👉తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. 👉 ఉత్తమ్ కుమార్ రెడ్డి BRS కోవర్టు: ఎంపీ ఆర్వింద్ 👉ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అరెస్ట్…పల్నాడు జిల్లా…👉బీ కేర్ ఫుల్….మళ్ళీ విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ…👉మధ్యాహ్నం భోజనము తిని…92 మంది విద్యార్థులకు అస్వస్థత..

👉 కర్ణాటకలో ఘోరం.! …జర్నలిస్టులుగా నటిస్తూ, మహిళా ప్రభుత్వ అధికారి ఇంట్లో రహస్య కెమెరాలు అమర్చి, ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి, ₹50 లక్షల డిమాండ్ చేసిన దుండగులు !
వారందరినీ అరెస్టు చేసి. స్పై కెమెరాలు, ఫోన్లు, మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
👉ఏకంగా కలెక్టరేట్లోనే బేరసారాలు..!
• ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ అరెస్ట్…పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు…మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన DRO మురళి..పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటూచిక్కిన DRO క్యాటరింగ్ చేసిన బిల్లులు మంజూరుకి లంచం అడిగిన మురళి..26 లక్షల క్యాటరింగ్ బిల్లు మంజూరుకి లంచం డిమాండ్
చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు..!
👉 తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు సీఎం రేవంత్ రెడ్డి…

కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేయడం లేదని స్పష్టం చేశారు.
🌟 “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చారు.
🌟“జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజేషన్ చేయాలంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లా గురించి ఆలోచనలు చేస్తాం.
🌟 ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని అపోహలు సృష్టించినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం, కుట్రలు కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉంది. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం” అని వివరంగా చెప్పారు.
🌟సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. “ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయి. కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తుందని, వారసత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోతాయని కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారు.
🌟 అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వం చేయడం లేదు. కార్మికుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తుంది తప్ప, కార్మికులకు నష్టం కలిగే ఏ నిర్ణయం తీసుకోదు. సింగరేణి గని కార్మికులు తమ భుజాలపై మోసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు” అని ముఖ్యమంత్రి గారు విడమరిచి చెప్పారు.
🌟 2027లో నిర్వహించబోయే పుష్కరాల గురించి ముఖ్యమంత్రి వివరిస్తూ, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతాం. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం.
🌟 గతేడాది సరస్వతి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించుకున్నాం. అలాగే, వెయ్యేండ్లు గుర్తుండే విధంగా మేడారంను తీర్చిదిద్దుకుని సమ్మక్క – సారలమ్మ జాతరను దక్షిణ కుంభమేళాగా గొప్పగా నిర్వహించాం. మేడారం జాతరకు 2 కోట్ల మంది దర్శించుకున్నారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
🌟 ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం 6,116 కోట్ల రూపాయలను కేటాయించామని వాటి వివరాలను వెల్లడించారు. తెలంగాణ తొలి, మలి విడత పోరాటంలో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పాత్ర, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
🌟ఈ బహిరంగ సభ వేదిక నుంచి ముఖ్యమంత్రి ‘సమ్మక్క – సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు 205 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.
👉 ఏప్రిల్ తర్వాత కొత్త ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాం: రేవంత్ రెడ్డి..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గణపురం మండలం చెల్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందించారు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్న ఈ పథకం కింద, తొలి విడతలో 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడత జాబితా కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు.
👉 ఉత్తమ్ కుమార్ రెడ్డి BRS కోవర్టు: ఎంపీ ఆర్వింద్
ఉత్తమ్ కుమార్ రెడ్డి BRS కోవర్టు: ఎంపీ ఆర్వింద్
తెలంగాణ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ మనిషి అని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలను మాయం చేయాలని చూశారని, కావాలనే కుట్ర పూరితంగా ఎఫ్‌ఎస్‌ఎల్‌కు నిప్పు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ అర్వింద్ ఆరోపణలు చేశారు.
👉 చికెన్ ప్రియులకు గుండెలు అదిరే వార్త!!! జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యానికే ముప్పు….బీ కేర్ ఫుల్….మళ్ళీ విజృంభిస్తున్న బర్ద్ ఫ్లూ…*😱😱😱
అన్నమయ్య జిల్లా… సదుం మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో గత వారం రోజుల్లో సుమారు 24 వేల నుంచి 28 వేల కోళ్లు మృతి చెందాయి.
భోపాల్‌లోని ల్యాబ్‌లో పరీక్షల అనంతరం బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ కూడా దీనిని ధృవీకరించింది.అధికారులు అప్రమత్తమై, మృతి చెందిన కోళ్లను సురక్షితంగా పూడ్చి, వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు భయపడవద్దని అధికారులు భరోసా ఇస్తున్నారు.
👉మధ్యాహ్నం భోజనము తిని…92 మంది విద్యార్థులకు అస్వస్థత…ఆంద్రప్రదేశ్…పోలవరం జిల్లా
మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సుమారు 92 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం అనంతరం వాంతులు అవడంతో హుటాహుటిన పాఠశాల సిబ్బంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీఎంవో, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షించాలన్నారు.

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్