👉కాంగ్రెస్ కి హ్యాపీ డేస్ కంటిన్యూ…రీజనిదే ? ..👉 ఎ పి లో నేతన్నలకు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్*…👉ఆర్ఎస్ఎస్ తరహాలో జనసేన.. డిప్యూటీ సీఎం పవన్ బిగ్ టార్గెట్ ఫిక్స్ !!!…👉ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు.. 👉హై టెన్షన్ నడుమ తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం*..👉 ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్…👉బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే ఇండిపెండెంట్ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు – ఆర్ఎస్ ప్రవీణ్.. 👉 జేడీ లక్ష్మినారాయణ.. ఇక మేఘా గ్రూపు ఉద్యోగి!

👉కాంగ్రెస్ కి హ్యాపీ డేస్ కంటిన్యూ…రీజనిదే ?

తెలంగాణా రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు సాగుతోంది.మొన్న పంచాయతీలలో అత్యధిక సీట్లు సాధించింది. తెలంగాణా రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడుగా ముందుకు సాగుతోంది. మొన్న పంచాయతీలలో అత్యధిక సీట్లు సాధించింది. నిన్నటికి నిన్న మునిసిపల్ ఎన్నిలల పోరులో మెజారిటీ సీట్లను సొంతం చేసుకుంది. ఇక ఇదే ఉత్సాహంతో మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా పచ్చ జెండా ఊపేస్తోంది. కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పై దాటింది. ఈ మధ్యలో వచ్చిన ప్రతీ ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలుస్తూ ఉంటే విపక్షాలు చతికిలపడుతున్నాయి. దానికి వారు చెప్పే రీజన్ అధికార దుర్వినియోగం అని ఇతరత్రా అని చెబుతున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలీ అంటే తెలంగాణాలో నెలకొన్న రాజకీయమే కాంగ్రెస్ కి శ్రీరామ రక్షగా ఉంది అని అంటున్నారు.అదేలా అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. త్రిముఖ పోరుతో : తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ బీజేపీ ఉన్నాయి. ఈ మూడు పార్టీల నడుమే ఫైట్ ఎపుడూ సాగుతూ ఉంటుంది. కాంగ్రెస్ మీద ప్రజలలో వ్యతిరేకత ఉండడం సహజం. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి. మరి ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి అవతల వైపు చూస్తే విపక్షం చీలి ఉంది. బీఆర్ఎస్ బీజేపీ మేమే ఆల్టర్నేషన్ అని జబ్బలు చరుస్తూ జనంలోకి వస్తున్నాయి. దాంతో ఈ వ్యతిరేకత ఆ పార్టీల మధ్య ఓట్లుగా విభజించబడుతోంది.దీంతో కాంగ్రెస్ పని సులువు అవుతోందని అంటున్నారు. ** కలిసే సీన్ లేదు : ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే మాత్రం కాంగ్రెస్ కి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఈ రెండు పార్టీల ఐక్యతతో కాంగ్రెస్ బండికి బ్రేకులు పడతాయి.లెక్కలు కూడా అలాగే ఉన్నాయి. మునిసిపల్ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓటు షేర్ శాతాలను చూసినా ఆదే ఉంది. కానీ ఈ పార్టీలు కలిసేది లేదు. అది అసాధ్యం అని చెప్పాలి. ఎలాగంటే బీఆర్ఎస్ ని ఎంత తగ్గిస్తే తాము అంత ముందుకు పోగలం అన్నది బీజేపీ ఎత్తుగడ. పైగా తెలంగాణాలో ఏకైన ప్రాంతీయ పార్టీగా బీఆర్ ఎస్ ఉంది. ఆ పార్టీ బలం తగ్గిస్తే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో నేరుగా ఢీ కొడితే తమకు ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా ఫలితాలు వస్తాయని అధికారం దక్కుతుందని బీజేపీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో ఉంది. ఇక బీఆర్ ఎస్ విషయం తీసుకుంటే ముస్లిం మైనారిటీలు ఇతర వర్గాల మీద ఆధారపడిన పార్టీ. ఆ పార్టీ ఓటు బ్యాంక్ కూడా అక్కడే ఉంది. అదే