రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 16 క్రిమినల్ కేసులు.. నిరసనగా ర్యాలీలు…👉 ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలు ఉంటే సజ్జనార్ కోర్టులో పెట్టాలి…కేటీఆర్👉మార్కాపురంలో రహదారి భద్రత అవగాహన ర్యాలీ…👉ఏపీ పాలిటిక్స్‌లో ఇలాంటి ‘హైలెట్స్‌’ మంచివేనా ..! …ఐపీఎస్‌గా ఎంపికైన కళాశాల విద్యార్థి ఆవుల రమేష్‌ రెడ్డికి సన్మానం… 👉మంచిర్యాలలో మద్యం సేవించి కానిస్టేబుల్ రవి ప్రసాద్ వీరంగం*

👉ఏపీ పాలిటిక్స్‌లో ఇలాంటి ‘హైలెట్స్‌’ మంచివేనా ..! కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్నా వారిలో కొంతమంది వివాదాల‌ దిశగా అడుగులు వేస్తున్నారు. వివాదాలతోనే హైలెట్ అవ్వాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కొంతమంది వివాదాల‌ దిశగా అడుగులు వేస్తున్నారు. వివాదాలతోనే హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. సహజంగా ఒకప్పుడు ప్రజలకు చేరువ కావడం, వారికి పనులు చేయడం నియోజకవర్గం అభివృద్ధి చేయడం ద్వారా నాయకులు హైలెట్ అయ్యారు. అదేవిధంగా ప్రజా నేతలుగా ఎదిగేవారు. ఇది అందరికీ మేలు చేసిన పరిణామం. కానీ, రాను రాను వివాదాస్పద నాయకులు నిరంతరం చర్చల్లో ఉండడం.. తెలిసిందే. ఒక ర‌కంగా చెప్పాలంటే.. వివాదం ఉంటేనే ప్రజలు గుర్తిస్తారు అన్న విధంగా పరిస్థితులు మారిపోవడంతో చాలామంది నాయకులు ఇప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతు న్నాయి. గడిచిన 18 నెలల కాలంలో దాదాపు 9 మంది నాయకులపై తీవ్ర స్థాయిలో వివాదాలు చలరేగాయి. వీటిలో లైంగిక వేధింపులు కావచ్చు, మహిళల ఆరోపణలు కావచ్చు, ఇతర వివాదాలు కావచ్చు, ఏదైన‌ప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక మధ్య స్థాయిలో అంటే సొంత పార్టీలోనే వివాదాలు పెట్టిన నాయకులు… వివాదానికి దారితీసిన నాయకులు కొందరు ఉన్నారు. ఇలాంటివారి విష‌యంలో పార్టీ కొంతవరకు సంయమనం పాటిస్తున్నా.. చర్యలు తీసుకోకపోవడంతో మరింత మంది రెచ్చిపోతున్నారనే వాదన టిడిపిలో వినిపిస్తోంది. ఇక‌, జనసేన కూడా గత కొంతకాలంగా వివాదాల చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. మహిళా డాన్స్ మాస్టర్ వివాదంలో జానీ మాస్టర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదేవిధంగా తిరుపతికి చెందిన కిరణ్ రాయల్, పోలవరానికి చెందిన మరొక ముఖ్య నాయకుడు వివాదాల్లోనే చిక్కుకున్నారు. తాజాగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇట్లా ప్రస్తుతం కూటమిలో కొంతమంది నాయకుల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి మచ్చలు మరకలు ఏర్పడుతున్నాయి.ఒకవైపు ప్రభుత్వం వైసీపీ పాలనను మరిపించేలాగా ముందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే కొంతమంది నాయకులు మాత్రం వారి వ్యవహార శైలిని మార్చుకోకపోగా వివాదాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే హైలెట్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమికి ఇబ్బందులు తప్పడం లేదు. మరి దీన్ని ఎలా చూస్తారు.. ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూడాలి.
👉 సోనియా గాంధీని,రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలిస్తే మీరు ఎందుకు ధర్నా చేసారో.. మేము కూడా మా నాయకుడిని విచారణకు పిలిచారు కాబట్టి ధర్నాలు చేసాము అంటూ మహేష్ కుమార్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్…. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోఠిలో పట్టపగలు గన్ కాల్పులు జరిపి డబ్బులు దొంగతనం చేస్తే పట్టించుకునే నాథుడు లేడు…గంజాయి స్మగ్లర్లు ఒక ఎక్సైజ్ కానిస్టేబులుపై బండి ఎక్కించి చంపితే పట్టించుకునే నాథుడు లేడు…కోట్లాది మంది భక్తులు వెళ్ళే మేడారం జాతరలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, మంత్రి కారు అద్దాలు పగలగొట్టి నిరసన తెలిపితే పట్టించుకునే పరిస్థితి లేదు – కేటీఆర్….

