👉రాహుల్ గాంధీ నోరు నొక్కుతున్నారా ? … 👉 సింగరాయకొండ పాకల బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకున్నాం : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి 👉నేరం జరిగిన రెండు రోజుల్లో దొంగ అరెస్ట్,బంగారు వస్తువులు స్వాధీనం*ప్రొద్దుటూర్:…👉విజయవాడలో పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి*🌟 మార్కాపురం రూరల్ ఎస్ ఐ గా ఉన్నం వేమన …

👉రాహుల్ గాంధీ నోరు నొక్కుతున్నారా…ఫ్లాష్ బ్యాక్ ఏమి చెబుతోంది ? ….భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.ఈ విషయం ఎన్నో సార్లు గొప్పగా అంతా చెప్పుకుంటారు. అలాంటిది ఈ దేశానికి అత్యున్నత చట్ట సభల వేదికల మీద జరుగుతున్నదేమిటి అన్న చర్చ అయితే సాగుతోంది. భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ విషయం ఎన్నో సార్లు గొప్పగా అంతా చెప్పుకుంటారు. అలాంటిది ఈ దేశానికి అత్యున్నత చట్ట సభల వేదికల మీద జరుగుతున్నదేమిటి అన్న చర్చ అయితే సాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ఎందుకు వరసబెట్టి వాయిదా పడుతున్నాయి, ఎందుకు సజావుగా సాగడం లేదు, దానికి కారణాలు ఏమిటి ప్రతిష్టంబనకు గల పరిస్థితులు ఏమిటి ఇది సాగుతున్న చర్చ. పార్లమెంట్ లో చూసుకుంటే బలమైన అధికార పక్షంగా ఎన్డీయే ఉంది. మిత్రులు తటస్థుల మద్దతుతో కలుపుకుని మూడు వందల మంది ఎంపీల బలం ఎన్డీయేకు ఉంది. పైగా గత మూడు దఫాలుగా అధికారంలో ఎన్డీయే ఉంది.
🌟రాహుల్ అపొజిషన్ : ఒక విపక్షం వైపు చూస్తే వంద మార్క్ కి చేరువలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు రాహుల్ గాంధీ తొలిసారి తన మొత్తం పొలిటికల్ కెరీర్ లో కేబినెట్ ర్యాంక్ హోదాతో అధికార ప్రోటోకాల్ తో ఉన్నారు. 2024 లో ఆయనకు లీడర్ ఆఫ్ అపోజిషన్ దక్కింది. పార్లమెంటరీ సంప్రదాయాలను బట్టి చూస్తే ప్రధాని తరువాత ఎంతో ప్రాధాన్యత లీడర్ ఆఫ్ అపొజిషన్ కి ఉంది. రాహుల్ గాంధీ ఏ ప్రశ్నను అయినా సంధించవచ్చు. అయితే నిబంధనలు విరుద్ధంగా ఉంటే నో చెప్పవచ్చు.కానీ ఆయన మాట్లాడకుండా అడ్డుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అన్నదే చర్చగా ఉంది. ఆ పుస్తకంలో ఏముంది : రాహుల్ గాంధీ సభలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలోని కొన్ని లైన్లు సభలో చదవాలని ప్రయత్నించారు. అయితే ఆ పుస్తకం ప్రచురణ కాలేదని అందువల్ల ఆ పుస్తకం లోని అంశాల గురించి రూల్స్ ప్రకారం సభలో ప్రస్తావించ వద్దంటూ అధికార పక్షం అడ్డుకుంది. నిజానికి ఈ పుస్తకంలో ఉన్నది ఏమిటి అంటే చైనా దళాలు భారత్ భూభాగంలోకి దాడికి వస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో విఫలం అయింది అన్నది రాహుల్ చెప్పదలచుకున్నారు. దాంతో రూల్స్ ప్రస్తావన తేవడంతో రాహుల్ చెప్పాలనుకున్నది సభలో చెప్పలేకపోయారు. అయితే ఇదే సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కొన్ని పుస్తకాలను తీసుకుని వచ్చి నెహ్రూ మీద విమర్శలు సంధించారు. మరి ఆ పుస్తకాలకు అనుమతి ఇచ్చినపుడు రాహుల్ గాంధీని ఎందుకు మాట్లాడనివ్వరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.👉🏻ఆ పుస్తకంలో ఏముంది : రాహుల్ గాంధీ సభలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలోని కొన్ని లైన్లు సభలో చదవాలని ప్రయత్నించారు. అయితే ఆ పుస్తకం ప్రచురణ కాలేదని అందువల్ల ఆ పుస్తకం లోని అంశాల గురించి రూల్స్ ప్రకారం సభలో ప్రస్తావించ వద్దంటూ అధికార పక్షం అడ్డుకుంది. నిజానికి ఈ పుస్తకంలో ఉన్నది
