👉సర్‌ను అలా మార్చొద్దు..రాజ్యసభలో కమల్‌ హాసన్‌…👉ఎవడికి రా నువ్వు జాతిపితవు?..’ సీఎం రేవంత్ డైరెక్టర్ ఎటాక్…👉 ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వతీక సమ్మెను జయప్రదం చేయండి:సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి*…👉ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కు విలువైన భూములు కేటాయించ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం…👉కేసీఆర్‌పై చార్జిషీట్‌?*…👉 అవినీతిపై ప్రశ్నించినందుకు సిపిఐ నాయకులపై సీఐ దాడి అమానుషం: ఎస్పీ ని కలిసిన సిపిఐ నాయకులు…👉 బాలిక నోట్లో పేలిన చాక్లెట్ 😱

👉సర్‌ను అలా మార్చొద్దు..రాజ్యసభలో కమల్‌ హాసన్‌…
తమిళనాడులో కొనసాగుతోన్న ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల హక్కులను తనిఖీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.‘‘బిహార్‌లో బతికున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారు. అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

👉ఎవడికి రా నువ్వు జాతిపితవు?..’ సీఎం రేవంత్ డైరెక్టర్ ఎటాక్… ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన తూటాల్లాంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఉగ్రరూపాన్ని చూపారు. కొద్దిరోజులు విదేశాల్లో ఉండి..ఈ వారం మొదట్లో రాష్ట్రానికి చేరుకున్న ఆయన.. రెట్టించిన ఉత్సాహంతో తనపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టారు. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన ఆయన మిర్యాలగూడలో నిర్వహించిన సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన తూటాల్లాంటి మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. షాకిచ్చే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మొగుడూ పెళ్లాలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు.వాళ్ల బతుకు చెడ..రాజకీయ నాయకులు,జర్నలిస్టులు, సినిమా తారలు.. ఎవరి ఫోన్లు వదల్లేదు. మంది ఫోన్లు వినే వాడు మనిషేనా? అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే.. జాతిపితకు నోటీసులు ఇస్తారా? అంటున్నారు. ఎవడికి రా నువ్వు జాతిపితవు? వినోదరావు,దయాకర్ రావు,హరీశ్ రావు, కూకట్ పల్లి క్రిష్ణారావుకు అయితే జాతిపితవేమో కానీ మా నల్గొండ, పాలమూరు వాళ్లకు నువ్వెందుకు జాతిపితవు అవుతావు? మంది ఫోన్లు వినడం వంటి క్రూరమైన, ఘోరమైన నేరం చేసిన నువ్వెలా జాతిపితవు అవుతావు’’ అంటూ నాన్ స్టాప్ గా బండకేసి బాదినట్లుగా విమర్శల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తే.. మళ్లీ మరోసారి కేసీఆర్ పేరుకు ముందు జాతిపిత అన్న పదాన్ని పెట్టేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలన్నట్లుగా సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి.. క్షమాపణలు అడగాల్సిందిపోయి సిగ్గులేని మాటలా? అంటూ ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన విచారణకు హరీశ్, కేటీఆర్ ముఖాలకు తొడుగులేసి విచారణకు పట్టుకురావాల్సిందన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము జానారెడ్డి అంత మంచివాళ్లం కాదన్న ముఖ్యమంత్రి రేవంత్.. ‘తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ఫ్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతారు. కేంద్రంలో అధికారం కోల్పోతామని.. తెలంగాణ ఇస్తే ఏపీలో పార్టీ లేకుండా పోతుందని.. తెలంగాణలో అధికారంలోకి రాదని తెలిసినప్పటికీ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియా జాతిపిత అవుతారు,జాతిపిత కావటానికి తెలంగాణకు ఏం చేశారు?’’ అని ప్రశ్నించారు.. వేల కోట్ల రూపాయిల విలువ చేసే జున్వాడ, ఎర్రవెల్లి ఫాంహౌస్.. మొయినాబాద్ లోని హరీశ్ రావు ఫాంహౌస్, మీ టీవీలు, పేపర్లు. వేలాది కోట్లతో నిర్మించుకున్న పంజాగుట్ట గడీని తెలంగాణ సమాజానికి ఇస్తారా? తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదని.. చిన్న అధికార బాధ్యత కూడా ఆమెకు ఇవ్వలేకపోయిన మీకు జాతిపిత అర్హత ఎక్కడిది?’’ అంటూ సూటిగా నిలదీశారు. తెలంగాణను దోచుకున్న దొంగలు.. లుచ్చాలు జాతిపిత ఎలా అవుతారని ప్రశ్నించిన సీఎం రేవంత్.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నల్గొండ జిల్లాపై కక్ష..