👉 గుంటూరు :-రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 16 క్రిమినల్ కేసులు.. రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు.. సమాజంలో ఉద్రిక్తతలు పెంచడమే లక్ష్యంగా అంబటి తీరు. సీఎం చంద్రబాబుపై అత్యంత అసభ్య పదజాలంతో దూషణలు.. రిపోర్టులో ప్రస్తావించిన నల్లపాడు పోలీసులు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మాజీ మంత్రి అని కోర్టుకు తెలిపిన పోలీసులు. అంబటిని బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. రిమాండ్ విధించకపోతే అంబటికి ప్రాణహాని కలిగే అవకాశం ఉందన్న పోలీసులు. అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే చాన్స్ ఉంది. 14 రోజుల రిమాండ్‌తో పాటు పోలీసు కస్టడీ కోరిన నల్లపాడు పోలీసులు.
👉ఎక్సైజ్‌ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.*
కోటి రూపాయల నగదుతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
👉రాజమండ్రి సెంట్రల్ జైలుకు అంబటి…
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. సోమవారం తెల్లవారుజామున ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
👉 ఒక్క మాట.. విజేతను చేసింది!…
వేదిక : బాపట్లలోని వ్యవసాయ కళాశాల.
కార్యక్రమం : ఐపీఎస్‌గా ఎంపికైన కళాశాల విద్యార్థి ఆవుల రమేష్‌ రెడ్డికి సన్మానం.
వేలాది మంది విద్యార్థుల సమక్షంలో సన్మాన గ్రహీత ప్రసంగం ప్రారంభం అయింది. మధ్యలో ఓ యువకుడిని వేదిక మీదకు పిలిచి ‘నా తర్వాతి సివిల్స్‌ విజేత ఇతనే అంటూ’ ఆయన పరిచయం చేశారు. నాడు ఆయన అన్నట్టే 10 ఏళ్ల తర్వాత బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థికి సివిల్స్‌ వరించింది. ఆనాటి విజేత మాటలను అక్షర సత్యం చేస్తూ ఆ విద్యార్థి సివిల్స్‌లో 179వ ర్యాంకు సాధించారు. అచీవర్స్‌ స్టోరీస్‌ సగర్వంగా అందిస్తున్న యువ ఐపీఎస్‌ అల్లాటిపల్లి పవన్‌కుమార్‌ రెడ్డి సక్సెస్‌ స్టోరీ..
పవన్‌ స్వస్థలం ప్రకాశం జిల్లా పునుగోడు. ఆయన తండ్రి నారాయణరెడ్డి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. తల్లి వెంకట రత్నమ్మ గృహిణి. పవన్‌ అయిదవ తరగతి వరకు నేరేడుపల్లిలో చదివారు. 6 నుంచి 10వ తరగతి ఒంగోలులోని నవోదయలో పూర్తి అయింది. ఇంటర్‌కు రత్నంలో చేరారు. మెడిసిన్‌ రాకపోవడంతో అగ్రికల్చర్‌ బీఎస్సీ ఎంచుకున్నారు. నవోదయలో చదువుతున్న సమయంలో ఏటా ఆ స్కూల్లో జరిగే కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యేవారు. కలెక్టర్‌ను చూసినప్పుడల్లా అలా ఉన్నత పదవిలో ఉండాలని పవన్‌ మనసులో నాటుకుంది. పైగా ‘క్లాస్‌ టాపర్‌ అయితే ఆ బ్యాచ్‌ వాళ్లే గుర్తు పెట్టుకుంటారు.. సొసైటీకి ఏదైనా చేస్తేనే సమాజం గుర్తు పెట్టుకుంటుంది’ అన్న తన తండ్రి మాటలు పవన్‌ను వెంటాడేవి. అయితే ఏనాడూ తన మనసులో మాటను ఎవరితోనూ చెప్పలేదు. సమీప బంధువైన ఆవుల రమేష్‌ రెడ్డిని పలుమార్లు్ల కలిసినప్పటికీ సివిల్స్‌గానీ, పోటీపరీక్షల గురించిగానీ చర్చించలేదు.
