👉అగ్రరాజ్యాల అధినేతలే అతడికి బందీలు..ఎప్‌స్టీన్ ‘కామ’ కథలు.. ప్రముఖుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్…!!! 👉పార్లమెంట్‌లో మళ్లీ సమరం.. రాహుల్ సభ్యత్వం రద్దుకై తీర్మానం..

👉పార్లమెంట్‌లో మళ్లీ సమరం.. రాహుల్ సభ్యత్వం రద్దుకై తీర్మానం భారత పార్లమెంటరీ చరిత్రలో అరుదుగా వినిపించే ‘స్వతంత్ర తీర్మానం’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భారత రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. గతంలో అనర్హత వేటుతో మొదలైన రాజకీయ యుద్ధం ఇప్పుడు ‘స్వతంత్ర తీర్మానం’ రూపంలో కొత్త మలుపు తిరిగింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన నిర్ణయంతో లోక్‌సభలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్‌సభలో స్వతంత్ర తీర్మానం భారత పార్లమెంటరీ చరిత్రలో అరుదుగా వినిపించే ‘స్వతంత్ర తీర్మానం’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్‌కు నోటీసు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సాధారణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు కాకుండా ఒక సభ్యుడు స్వయంగా ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఇచ్చే ప్రతిపాదనను ఈ తీర్మానంగా పరిగణిస్తారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు.. దీని వెనుక లోతైన రాజ్యాంగపరమైన వ్యూహాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఏంటీ ‘స్వతంత్ర తీర్మానం’? పార్లమెంటు నిబంధనల ప్రకారం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలను చర్చకు తెచ్చేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఇది ప్రభుత్వం తరపున వచ్చే తీర్మానం కాదు. ఒక ఎంపీ వ్యక్తిగత హోదాలో స్పీకర్‌కు ప్రతిపాదన పంపుతారు. కేవలం చర్చ కోసం కాకుండా ఒక నిర్దిష్ట నిర్ణయాన్ని సభ్యత్వ రద్దు వంటివి తీసుకోవాలని ఈ తీర్మానం కోరుతుంది. స్పీకర్ అనుమతిని బట్టి దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరగడమే కాకుండా చివరలో ఓటింగ్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ఈ తీర్మానాన్ని సభ ముందు ఉంచాలా లేదా అన్నది పూర్తిగా లోక్‌సభ స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. రాజకీయ ప్రతీకారమా? నియమావళి అమలునా? ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషణలు భిన్నంగా ఉన్నాయి.”రాహుల్ గాంధీ నిరంతరం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని,సభ హుందాతనాన్ని దెబ్బతీస్తున్నారని అందుకే ఈ చర్య అవసరమని బీజేపీ వర్గాలు వాదిస్తున్నాయి.
అయితే దీనిని విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంగా రాజకీయ ప్రతీకార చర్యగా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు రాహుల్ సభ్యత్వ రద్దు అంశం తెరపైకి రావడంతో సభలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. స్పీకర్ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది. నిషికాంత్ దూబే పంపిన ఈ స్వతంత్ర తీర్మానాన్ని స్పీకర్ ఆమోదిస్తారా? లేక తిరస్కరిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ స్పీకర్ దీనికి పచ్చజెండా ఊపితే సభలో రాహుల్ గాంధీ ప్రవర్తన లేదా సభ్యత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే, రాహుల్ సభ్యత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇది దేశవ్యాప్త నిరసనలకు లేదా న్యాయపోరాటాలకు దారితీయవచ్చు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంపీల సభ్యత్వం రద్దు అనే అంశం ఎప్పుడూ సెన్సిటివ్ సబ్జెక్టే. రాహుల్ గాంధీ విషయంలో మళ్లీ అటువంటి ప్రయత్నం జరగడం భవిష్యత్ రాజకీయ సమీకరణాలను మార్చేలా ఉంది. పార్లమెంట్ వేదికగా సాగే ఈ ‘చదరంగం’లో గెలుపెవరిదో వేచి చూడాలి.
👉అగ్రరాజ్యాల అధినేతలే అతడికి బందీలు..ఎప్‌స్టీన్ ‘కామ’ కథలు ప్రపంచ రాజకీయ యవనికపై ఒక ఫైనాన్షియర్‌గా బిలియనీర్‌గా వెలిగిపోయిన పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్.కానీ ఆ ముసుగు వెనుక ఉన్న అసలు రూపం ఒక కరడుగట్టిన నేరగాడిది.ప్రపంచ రాజకీయ యవనికపై ఒక ఫైనాన్షియర్‌గా బిలియనీర్‌గా వెలిగిపోయిన పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్.
కానీ ఆ ముసుగు వెనుక ఉన్న అసలు రూపం ఒక కరడుగట్టిన నేరగాడిది. టీనేజ్ బాలికలను వేటాడి.. వారిని శక్తివంతులైన వ్యక్తులకు ఎరగా వేసి, ఒక అంతర్జాతీయ సె*క్స్ ట్రాఫికింగ్ రాకెట్‌ను నడిపిన ‘కామరూప పిశాచి’ ఇతడు. 2019లో జైలు గదిలో అతని మరణం ఒక రహస్యంగా మిగిలిపోయినా అతడు వదిలివెళ్లిన ‘బ్లాక్ బుక్’ ఇప్పటికీ ప్రపంచ దేశాల అధినేతలను, దిగ్గజాలను నిద్రపోనివ్వడం లేదు. సామాన్యుడి నుంచి ‘వాల్‌స్ట్రీట్’ మాయావి వరకు 1953లో న్యూయార్క్‌లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఎప్‌స్టీన్ ప్రయాణం ఆశ్చర్యకరం. డిగ్రీ కూడా పూర్తి చేయని వ్యక్తి, గణితంలో తనకున్న పట్టుతో ఏకంగా డాల్టన్ స్కూల్‌లో టీచర్‌గా చేరిపోయాడు. అక్కడే విద్యార్థినులపై ఇతని కన్ను పడింది. ఆ తర్వాత ఆర్థిక రంగంపై పట్టు పెంచుకుని వాల్‌స్ట్రీట్ దిగ్గజాల సరసన చేరాడు. తాను ఒక నిఘా సంస్థ ఏజెంట్‌నని ప్రచారం చేసుకోవడం ద్వారా తన చుట్టూ ఒక మిస్టరీని సృష్టించుకున్నాడు.