బీఆర్ఎస్ బీజేపీతో జత కడితే ఆ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ కి షిఫ్ట్ అవుతుందని తమకు మరింతగా ఇబ్బంది అవుతుందని గులాబీ పార్టీ లెక్కలేస్తోంది. ** గతంలో అలా : ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు బీజేపీ బాగా సీట్లూ ఓట్లూ సంపాదించింది అంటే దానికి కారణం విపక్షంలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీలో వర్గ పోరు అనాసక్తి ఉదాశీనత వంటి కారణాల వల్ల బీజేపీ దూకుడు రాజకీయం చేసింది. పైగా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ని తగ్గించాలని చేసిన వ్యూహాలు బీజేపీ ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి. కానీ ఇపుడు మొత్తం సినారియో రివర్స్ లో ఉంది. అందుకే బీజేపీ గతం మాదిరిగా పుంజుకోలేకపోతోందని అంటున్నారు. తెలంగాణాలో ఈ త్రిముఖ పోరు సాగినంత కాలం కాంగ్రెస్ కి ఎదురు ఉండదనే అంటున్నారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చి బీఆర్ఎస్ బీజేపీలలో ఏదో ఒక పార్టీ ని స్ట్రాంగ్ గా సపోర్టు చేస్తూ ఏకమొత్తంగా ఓట్లు అన్నీ ఆ పార్టీకే వేసేంతవరకు కాంగ్రెస్ కి అన్నీ హ్యాపీ డేస్ నే అని అంటున్నారు.కాంగ్రెస్ సైతం ఈ లెక్కలను గమనించు కుంటూనే తమదైన రాజకీయం చేస్తూ విజయ తీరాలలో విహరిస్తోంది అన్నది విశ్లేషకుల మాట.
👉నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్*

✦రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో హామీ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ యజమానులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే._*
✦ఆ హామీకి అనుగుణంగా అర్హులైన నేత కుటుంబాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో ‘నేతన్నల ఉచిత విద్యుత్’ పథకానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో వేలాది చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గనుంది. ఈ నిర్ణయంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ముఖ్యమంత్రి చంద్రబాబుకు నేతన్నల కుటుంబాల తరఫున కృతజ్ఞతలు తెలిపారు._
👉ఆర్ఎస్ఎస్ తరహాలో జనసేన.. డిప్యూటీ సీఎం పవన్ బిగ్ టార్గెట్ ఫిక్స్ ఏపీలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేనాని పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. ఏపీలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేనాని పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ విస్తరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో అన్నివర్గాలకు పార్టీని చేరువ చేయాలని భావిస్తున్న పవన్ కేడర్ ను ఇకపై కొత్త పేర్లతో పిలవనున్నట్లు ప్రకటించారు.మిత్రపక్షం బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ పదాధికారులను పిలిచే తరహాలో ఈ పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తలను జన సైనికులు అని, మహిళా కార్యకర్తలను వీర మహిళలుగా పిలిచేవారు. ఇప్పుడు కొత్తగా మూడు పేర్లను పవన్ ప్రతిపాదించారు. ఇవి వినేందుకు సంస్కృత పదాలుగా ఉన్నా, పార్టీ వర్గాల్లో ఆ పేర్లపై విస్తృత చర్చ జరుగుతోంది.పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా తొలి సభ్యత్వాన్ని పవన్ స్వీకరించారు. ఇందుకోసం విరాళంగా రూ.2 కోట్లను పార్టీకి చెల్లించారు. ఈ సమయంలో పవన్ పార్టీ విస్తరణపై భావోద్వేగం వ్యక్తం చేశారు. పదకొండేళ్ల క్రితం కేవలం 150 మందితో పార్టీని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత 2021లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడితే 90 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకున్నట్లు వివరించారు. ఈ సంఖ్య ఎన్నికల ముందు 6 లక్షలకు పెరిగిందని, క్రమంగా ఇప్పుడు 12.8 లక్షలకు చేరుకుందని వవన్ వెల్లడించారు. పార్టీని చిన్న చిన్న వ్యాపారాలు, కూలి పనులు చేసుకునే వారి నుంచి బాగా చదువుకున్న విద్యావేత్తలు, వృత్తి నిపుణులు భాగస్వాములయ్యారని పవన్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా పవన్ పార్టీలో కేడర్ ను మూడు వర్గాలుగా విభజిస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఒక్కోవర్గంలో ఉన్నవారిని ఆయా పేర్లతో పిలుస్తామని వెల్లడించారు. పార్టీలో ఇకపై ఉద్యమి, సాధక్, ప్రదాతగా మూడు బృందాలు ఉంటాయని పవన్ వెల్లడించారు.జనసేన భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, పార్టీ సిద్ధాంతాలు,ఆశయాలు,ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని,అలా పనిచేసేందుకు ముందుకు వచ్చేవారిని ‘ఉద్యమి’గా పిలుస్తామని చెప్పారు. అదేవిధంగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించేవారిని ‘సాధక్’గా వ్యవహరిస్తారు. ప్రజా, రాజకీయ పోరాటానికి పోరోక్షంగా తమవంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేధా సహాయ సహకారాలు అందించేవారిని ‘ప్రదాత’ అనే పేరుతో పిలుస్తారు. ఉద్యమి, సాధక్, ప్రదాత అన్న ఈ పదాలు వినేందుకు సంస్కృతంలా ఉన్నప్పటికీ ఆ పేర్లు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంటున్నారు.
** కేడర్ కు ఇలాంటి పేర్లు పెట్టడం ద్వారా వారిపై పవిత్రమైన బాధ్యత మోపుతున్నట్లు భావిస్తారని అంటున్నారు.ఇది ఆర్‌ఎస్‌ఎస్‌లోని’ప్రచారక్’, ‘విస్తారక్’,’స్వయంసేవక్’ వంటి పదజాలాన్ని గుర్తుచేస్తోంది.అంటే, రాజకీయాన్ని కేవలం ఓట్ల కోసం కాకుండా, ఒక ‘లక్ష్యం’ కోసం చేసే పనిగా మార్చడం పవన్ ఉద్దేశంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణను పెంచడానికి, కార్యకర్తల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కల్పించడానికి ఈ పేర్లు దోహదపడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా”నేను జనసేన కార్యకర్తను” అని చెప్పుకోవడం కంటే,”నేను ఒక సాదిక్” లేదా “ఉద్యమి” అని చెప్పుకోవడం ద్వారా వారిలో పదవులపై ఒక రకమైన గౌరవం,బాధ్యత పెరుగుతాయని అంటున్నారు. మరోవైపు జనసేన సిద్ధాంతాల్లో సనాతన ధర్మం, భారతీయత పట్ల గౌరవం ఉందని చాటిచెప్పడం కూడా పవన్ ఉద్దేశంగా చెబుతున్నారు.ఈ పదాలు వాడటం ద్వారా పార్టీ మూలాలు భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉన్నాయని చెప్పడం పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చు అంటున్నారు. మొత్తానికి, ఈ పేర్ల ద్వారా పవన్ కళ్యాణ్ జనసేనను ఒక “పొలిటకల్్ ఆర్మీ” తరహాలో తీర్చిదిద్దాలనుకుంటున్నారని అర్థమవుతోందని విశ్లేషిస్తున్నా. ఇది సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, ఒక క్రమశిక్షణ కలిగిన సంస్థాగత నిర్మాణానికి సంకేతంగా చెబుతున్నారు.
👉చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 62 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం.*
*టీమిండియా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్.*
*విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌కు భారీ స్కోరు అందించిన ఇషాన్ కిషన్.*
*అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్‌కు దక్కిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు.*
*వరల్డ్ కప్‌లో దాయాదిపై గెలుపుతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం.
