👉 రాహుల్ కి సింపతీ పెరుగుతుందా ?.. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ తన ఫైర్ ని అంతా బడ్జెట్ సెషన్ లో చూపిస్తున్నారు. పప్పు అని ఒకనాడు అన్న వారు అంతా నిప్పుగా మారిన రాహుల్ ని చూసి షాక్ తినే పరిస్థితి ఉంది. లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ తన ఫైర్ ని అంతా బడ్జెట్ సెషన్ లో చూపిస్తున్నారు. పప్పు అని ఒకనాడు అన్న వారు అంతా నిప్పుగా మారిన రాహుల్ ని చూసి షాక్ తినే పరిస్థితి ఉంది. ఆయన నేరుగా అధికార పార్టీ మీద చేస్తున్న విమర్శలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన తన ప్రసంగంలో వాడి వేడిని జోడిస్తూ నేరుగా ఎన్డీయే కూటమి మీద తన ఫోకస్ పెట్టి మరీ గట్టిగా టార్గెట్ చేస్తున్నారు..
🌟బడ్జెట్ చర్చలో సైతం : లోక్‌సభలో 2026-27 కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో నిర్దిష్టంగా ఏ వర్గానికి ప్రయోజనాలు లేవని విమర్శించారు. ఇంజనీరింగ్ ఐటీ రంగంలో A I వల్ల చాలా ఉద్యోగాలు పెను సవాళ్లను ఎదుర్కొంటాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన అమెరికా భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం దాని వెనక ఉన్న విషయాలను కూడా చెబుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా భారత మాతను అమ్మేశారు అంటూ ఆయన చేసిన సీరియస్
* యాక్షన్ కి రెడీ : ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద సీరియస్ యాక్షన్ కి ఎన్డీయే సర్కార్ రెడీ అవుతోంది అని అంటున్నారు. లోక్ స్సభలో బడ్జెట్ పైన చర్చ సందర్భంగాలో అధికార పార్టీ నాయకుల మీద నిరాధారమైన ప్రకటనలు చేసిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పడం విశేషం. *ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైన, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపైన రాహుల్ గాంధీ తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన హక్కుల ఉల్లంఘన అని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ అన్ని నిర్ణయాలు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నామని చెప్పారు. వారి ప్రయోజనాలకు భద్రత కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. కేంద్ర మంత్రి పూరీ అయితే రాహుల్ కి నిరాధారమైన విమర్శలు చేయడం అలావాటే అని మండిపడ్డారు.
*ఏమి జరుగుతుంది : ఇదిలా ఉంటే సభా హక్కుల నోటీసు ఇస్తే ఏమి అవుతుంది అన్న చర్చ మొదలైంది. పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యుల విశేషాధికారాలను ఉల్లంఘించినప్పుడు సభ గౌరవానికి భంగం కలిగించినప్పుడు ప్రవేశపెట్టే ఒక ముఖ్యమైన నోటీసుగా దీనిని పేర్కొంటారు. పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యులు తమ విధులు నిర్వర్తించడానికి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులు కలిగి ఉంటారు. ఉదాహరణకు సభ్యులు ఎవరైనా సభలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కలిగి ఉంటారు.అయితే తప్పుడు సమాచారం ఇవ్వకపోవడం సభ్యులను గౌరవించడం వంటివి చేయాల్సి ఉంటుంది.
*హక్కుల ఉల్లంఘన: ఇదే సమయంలో ఒక సభ్యుని హక్కులకు భంగం కలిగించినా లేక సభను తప్పుదారి పట్టించినా లేదా సభ గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించినా దానిని సభా హక్కుల ఉల్లంఘన గా పరిగణిస్తారు. దీనిని ఎదుర్కోవడానికి సభ స్పీకర్ లేదా చైర్మన్‌కు ఇచ్చే లిఖితపూర్వక ఫిర్యాదును సభా హక్కుల నోటీసు అని అంటారు. సభా హక్కుల నోటీసు ఎప్పుడు ఇస్తారు అన్నది చూస్తే సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చినప్పుడు అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే సభలో సభ్యులకు లేదా సభకు అవమానం జరిగినప్పుడు కూడా నోటీసు ఇస్తారు. సభ ప్రొసీడింగ్స్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినప్పుడు, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సరైన సమాధానం ఇవ్వకపోయినా లేక సమాచారాన్ని దాచిపెట్టినా, అమర్యాదగా ప్రవర్తించినా, ప్రివిలేజ్ మోషన్ తీసుకువస్తారు.