ఏమిటి అంటే చైనా దళాలు భారత్ భూభాగంలోకి దాడికి వస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలో విఫలం అయింది అన్నది రాహుల్ చెప్పదలచుకున్నారు. దాంతో రూల్స్ ప్రస్తావన తేవడంతో రాహుల్ చెప్పాలనుకున్నది సభలో చెప్పలేకపోయారు. అయితే ఇదే సభలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కొన్ని పుస్తకాలను తీసుకుని వచ్చి నెహ్రూ మీద విమర్శలు సంధించారు. మరి ఆ పుస్తకాలకు అనుమతి ఇచ్చినపుడు రాహుల్ గాంధీని ఎందుకు మాట్లాడనివ్వరని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.
🌟 పంతాలకు పోతున్నారా : ఇక రాహుల్ గాంధీ తాను ఏ పుస్తకాలను ప్రస్తావించనని భారత్ చైనాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు పరిస్థితుల గురించి జాతీయ భద్రత అంశంగా మాట్లాడుతాను అని చెప్పినా కూడా అనుమతించకపోవడం పట్ల చర్చ సాగుతోంది. నిజానికి ప్రతిపక్షం ఏమి చెప్పినా చివరికి మైక్ అధికార పక్షానికి వస్తుంది. విపక్షం చెప్పింది తప్పు అని చెప్పే హక్కు అధికార పక్షానికి ఉంటుంది తమ వాదనా పటిమతో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా తిప్పి కొట్టే అవకాశం అడ్వాంటేజ్ అధికార పక్షానికి ఎపుడూ ఉంటాయి. కానీ విపక్షాలు ఏమి చెప్పదలచుకున్నారు అన్నది చెప్పనీయకపోతే ఎలా అన్న ప్రశ్ననే ఇండియా కూటమి నుంచి వ్యక్తం అవుతోంది. సభలో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం, అధికార పక్షం వాస్తవాలను ఇవిగో అని చెప్పాల్సి ఉంటుంది.కానీ అసలు మాట్లాడనీయకపోవడమేంటి అన్నదే చర్చగా ఉంది. ఇలా పంతాలకు పట్టింపులకు పోతే సభలో ప్రజా సమస్యలు కానీ కీలక అంశాలు కానీ చర్చకు ఎలా వస్తాయని అంటున్నారు.
🌟 గతంలో అలా : గతంలో తొలి ప్రధాని నెహ్రూ కేవలం ఒకరిద్దరు సభ్యులు కలిగిన జన సంఘ్ కి అంటే ఇప్పటి బీజేపీ పూర్వ రూపం అయిన పార్టీకి ఎన్నో అవకాశాలు మాట్లాడేందుకు ఇచ్చారు తన ప్రభుత్వం మీద అప్పటి యువనేత వాజ్ పేయి విమర్శలు చేస్తూ ఉంటే నెహ్రూ అనుమతించేవారు. ఆయన విమర్శలకు సరైతే సరిదిద్దుకునే వారు. లేకపోతే వివరణ ఇచ్చేవారు. అది కదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన ముఖ్య లక్షణం అన్నది అంతా అంటున్న మాట. విపక్షాలను మాట్లాడనీయవద్దు అనో లేక రూల్స్ చూపించో ఆపితే అంతిమంగా నష్టపోయేది ఎవరు అంటే జవాబు సులువుగానే దొరుకుతుంది. ప్రతిపక్షం అంటే ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలుగానే చూడాలి. జవాబు వాటికి చెప్పగలగాలి. అంతే తప్ప అధికార పక్షం వైపే అంతా అన్నట్లుగా వ్యవహారం సాగితే ఎలా అన్నది మేధావుల నుంచి వస్తున్న మాట. అధికార పక్షం ప్రతిపక్షం స్నేహ పూర్వక వాతావరణంలో చర్చలు జరపాలి. ఎవరూ ఎవరికీ శత్రువులు కారని గ్రహించాలి అని సూచనలు వస్తున్నాయి.