👉హై టెన్షన్ నడుమ తొర్రూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం*
*మున్సిపల్ కార్యాలయం గేటు వద్దకు తోసుకొచ్చిన ఇరు పార్టీల నాయకులు*
*144 సెక్షన్ అమల్లో ఉన్న దూకుడు దగ్గరని కార్యకర్తలు*
తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్న బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకొని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుండాయిజం..
జనగామ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను అడ్డుకున్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అతని అనుచరులు అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు
ప్రతిఘటించి తొర్రూరుకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,సహా కౌన్సిలర్లు
👉*కడియం కావ్య తొర్రూరు లో ఓటు ఎలా వేస్తుంది…??
2025 లోనే వరంగల్ కార్పొరేషన్ లో ఆమె ఓటు తీసుకుంది…*అవసరం కోసం ఇప్పుడు తొర్రూరు వస్తా అంటే ఎట్లా…**తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో యంపి కడియం కావ్య కు ఓటు వేసే అవకాశం ఇవ్వద్దు… *మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ కు పిర్యాదు చేసిన మాజీమంత్రి సత్యవతిరాథోడ్, బిఆర్ఎస్ యువజనవిభాగం అధ్యక్షుడు యాళ్ళ మురళీధర్ రెడ్డి…*
👉నేడు తెలంగాణలో బిగ్‌డే*
మేయర్లు,చైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో పార్టీల వ్యూహాలు
ఇప్పటికే క్యాంప్‌లకు పార్టీల అభ్యర్థుల తరలింపు…
క్యాంప్‌ల నుంచి నేరుగాఎన్నికలకు రానున్న అభ్యర్థులు…
చివరి నిమిషం వరకు పార్టీల ప్రయత్నాలు…
నిన్న రాత్రి మంత్రులతో సీఎం రేవంత్ జూమ్‌ మీటింగ్
మేయర్లు, చైర్మన్‌ల ఎన్నికపై రేవంత్ దిశానిర్దేశం
👉 మహబూబాబాద్ జిల్లా డోర్నకల్…సీల్డ్ కవర్ రాజకీయాలు డోర్నకల్‌లో హాట్ టాపిక్…దోర్నకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన 11 మంది కౌన్సిలర్ అభ్యర్థులు హైదరాబాద్‌లో తెలియని క్యాంప్ రాజకీయాల్లో ఉన్నట్లు సమాచారం.
పార్టీ హైకమాండ్ సూచనల మేరకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పేర్లు “సీల్ కవర్”లో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ పేర్లను అందరూ అంగీకరిస్తున్నట్లు సంతకాలు చేసి, మున్సిపల్ కమిషనర్ చదివిన సమయంలో చేతులు ఎత్తి మద్దతు తెలపాలని ఆదేశించినట్లు సమాచారం.
రేపు మధ్యాహ్నం డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల అధికారులు అధికారికంగా చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లను ప్రకటించనున్నట్లు తెలిసింది.*డోర్నకల్ రాజకీయాల్లో “సీల్ కవర్ రాజకీయాలు” చర్చనీయాంశంగా మారాయి.*
👉విజయవాడ : గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్‌గేట్స్.*
*పొగమంచు వల్ల కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన బిల్‌గేట్స్ విమానం.. క్లియరెన్స్ లభించిన తర్వాత విమానాశ్రయంలో ల్యాండ్ అయిన బిల్‌గేట్స్ విమానం.*
*బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు.*
*బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికి, సచివాలయానికి బయలుదేరిన మంత్రి లోకేష్.*సచివాలయం మొదటి బ్లాక్ వద్ద బిల్‌గేట్స్‌కు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు.
