👉ఆ ప్రశ్నలు అడగొద్దు.. : దేశ చరిత్రలో తొలిసారి ప్రధాని ఆదేశం… దేశ చరిత్రలో మునుపెన్నడూ చోటు చేసుకోని అనేక సంఘటనలు, తీసుకోని అనేక నిర్ణయాలు.. ప్రధాని నరేంద్ర మోడీ హయాం లో జరుగుతున్న విషయం తెలిసిందే. దేశ చరిత్రలో మునుపెన్నడూ చోటు చేసుకోని అనేక సంఘటనలు,తీసుకోని అనేక నిర్ణయాలు.. ప్రధాని నరేంద్ర మోడీ హయాం లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరంపరలో ఇప్పుడు పార్లమెంటు వేదికగా.. కొన్ని ప్రశ్నలను అడగడానికి వీల్లేదంటూ .. ప్రధాన మంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అత్యంత వాడి వేడిగా సాగుతున్న ఈ సమావేశాల్లో ఏ పార్టీకి చెందిన సభ్యులైనా.. వారు అధికార పక్షమా? ప్రతిపక్షమా? అనే తేడా లేకుండా.. ఎవరూ కూడా `ఈ తరహా ప్రశ్నలు` అడగానికి వీల్లేదని.. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా తమకు లేదని ప్రధాన మంత్రి కార్యాలయం లిఖిత పూర్వకంగా పార్లమెంటు ఉభయ సభలకు స్పష్టం చేసింది.

ఏంటా ప్రశ్నలు? 1) ప్రధాన మంత్రి కేర్స్ ఫండ్(ప్రధాని తరచుగా చేసే సాయాలు) 2) జాతీయ రక్షణ నిధి 3) ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి …. ఈ మూడు అంశాలకు సంబంధించిన ఎలాంటి ప్రశ్నలను పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎవరూ ప్రశ్నించరాదని.. ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. అంతేకాదు.. సభాపతి స్థానంలో ఉన్న వారు వీటిని పరిహరించాలని.. ఒకవేళ ఎవరైనా సభ్యుడు ప్రశ్నించాలని భావిస్తే.. సభా నియమాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడాప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొనడం గమనార్హం.ఈ మేరకు రాజ్యసభ, లోక్‌సభల సెక్రటరీలకు.. ప్రత్యేక పత్రాన్ని పంపించారు. వాస్తవానికి ప్రధాని స్థానంలో ఉన్న వారు ఎవరైనా.. ఉభయ సభలకు జవాబుదారీగా వ్యవహరించాలి. అంటే ఉభయ సభల్లో లేవనెత్తే ఏ ప్రశ్నకైనా ఆయన సమాదానం చెప్పాలి. కానీ, పై మూడు అంశాల్లో మాత్రం ఇప్పుడు తప్పించుకున్నట్టేనని విపక్షాలు ఆందోళన చేస్తున్నారు. పైగా.. ఇవి లక్షల కోట్ల రూపాయల నిధులతో ముడిపడిన వ్యవహారం కావడం మరో విశేషం. అయినప్పటికీ.. ప్రధాని కార్యాలయం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నది ఆసక్తిగా మారింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుడుతున్నాయి.
👉 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నిరసన*
*”ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు” అంటూ నినాదాలు చేసిన వైయస్ఆర్ సీపీ నేతలు*
👉 విద్యాశాఖ మంత్రికి విద్యార్థుల తల్లిదండ్రుల బహిరంగ లేఖ..**
ఆంధ్రప్రదేశ్ విద్యా & వసతి బకాయిల సమగ్ర నివేదిక (ఫిబ్రవరి 2026 నాటికి)…ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ (RTF) మరియు మెస్ ఛార్జీల (MTF) బకాయిల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
* దీనికి సంబంధించిన పూర్తి వివరాలు
బకాయిల ప్రస్తుత స్థితి (Dues Status)
2023 నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిలు 2026 ప్రారంభం నాటికి భారీగా పేరుకుపోయాయి.
*2023-24 విద్యా సంవత్సరం:ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపు 3 ఇన్‌స్టాల్‌మెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో మెజారిటీ నిధులు ఇంకా విడుదల కావాల్సి ఉంది.
* 2024-25 విద్యా సంవత్సరం: ప్రభుత్వం విధాన మార్పు చేసినప్పటికీ, గత రెండు క్వార్టర్లకు సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు.
* పిజి (PG) కోర్సులు: గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన ప్రైవేట్ యూనివర్సిటీ పీజీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉన్నాయి.
ఆర్థిక అంచనాలు (Financial Estimates)
అధికారిక మరియు క్షేత్రస్థాయి గణాంకాల ప్రకారం మొత్తం బకాయిలు ₹6,400 కోట్ల నుంచి ₹7,000 కోట్ల మధ్య ఉన్నట్లు అంచనా.
