👉చంద్రబాబు పాలనపై అసంతృప్తి?.. టీడీపీ ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వైరల్ …👉శ్రీ‌వారి ల‌డ్డూపై చంద్ర‌బాబు చెబుతోంది చాలా త‌ప్పు : ఉండవల్లి.. 👉రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా*…👉 మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం:డీజీపీ శివధర్‌ రెడ్డి.. 👉పుత్తడి బొమ్మలకు రక్షణ ఏదీ?…ఆకతాయిల నుండి నంద్యాల విద్యార్థినులను రక్షించండి: ఎన్ఎఫ్ఐడబ్ల్యూ..👉హైదరాబాద్‌: డిజిటల్‌ అరెస్ట్ పేరుతో మోసం చేస్తున్న ముగ్గురు అరెస్ట్.. 👉 పాకాల బీచ్ ఫెస్టివల్” ప్రమోషన్ సందర్భంగా 2 కే రన్

👉చంద్రబాబు పాలనపై అసంతృప్తి?.. టీడీపీ ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ వైరల్ …ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే బాంబు పేల్చారు. ‘‘రోడ్లు లేవు.. ఉద్యోగాలు లేవు.. పల్లె కన్నీరు పెడుతోంది’’ అంటూ సదరు ఎమ్మెల్యే తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టి కలకలం రేపారు. ఈ విషయం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఆ ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పార్టీ క్రమశిక్షణను అతిక్రమిస్తున్నా, అధిష్టానం ఉపేక్షిస్తుండటంతో ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్నట్లు నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూటమిలో మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఎవరూ లేనట్లు ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారారని అంటున్నారు. సర్కార్ పాలనపై ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరోక్ష విమర్శలకు దిగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలతో వివాదాలతో కొలికపూడి ఎప్పటికప్పుడు చర్చలకు ప్రధాన కేంద్రం అవుతున్నారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నితో విభేదాలు వల్ల ఎమ్మెల్యే పార్టీ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో పార్టీ కేడర్ ను, అధిష్టానాన్ని మరింత రెచ్చగొట్టేలా తాజాగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సరిగా లేదన్న భావన కలిగేలా పరోక్ష విమర్శలు చేస్తూ ఎమ్మెల్యే కొలికపూడి పెట్టిన వాట్సప్ స్టేటస్ సంచలనంగా మారింది. ‘‘3 వారాల పాటు 35 గ్రామాల్లో 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపాను..రోడ్లు లేని పల్లెలు…ఉద్యోగాలు రాని పిల్లలు…పల్లె కన్నీరు పెడుతోంది…’’ అంటూ కొలికపూడి తన ఫోన్ వాట్సాప్ స్టేటస్ పెట్టారు. అధికార పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. రాజధాని అమరావతి ఉద్యమకారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారశైలి తొలి నుంచి టీడీపీకి తలనొప్పిగా మారిందని అంటున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ టికెట్ ను కొలికపూడి కైవసం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజే ప్రతిపక్షానికి చెందిన ఓ మండలస్థాయి నాయకుడి భవనాన్ని కూల్చేయాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, బుల్డోజర్ తో ఆ నేత ఇంటికి వెళ్లడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఇక ఆ రోజు నుంచి నేటి వరకు ఆయనను ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉందని చెబుతున్నారు. అసెంబ్లీకి హాజరుపై వైసీపీ బిగ్ ప్లాన్ సొంత నియోజకవర్గంలో కేడర్ తో వివాదలు పెట్టుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. తనకు అసెంబ్లీ టికెట్ ఇప్పించిన ఎంపీ కేశినేని చిన్నిపైనా గతంలో అవినీతి ఆరోపణలు చేసి కలకలం రేపారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఎంపీ తన నుంచి డబ్బు తీసుకున్నారని బహిరంగ ఆరోపణలు చేసి పార్టీ ఆగ్రహానికి గురయ్యారని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పార్టీ క్రమశిక్షణ సంఘం చేపట్టిన విచారణలో తేలిందని చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీ పరువు బజారుకీడుస్తున్న ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అధినేత చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు.భవనాన్ని కూల్చేయాలని అధికారులను ఆదేశించడమే కాకుండా, బుల్డోజర్ తో ఆ నేత ఇంటికి వెళ్లడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది.ఇక ఆ రోజు నుంచి నేటి వరకు ఆయనను ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉందని చెబుతున్నారు.