*ఈ ప్రక్రియ ఎలా అంటే : సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని భావించే సభ్యుడు లోక్ సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ కు లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలి. ఆ మీదట స్పీకర్ అనుమతితో సభలో చర్చ జరుగుతుంది. నోటీసు ఆమోదం పొందితే దానిని సభా హక్కుల కమిటీకి రిఫర్ చేస్తారు. ఈ కమిటీ ఆ అంశాన్ని విచారించి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ప్రకారం హక్కుల ఉల్లంఘన నిజమని తేలితే, సభ సంబంధిత సభ్యుడిని హెచ్చరించ వచ్చు లేదా శిక్షించవచ్చు.
*రాహుల్ దూకుడు : అయితే సభా హక్కుల నోటీసు ఇచ్చినా రాహుల్ గాంధీ అండ్ ఇండీ కూటమి ఎంపీలు వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద నోటీసు ఇచ్చి సభలో చర్చించి అనంతరం ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసే యాక్షన్ ని అమలు చేసినా రాహుల్ కి సానుభూతి వస్తుందని అంటున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ ఈసారి బడ్జెట్ సెషన్ లో మాత్రం తనలోని రెండవ కోణం చూపిస్తున్నారు. మరి సభలో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.
👉రెండో తరగతి విద్యార్థిని కొట్టిన టీచర్ పై ఫిర్యాదు
రాయచోటి టౌన్‌లోని శ్రీచైతన్య స్కూల్ (4 బ్రాంచ్)లో రెండో తరగతి చదువుతున్న సమీహా (7) అనే విద్యార్థిని, నోట్ బుక్‌లో ఒక పదాన్ని తప్పుగా రాసినందుకు టీచర్ విశ్వదీప్ వాతలు వచ్చేలా కొట్టారని సంబేపల్లె మండలం దేవ పట్లకు చెందిన విద్యార్థి తల్లి పెద్దపుత్త నబియా ఫిర్యాదు చేశారు.
వారి తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం తన కుమార్తె సమీహా పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి, నీరసంగా ఉన్నట్లుగా కనిపించింది. తల్లి ఏమైందని అడిగినప్పుడు విద్యార్థి సమీహా విశ్వదీప్ టీచర్ కొట్టారని తెలిపింది. ఫిర్యాదులో చిన్నారి ఒళ్లంతా మచ్చలు ఉండాయని కూడా పేర్కొన్నారు. వెంటనే పై రాయచోటి అర్బన్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసింది. సంబంధిత టీచర్‌తో పాటు పాఠశాల యాజమాన్యం పై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
👉మతం కన్నా మానవత్వమే మిన్న..
కర్ణాటకలోని బస్తెవాడకు చెందిన మెహబూబ్ హాసన్, నూర్జహాన్ దంపతులు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. తమ పొరుగున ఉన్న లింగాయత్ మతస్థులైన కాడయ్య దంపతులు చనిపోవడంతో, వారి ఇద్దరు కుమారులను చేరదీసి 20 ఏళ్లుగా సొంత బిడ్డల్లా పెంచారు. తాజాగా పెద్దకుమారుడు సోమశేఖర్కు లింగాయత సంప్రదాయం ప్రకారమే వివాహం జరిపించి తమ ఉదారతను చాటుకున్నారు. మానవత్వమే మిన్న అని నిరూపించిన ఈ దంపతులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి..£
👉 ఉచితంగా రూ.5 లక్షల ఆరోగ్య బీమా.. ఈ పథకానికి మీరు అప్లై చేసారా?
ఆర్థికంగా బలహీన వర్గాలు, సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్–ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (PM-JAY) పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభిస్తుంది. ప్రభుత్వంతో పాటు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా క్యాష్‌లెస్ సేవలు అందుబాటులో ఉంటాయి. శస్త్రచికిత్సలు, పరీక్షలు, ఐసీయూ చికిత్సలు సహా అనేక సేవలు కవరవుతాయి. గోల్డెన్ కార్డ్ ద్వారా దేశవ్యాప్తంగా చికిత్స పొందవచ్చు.
👉అల్లరి చేస్తున్నాడని బాలుడి కన్ను పోయేలా కొట్టిన అంగన్వాడీ టీచర్*
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తమ కుమారుడు విద్వాన్ష్‌ను అంగన్వాడీ కేంద్రంలో వదిలేసి తమ పనులు చేసుకునేందుకు వెళ్లిన కొంపెల్లి లక్ష్మీ, విజయ్ కుమార్ దంపతులు..
