👉కర్ణాటకలో పట్టుబడిన భారీ అవినీతి తిమింగలం..రూ.4.46 కోట్లు స్వాహా😱…👉రాజకీయ విరాళాల్లో బీజేపీకి రూ.3,157 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 298 కోట్లు!!!… 👉 ఎస్ టి యు ఆధ్వర్యంలో దద్దరిల్లిన కలెక్టరేట్ వద్ద ధర్నా.. ప్రకాశం మార్కాపురం జిల్లా .. 👉ఆలయాన్ని సందర్శించిన డిఎస్పి…*భధ్రత్ర ఏర్పాట్లు పరిశీలన…👉పోల‌వ‌రం జిల్లా గంగారం పీఎస్‌లో ఘ‌ట‌న‌…👉ఓ వివాహేత‌ర సంబంధం కేసులో తప్పించేందుకు డ‌బ్బు డిమాండ్…👉మున్సిపల్ శాఖ డైరీని ఆవిష్కరించిన మార్కాపురం మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు…

👉కర్ణాటకలో పట్టుబడిన భారీ అవినీతి తిమింగలం.. రూ.4.46 కోట్లు స్వాహా😱😱😱
ఆస్తికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో.. HM జనార్ధన్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సోదాలు
ఈ తనిఖీల్లో లోకాయుక్తకు 4.46 కోట్లు లభ్యం..
అతని ఆదాయంలో అది 216% అని తేల్చిన అధికారులు
జనార్ధన్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు..
ఇంత డబ్బు ఎక్కడదనే కోణంలో లోకాయుక్త విచారణ….
👉రాజకీయ విరాళాల్లో బీజేపీకి రూ.3,157 కోట్లు, కాంగ్రెస్‌కు రూ. 298 కోట్లు!!!
2024-25లో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా బీజేపీకి భారీగా విరాళాలు…
మొత్తం నిధుల్లో 82.52 శాతం వాటాతో బీజేపీకి అగ్రస్థానం
కాంగ్రెస్‌కు 7.81 శాతం, తృణమూల్‌కు 2.67 శాతం మాత్రమే దక్కిన నిధులు…
విరాళాలు అందించిన రాష్ట్రాల్లో తెలంగాణకు రెండో స్థానం
ఏడీఆర్ తాజా నివేదికలో వెలుగులోకి వచ్చిన కీలక గణాంకాలు…
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సింహభాగం దక్కించుకుంది. మొత్తం నిధుల్లో ఏకంగా 82.52 శాతం వాటాను కమలం పార్టీయే పొందగా, మిగిలిన పార్టీలు చాలా వెనుకబడ్డాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక ఈ సంచలన వివరాలను వెల్లడించింది.
**ఏడీఆర్ నివేదిక ప్రకారం 2024-25లో ఎలక్టోరల్ ట్రస్టులు వివిధ రాజకీయ పార్టీలకు కలిపి మొత్తం రూ. 3,826.35 కోట్లను పంపిణీ చేశాయి. ఇందులో బీజేపీ ఒక్కదానికే రూ. 3,157.65 కోట్లు అందాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి కేవలం రూ. 298.78 కోట్లు (7.81 శాతం), తృణమూల్ కాంగ్రెస్‌కు రూ. 102 కోట్లు (2.67 శాతం) మాత్రమే లభించాయి. మిగిలిన 19 పార్టీలకు కలిపి రూ. 267.92 కోట్లు అందాయి.
విరాళాలు అందించిన కార్పొరేట్ సంస్థల్లో ఎలివేటెడ్ అవెన్యూ రియాల్టీ ఎల్ఎల్‌పీ రూ. 500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాటా సన్స్ (రూ. 308 కోట్లు), టీసీఎస్ (రూ. 217 కోట్లు), మేఘా ఇంజినీరింగ్ (రూ. 175 కోట్లు) ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర నుంచి అత్యధికంగా రూ. 1,225 కోట్లు రాగా, తెలంగాణ నుంచి రూ. 358 కోట్లు అందడం గమనార్హం.
దేశంలో మొత్తం 20 రిజిస్టర్డ్ ఎలక్టోరల్ ట్రస్టులు ఉండగా, కేవలం 10 ట్రస్టులు మాత్రమే తమ విరాళాల వివరాలను సమర్పించాయి.ఇంకో 5 ట్రస్టులు తమకు విరాళాలే రాలేదని తెలిపాయి. మరో 5 ట్రస్టుల నివేదికల గడువు ముగిసినా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవని ఏడీఆర్ తన విశ్లేషణలో పేర్కొంది.ఈ లెక్కలు కూడా బయటకు వస్తే విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా శివరాత్రి వేడుకలు జరుపుకోవాలి..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు..

