👉ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..👉కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు : సీఎం రేవంత్ రెడ్డి.. 👉 ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిని పరిశీలించిన వైయస్ జగన్…👉 ఎర్రచందనం ముద్దాయిలు ఇద్దరిపై పీడీ యాక్ట్…👉 నోటిలో పేలిన ఫోన్ బ్యాటరీ!…👉ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. 39 ప్రయాణికులకు తప్పిన ప్రమాదం*👉న్యాయవాదులపై హత్యాకాండలను అరికట్టండి.. 👉ప్రకాశం మార్కాపురం జిల్లాలలో విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన..👉ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్లు*…*సగం లైట్ స్టిక్కర్ నిబంధన జాడలేదు*… 👉కాపుల వేళ్లతో కాపుల కన్ను పొడవడమే జగన్ ప్లాన్!.. 👉స్వామి వారి భూమిని కబ్జా చేసిన వారిని వదిలిపెట్టం కూల్చివేస్తాం* *తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి.*

👉ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఐదేళ్లలో రసాయనాలు కలిపిన నెయ్యితో ప్రసాదాలు.. శ్రీశైలం ప్రసాదంలోనూ రసాయనాలు కలిపారు.. బాత్‍రూమ్ శుభ్రపరిచే రసాయనాలతో తిరుమల లడ్డూ NDDB నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నా.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు..రసాయనాలు కలిపినట్లు సిట్ నివేదికలో ఉందని వైవీ సుబ్బారెడ్డే స్వయంగా చెప్పారని సీఎం చంద్రబాబు తెలిపారు.
👉బిఆర్ఎస్ నేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్రెడ్డి…

*కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు ..కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని* అన్నారు.
*దత్తపుత్రుడు కిషన్ రెడ్డి, దొంగ పుత్రుడు కేటీఆర్ కలిసి కేసీఆర్ ను కాపాడుతున్నారని* ఆరోపించారు. కాళేశ్వరం కేసు సీబీఐ కి ఇస్తే 48 గంటల్లో కేసీఆర్ ను జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి.. కాళేశ్వరం కేసును బీజేపీ ఎందుకు ముందుకు సాగనీయడం లేదు.. సీబీఐ విచారణ చేయాలని కోరినా ఇప్పుడు ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. *కేసీఆర్, హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కిషన్ రెడ్డి చెప్పాలి* అన్నారు.
*బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందే ..* నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, బీఆర్ ఎస్ లను గెలిపిస్తే అభివృద్ది శూన్యం అన్నారు. బీజేపీనుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా.. నిధులు తెచ్చింది నిల్ అన్నారు. నిజామాబాద్ లో రెండుసార్లు బీఆర్ఎస్ గెలిచినా మురికికూపం చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి.
*అర్వింద్ ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదని* ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.
👉 ఎర్రచందనం ముద్దాయిలు ఇద్దరిపై పీడీ యాక్ట్
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న టాస్క్ ఫోర్స్
ఎర్రచందనం అక్రమ రవాణాకు చెందిన పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న కర్నాటక కు చెందిన నారాయణ స్వామి (48) తమిళనాడుకు చెందిన సయ్యద్ అబ్దుల్ లతీఫ్, ఎలియాస్ సేటు ఎలియాస్ సేటు బాయ్ (49)లపై టాస్క్ ఫోర్స్ అధికారులు పీడీ యాక్ట్ అమలు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ అములులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ అధ్వర్యంలో ఏఎస్పీ జె.కులశేఖర్ మార్గ నిర్దేశకత్వంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే కాకుండా, ఎక్కువ కేసుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా వృత్తిగా చేసుకుని, ముఠాగా ఏర్పడి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ లు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు ముద్దాయిలు నారాయణ స్వామి, సయ్యద్ అబ్దుల్ లతీఫ్ ఎలియాస్ సేటు ఎలియాస్ సేటు బాయ్ లపై పీడీ యాక్ట్ అమలుకు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు సిఫారసు చేశారు.ఈ మేరకు తిరుపతి జిల్లా కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ గారు, వీరిపై పీడీ యాక్ట్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు.వీరిద్దరూ ఎర్రచందనం కొల్లగొట్టడుతూ,వన్య మృగాల చట్టాలను ఉల్లంఘించి నేరాలు చేస్తూ ప్రజాజీవనానికి అటంకం కలిగిస్తున్నట్లు గుర్తించారు. పీడీ యాక్ట్ అమలులో భాగంగా నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధకంలో భాగంగా పీడీ యాక్ట్ అమలు చేయడానికి వెనుకాడబోమని టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ హెచ్చరించారు. ఎర్రచందనం కేసుల్లో ఇప్పటికే అనేక మందికి శిక్షలు పడ్డాయని గుర్తు చేశారు.యువత ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నించి వారి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హెచ్చరించారు.స్మగ్లర్లకు శిక్ష పడటంతో పాటు వారి ఆస్తులు కూడా జప్తు చేసుకో పడతాయని తెలియజేసారు.