తమ కుమారుడికి జ్వరం వచ్చిందని, ఇంటికి తీసుకెళ్లాలని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన అంగన్వాడీ టీచర్ రాణి..అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చూసేసరికి, బాలుడి కంటికి, చేతులకు తీవ్ర గాయాలు ఉండడం గమనించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు అంగన్వాడీ టీచర్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన హాస్టల్ యాజమాన్యం…దీంతో రాత్రి నుండి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ సిబ్బంది తీరుకు నిరసనగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్న విద్యార్థినులు
పిల్లలను చూడటానికి వచ్చిన విద్యార్థిని తల్లి రాత్రి అవ్వడంతో ఇక్కడే హాస్టల్లో ఉండి రేపు ఇంటికి వెళ్తమనడంతో.. ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోవాల్సిందే అంటూ ఆ తల్లిని అవమానించిన యాజమాన్యం
దీంతో విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన
👉ఇదేం దోపిడీ రా నాయనా.ఫోన్ పే చేస్తారు.సక్సెస్ వస్తుంది.. కానీ డబ్బులు జమ కావు..!*
నగదు లావాదేవీల్లో ఇటీవల కాలంలో ఏదో ఒక చోట ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సైబర్ ఉచ్చులో పడవద్దని ప్రభుత్వం, పోలీస్ శాఖ అప్రమత్తం చేస్తున్నా, ప్రజలు మోసగాళ్ల మాయలో పడుతూనే ఉన్నారు.తాజాగా మార్కాపురంజిల్లా ఎర్రగొండపాలెం పట్టణం నడిబొడ్డున అంబేడ్కర్ సెంటర్, త్రిపురాంతకం రోడ్డు లోని ఇద్దరు వ్యాపారులను డిజిటల్ పేమెంట్ పేరుతో నేరగాళ్ళు అడ్డంగా దోచుకున్నారు..
మర్కాపురంజిల్లా యర్రగొండపాలెంలో ఇద్దరు వ్యాపారులను ఫోన్ పేలో నగదు బదిలీ పేరుతో ఘారానా మోసగాళ్ళు లక్ష రూపాయలకు టోకరా వేశారు… పట్టణంలోని లోని ఓ మినీ సూపర్ మార్కెట్ దగ్గరకు కారులో వచ్చిని ఇద్దరు వ్యక్తులు వంట సామాగ్రి కొనుగోలు పేరుతో మోసానికి పాల్పడ్డారు… కొత్తగా తాము హోటల్ పెట్టామని హోల్‌సేల్‌లో వంట నూనె కావాలని నమ్మబలికారు… 25 వేల రూపాయలకు వంట నూనె కొనుగోలు చేశారు… క్యాష్ లేదని ఫోన్ పే చేస్తామని చెప్పారు… అయితే తమ ఫోన్‌లో స్కానర్ పనిచేయడం లేదని, ఫోన్‌పే నెంబర్ చెప్పాలని కోరారు… షాపు యజమానురాలు ఇచ్చిన హోల్ సేల్ వ్యాపారి ఫోన్ నెంబర్‌కు 25 వేల రూపాయలు ఫోన్ పే చేశారు… ఫోన్ పే సక్సెస్‌ఫుల్ అని రావడంతో ఫోన్‌లోని రిసిప్ట్ చూపించారు… వ్యాపారంలో నిమగ్నమైన దుకాణంలోని వ్యక్తులు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిందా లేదా… అని హోల్ సేల్ వ్యాపారిని సంప్రదించలేదు… తీరా మరుసటి రోజు హోల్‌సేల్ వ్యాపారి సూపర్‌మార్కెట్ దగ్గరకు వచ్చి వంట నూనె తాలూకా డబ్బులు ఇవ్వమని చెప్పడంతో తాము మోసపోయామని దుకాణదారులు గుర్తించారు… వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు…అలాగే పెద్దారవీడు మండలం కుంట దగ్గర కూడా ఓ కిరాణా షాపు యజమానిని ఇదే విధంగా మోసం చేసి 21 వేల రూపాయలతో ఉడాయించి మాచర్ల వైపు వెళ్ళినట్టు గుర్తించారు.