కసి పెంచుకొని ఇక్కడి ప్రాజెక్టులను పడావు పెట్టారన్నారు. సమైక్య రాష్ట్రంలో కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాడి తెచ్చిన ఎస్ ఎల్ బీసీ సొరంగాన్ని పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి చేయలేదని, కక్షతోనే ఈ పనులు చేయలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ ఎల్ బీసీ పనులు చేయిస్తుంటే.. అనూహ్య రీతిలో ప్రమాదం జరిగిన కార్మికులు చనిపోయారని,ఈ సందర్భంగా కనీస మానవత్వం లేకుండా మామా అల్లుళ్లు, బావా బామ్మరదులు ఎస్ఎల్ బీసీ ఆగిపోయిందని సంబరపడ్డారంటూ నల్గొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ ను గెలిపిస్తారన్న విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదన్న సీఎం రేవంత్.. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్సే గెలవాలన్నారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారన్న సీఎం రేవంత్..‘‘ఆయన నక్కజిత్తులు నడవవు. ఆయన వీపు చింతపండు చేయటం పక్కా.. జానారెడ్డి సొంత కొడుకును పక్కన పెట్టి ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేను చేయిస్తే. ఎర్రవెల్లికి వెళ్లి మోకరిల్లాడు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించేందుకు ఇంటింటికి తిరిగాడన్న సీఎం రేవంత్.. తాము జానారెడ్డి అంత మంచివాళ్లం కాదంటూ.. ‘‘కాంగ్రెస్ శ్రేణుల జోలికి వస్తే వీపు చింతపండు చేస్తామంటూ నేరుగా వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. మొత్తంగా..మున్సిపల్ ఎన్నికల వేళ.. సీఎం రేవంత్ తన ఆగ్రహం పాళ్లను మోతాదు పెంచిన వైనం ఆయన తాజా స్పీచ్ ను చూస్తే అర్థమవుతుంది.
👉కేసీఆర్‌పై చార్జిషీట్‌?*…ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో 2 వారాల్లో దాఖలుకు సిట్‌ ఏర్పాట్లు..పక్కా ఆధారాలతో అభియోగాలు…ఆర్థిక లబ్ధి, రాజకీయప్రయోజనాలపై ఫోకస్‌.. సాక్షులుగా రివ్యూ కమిటీలోని అధికారులు..
అప్రూవర్‌గా ఒక ఐఏఎస్‌ అధికారి!…నిందితుల జాబితాలో ప్రభాకర్‌రావు కుమారుడు…ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రెండు వారాల్లో నేరాభియోగ పత్రం (చార్జిషీట్‌) దాఖలు చేయాలని సిట్‌ నిర్ణయించినట్టు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌, హరీశ్‌రావు,మరికొందరు ప్రముఖుల పాత్రపై సాక్ష్యాధారాలను సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. చార్జిషీట్‌ దాఖలు కోసం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. సిట్‌ చీఫ్‌ బుధవారం దర్యాప్తు బృందంతో సమావేశమయ్యారు. ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పాత్ర వహించిన ఒకరిద్దరిని చార్జిషీట్‌ వేసేలోపు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కొత్తగా మరో ఐదారుగురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్టు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును అధికారులు రెండు కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అధికార మార్గాల్లో జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ (మావోయిస్టుల పేరిట) ఒకటికాగా, అనధికారికంగా ప్రైవేటు వ్యక్తుల ఇళ్లలో, కార్యాలయాల్లో జరిగిన ట్యాపింగ్‌ వ్యవహారం మరొకటి. ఇందులో అధికారిక మార్గంలో జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ఆయన బృందం, నిఘా, బెదిరింపులకు సంబంధించి అప్పటి టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ రాధాకిషన్‌రావు పాత్రపై ఇప్పటివరకు లభించిన ఆధారాలతో చార్జిషీట్‌ దాఖలుకు సిట్‌ అధికారులు సన్నద్ధమైనట్టు తెలిసింది. ట్యాపింగ్‌ కోసం ఆదేశాలు ఇవ్వడం, రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధిపొందడం నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌,నాటి మంత్రి హరీశ్‌రావు,మాజీ ఎంపీ సంతో్‌షరావుతోపాటు మరో ఇద్దరు ప్రముఖుల పాత్రపై పూర్తి సాక్ష్యాధారాలతో నేరాభియోగాలు నమోదు చేయనున్నట్టు సమాచారం. ఫోన్‌ ట్యాపింగ్‌కు అనుమతులిచ్చిన రివ్యూ కమిటీలోని అధికారులను ఈ కేసులో సాక్షులుగా, ఒక ఐఏఎస్‌ అధికారిని అప్రూవర్‌గా చూపించనున్నట్టు తెలిసింది. ట్యాపింగ్‌ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని సదరు ఐఏఎస్‌ అధికారి ద్వారా భూముల గోల్‌మాల్‌ జరిగిన వ్యవహారంలో లబ్ధిపొందిన వారి ఆధారాల ను సిట్‌ అధికారులు సేకరించినట్టు సమాచారం.ఇక ఈ కేసులో ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కుమారుడు నిశాంత్‌రావును నిందితుల జాబితాలోకి చేర్చే అవకాశాలు న్నట్టు తెలిసింది. కేసు నమోదై రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన సిట్‌ దర్యాప్తును సమీక్షించు కుని,తదుపరి చర్యల కోసం ఒక వ్యూహన్ని రూపొందించు కున్నట్టు సమాచారం.