సొంత నియోజకవర్గంలో కేడర్ తో వివాదాలు పెట్టుకున్న ఎమ్మెల్యే కొలికపూడి.. తనకు అసెంబ్లీ టికెట్ ఇప్పించిన ఎంపీ కేశినేని చిన్నిపైనా గతంలో అవినీతి ఆరోపణలు చేసి కలకలం రేపారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని ఎంపీ తన నుంచి డబ్బు తీసుకున్నారని బహిరంగ ఆరోపణలు చేసి పార్టీ ఆగ్రహానికి గురయ్యారని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పార్టీ క్రమశిక్షణ సంఘం చేపట్టిన విచారణలో తేలిందని చెబుతున్నారు. అంతేకాకుండా పార్టీ పరువు బజారుకీడుస్తున్న ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అధినేత చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ సంఘం సూచించినా, ఆ నివేదికను సీఎం చంద్రబాబు తొక్కి పెట్టారని అంటున్నారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చేసే విషయంలో నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో సీఎం సహనాన్నే పరీక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి మరో సారి తన వైఖరి బయటపెట్టారని అంటున్నారు. ఇక గతంలో కూడా మద్యం అమ్మకాలు,పేకాట క్లబ్బులపై ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రకటనలు చేశారు. అప్పుడూ కూడా పార్టీ హైకమాండ్ ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం నందిగాం నియోజకవర్గ పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లగా, ఎమ్మెల్యే కొలికపూడి సీఎం చంద్రబాబుకు నమస్కరించారు.ఆ సమయంలో ఎమ్మెల్యేను అసలు పట్టించుకోకుండా సీఎం ముందుకు వెళ్లిపోయారు. ఆ సంఘటనతో ఎమ్మెల్యే నొచ్చుకున్నారని,దాంతో ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది.అయితే ఎమ్మెల్యే కొలికపూడి మాత్రం పార్టీలో ఉంటూనే ప్రభుత్వంపైన,పార్టీ నేతలపైన విమర్శలకు దిగుతూ అందరి సహనాన్ని పరీక్షిస్తున్నారని అంటున్నారు.తాజా వాట్సాప్ స్టేటస్ తో తన వైఖరి మరోసారి బయటపెట్టడం చూస్తుంటే ఆయన పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారని అంటున్నారు.
👉రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా*
హైదరాబాద్‌: కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. శేరిలింగం పల్లి మున్సిపల్‌ కార్యాలయం- మదీనగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్‌ చేపట్టింది. స్థానిక జంగమోని కుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. మట్టిపోసి ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యారు. దీంతో వారిపై రెవెన్యూ అధికారులు కేసులు పెట్టారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కుంట చుట్టూ ఫెన్సింగ్‌ ప్రక్రియ చేపట్టారు.
👉 మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం:డీజీపీ శివధర్‌ రెడ్డి
హైదరాబాద్‌ మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి: డీజీపీ…కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 142 కేసులు నమోదు..తనిఖీల్లో రూ.3 కోట్లకు పైగా నగదు స్వాధీనం: డీజీపీ శివధర్‌ రెడ్డి.
👉శ్రీ‌వారి ల‌డ్డూపై చంద్ర‌బాబు చెబుతోంది చాలా త‌ప్పు…
ప్ర‌శ్న అడిగిన విలేక‌రి మీదే చంద్ర‌బాబు ఆగ్ర‌హంతో ఊగిపోయారు..20వ పేజీలో క్లియ‌ర్‌గా ఉంటే.. చంద్ర‌బాబుకు ఫీడింగ్ స‌రిగ్గా ఇవ్వ‌డం లేదా..?
సిట్ క్లియర్‌గా రిపోర్ట్ ఇచ్చినా పదే పదే జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడుతున్నారు – ఉండవల్లి అరుణ్ కుమార్
👉హైదరాబాద్‌: డిజిటల్‌ అరెస్ట్ పేరుతో మోసం చేస్తున్న ముగ్గురు అరెస్ట్..*
ముంబైకి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ నుంచి కోటి రూపాయలు కొట్టేసిన ముఠా.. సీబీఐ, ఈడీ, ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పేరు చెప్పి డిజిటల్ అరెస్టులు.. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఇదే తరహా సైబర్‌ నేరాలు
👉​పుత్తడి బొమ్మలకు రక్షణ ఏదీ?… ప్రేమ పేరిట వేధింపులు.. విద్యార్థినుల విలవిల!… ఆకతాయిల నుండి విద్యార్థినులను రక్షించండి.. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ)..నంద్యాల
నంద్యాల పట్టణంలో కొంతమంది ఆకతాయిలు కాలేజీలు హైస్కూల్లు వద్ద మోటార్ సైకిల్ తో నిలబడి అమ్మాయిలను. విద్యార్థినిలను అనేక రకాలుగా వేధిస్తూ క్షణికానందం పొందుతున్నారని తల్లిదండ్రులకు చెప్తే తమ చదువులకు ఇబ్బంది కలుగుతుందని మానసికంగా ఆవేదన చెందుతు న్నారని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆకతాయిల నుండి వారిని రక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు. జి లక్ష్మీదేవి. జిల్లా నాయకురాలు. ఎస్ సుశీలమ్మ.ఎస్ మున్ని..పద్మ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జి.లక్ష్మీదేవి మాట్లాడుతూ