👉 ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిని పరిశీలించిన వైయస్ జగన్…
టీడీపీ గూండాలు ఎలా ఇంటిపై పెట్రోల్‌ బాంబులతో దాడి చేసిన విషయాన్ని వైయస్ జగన్ కి వివరించిన జోగి రమేశ్ కుటుంబ సభ్యులు…కూటమి ప్రభుత్వం దాడుల్ని నిరసిస్తూ.. ఇబ్రహీంపట్నం రింగ్‌రోడ్డు నుంచి జోగి రమేశ్ ఇంటి వరకు కిక్కిరిసిన జనం
👉గుంతకల్లు లో పిల్లలు ను ఎత్తుకెళ్తున్న ఒక ఆమెను పట్టుకుని దేహశుద్ధి చేసారు..ఇంకా పిల్లల్ని.. ఎత్తుకుపోయే బ్యాచ్.. ఇంకా నలుగురు మహిళలు ఉన్నారని.. పట్టుబడిన మహిళ తెలియజేసింది…
👉 నోటిలో పేలిన ఫోన్ బ్యాటరీ!
ఫోన్ బ్యాటరీ నోట్లో పేలిన ఘటన వైరల్ అవుతోంది. ఓ సర్వీస్ సెంటర్లో బాలుడు బ్యాటరీని గట్టిగా కొరికాడు. కెమికల్ రియాక్షన్తో అది పేలి అతడి నోటికి తీవ్ర గాయమైంది. అక్కడున్న వాళ్లు ఆసుపత్రికి తరలించారు. ‘బ్యాటరీని ఎప్పుడూ కొరకొద్దు, వంచొద్దు, రంధ్రం చేయొద్దు. పిల్లలకు దూరంగా, చల్లని ప్రదేశంలో ఉంచాలి. బ్యాటరీ ఉబ్బితే వాడొద్దు. వాడని వాటిని రీసైక్లింగ్ సెంటర్లలో ఇవ్వండి’ అని నిపుణులు సూచిస్తున్నారు..
👉న్యాయవాదులపై హత్యాకాండలను అరికట్టండి..*
*డిజిపి పి శశిధర్ రెడ్డికి షాద్ నగర్ బార్ అసోసియేషన్ నేతల ఫిర్యాదు..*రక్షణ కల్పిస్తామని డిజిపి హామీ…
న్యాయవాదులపై హత్యాకాండలను, దాడులను అరికట్టాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర డిజిపి పి. శశిధర్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు.షాద్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి గుండుబావి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక న్యాయవాదులు కూడా ఆయనను కలుసుకున్నారు.ఇటీవల మహిళా న్యాయవాది స్వప్నను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని న్యాయవాదులు ఆయనను కోరారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న హత్యాకాండలను, దాడులను అరికట్టే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్,అదేవిధంగా హెల్త్ కార్డుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా న్యాయవాదులు త్వరలో భూత్పూర్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు.ఈ పాదయాత్రకు కూడా రక్షణ కల్పించాలని బిజెపికి కోరారు.దీనిపై డిజిపి స్పందిస్తూ ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. తెలంగాణ ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డితో పాటు,షాద్ నగర్ అధ్యక్షుడు వేణుగోపాలరావు,మల్కాజిగిరి అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి,అలంపూర్ అధ్యక్షుడు శ్రీనివాస్,షాద్ నగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ రెడ్డి తదితరులు వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు.
👉”విద్యార్థుల భవిష్యత్తుకు పోలీసుల భరోసా: RGUKT మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు.”*
విద్యార్థుల్లో భద్రతా అవగాహన పెంపొందించడం, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వివిధ విద్యాసంస్థల్లో అవగాహన–కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
సంతనూతలపాడు ఎస్‌ఐ ఆధ్వర్యంలో RGUKT SSN కాలేజ్‌ను సందర్శించిన పోలీసులు విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమై, విద్యా జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, డ్రగ్స్‌ నివారణ, ట్రాఫిక్ నియమాలు, మహిళా భద్రత వంటి అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.విద్యార్థులు తమ సందేహాలను నేరుగా అడిగి, పోలీసుల నుండి విలువైన మార్గదర్శకత్వం పొందారు.