*’లోలితా ఎక్స్‌ప్రెస్’ పాపపు ద్వీపం ఎప్‌స్టీన్ తన అక్రమ సామ్రాజ్యాన్ని కేవలం భవనాలకే పరిమితం చేయలేదు. వర్జిన్ ఐలాండ్స్‌లో ‘లిటిల్ సెయింట్ జేమ్స్’ అనే సొంత ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. అక్కడికి మైనర్ బాలికలను తరలించడానికి ఒక ప్రైవేట్ జెట్‌ను ఉపయోగించేవాడు. లోలితా ఎక్స్‌ప్రెస్ అని ఈ విమానానికి స్థానికులు పెట్టిన పేరిది. ఈ జెట్ ఫ్లైట్ లాగ్స్‌లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతులైన వ్యక్తుల పేర్లు ఉండటం గమనార్హం. తన భవనాల్లోని ప్రతి గదిలో రహస్య కెమెరాలు అమర్చి, ప్రముఖుల ప్రైవేట్ క్షణాలను రికార్డు చేసేవాడు. దీని ద్వారా వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడనే ఆరోపణలు ఉన్నాయి. * వలలో చిక్కుకున్న ‘పెద్ద తలకాయలు’ ఎప్‌స్టీన్ డైరీలో లేదా అతనితో సంబంధాలు ఉన్న వారి జాబితాలో లేని ప్రముఖుడు లేడంటే అతిశయోక్తి కాదు. బిల్ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ వంటి మాజీ అధ్యక్షులు… వ్యాపార దిగ్గజాలైన బిల్ గేట్స్, ఎలాన్ మస్క్ వంటి టెక్ బిలియనీర్లు.. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ.. ఇలా వీరందరూ నేరంలో భాగస్వాములని తేలకపోయినా ఎప్‌స్టీన్‌తో వీరికున్న సాన్నిహిత్యం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
* గిస్లైన్ మాక్స్‌వెల్.. చీకటి వల విసిరిన సూత్రధారి ఎప్‌స్టీన్ ఒంటరిగా ఈ దారుణాలు చేయలేదు. అతనికి కుడిభుజంగా నిలిచిన మహిళ గిస్లైన్ మాక్స్‌వెల్. మోడలింగ్ ఛాన్సులు, స్కాలర్‌షిప్‌లు ఇప్పిస్తామని నమ్మబలికి పేద కుటుంబాలకు చెందిన మైనర్ బాలికలను ఎప్‌స్టీన్ వద్దకు చేర్చే బాధ్యత ఈమెదే. సుమారు 1,000 మందికి పైగా బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. –
*వ్యవస్థల వైఫల్యం.. అనుమానాస్పద మరణం
2008లో మొదటిసారి దొరికినప్పుడు, కేవలం 18 నెలల సాధారణ శిక్షతో ఎప్‌స్టీన్ బయటపడటం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఒక ‘సీక్రెట్ ప్లీ డీల్’ ద్వారా అతను తనపై ఉన్న కేసులను నీరుగార్చగలిగాడు. అయితే 2019లో మళ్ళీ అరెస్టయినప్పుడు పరిస్థితి మారింది. బెయిల్ రాకుండా జైలులో ఉన్న సమయంలోనే అతను అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో జైలు కెమెరాలు పనిచేయకపోవడం.. సెక్యూరిటీ గార్డులు నిద్రపోవడం వంటి అంశాలు ఇది హత్యేమో అన్న అనుమానాలను ఇప్పటికీ సజీవంగా ఉంచాయి.. న్యాయం జరిగిందా? జెఫ్రీ ఎప్‌స్టీన్ మరణంతో అతని రహస్యాలన్నీ సమాధి అయ్యాయని చాలామంది భావించారు.కానీ న్యాయస్థానాలు విడుదల చేస్తున్న ఫైళ్లు ఇప్పటికీ కొత్త నిజాలను వెలుగులోకి తెస్తున్నాయి.డబ్బు,అధికారంతో ఎంతటి ఘోరాన్నైనా కప్పిపుచ్చవచ్చని ఎప్‌స్టీన్ భావించాడు.. కానీ ప్రకృతి అతనికి శిక్ష విధించింది. అయితే అతని వెనుక ఉన్న ఆ ‘పెద్దల’ అసలు రంగు బయటపడినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం జరుగుతుంది.ఈ ఫైల్స్ లో మన దేశ ప్రధానమంత్రి తో పాటు మన దేశానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు సైతం ఉండడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం చెలరేగుతుంది. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి 5 లక్షల మంది అదృశ్యం అయ్యారని, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి.. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోడీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి.. ముందు ఏమి జరుగుతుందో అనే దేశవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్