ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌కు పూర్తిగా లొంగిపోయారు. రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ..👉సినీ నటుడు మోహన్ బాబు గూండాలచే విద్యార్థి నాయకులపై దౌర్జన్యం..👉 తెలంగాణలో బీజేపీకి పవన్ మద్దతు– ప్రచారం కూడా !..👉ఖమ్మం: వసూళ్లపై విచారణకు ప్రత్యేక పోలీసు బృందం… 👉కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ సీపీఐ నాయకుల నిరసన.. (మహబూబాబాద్)👉 మైనర్లు గంజాయి సేవించి బైక్ పై విన్యాసాలు చేశారన్న దానిలో వాస్తవం లేదు..👉ఈనెల 6 వరకూ ఆధార్ క్యాంపులు*..👉సుప్రీంకోర్టులో తన కేసుని తానే వాదించనున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

👉 ధాన్యాన్ని కాపాడేందుకు నరేంద్ర మోదీ భారత రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నారు…‼️.. సంజయ్ సింగ్, (రాజ్యసభ ఎంపీ,ఆమ్ ఆద్మీ పార్టీ)..ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పూర్తిగా లొంగిపోయారు. తన స్నేహితులలో ఒకరిని రక్షించడానికి – గౌతమ్ అదానీ – అతను దేశంలోని మిలియన్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ,పాల ఉత్పత్తులకు భారత మార్కెట్‌ తెరుచుకోవడంతోపాటు వాటిపై పన్నులు తగ్గించారు.భారతీయ ఉత్పత్తులపై మాత్రమే 18% పన్ను విధించబడుతుంది. దీని ప్రత్యక్ష ఫలితం అమెరికా రైతులు సంతోషంగా ఉండటమే కాకుండా భారతదేశ రైతులు నాశనమైపోతారు ఆనీ ఆయన ఆరోపించారు.
👉కనీస నిల్వలు లేని ఖాతాలపై మూడేళ్లలో రూ.8,000 కోట్లు వసూలు*
బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలు లేని ఖాతాదారుల నుంచి దేశంలోని 11 ప్రభుత్వరంగ బ్యాంకులు గత మూడేళ్లలో రూ.8,092 కోట్ల ఛార్జీ వసూలు చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్‌చౌధరి తెలిపారు.
ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌లు పంపినందుకు, రుసుముల కింద రూ.3,387 కోట్లు వసూలు చేసినట్లు లోక్‌సభకు తెలిపారు.
👉 తెలంగాణలో బీజేపీకి పవన్ మద్దతు– ప్రచారం కూడా !
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తమకు మద్దతు ప్రకటించారని..ప్రచారం కూడా చేస్తారని రామచంద్రరావు, కిషన్ రెడ్డి ప్రకటించారు. పవన్ తో భేటీ తర్వాత మంగళవారం అర్థరాత్రి ఈ ప్రకటన చేశారు.

నిజానికి జనసేన పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి, క్షేత్రస్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్న వేళ బీజేపీ నేత రామచంద్రరావు , కిషన్ రెడ్డిపవన్ కల్యాణ్‌ను కలవడం, ఆ వెంటనే పవన్ తమకు మద్దతు ప్రకటించారని స్టేట్‌మెంట్ ఇవ్వడం జనసేన వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవానికి, ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పొత్తుల గురించి బీజేపీ ఎలాంటి చొరవ తీసుకోలేదు. ఇప్పుడు జనసేన నాయకులు, కార్యకర్తలు నామినేషన్లు వేసి గెలుపు కోసం పోరాడుతున్న తరుణంలో, అకస్మాత్తుగా పవన్ మాకే మద్దతు అని బీజేపీ ప్రకటించుకోవడం జనసేన ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉంది.
*పవన్‌ను మొహమాట పెడుతున్న బీజేపీ…
పొత్తు లేకుండా పవన్ కల్యాణ్ బీజేపీ కోసం ప్రచారం చేయడం అంటే, తన సొంత పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికరం అవుతుంది. క్షేత్రస్థాయిలో జనసేన గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని, పవన్ మరో పార్టీ కోసం ప్రచారం చేస్తే అది పార్టీ కేడర్‌లో తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. సొంత పార్టీ నేతలు బరిలో ఉన్నప్పుడు, అధినేతగా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పవన్‌పై ఉంటుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం పవన్‌ను ఒక ధర్మసంకటంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
*అధికారికంగా ప్రకటించని పవన్..
రామచంద్రరావు, కిషన్ రెడ్డి భేటీలు, ఆ తర్వాత బీజేపీ ప్రకటనపై జనసేన పార్టీ లేదా పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అందుకే బీజేపీ నేతల ఏకపక్ష ప్రకటనలు జనసేనకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారాయి. మద్దతు అనేది పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించాలి తప్ప, బీజేపీ నేతలు తమకు తాముగా చెప్పుకోవడం పద్ధతి కాదని జనసైనికులు అంటున్నారు. జనసేన బలం ఉన్న చోట ఆ ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదని, ఇది పవన్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా జనసేన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే కుట్ర అని వారు అనుమానిస్తున్నారు.