అదే విధంగా, మార్కాపురం జిల్లా పోలీసుల సమన్వయంతో పామూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్ విద్యార్థినులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించబడింది.బాలికల భద్రత,ఆత్మవిశ్వాసం, చట్టపరమైన రక్షణలు,అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందే మార్గాలు, మంచి అలవాట్లు–మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రాయోగిక సూచనలు అందించారు.
ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో చట్టంపై అవగాహన పెరిగి, భద్రత పట్ల చైతన్యం మరింత బలపడిందని అధికారులు పేర్కొన్నారు.భవిష్యత్తులోనూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
👉ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. 39 ప్రయాణికులకు తప్పిన ప్రమాదం*
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద హైదరాబాద్‌ నుంచి గుంటూరు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. కంచికచర్ల మండలం కేసర టోల్‌గేట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుక భాగంలో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు.ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం బస్సు ఇంజిన్ భాగం మంటల్లో కాలిపోయింది.ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
👉 ఏడాదిలో సాఫ్ట్‌వేర్ జాబ్‌లు ఉండవా?
సాఫ్ట్‌వేర్ రంగంలో AI ప్రకంపనలపై ఆంథ్రోపిక్ CEO డారియో అమోడెయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 6 నుండి 12 నెలల్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పనులన్నీ AI చేయగలదని, రాబోయే ఐదేళ్లలో 50% ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ పరిణామాలతో భారతీయ ఐటీ స్టాక్స్ ఇప్పటికే భారీగా పతనమయ్యాయి..
👉కాపుల వేళ్లతో కాపుల కన్ను పొడవడమే జగన్ ప్లాన్!
కూటమి కలసి ఉన్నంత కాలం జగన్ రెడ్డి గెలుపు దగ్గరకు కూడా రాలేడు.. నేను అయితే కూటమిని విడగొడతా…. అని విజయసాయిరెడ్డి ఇటీవల బహిరంగంగా చెప్పారు. అయితే కూటమిని విడగొట్టకపోయినా పర్వాలేదు.. ఓట్లను విడగొట్టడం ద్వారా జగన్ రెడ్డిని గెలిపించవచ్చని..తాను నిరూపిస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చారేమో కానీ.. వెంటనే అంబటి రాంబాబు ప్రయోగం జరిగిపోయింది. ఉద్దేశపూర్వకంగా ఆయన చంద్రబాబు అత్యంత ఘోరమైన తిట్లు తిట్టడం.. వెంటనే టీడీపీ కార్యకర్తల రియాక్షన్ రావడంతో వారనుకున్న ప్లాన్ ప్రారంభించారు. వెంటనే అంబటికి కాపు కుల మహా నేత అనే ట్యాగ్ తగిలించి.. వైసీపీలో ఉన్న కాపు నేతలందర్నీ .. చివరికి కుల పట్టింపు లేకుండా కమ్మ వ్యక్తినే పెళ్లి చేసుకున్న కుమార్తెను కూడా రంగంలోకి దింపి..కుల వ్యాఖ్యలు చేయించారు. ఇదంతా కాపుల్లో చీలిక తెచ్చి.. గత ఎన్నికల్లో వారు చూపించిన ఐక్యతను దూరం చేయడానికే.
అంబటి రాంబాబు ఇష్యూ పక్కా ప్లాన్…
తాజాగా అంబటి రాంబాబు చుట్టూ జరుగుతున్న రాజకీయం యాదృచ్ఛికం కాదు, అది ఒక పక్కా ప్లాన్..చంద్రబాబుపై అంబటి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, దానికి ప్రతిగా టీడీపీ శ్రేణులు స్పందించడం.. వెనువెంటనే దీనికి కుల రంగు పులమడం అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం సాగుతోంది. అంబటిని కాపు కుల మహానేతగా ప్రొజెక్ట్ చేస్తూ, వైసీపీలోని కాపు నేతలందరినీ రంగంలోకి దింపడం ద్వారా.. కాపుల్లో ఉన్న ఐక్యతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. కాపు సామాజికవర్గంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే.. పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రస్తుతం ఐక్యంగా ఉన్న కాపులను విభజించి, వారిలో అభద్రతా భావాన్ని కలిగించడం ద్వారా కూటమి బలాన్ని తగ్గించాలనేదే జగన్ రెడ్డి అంతిమ లక్ష్యం.