👉ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వతీక సమ్మెను జయప్రదం చేయండి:సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి*
*జనగామ జిల్లా:*
కార్మికుల శ్రమతో కార్పొరేట్లకు కోట్లు సంపాదించి పెట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక కర్షక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి పిలుపునిచ్చారు.పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల సార్వత్విక సమ్మె సన్నాక సమావేశం సోమేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న అధ్యక్షత వహించగా మాధవి,సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడులను పెట్టుబడిదారీ కార్పోరేట్ యాజమాన్యాలకు ఆనుకూలంగా తీసుకొచ్చారని,దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా కోట్లాదిమంది కార్మికులకు పని భద్రత కరువైందని,అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం గాలికి వదిలేసారని,కార్మికుల కనీస వేతనం నెలకు 26,000 అమలు చేయడం లేదని,చాలి చాలని వేతనాలతో శ్రమదోపిడికి గురవుతున్నారని,అసంఘటిత రంగంలో పనిచేస్తున్న అమాలి భవనం ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని,వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని,ఫిబ్రవరి 12న జరిగే జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బసవ రామచంద్రం,కోశాధికారి బత్తిని వెంకన్న, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కొడకండ్ల ప్రాజెక్టు అధ్యక్షురాలు పి భిక్షం,జిల్లా గౌరవ అధ్యక్షురాలు రామ తార,మండల కార్యదర్శి శ్రావణి,శోభ, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కొడకండ్ల మండల అధ్యక్షులు నూనె ముంతల యాకన్న,అమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు అంబటి సోమయ్య,ఏనుగతల వెంకన్న,జి కుమార్,ఎల్లయ్య,సుశీల,యాకమ్మ,ఎల్లమ్మ, ఐలయ్య మూడు మండలాల కార్మికులు పాల్గొన్నారు.
👉 రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ #ఏసీబీకి చిక్కిన కూకట్పల్లి జోన్ సూపరిండెంట్ ఇంజనీర్ చిన్నారెడ్డి..
చెరువుల్లో గుర్రపు డెక్క తొలగించే పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్…రూ 1.4 కోట్ల పనులు చేసిన కాంట్రాక్టర్…
అందుకు సంబంధించిన బిల్లును పాస్ చేసేందుకు రూ.30 లక్షలు డిమాండ్… రెండు విడతల్లో #లంచం తీసుకునేందుకు అంగీకారం..కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా రూ.15 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
👉 ​ అవినీతిపై ప్రశ్నించినందుకు సిపిఐ నాయకులపై సీఐ దాడి అమానుషం.* ​నిందితుడైన సీఐ ఇంతియాజ్ భాషా. పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి తక్షణమే సస్పెండ్ చేయాలి… ​ఎస్పీని కలిసిన సీపీఐ బృందం…
నంద్యాల జిల్లా డోన్ మండలం తిమ్మాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిని ప్రశ్నించిన సిపిఐ నాయకులను అక్రమంగా నిర్బంధించి, లాకప్‌లో అమానుషంగా చిత్రహింసలకు గురిచేసిన డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ భాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల షోరాణ్ రన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామాంజ నేయులు,జిల్లా కార్యదర్శిఎన్ రంగ నాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫకృద్దీన్. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సుంకయ్య. కే రాధాకృష్ణ మూట రాముడు. సిపిఐ డోన్ మండల కార్యదర్శి నారాయణ. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న ఏఐటియుసి జిల్లా నాయకులు పి.మురళీధర్డి,శ్రీనివాసులు. సిపిఐ నాయకులు పృథ్వి కుమార్ లు సిపిఐ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేశారు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామాంజనేయులు,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా డోన్ మండలం తిమ్మాపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు డోన్ సిపిఐ మండల కార్యదర్శి పి. నారాయణ, గ్రామ శాఖ కార్యదర్శి సురేష్‌లపై సీఐ ఇంతియాజ్ భాషా అధికార పార్టీ తొత్తుల వ్యవహరిస్తూ పక్షపాత వైఖరితో దాడి చేశారని మండిపడ్డారు. జనవరి 28న ఎటువంటి కారణం లేకుండా వారిని జీపులో ఎక్కించుకుని, సీసీ కెమెరాలు లేని మార్గంలో తీసుకెళ్లి, కాళ్లు కట్టేసి తలకిందులుగా వేలాడదీసి పాశవికంగా కొట్టడం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటని ధ్వజమెత్తారు. దళితుడైన నారాయణను కులం పేరుతో దూషిస్తూ, “ఎమ్మెల్యే అనుచరులపై ఫిర్యాదు చేస్తారా?” నా కొడుకుల్లారా అని సీఐ బెదిరించడం చూస్తుంటే ఆయన చట్టానికి కాకుండా అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నారని స్పష్టమవుతోందని విమర్శించారు..ఫ్రెండ్లీ పోలీస్ అని చెబుతూనే,ఇలా అరాచకాలకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. సీఐ ఇంతియాజ్ భాషా గతంలోనూ అనేక వివాదాల్లో ఉన్నారని,పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.తక్షణమే సదరు సీఐపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని,ఆయనను విధులను నుండి తొలగించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు..లేనిపక్షం లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