బరిలో నిలిచిన జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి?
ఇప్పటికిప్పుడు పొత్తులు ఖరారు చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసిపోయింది. మరో వారంలో పోలింగ్ ఉంది. ఒకవేళ పవన్ కల్యాణ్ నిజంగానే మద్దతు ఇస్తే, మరి బరిలో ఉన్న జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? వారిని విరమించుకోమని చెప్తారా? లేక వారిని కాదని బీజేపీకి ఓటు వేయమని పవన్ అడుగుతారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీజేపీ తన స్వార్థం కోసం పవన్ ఇమేజ్‌ను వాడుకోవాలని చూస్తోంది తప్ప, జనసేనను ఒక భాగస్వామిగా గౌరవించడం లేదనే సంకేతాలు ఈ పరిణామాల ద్వారా వెళ్తున్నాయి. ఇది అంతిమంగా జనసేన అభ్యర్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశమే. ఈ అంశంలో తెలంగాణలో జనసేన పార్టీ తరపున నిలబడిన వారికి రామ్ తాళ్లూరి వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
👉సినీ నటుడు మోహన్ బాబు గూండాలచే విద్యార్థి నాయకులపై దౌర్జన్యం, కిడ్నాప్*విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని కందారపు మురళి డిమాండ్.. కందారపు మురళి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి..
సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్ ఎస్ఎఫ్ఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోదులపై కలెక్టర్ కార్యాలయం వద్ద సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా ఉన్న 30 మంది వాహనాలలో వచ్చి అమానుషంగా వీరిపై దాడికి పాల్పడడమే కాకుండా తమ వెంట తెచ్చుకున్న వాహనాలలో వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
దాడి కిడ్నాప్ విషయాన్ని ఏఎస్పీ రవి మనోహర్ ఎస్పీ సుబ్బరాయుడుల దృష్టికి తీసుకెళ్లిన సిపిఎం నేత కందారపు మురళి …విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మోహన్ బాబుకు సిపిఎం నేత కందారపు మురళి హెచ్చరించారు.విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని,తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు .
👉 అంగన్ వాడిల తనిఖీలు శూన్యం… జువ్వడి అంగన్ వాడే నిదర్శనం…
కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం జువ్వడి అంగన్ వాడి కేంద్రంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. దాదాపు 30 మంది పిల్లలు ఉన్న ఈ కేంద్రంలో వారికి సరైన పోషకాహారం అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సమయపాలన పాటించకపోవడం, కేంద్రం చుట్టూ అపరిశుభ్రత, దుర్గంధం నెలకొనడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ కేంద్రాలపై నిఘా, తనిఖీలు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
👉 వసూళ్లపై విచారణకు ప్రత్యేక పోలీసు బృందం… ఖమ్మం: వసూళ్లపై విచారణకు ప్రత్యేక పోలీసు బృందం
ఖమ్మం జిల్లాలో మంత్రి పేరుతో ఉద్యోగాలు, పదవులు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండటంతో, సీపీ సునీల్ దత్ స్పందించి పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ బృందాలు కూడా రంగంలోకి దిగి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
👉 కడప జిల్లా..మైదుకూరు పట్టణం కడప రోడ్డులో ఓమ్ని వాహనం లో పేలిన గ్యాస్ సిలిండర్..వాహనానికి గ్యాస్ను నింపే క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపిన స్థానికులు..దగ్ధమైన వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..ఈ ఘటనలో విద్యుత్ వైర్లు సైతం కాలి కింద పడ్డ వైనం…భయాందోళనకు గురైన స్థానికులు.. హుటాహుటి సంఘటన స్థలానికి చేరుకున్న అర్బన్ సిఐ రమణారెడ్డి..ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి అదుపు చేశారు..
👉ఈనెల 6 వరకూ ఆధార్ క్యాంపులు*
గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో సోమవారం నుంచి ఈ నెల 6 వరకూ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.15 నుంచి 17 ఏళ్ల మధ్య వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది. అలాగే ఈ నెల 16 నుంచి 20 వరకు మరో విడత పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు.
👉 మైనర్లు గంజాయి సేవించి బైక్ పై విన్యాసాలు చేశారన్న దానిలో వాస్తవం లేదు..*వివరాలను వెల్లడించిన రాప్తాడు సిఐ శ్రీ హర్ష..*అనంతపురం జిల్లా
వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.మైనర్లు గంజాయి సేవించి బైక్ పై విన్యాసాలు చేశారన్న దానిలో వాస్తవం లేదు.
రాప్తాడు- అనంతపురం జాతీయ రహదారిపై బైక్ విన్యాసాలు చేసిన మైనర్లను విచారించాం.మైనర్ బాలురు నడిపిన బైక్ లను సీజ్ చేశాం.వారి తల్లిదండ్రులపై కూడా ఎంవిఐ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం.