మహాశివరాత్రి సందర్బంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శివాలయాలు మరియు ఇతర దేవాలయాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. డీఎస్పీలు, సీఐలు,ఎస్సైలతో జిల్లా ఎస్పీ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రత, ట్రాఫిక్ మరియు పలు అంశాలపై సమీక్షించి పలు సూచనలు తెలియచేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని ప్రధాన శివాలయాలు ప్రాంతాల్లో జరిగే జాతరలు, ప్రత్యేక పూజలు, రాత్రి జాతర కార్యక్రమాలు వంటి వాటిని గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల వద్ద అదనపు సిబ్బందిని మోహరించాలని, మహిళా భక్తుల భద్రత దృష్ట్యా మహిళా పోలీసులను నియమించాలని ఆదేశించారు.
భక్తులు క్యూలైన్‌లో సజావుగా దర్శనం చేసుకోవటానికి బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని, తోపులాటలు, గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ఎక్కువగా జరిగే కార్యక్రమాల సందర్భంలో ప్రత్యేక గస్తీ బృందాలను నియమించాలని, సీసీటీవీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆలయాల సమీపంలో తాత్కాలిక పార్కింగ్ ప్రదేశాలు గుర్తించి, వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ మళ్లింపులు చేయాలన్నారు. దర్శనానికి వచ్చే వారు భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన నగలు, మొబైల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో భగవంతుని దర్శించుకునేలా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.జిల్లాలో పొదిలి, త్రిపురాంతకం, భైరవకోన, మడనూరు మరియు మొదలైన ప్రాంతలోన్ని ప్రముఖ దేవాలయాలు వద్ద శివరాత్రి ఉత్సవాలు మరియు రథోత్సవాలు జరుగుతున్నాయని, పండుగ ఉత్సవాలు, ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎక్కువ సిబ్బందితో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డు లో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, పూర్తి స్ధాయి బందోబస్తుతో అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఏమైనా ఉంటే స్థానిక పోలీసు వారికి గాని లేదా 112/100 నంబర్లకు గాని తెలియపరచాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కనిగిరి డిఎస్పి పి.సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు సిబ్బంది ఉన్నారు.
👉 ఎస్ టి యు ఆధ్వర్యంలో దద్దరిల్లిన కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రకాశం మార్కాపురం జిల్లా

ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల కు తన మేనిఫెస్టో ప్రకటించిన హామీలు తక్షణమే అమలు పరిచే విధంగా రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం భాగంగా మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద STU మార్కాపురం జిల్లా అధ్యక్షులు టి కె యస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమం నకు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంగళరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షలు యర్రయ్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమము లో ప్రధాన కార్యదర్శి ఆర్ దేశా నాయక్, ఆర్థిక కార్యదర్శి సిహెచ్ గాలయ్య మరియు భారీ సంఖ్య లో రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు వివిధ మండలాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమం లో పాల్గొన్నారు.రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంగళ రెడ్డి మాట్లాడుతూ నాలుగు పెండింగ్ డి ఏలను ప్రకటించాలి. మెమో. 57 మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింప చేయాలి.అనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రయ్య మాట్లాడుతూ సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు టి కె యస్ ప్రసాద్ మాట్లాడుతూ పిఆర్సి కమిషన్ ను నియమించి 30% మధ్యంతర భృతి ప్రకటించాలి. దీర్ఘకాలిక ఆర్థిక బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించి వెంటనే బకాయిలను ఉద్యోగులకు చెల్లించాలి అనీ డిమాండ్ చేశారు.ప్రధాన కార్యదర్శి దేశా నాయక్ మాట్లాడుతూ పెన్షన్ సౌలభ్యాలు పదవీ విరమణ చేసిన మరుసటి రోజు ఉద్యోగికి అందించాలి డిమాండ్ చేశారు. కార్యక్రమం అనంతరం STU నాయకులు ర్యాలీ గారు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు కు వినతి పత్రం అందచేశారు.సిపిఐ నాయకులు అందె నాసరయ్య, కాసిం మద్దతు తెలిపినారు.ఈ కార్యక్రమంలో కనిగిరి డివిజన్ నుండి నరసింహారెడ్డి, తిరుపతి రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి,శ్రీలత, రాజా మరియు వారి కార్యవర్గ సభ్యులు అలాగే గిద్దలూరు డివిజన్ నుండి రాఘవరెడ్డి,చెంచయ్య, సూరాని వెంకటేశ్వర్లు, బివి నారాయణ, శివప్రసాద్, జడ్ సి రంగయ్య,రాంప్రసాద్, రంగస్వామి, గురవయ్య,ఎస్ వి ప్రసాద్,జాన్సన్, శివశంకర్, రవిచంద్ర రెడ్డి, రహమత్ భాష,మహమ్మద్ భాష, కృపానందం,మేరీ కార్లియన్,సోఫియా రాణి, జయశ్రీ, ఉషారాణి,అరుణ కుమారి,పద్మావతి, అనురాధ, రత్నావళి, కాసిం వలి, వెంకటేశ్వర్లు, ఆర్ వెంకటేశ్వర్లు, ఇబ్రహీం మరియు వారి కార్యవర్గ సభ్యులు అలాగే మార్కాపురం డివిజన్ నుండి అక్కల నారాయణ, వెంకటరమణ,గురవయ్య,యూసఫ్ షరీఫ్, రాందాసు మరియు వారి కార్యవర్గ సభ్యులు పాల్గొని ధర్నా కార్యక్రమం విజయవంతం చేయడం జరిగినది.