👉ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి త‌ల‌మానికంగా ఉన్న విశాఖ‌ప‌ట్నంలో ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌కు విలువైన భూములు కేటాయించ‌డంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం…*ఏబీఎన్–ఆంధ్రజ్యోతి ఛానల్‌కు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా బదలాయించిన అంశంపై కీల‌క వ్యాఖ్య‌లు*
…*ఈ భూమి బదలాయింపును సవాలు చేస్తూ విశాఖపట్నానికి చెందిన నక్క నమ్మి గ్రేస్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు గురువారం విచారించింది*
….*విశాఖపట్నం సర్వే నంబర్ 70/1 & 70/2లో ఉన్న సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆమోద్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (రాధాకృష్ణ‌ సంస్థ) కార్యాలయం నిర్మాణం కోసం ఉచితంగా కేటాయించాలని చంద్ర‌బాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 492 (తేదీ: 12-12-2025) ద్వారా భూమిని తక్షణమే బదలాయించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది*..*అయితే, ఇది రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి విరుద్ధమని పిటిషనర్ వాదించారు. జీవో ఎంఎస్ నెంబర్ 571 (14-09-2012)లోని క్లాజ్–3 ప్రకారం ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా ప్రభుత్వ భూములు బదలాయించడానికి అవకాశం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు*
*ప్రైవేట్ సంస్థలకు ఉచితంగా భూములు కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట విరుద్ధమని జడ శ్రవణ్ కుమార్ కోర్టులో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న భూ బదలాయింపు చట్టాలు, విధానాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆయన వాదించారు..ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీవోలను అనుసరించి ఇప్పటికే ఏమైనా సేల్ డీడ్ రాసారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే, ఏ చట్టం ఆధారంగా ప్రభుత్వం ఉచితంగా భూమి బదలాయించిందో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది*…*ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ జీవో ఏ సందర్భంలో జారీ అయిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు, పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం (అఫిడవిట్) దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది*….*భూ బదలాయింపు లకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసిన ధర్మాసనం, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
👉 బాలిక నోట్లో పేలిన చాక్లెట్ 😱😱😱
చాక్లెట్ అనుకొని పేలుడు పదార్థం తినడంతో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. రాజస్థాన్లోని అల్వార్ (D)కి చెందిన మూడేళ్ల అక్షు తన సోదరితో కలిసి FEB 2న స్థానిక దుకాణంలో చాక్లెట్ కొనుక్కుంది. దాన్ని నోటిలో పెట్టుకుని నమలగానే పేలి బాలిక నోరు, దవడ చీలిపోయింది. ఈ మేరకు బాలిక అత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపు ఓనర్ గన్ పౌడర్ నింపిన పదార్థాన్ని ఇచ్చాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది..
👉 ఏపీలో గద్దర్ విగ్రహ ప్రతిష్ఠకు అనుమతులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం ఇచ్చిన గద్దర్ కూతురు వెన్నెల…
అలాగే ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు గద్దరన్న పేరు పెట్టాలని విజ్ఞప్తి…
దీనిపై చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించాడని తెలిపిన గద్దర్ కూతురు వెన్నెల.
👉నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్‌పై కేసు నమోదు..బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ సినిమా ఆడియో ఫంక్షన్‌లో అసభ్యకరమైన పదజాలంతో కూడిన పాటలు పాడారన్న ఆరోపణలపై హైద్రబాద్లోని మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ అశోక్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!