👉ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు..*ఈనెల 18న అధికారులతో భేటి కానున్న సీఎం..?*
*మార్చిలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం..*మార్చిలోపు ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.498 కోట్లు రద్దు అయ్యే అవకాశం..*
*ఎన్నికల ఖర్చు ఎంత..? కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంత..? అనే విషయంపై ప్రభుత్వానికి వివరించనున్న అధికారులు..*
👉 ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్
…ఎదురు తిరిగిన ఓటర్లు…యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీలోని ఎన్నికల్లో ఒకటవ వార్డులో ఓడిపోయినందుకు తాను పంచిన డబ్బులు, చీరలు ,హాట్ బాక్స్‌లను తిరిగి ఇవ్వాలని ఓటర్ల ఇళ్లపైకి వెళ్ళి హల్చల్ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపరాణి, ఆమె కుటుంబ సభ్యులు
ఓటర్లు అందరూ ముకుమ్ముడిగా ఎదిరించడంతో, సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయిన స్వరూపరాణి….
👉 మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న క్యాంపులకు, పోలీసులు దౌర్జన్యంగా వచ్చి వారిని బెదిరిస్తున్నారు
ఫోన్ ట్యాపింగ్ ద్వారా క్యాంపు లొకేషన్ తెలుసుకుని, మఫ్టీలో పోలీసులను పంపిస్తున్నారు
బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే ఇండిపెండెంట్ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్….* రేపు చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఓటింగ్ జరుగుతుంది
మా పార్టీ క్యాంపుల నుండి అభ్యర్థులను బస్సులో తరలించే క్రమంలో, కాంగ్రెస్ కార్యకర్తలు బస్సుల మీద దాడి చేసి, మా అభ్యర్థులను బలవంతంగా తీసుకెళ్లి వారికి అనుకూలంగా ఓట్లు వేయించుకునే కుట్ర చేస్తున్నారని మాకు సమాచారం ఉంది.కాబట్టి పోలీసుల అండతో కాంగ్రెస్ నాయకులు చేసే ఇలాంటి అరాచకాలను ఆపాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాము – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్…
👉 జేడీ లక్ష్మినారాయణ.. ఇక మేఘా గ్రూపు ఉద్యోగి!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మేఘా గ్రూపులో ఉద్యోగంలో చేరారు. ఈవీ ట్రాన్స్ అనే కంపెనీలో ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ఆశించిన సక్సెస్ దక్కకపోవడంతో, ఆయన తిరిగి తన వృత్తిపరమైన కెరీర్‌పై దృష్టి సారించారు. రాజకీయాల్లో లేకపోయినా ఆయన స్వచ్చంద సంస్థ ద్వారా రైతులకు, యువతకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఇటీవల ఆయన కుటుంబం సైబర్ మోసానికి గురైంది. రెండున్నర కోట్ల వరకూ నష్టపోయింది. దీంతో ఆయనకు ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది. చివరికి ఆయన ఉద్యోగాన్ని ఎంచుకున్నారు.
సీబీఐ జేడీగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు,గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసీ మైనింగ్ కేసులను అత్యంత పకడ్బందీగా డీల్ చేసి లక్ష్మీనారాయణ వార్తల్లో నిలిచారు.చివరికి లంచాలు తీసుకుంటున్న జడ్జిలను కూడా పట్టుకుని వ్యవస్థలో తన నిజాయితీని చాటుకున్నారు. అనంతరం మహారాష్ట్ర కేడర్‌కు వెళ్లిన ఆయన, పదవీకాలం ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి మళ్లీ వెళ్తున్నారనే సాకుతో ఆ పార్టీకి దూరమయ్యారు.
రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం ప్రయత్నించిన లక్ష్మీనారాయణ, క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణను ఓట్లుగా మలచుకోవడంలో విఫలమయ్యారు. 2024 ఎన్నికల ముందు ఆయన జై భారత్ నేషనల్ పార్టీ ని స్థాపించి, విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.అయితే,ఈ ఎన్నికల్లో ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది.కనీసం ఐదు వేల ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్ కోల్పోయారు.చివరికి ఆయన వీటన్నింటినీ వదిలేసి మళ్లీ ఉద్యోగానికి వెళ్తున్నారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్