👉 సింగరాయకొండ పాకల బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.గిద్దలూరు.. ప్రకాశం జిల్లా… శుక్రవారం గిద్దలూరు సమీపంలోని రాయల్ రిసార్ట్స్ లో పాకాల బీచ్ ఫెస్టివల్ కు సంబంధించిన వాల్ పోస్టర్లను, ఏ.వి ఆడియోను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. రాజబాబు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూప్రకాశం జిల్లాలోని పాకల బీచ్ లో ఈనెల 14 మరియు 15వ తేదీల్లో రెండు రోజులు పాటు బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పాకల బీచ్ లో నిర్వహించే ఫెస్టివల్ కు ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా పాకల బీచ్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆయన చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలందరూ బీచ్ ఫెస్టివల్స్ కు వచ్చి మంచి అను భూతులు పొందాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ఈనెల 14,15 తేదీలలో పాకల బీచ్ లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించ డానికి తీసుకున్నా మని చెప్పారు. రెండు రోజులపాటు పాకల బీచ్ లో నిర్వహించే బీచ్ ఫెస్టివల్స్ కు ప్రజలందరూ హాజరుకావాలని ఆయన చెప్పారు. బీచ్ ఫెస్టివల్ కు ప్రజలందరూ వచ్చి ఆస్వాదించాలని ఆయన కోరారు. పాకల బీచ్ ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటా మని ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసన సభ్యులు ముత్తు ముల అశోక్ రెడ్డి మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు,సబ్ కలెక్టర్ శివరామి రెడ్డి,తాసిల్దార్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
🌟 మార్కాపురం రూరల్ ఎస్ ఐ గా ఉన్నం వేమన గురువారంనియమితులయ్యారు.
ఈయన గతంలో పొదిలి ఎస్ ఐ గా పని చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఎస్ ఐ గా పనిచేస్తున్న అంకమ్మ రావు ను జిల్లా ఎస్ పి కార్యాలయానికి రిపోర్ట్ చేశారు.
👉మద్యం మత్తులో వున్నవారి సొత్తు దోపిడీ*
*నేరం జరిగిన రెండు రోజుల్లో దొంగ అరెస్ట్,బంగారు వస్తువులు స్వాధీనం*ప్రొద్దుటూర్: మద్యం మత్తులో ఉన్నవారే లక్ష్యంగా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన దొంగను ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి చొరీ సొత్తు ను స్వాధీనం చేసుకున్నారు.
గత నెల 29 వ తేదీన సాయంత్రం ప్రొద్దుటూర్ టౌన్ లోని హోమస్ పేట ప్రాంతంలో ఒక మద్యం షాప్ వద్ద ప్రొద్దటూర్ టౌన్ మేదర వీధికి చెందిన టంగుటూరు ఎల్లాలు,వయస్సు 40 సం.రాలు మద్యం సేవించి మత్తులో ఉండి,అటుగా వస్తున్న ఒక వ్యక్తిని లిఫ్ట్ అడుగగా ఆ వ్యక్తి,మత్తులో ఉన్న వ్యక్తిని తన స్కూటీ పై ఎక్కించుకొని ఒక పథకం ప్రకారం టౌన్ శివార్ల లోని పూజ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపాన ఒక నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి అతని వొంటి పై ఉన్న ఒక బంగారు గొలుసు,రెండు ఉంగరాలు దోచుకొని అతన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.ఆ మరుసటి రోజు ఉదయం మద్యం మత్తు వదిలిన తర్వాత భాదితుడికి మెలుకువ వచ్చి తన వొంటిపై వున్న సుమారు మూడు తులాల బంగారు వస్తువులు చొరీ అయినట్లు గ్రహించి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు అయింది.