మరోవైపు త్రిపురాంతకంలో ఇదే విధంగా ఓ వ్యాపారిని మోసగాళ్ళు మోసం చేశారు… కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ ద్వారా నగదు బదిలీ చేస్తాం, క్యాష్ కావాలంటూ నగదు లావాదేవీల వ్యాపారం చేసే వ్యాపారిని అడిగి ఫోన్‌పేలో 70 వేలు నగదు బదిలీ చేశారు… ఫోన్ పేలో నగదు ట్రాన్స్‌ఫర్ సక్సెస్ అయినట్టు రావడంతో తన ఎకౌంట్‌ను వ్యాపారి చెక్ చేసుకున్నాడు… 70 వేలు క్రెడిట్ అయినట్టు చూపించడంతో నగదు ఇచ్చేశాడు… అరగంట తర్వాత ఆ ఇద్దరు ఫోన్ చేసి రాంగ్ ఎకౌంట్‌కు నగదు బదిలీ అయిందని చెప్పారని, అలా చెప్పిన కొద్దిసేపటికే తన ఎకౌంట్ ఫ్రీజ్ అయిపోయిందని, ఇలా ఎందుకు అయిందో అర్ధంకాక చివరకు తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశానని, మోసపోయిన బాధితుడు తెలిపారు.కారులో దర్జాగా తిరుగుతూ ఫోన్ పే నగదు లావాదేవీల పేరుతో వ్యాపారులను మోసం చేస్తున్న ముఠా వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు… యర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో మోసపోయిన పలువురు వ్యాపారులు చెప్పిన ఆనవాళ్ళ మేరకు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు… టోల్‌ప్లాజాల దగ్గర నెంబర్ ప్లేట్‌లేని ఓ కారు పలుమార్లు తిరిగినట్టు గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు… నగదు లావాదేవీల విషయంలో వ్యాపారులు, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని యర్రగొండపాలెం ఎస్‌ఐ చౌడయ్య కోరుతున్నారు.
👉మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకాలో 104 వెహికిల్స్ మాయం…మరమ్మతులు ఉన్నాయని పక్కన పెట్టిన నాలుగు 104 వాహనాలు మాయం …రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి మాయమైన 104 వాహనాలు…104 వాహనాలను దొంగలించారంటూ ఆరు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన జిల్లా వైద్యాధికారి…ఎవరి అనుమతి లేకుండానే డంపింగ్ యార్డుకు తరలించిన కొంత మంది సిబ్బంది
104 వెహికిల్స్‌ను ధ్వంసం చేసి వాటి సామాన్లు అమ్ముకున్నారని ఆరోపణ…డంపింగ్ యార్డులో 104 వాహనాలను ధ్వంసం చేస్తున్న వీడియో వైరల్
కేసు నమోదు చేసి విచారిస్తున్నామంటున్న పోలీసులు…
సిబ్బంది సహకారం లేకుండా ప్రభుత్వాసుపత్రి నుంచి డంపింగ్ యార్డుకు 104 వాహనాలు ఎలా వెళ్లాయని ప్రశ్న
👉పెళ్లి పేరుతో వల.. యువతికి రూ. 3.6 లక్షల టోకరా! 😱😱😱
ఒక ప్రొఫైల్.. ఒక పరిచయం.. జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన ఒక వ్యక్తి. అంతా సవ్యంగానే ఉందనుకుంది. కానీ ఆ ప్రొఫైల్ వెనుక అసలు నిజం వేరే ఉంది! 🎭
ఢిల్లీలో ఎక్స్‌పోర్ట్ బిజినెస్, ఎయిర్‌పోర్ట్‌లో తండ్రి ఉద్యోగం అంటూ నమ్మబలికాడు. సడన్‌గా తల్లికి సీరియస్ అంటూ సెంటిమెంట్ డ్రామా మొదలుపెట్టాడు. లక్షలు ట్రాన్స్‌ఫర్ అయ్యాక కానీ తెలియలేదు.. అదంతా ఒక పక్కా ప్లాన్ అని!
ఆరు నెలల పాటు నమ్మించి మోసం చేసిన ఈ సైబర్ క్రైమ్ స్టోరీ పూర్తి వివరాలు చూడండి.
జాగ్రత్త! ఆన్‌లైన్ పరిచయాలతో అప్రమత్తంగా ఉండండి.
👉ఏసీబీ వలలో మరో రెవిన్యూ తిమింగలం..!*
రెవెన్యూ నిబంధనలు పాటించకుండా ల్యాండ్ సర్వే రిపోర్ట్ చేస్తామని రైతుకు డబ్బులు డిమాండ్ చేసిన సర్వేర్ చిత్తూరు జిల్లా పుంగనూరులో లంచం తీసుకుంటూ ఏసీబీకిపట్టుబడ్డ సర్వేయర్.*ల్యాండ్ సర్వే రిపోర్టు* కోసం 20,000 డిమాండ్.