👉కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ సీపీఐ నాయకుల నిరసన..*
*మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళినాయక్ తమతో పొత్తు కుదుర్చుకుని, తమకు అన్యాయం చేశాడని నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన సీపీఐ నాయకులు… *పొత్తు పేరుతో కాంగ్రెస్ పార్టీ తమ గొంతు కోసిందని ఆరోపణలు…*
👉 ఆస్తి పిచ్చి.. కుమార్తెను కిరాతకంగా చంపిన తండ్రి..!
ఆస్తి, బంగారంపై పెంచుకున్న వ్యామోహం ఒక తండ్రిని కాలయముడిగా మార్చింది. కర్ణాటకలోని కుంజత్తూరులో ఉమర్ అనే వ్యక్తి, ఆస్తి వివాదం నేపథ్యంలో కుమార్తె జుమైలా(18)ను కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన జుమైలా బాబాయ్ షేకుంజిపై కూడా నిందితుడు దాడి చేసి గాయపరిచాడు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
👉మటన్ కంటే నాటుకోడి ధర ఎక్కువ:ఎంపీ అవినాష్ రెడ్డి
రాష్ట్రంలో నాటుకోడి ధరలు మటన్ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయంటూ కడప ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి మంగళవారం లోక్సభలో ఆందోళన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ రైతుల కోసం కేంద్రం తీసుకుంటున్న రోగ నియంత్రణ, బీమా చర్యల గురించి ఆయన ప్రశ్నించారు. దీనికి కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ బదులిస్తూ, ఎంపీ వాదనను తోసిపుచ్చారు..
👉 పోలీసులపై ఏసీబీ విచారణ?
తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైటర్ వెనుక ఉన్న సూత్రధారులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇప్పటికే CI పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ DSP కృష్ణారావు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది..£
👉పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీకి సూపర్‌ స్టార్‌ కానుక*
* తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును కానుకగా అందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (50) ఇటీవల తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించి పలువురు మన్ననలు అందుకున్నారు. తాజాగా ఆమెను అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ సన్మానించారు..£
👉హైవేపై ఆటోలతో స్టంట్స్‌.. ముగ్గురు డ్రైవర్ల అరెస్ట్‌*
* కర్నూలులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం జాతీయ రహదారిపై మూడు ఆటోలు స్టంట్స్‌ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్ స్పందించి ఆటోలను గుర్తించాలని పోలీసులను ఆదేశించారు.

👉రియల్లీ ‘ఓ మై గాడ్’!*
సుప్రీంకోర్టులో తన కేసుని తానే వాదించనున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
SIR ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు.. కోర్టు ముందు సీఎం హాజరు…ఇందుకు సుప్రీంకోర్టు భద్రతా విభాగం అనుమతి.. Z+ కేటగిరీ సెక్యూరిటీతో రంగంలోకి!..ఒక సిట్టింగ్ సీఎం స్వయంగా సుప్రీంకోర్టులో వాదించడం.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి!
👉రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు.
జిల్లా ఎస్పీకి మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు.
ఇది నా వ్య‌క్తిగ‌త విషయం:జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్*
జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత తొలిసారిగా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు.
‘నాకు, వీణకు మధ్య జ‌రిగింది వ్య‌క్తిగ‌త విషయం.
పార్టీ ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యా.
నా వాదనను ఆధారాలతో కమిటీకి తెలిపా.
కమిటీ తన నివేదికను అధిష్టానానికి ఇచ్చాక నిర్ణయం తీసుకుంటారు. ఇది నా వ్యక్తిగత వ్యవహారం.. పార్టీకి సంబంధం లేదు. నాపై కేసు నమోదైన విషయం నాకు తెలియదు. నాపై ఎన్ని కేసులు పెట్టుకున్నా చట్ట ప్రకారం ఎదుర్కోడానికి నేను సిద్ధం’ అని అన్నారు.
👉ప్రాణం తీసిన న్యూడ్ మార్ఫింగ్ ఫోటోలు*
మనస్తాపంతో ఆత్మహత్య…
హైదరాబాద్ – రాంనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రేమ్ కుమార్(36) అనే వ్యక్తికి, మార్ఫింగ్ చేసిన తన న్యూడ్ ఫోటోలు పంపిన దుండగులు..వెంటనే రూ.3 వేలు చెల్లించకపోతే తన కుటుంబంలో అందరి న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపిస్తామని బెదిరించిన నిందితులు…గుర్తుతెలియని వారికి డబ్బులు పంపిస్తే మళ్లీ అడుగుతూనే ఉంటారని, ధైర్యంగా ఉండాలని, పోలీసులకు ఫిర్యాదు చేద్దామని బాధితుడికి ధైర్యం చెప్పిన అతని భార్య, కుటుంబ సభ్యులు కానీ నిందితుల బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!