నంద్యాల పట్టణంలో విద్యాసంస్థల ప్రాంగణాలు ఆకతాయిలకు అడ్డాగా మారుతున్నాయని అక్షరాయుధాలు పట్టాల్సిన యువత, ప్రేమ పేరుతో వికృత చేష్టలకు దిగుతూ విద్యార్థినుల పాలిట శాపంగా మారుతున్నారని ఆవేదనతో అన్నారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పాఠశాలలు మరియు మహిళా కళాశాలల పరిసరాల్లో బైక్‌లపై చక్కర్లు కొడుతూ అబ్బాయిలు రభస సృష్టిస్తున్నారని ముఖ్యంగా విద్యాసంస్థలు ప్రారంభమయ్యే సమయాల్లో మరియు సాయంత్రం వేళల్లో గుంపులు గుంపులుగా చేరి విద్యార్థినులను వెంబడించడం, అసభ్యకరంగా మాట్లాడటం నిత్యకృత్యమైందని కేవలం విద్యాసంస్థలే కాకుండా, పట్టణంలోని లేడీస్ హాస్టళ్లు, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు మరియు కోచింగ్ సెంటర్ల వద్ద కూడా ఆకతాయిల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఉదయం, సాయంత్రం వేళల్లో కోచింగ్ సెంటర్ల ముందు నిలబడి వచ్చే పోయే యువతులను వేధించడం, హాస్టళ్ల వద్ద తిష్టవేసి వెకిలి చేష్టలకు దిగడం మహిళల భద్రతను ప్రశ్నార్థకం.ఈ వేధింపులు భరించలేక విద్యార్థినులు, ఉద్యోగినులు మానసిక క్షోభకు గురవుతున్నారని. స్కూల్ లేదా ఆఫీసు వాకిలి దాటినప్పటి నుండి క్షేమంగా నివాసాలకు చేరుకునే వరకు ప్రతి అడుగులోనూ అభద్రతా భావం వెంటాడుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలు, హాస్టళ్ల ముందు యువకులు బైక్‌లతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ, సైలెన్సర్లు మార్చిన వాహనాలతో అతివేగంగా దూసుకుపోతూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. చాలామంది విద్యార్థినులు బయటికి చెబితే ఇంట్లో చదువు మాన్పిస్తారేమో అన్న భయంతో, లేదా పరువు పోతుందన్న ఆందోళనతో ఈ వేధింపులను మౌనంగా భరిస్తున్నారని ఈ మౌనాన్నే ఆకతాయిలు అలుసుగా తీసుకుని మరింత రెచ్చిపోతున్నారు.
​పట్టణంలో ‘షీ టీమ్స్’ తనిఖీలు ఉన్నప్పటికీ, అవి కేవలం ప్రధాన జంక్షన్లకే పరిమితం కాకుండా మారుమూల వీధుల్లో ఉన్న హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల వద్దకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. మఫ్టీలో పోలీసులు తిరుగుతూ ఇలాంటి ఆకతాయిలను పట్టుకొని కఠినమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల పట్టణం విద్యా కేంద్రంగా పేరుగాంచుతున్న తరుణంలో, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు మహిళల పురోగతికి ఆటంకంగా మారుతున్నాయి. తక్షణమే జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించి, హాస్టళ్లు మరియు విద్యాసంస్థల వద్ద నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలని పై నాయకురాలు జిల్లా పట్టణ పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని తెలిపారు
👉 బైక్ పై మృతదేహం తరలింపు..*
బాపట్ల:పేదరికం కారణంగా ఒక వ్యక్తి మృతదేహాన్ని బైక్ పై తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. కర్లపాలెం మండలం రాళ్లచెరువుకు చెందిన నక్క నాగేశ్వరరావు గుండెపోటుతో మరణించగా.. బాపట్ల ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ఆటో వారు రూ.3 వేలు అడిగారు. అంత స్థోమత లేకపోవడంతో మంగళవారం నాగేశ్వరరావు సోదరులు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై 13 కి మీ దూరంలోని తమ గ్రామానికి తరలించారు. ఈ హృదయవిదారక ఘటన కలిచివేసింది.
👉” పాకల బీచ్ ఫెస్టివల్” ప్రమోషన్ లో భాగంగా 2 కె రన్… పొదిలి .. ఈనెల 14, 15 వ తేదీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలో పాకాల గ్రామంలో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ” పాకల బీచ్ ఫెస్టివల్” ప్రమోషన్ లో భాగంగా ఈరోజు పొదిలి పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు.

కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి,గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి,మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు,రాష్ట్ర మారీ టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ,ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, దర్శి టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు అతిథులు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాకల బీచ్ ఎంతో సుందరంగా ఉంటుందని ఈ బీచ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్నామని ఈనెల 14 మరియు 15వ తేదీలలో పాకాల బీచ్ లో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడింగులు, వివిధ రకాల బోట్లు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.అనంతరం 2k run ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు,పొదిలి మండల ప్రజలు పాల్గొన్నారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్