ప్రొద్దుటూరు ఏ ఎస్ పి యు.విభూ క్రిష్ణ ఆదేశాలతో ప్రొద్దుటూరు రూరల్ సిఐ ఎం.నాగభూషణ్ నేతృత్వంలో, ప్రొద్దుటూర్ రూరల్ ఎస్సై శ్రీకాంత్ మరియు సిబ్బంది ని ఒక ప్రత్యేక బృందం గా ఏర్పాటు చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌లు, సాంకేతిక ఆధారాలతో రెండు రోజుల్లోనే ప్రొద్దుటూరు టౌన్ లోని దస్తగిరి పేటకి చెందిన పాత నేరస్తుడయిన జెస్టడి రాజేష్,వయస్సు 25 సం.రాలు అనే నిందితుడిని గుర్తించి ఈ రోజు అరెస్ట్ చేశారు.
నిందితుడి వద్ద నుండి 20 గ్రాముల బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాల తో (విలువ సుమారు 4 లక్షలు )పాటు నేరానికి ఉపయోగించిన స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని కోర్ట్ లో హాజరు పరుచగా కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
*నిందితుడి నేర చరిత్ర:- నిందితుడిపై గతంలో ప్రొద్దుటూర్ 2 టౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఒక హత్య కేసు తో పాటు,ప్రొద్దుటూర్ 3 టౌన్,రూరల్,రాజుపాలెం,జమ్మల మడుగు అర్బన్,ఎర్రగుంట్ల,పులివెందుల పోలీస్ స్టేషన్ ల లో పలు చోరీ కేసులు నమోదై వున్నవి.
👉విజయవాడలో పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి* విజయవాడ…
ప్రభుత్వాసుపత్రిలో ఎనస్థీషియా పీజీ విద్యార్థిని డాక్టర్‌ బత్తుల దీపిక బుధవారం అర్ధరాత్రి తర్వాత అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాత్రి 1.10 వరకూ బాగానే ఉన్న దీపిక.. అరగంటలోనే ఆపరేషన్‌ థియేటర్‌లో కుప్పకూలిపోయారు. రాత్రి 1.40 సమయంలో తోటి పీజీ విద్యార్థులు ఆమెను గుర్తించి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
🌟రూబల్‌ నాగీ… ముంబయి టీచర్‌కు రూ.9 కోట్ల ప్రైజ్‌మనీ..💐💐💐
భారత్‌కు చెందిన ఉపాధ్యాయురాలు రూబల్‌ నాగీ ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ అందుకున్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్స్‌ సమిట్‌లో ఆమె దీనిని స్వీకరించారు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది విద్యా కేంద్రాలు ఏర్పాటుచేయడం, పెయింటింగ్‌ల ద్వారా మురికివాడల్లో చిన్నారులకు విద్య అందించేందుకు కృషి చేసినందుకు నాగీకి ఈ గుర్తింపు లభించింది. దీని ద్వారా రూ.9 కోట్ల ప్రైజ్‌ మనీని నాగీ అందుకున్నారు.
ముంబయికి చెందిన రూబల్‌ నాగీ.. రూబల్‌ నాగీ ఆర్ట్‌ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 800 విద్యాకేంద్రాలు ఏర్పాటు చేశారు. పాఠశాలలకు వెళ్లని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితోపాటు బడికెళ్లే పిల్లలకూ విద్యను అందిస్తున్నారు. సైన్స్‌, గణితం, చరిత్రతోపాటు ఇతర అంశాలను నేర్పించేందుకు గోడలపై చిత్రాలను గీసే విధానాన్ని పాటిస్తున్నారు.గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ అందుకున్న నాగీ ఇది తనతోపాటు భారత్‌కు దక్కిన గౌరవమన్నారు. 24 ఏళ్ల క్రితం 30 మంది చిన్నారులతో కలిసి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టానని.. ఇప్పుడు లక్షలాది మంది ఇందులో భాగస్వామ్యమయ్యారని చెప్పారు. దేశంలోని ప్రతి చిన్నారిని పాఠశాలలో చేర్పించేందుకు చేసిన ప్రతి ప్రయత్నం తనకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ ప్రైజ్‌ మనీతో ఉచిత ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.
🌟 కర్నూలు
ఏసీబీ వలలో మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కర్నూల్ జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు,బిల్ కలెక్టర్ బాస్కర్
రూ.20,000/- లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టబడిన మున్సిపల్ కమిషనర్,బిల్ కలెక్టర్

7k network
Recent Posts

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్