👉ప్రకాశం మార్కాపురం జిల్లా మున్సిపల్ శాఖ డైరీని ఆవిష్కరించిన మార్కాపురం మున్సిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు… “ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్” యొక్క డైరీ కమ్ హ్యాండ్ బుక్ ను మార్కాపురం పురపాలక సంఘ కమీషనర్ DVS నారాయణరావు చే ఆవిష్కరించడమైనది. సదరు కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ డివిఎస్ నారాయణరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా మున్సిపల్ ఉద్యోగులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని మరియు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ యూనియన్ ప్రతి ఒక్క మున్సిపల్ ఉద్యోగికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక యూనియన్ గా మేమున్నాం అంటూ ఒక హామీని కల్పించినదిఅని అలాగే అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. కృష్ణ మోహన రావు కి మరియు కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. సదరు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు మార్కాపురం మునిసిపల్ మేనేజర్ యు ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మరియు మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ టపా ఖాదర్ వలి మార్కాపురం పురపాలక సంఘ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూపాల్ రెడ్డి రెవిన్యూ అధికారి షేక్ సోహిల్ అహ్మద్ GSW మేనేజర్ శేఖర్ బాబు టౌన్ ప్లానింగ్ అధికారి కె శ్రీనివాసులు శానిటరి ఇన్స్పెక్టర్ బి చెన్నకేశవులు పురపాలక సంఘ సీనియర్ సహాయకులు శ్యామ్ విజయకుమార్ పద్మావతి వంశీ జూనియర్ సహాయకులు తల్లమ్ ప్రసాద్ ,తాడి సత్యనారాయణ , గుమ్మా ప్రసాద్ పి వెంకటయ్య,కిరణ్ ,చప్పిడి శ్రీనివాసులు వినయ్ కార్యాలయ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొనుట జరిగినది.
👉ఆంధ్రప్రదేశ్..వెస్ట్ గోదావరి జిల్లా…పోల‌వ‌రం జిల్లా గంగారం పీఎస్‌లో ఘ‌ట‌న‌…ఓ వివాహేత‌ర సంబంధం కేసులో తప్పించేందుకు డ‌బ్బు డిమాండ్…
వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న భ‌ర్త‌పై కేసు పెట్టిన మొద‌టి భార్య‌…ఈ కేసులో చ‌ర్య‌లు తీసుకోకుండా ఉండేందుకు భ‌ర్త శివ నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్…ఏసీబీని ఆశ్ర‌యించిన బాధితుడు..లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై వెంక‌టేష్‌, కానిస్టేబుల్ వీర‌బాబు
👉ఆలయాన్ని సందర్శించిన డిఎస్పి…*భధ్రత్ర ఏర్పాట్లు పరిశీలన…స్వామివారికి ప్రత్యేక పూజలు…*
*రధొత్సవ ఏర్పాట్లపై ఆరా…*
మార్కాపురంజిల్లా పొదిలి నిర్మమహేశ్వరస్వామి వారిని కనిగిరి డిఎస్పి సాయిఈశ్వర్ యశ్వంత్ సందర్శించారు.
మహశివరాత్రి సందర్భంగా భద్రత ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.రధొత్సవం సందర్బంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే ఆవకాశం ఉన్నందున రద్దిని తట్టుకునేందుకు ఆలయ సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చారు.
శాంతిభద్రతలకు ప్రత్యేక టింలు నిరంతరం పర్యవేక్షించే విధంగా చూడాలని ఆయన కొరారు._
ఈ సందర్బంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ కమీటి ఆధ్వర్యంలో డిఎస్పి కి ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సి.ఐ రాజేష్ కుమార్,ఎస్సై ఎస్.రాజేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
👉పాకాల బీచ్ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం: పటిష్ట భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దిశానిర్దేశం.*
ఈ నెల 14,15 తేదీలలో నిర్వహించనున్న సింగరాయకొండ,పాకాల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతితో పాటు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు వెల్లడించారు.సింగరాయకొండ సర్కిల్ అధికారులతో నిర్వహించిన బ్రీఫింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. బీచ్ ఫెస్టివల్‌కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక ట్రాఫిక్ క్రమబద్ధీకరణ,పార్కింగ్ వసతులు మరియు సముద్ర స్నానాల వద్ద ప్రమాదాలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పండుగ వాతావరణంలో జరిగే ఈ వేడుకల్లో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ జారీ చేసిన నియమాలు, మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.ముఖ్యంగా సముద్ర తీరంలో లోతైన ప్రాంతాలకు వెళ్లవద్దని, పోలీసుల సూచనలు పాటించి వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్