టంగా చెప్పింది.
• పోలీస్ మాన్యువల్: సివిల్ వివాదాల పరిష్కారం పోలీసుల పరిధిలోకి రాదు. వాటిని కోర్టులు మాత్రమే తేల్చాలి.
⭐ మీరు చేయాల్సినవి …
1. ధైర్యంగా అడగండి: పోలీసులు ఫోన్ చేసి “ఫలానా భూమి గొడవలో స్టేషన్‌కు రా” అంటే, “సార్ అది సివిల్ మేటర్, కోర్టులో ఉంది. నేను రాను” అని చెప్పే హక్కు మీకు ఉంది.
2. హైకోర్టులో పిటిషన్: పోలీసులు మిమ్మల్ని పదే పదే పిలిచి వేధిస్తుంటే, మీ అడ్వకేట్ ద్వారా హైకోర్టులో “Writ of Mandamus” వేయవచ్చు. “సివిల్ గొడవలో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశించండి” అని కోరవచ్చు. ఇలా చేస్తే ఆ పోలీస్ అధికారిపై కోర్టు సీరియస్ అవుతుంది.
3. పై అధికారులకు ఫిర్యాదు: మీ ప్రాంతపు DCP లేదా SP కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి. “ఫలానా అధికారి సివిల్ విషయంలో జోక్యం చేసుకుని నన్ను బెదిరిస్తున్నారు” అని చెప్పండి.
4. వాయిస్ రికార్డింగ్: పోలీసులు సెటిల్‌మెంట్ కోసం మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు లేదా డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు కచ్చితంగా రికార్డ్ చేయండి.
👉బంగారం ధర ₹ లక్షకు తగ్గుతుందా?* …👉 పరిగి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగి, బోరున విలపించిన కాంగ్రెస్ కౌన్సిలర్…👉సీఐ శివకుమార్‌పై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం(TS) …👉కూటమి ప్రభుత్వ బడ్జెట్ చూస్తే …గతంలో మాదిరే అపద్దాలు, మోసాలు : వైసీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ రెడ్డి …👉అవయవదాత చిన్నారికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికిన కేరళ*..👉ముఖ్యమంత్రి సహాయనిధి నుండి తెల్ల కార్డు వారు సహాయం పొందేందుకు విధి విధానాలు… 👉ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల*
Recent Posts