👉నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు.
హరిచరణ్ మార్వాడీ పాఠశాల పోలింగ్ కేంద్రం (బూత్ నెం. 287) వద్ద ఘటన..విధుల్లో ఉన్న ఎస్సై గుర్రం నారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోవర్ధన్, శ్రీనివాసులపై దుర్భాషలు.. పోలీసులపై అసభ్య, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అరవింద్. నిషేధిత స్టిల్, వీడియో కెమెరాలతో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించినట్లు ఫిర్యాదు..డ్యూటీలో ఉన్న సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించిన అరవింద్. BNS సెక్షన్లు 132, 223, 296(B) & తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 సెక్షన్ 226 కింద క్రైమ్ నెం. 51/26 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు టౌన్-1 SHO రఘుపతి తెలిపారు
👉ప్రమాద బాధితులకు అండగా నిలవండి..*
రహదారి ప్రమాదాల్లో గాయపడి మృత్యువుతో పోరాడుతున్న వారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడే ‘గుడ్ సమరిటన్’లను ప్రోత్సహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈమేరకు ‘రహ-వీర్’ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘రహ-వీర్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బాధితులను ఆదుకుని ప్రాణదాతలుగా నిలిచేవారికి రూ.25 వేలతోపాటు ప్రభుత్వం తరఫున ప్రశంసాపత్రం అందజేయనున్నారు.
👉డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల…అమరావతి:

వెలగపూడి సచివాలయం లో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఛాంబర్లో కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు.ముఖ్యంగా రేపు వచ్చే శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలో ఉన్న దిగువమెట్ట రేంజ్ పరిధిలో గల గుండ్ల బ్రహ్మేశ్వరం వెళ్లేందుకు అనుమతి మంజూరు చేయాల్సిందిగా కోరగా వెంటనే చేయిస్తామని తెలియజేశారు. అంతేకాకుండా వస్తున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా గిద్దలూరు నియోజకవర్గనికి నిధులు కేటాయించి,ట్యాంకర్ల ద్వారా అవసరమైన ప్రదేశాలలో నీటిని తరలించి ప్రజలకు అందించేందుకు నిధులు మంజూరు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం నియోజకవర్గ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి తెలిపారు.
👉ప్రకాశం మార్కాపురం జిల్లాపట్టణంలో హోరెత్తిన కార్మిక గళం.. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ…
సమ్మెలో పాల్గొన్న CITU, AITUC సంఘాలు.
కార్మికులకు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు.సమ్మె ప్రభావంతో మార్కాపురం పట్టణంలో పలుచోట్ల నిలిచిపోయిన కార్యకలాపాలు.ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో నినదిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాలు.వివరించారు.
👉 ట్రాన్స్‌జెండర్లకు సామాజిక గుర్తింపు: ఐడెంటిటీ కార్డులు అందజేసిన కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
*తిరుపతి సమాజంలో ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ట్రాన్స్‌జెండర్లకు అధికారిక గుర్తింపు కార్డులు సర్టిఫికెట్లను ఆయన అందజేశారు.
👉మహాశివరాత్రి భద్రతపై పోలీసుల ప్రత్యేక నిఘా: ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లోని ఆలయాల్లో ముందస్తు ఏర్పాట్ల పరిశీలన.*
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల భద్రతే ధ్యేయంగా ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వేల సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్ల నిర్వహణ,పార్కింగ్ సౌకర్యాలు మరియు తొక్కిసలాట జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ కమిటీలకు కీలక సూచనలు చేశారు.ముఖ్యంగా రథోత్సవాలు,వాహన సేవలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు మరియు సిసిటివిల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారు.
👉 రాహుల్ కి సింపతీ పెరుగుతుందా ?.. 👉నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు..👉ప్రకాశం మార్కాపురం జిల్లాపట్టణంలో హోరెత్తిన కార్మిక గళం.. 👉అల్లరి చేస్తున్నాడని బాలుడి కన్ను పోయేలా కొట్టిన అంగన్వాడీ టీచర్*…👉మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకాలో 104 వెహికిల్స్ మాయం .. 👉డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల…👉ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లోని ఆలయాల్లో ముందస్తు ఏర్పాట్ల పరిశీలన.*👉 పెళ్లి పేరుతో వల.. యువతికి రూ. 3.6 లక్షల టోకరా! 😱
Recent Posts