కాపుల ఐక్యతను దెబ్బతీసి బలపడే వ్యూహం
ఇప్పుడు రాజకీయంగా కాపులు బలంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ అందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు.ఇక్కడే జగన్ రెడ్డికి మైనస్ అయింది. వారిని విడగొడితే తప్ప.. తనకు బతుకు లేదు. అందుకే కాపుల వేళ్లతోనేకాపుల కన్ను పొడిచేందుకు అంబటిని ప్రయోగించారు. ఆయనను బలి చేసి అయినా సరే కాపుల్ని విడగొట్టి .. పవన్ కల్యాణ్‌ను బలహీనం చేసి.. తాను బలపడాలనుకుంటున్నారు. వైసీపీలో ఉన్న కాపు నేతలంతా జగన్ రెడ్డి ప్లాన్ ను అర్థం చేసుకున్నారో లేదో కానీ.. రంగంలోకి దిగిపోతున్నారు. తమ కన్ను తాము పొడుచుకునేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ రెడ్డి వేసే రాజకీయ పదవుల కోసం తమ వర్గానికి చరిత్రలో జరిగిన అన్యాయాన్ని మరోసారి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ వారికి సామాన్యుల నుంచి మద్దతు లభించడం లేదు.
ఇలాంటి కుల రాజకీయాలకు కాలం చెల్లింది !
జగన్ రెడ్డి అనుకుంటున్నట్లుగా ఇలాంటి విభజన రాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లిందనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంతో పోలిస్తే కాపు సామాజికవర్గంలో రాజకీయ చైతన్యం పెరిగింది. ఐక్యత వల్ల దక్కే అధికారం, ప్రాధాన్యతను వారు కళ్లారా చూస్తున్నారు. కేవలం ఒక నేతను తిట్టడం వల్లనో లేదా కులం పేరుతో సెంటిమెంట్ రగిలించడం వల్లనో వారు విడిపోతారని అనుకోవడం భ్రమ కావచ్చు. వైసీపీ ప్లాన్ రివర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కు తోడు, ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు ప్రజల్లో మరింత అసహనాన్ని కలిగిస్తున్నాయి. కాపుల వేళ్లతోనే వారి కన్ను పొడవాలని చూస్తున్న జగన్ వ్యూహం.. చివరకు ఆయన రాజకీయ భవిష్యత్తుకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
👉కళ్ళు పోతున్నాయి*…*నరకంగా మారిన రాత్రి ప్రయాణం*…*ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్లు*…*సగం లైట్ స్టిక్కర్ నిబంధన జాడలేదు*
రాత్రి 7గంటల తరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది. ఎదురొచ్చే వాహనాల *LED* లైట్స్ వల్ల కళ్లు కనిపించకుండపోతున్నాయికొత్తగా వచ్చే వాహనాలు కొత్తగా ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి.ఆర్టీవో అధికారుల పర్యవేక్షణ కరువు. నియంత్రణ జాడ ఎక్కడ లేదు.
గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నిబంధన ఉండేది.. ఆ రూల్ తీసేసారో ఉందో తెలీదు. ఎల్ఇడి లైట్ ల వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక….కళ్ళు మసకబారి ఏమీ కనపడకుండా పోయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ ల కు వస్తున్న led lights గురించి చర్య తీసుకొని కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు black స్టిక్కర్ కానీ, black పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
👉స్వామి వారి భూమిని కబ్జా చేసిన వారిని వదిలిపెట్టం కూల్చివేస్తాం*
*తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి.*
*మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఘాటు వార్నింగ్*
*యాడికి గ్రామంలో స్వామివారి భూమిని కబ్జా చేసిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి.*
*యాడికి శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవానికి భిక్షాటన చేయాలా. 1200 ఎకరాల భూమి ఉన్న కూడా ఎందుకు అడుక్కోవాలి. స్వామి స్థలాల్లో కబ్జా చేసిన వారు ఖాళీ చేయండి.*
*లేకపోతే కళ్యాణ ఉత్సవం తర్వాత మేమే కూల్చి వేస్తాం.*

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్