* విద్యా దీవెన (RTF): కళాశాలలకు చెల్లించాల్సిన బోధన రుసుము సుమారు ₹4,000 కోట్ల వరకు ఉంది.
* వసతి దీవెన (MTF): విద్యార్థుల భోజన, వసతి సౌకర్యాల కోసం ఇచ్చే స్కాలర్‌షిప్ బకాయిలు సుమారు ₹2,200 కోట్ల పైచిలుకు ఉన్నాయి.
ప్రభావితమైన విద్యార్థుల సంఖ్య (కోర్సుల వారీగా)
బకాయిల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 నుండి 12 లక్షల మంది విద్యార్థులు నేరుగా ప్రభావితమవుతున్నారు.
*ఇంజనీరింగ్, మెడికల్ & ప్రొఫెషనల్ కోర్సులు: సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులు.వీరికి ఫీజులు ఎక్కువగా ఉండటం వల్ల కాలేజీ యాజమాన్యాల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉంది.
* డిగ్రీ విద్యార్థులు: సుమారు 4.5 నుండి 5 లక్షల మంది. వీరు ఎక్కువగా సాధారణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వసతి దీవెన అందక ఇబ్బంది పడుతున్నారు.
* ITI & పాలిటెక్నిక్: సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులు. ప్రధానంగా కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది.
ప్రస్తుత ప్రభుత్వ విధానం – పరిష్కార మార్గాలు
2025లో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది:
* నేరుగా కళాశాలలకే: 2024-25 విద్యా సంవత్సరం నుండి ఫీజులను నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమ చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించారు. దీనివల్ల తల్లుల ఖాతాల్లో పడటం, వారు కాలేజీలకు కట్టకపోవడం అనే సమస్యకు పరిష్కారం లభించింది.
* అయినా ప్రవైట్ కళాశాలల యాజమాన్యాలు పరీక్షల హాల్ టికెట్లు నిలిపివేయడం. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు (CMM & PC) ఇవ్వకపోవడం.ఒత్తిడి చేసి బలవంతంగా విద్యార్థి తల్లిదండ్రుల నుండి ఫీజులు వసూలు చేయడం ప్రభుత్వం మాకు ఫీజు బకాయిలు చెల్లించితే మీకు ఫీజు లు తిరిగి ఇస్తాం. ఇది బరితెగించిన యాజమాన్యాల మాట… ( విద్యార్థులు తల్లిదండ్రులు అన్న ఓ చులకన భావం)
* మరో వంక APHERMC ఉత్తర్వులకు చట్ట విరుద్ధంగా అదనంగా వేల ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులు నుండి వసూలు చేయడం ఈ బరితెగింపు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది…
(ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం (G.O.s), ఫీజు బకాయిల పేరుతో ఏ విద్యా సంస్థ కూడా విద్యార్థుల సర్టిఫికేట్లు లేదా హాల్ టికెట్లు ఆపడానికి వీలులేదు. ఇది సుప్రీం కోర్టు తీర్పుల ఉత్తర్వుల ఉల్లంఘన )
* ఫిర్యాదు చేస్తే ఇంటర్నల్ మార్కుల కోత విధిస్తారు అనే భయం విద్యార్థి తల్లిదండ్రుల కు… ఉంది
* APHERMC ఫిర్యాదు చేసేందుకు కానీ… చేసినా ఫిర్యాదు పై చర్యలు శూన్యం …
* ఒక్క 2025-26 సంవత్సరం లో APHERMC కి ప్రభుత్వం కు ఎన్ని ఫిర్యాదు లు వచ్చాయి (ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) గా విద్యార్థి తల్లిదండ్రులు గా చేసినవి) సంబంధిత కళాశాల ల పై చర్యలు తీసుకొన్నారు. వివరాలు తెలిపితే విద్యార్థి తల్లిదండ్రుల కు భరోసా నమ్మకం గా ఉంటుంది.. ఫిర్యాదు చేయగలరు.
* ప్రయారిటీ ప్రకారం విడుదల: ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సర్టిఫికేట్లు అందడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో, వారి కోసం ప్రత్యేకంగా సుమారు ₹400 కోట్లను 2025 చివరలో ప్రభుత్వం కేటాయించింది.
* దశల వారీ చెల్లింపు: మిగిలిన ₹6,000 కోట్ల బకాయిలను క్వార్టర్ల వారీగా బడ్జెట్ కేటాయింపులను బట్టి విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
క్షేత్రస్థాయి సమస్యలు
బకాయిలు అందకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి.
ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు చేసే వేధింపుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, మరియు కొందరు విద్యార్థులు చదువు మధ్యలో ఆపేస్తున్న (Dropouts) ఉదాహరణలు కోకొల్లలు..
-మా పిల్లల దుస్థితి..* పరీక్షల హాల్ టికెట్లు నిలిపివేయడం. * కోర్సు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్లు (CMM & PC) ఇవ్వకపోవడం.
* దీనిపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) కి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఫలితం మాత్రం శూన్యం.
PAAP డిమాండ్లు:-తక్షణమే బకాయిల విడుదల కోసం ఒక నిర్దిష్ట కాలపట్టిక (Time-bound schedule).
– బలవంతంగా ఫీజులు వసూలు, సర్టిఫికేట్లు ఆపే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ ఏర్పాటు.-APHERMC ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని విద్యాశాఖ మంత్రిని కోరారు.
👉 ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో పోలీసుల ‘నైట్ బీట్’ – రాత్రంతా పహారా, ప్రజలకు భరోసా!*
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రధమ కర్తవ్యంగా పోలీస్ యంత్రాంగం రాత్రివేళల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసింది.జిల్లా ఎస్పీల ఆదేశాల మేరకు,ఆయా జిల్లాల పరిధిలోని పట్టణాలు, గ్రామాలు మరియు జాతీయ రహదారులపై పోలీసులు ముమ్మరంగా ‘నైట్ బీట్’ నిర్వహిస్తున్నారు.అర్ధరాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను నిలదీయడమే కాకుండా, వారి వేలిముద్రలను ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎంలు మరియు వ్యాపార సముదాయాల వద్ద నిరంతరం గస్తీ కాస్తూ దొంగతనాలకు తావులేకుండా ‘విజిబుల్ పోలీసింగ్’ నిర్వహిస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవడానికి పోలీసులు అప్రమత్తంగా ఉంటూ,అడుగడుగునా నిఘా ఉంచుతున్నారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని, నేర రహిత సమాజం కోసం పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
👉మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ..సీఐపై ఆరోపణలతో సస్పెన్షన్*
నెల్లూరు జిల్లా సీతారామపురంలో ఘటన…పోలీస్ స్టేషన్‌లోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన కానిస్టేబుల్ జ్యోతి…మీడియా సమావేశంలో సీఐ వెంకట్రావుపై ఆరోపణలు చేసిన వైనం…
కానిస్టేబుల్ జ్యోతిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టిన అధికారులు…శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడటం,ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించి సీఐపై ఆరోపణలు చేయడంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో జరిగిన పరిణామాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
వివరాల్లోకి వెళితే.. విధుల్లో నిర్లక్ష్యం, ఇతర ఆరోపణల నేపథ్యంలో సీతారాంపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డిని ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో అదే పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న జ్యోతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. విషయం గమనించిన సహచరులు ఆమెను వెంటనే వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆమె స్వగ్రామం ఉదయగిరికి వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు, ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో తనకు ఎస్‌ఐతో వివాహేతర సంబంధం ఉందని సీఐ ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమె ఆరోపించారు. అందువల్లే ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారని చెప్పారు.
అయితే, ఎస్‌ఐపై తప్పుడు ఫిర్యాదులు చేసి అతని సస్పెన్షన్‌కు కారణమయ్యానని తనపైనే సీఐ నిందలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో సీఐ గత ఐదు నెలలుగా అవమానకరంగా మాట్లాడుతున్నారని, దీనిపై ప్రశ్నించినందుకు తనపై కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వంపై తప్పుగా ప్రచారం జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని ఆమె వెల్లడించారు.
ఇదిలా ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశం నిర్వహించి సీఐ వెంకట్రావుపై నిరాధార ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆమెపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ అనిత వేజండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.
👉ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్‌స్పెక్టర్*
మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో #అవినీతి బయటపడింది. మాదాపూర్ పీఎస్‌లో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ వినయ్ #లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఫిర్యాదుదారుడి నుంచి కేసు విషయంలో సహకారం అందిస్తానని చెప్పి రూ.50,000 లంచం డిమాండ్ చేసిన వినయ్, ఆ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
లంచం మొత్తం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, వినయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కలకలం రేగింది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
👉ఆ ప్రశ్నలు అడగొద్దు.. : దేశ చరిత్రలో తొలిసారి ప్రధాని ఆదేశం… దేశ చరిత్రలో మునుపెన్నడూ చోటు చేసుకోని అనేక సంఘటనలు… 👉 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి వైకాపా వాకౌట్ …👉ఫీజు రీయింబర్స్‌మెంట్ (RTF) మరియు మెస్ ఛార్జీల (MTF) బకాయిల కారణంగా తీవ్ర ఇబ్బందులు …విద్యాశాఖ మంత్రికి విద్యార్థుల తల్లిదండ్రుల బహిరంగ లేఖ..👉 ప్రకాశం , మార్కాపురం జిల్లాల్లో పోలీసుల ‘నైట్ బీట్’ – రాత్రంతా పహారా, ప్రజలకు భరోసా!👉మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ..సీఐపై ఆరోపణలతో సస్పెన్షన్*..👉ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్‌స్పెక్టర్*…
Recent Posts