బీఎస్సీ కాగానే ఉత్తరాఖండ్‌లోని జి.బి.పంత్‌ కళాశాలలో అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశారు పవన్‌. ఐడీబీఐలో ఉద్యోగం వచ్చినా చేరలేదు. 2011లో వ్యవసాయ అధికారిగా ఉద్యోగం లభించింది. ఉద్యోగం చేస్తూనే అదే ఏడాది సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించారు. నాల్గవ ప్రయత్నంలో ర్యాంక్‌ సాధించాలని లక్ష్యంగా చేసుకున్నారు. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లో విఫలమవడంతో ప్రిపరేషన్‌కు 2013లో ఢిల్లీలో అడుగుపెట్టారు. రెండు, మూడవ ప్రయత్నంలో మెయిన్స్‌లో పోయింది. 2014లో తిరిగి హైదరాబాద్‌ వచ్చి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. 2015లో నాల్గవ ప్రయత్నంలో విజయం సాధించారు.
కళాశాల వేదిక మీద రమేష్‌ అన్న తనను పరిచయం చేసిన నాటి నుంచి సివిల్స్‌ సాధించాలన్న కసి పెరిగిందని తన మనసులో మాట చెప్పారు పవన్‌. ‘అన్నను పలుసార్లు కలిసినప్పటికీ ఏనాడు నా మనసులో మాట చెప్పలేదు. స్టేజీ మీద ఆయన నా గురించి చెప్పడంతో ఆశ్చర్యపోయాను. నా నడతను గమనించే సివిల్స్‌ సాధిస్తాడని విశ్వాసంతో చెప్పారు. ప్రిపరేషన్‌ సమయంలో డిసప్పాయింట్‌ అయితే రమేష్‌ అన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకునేవాడిని. ‘నీకు కావాల్సింది ఒక్క సీటే. ఎంతో మంది కూడా దానికోసమే పరుగెడుతుంటారు. నీ పక్కన ఉన్నవాళ్లను పట్టించుకోకు. ఆ ఒక్క సీట్‌ కోసమే పరుగెత్తు’ అని నా భుజం తట్టారు. ఒక వ్యక్తి మాట ఎంత ప్రభావితం చూపిస్తుందో అన్నదానికి నా జీవితమే ఉదాహరణ. మంచి కుటుంబం దొరకడం కూడా నా అదృష్టం. అమ్మ, నాన్న, ఇద్దరు చెల్లెల్లు, బావలు నాకు అండగా నిలిచారు. నన్ను అనుక్షణం ప్రోత్సహించారు. నిరుత్సాహపడొద్దు అంటూ ధైర్యం నింపారని చెబుతారు పవన్‌.
ప్రకాశం జిల్లా దొనకొండలో వ్యవసాయ అధికారిగా ఉద్యోగం చేసినప్పుడు ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నానని అంటారు పవన్‌. ‘ప్రభుత్వ అధికారి ఈ సొసైటీకి ఏం చేయగలడో అర్థం అయింది. అధికారుల పాత్ర అవగతమైంది. చాలా ఊళ్లకు బస్‌ సౌకర్యం లేదు. కిలోమీటర్ల కొద్దీ అక్కడివారు నడుచుకుంటూ వస్తుంటే మనసు చివుక్కుమనేది. కొద్ది మంది మాత్రమే పాస్‌బుక్‌లు తీసుకొచ్చి సబ్సిడీ మొత్తాలను తీసుకెళ్లేవారు. ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నా చాలా మందికి తెలియదని నాకు అర్థం అయింది. సమాజంలో మార్పు మనం తేగలమా అని ఆలోచించేవాడిని. వ్యవసాయ అధికారిగా ఉద్యోగం వచ్చినప్పుడు రెసిడెన్స్‌ సర్టిఫికేట్‌ కోసం ఎంఆర్‌వో ఆఫీసుకు వెళ్లాను. నాలుగు రోజులు తిప్పించుకున్నారు. నాకు చాలా బాధేసింది’ అని చెప్పుకొచ్చారు.
సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. కష్టాలంటే తెలుసు. నా చదువు కోసం చాలా ఖర్చు అయింది. అమ్మ నాన్న తిన్నారో లేదో.. నా కోసం చాలా కష్టపడ్డారు. ఏనాడూ ఖర్చులకు వెనుకాడలేదు. చిన్నప్పుడు అద్దె ఇంట్లోనే ఉండేవారం. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నా, చుట్టుపక్కల ఇళ్లతో పోలిస్తే మాదే చిన్నది. 2013 వరకు నాన్న సైకిల్‌ మీదనే వెళ్లేవారు. వ్యవసాయం కూడా చేసేవారు. ఆయనతోపాటు నేనూ వెళ్లేవాడిని. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆయనకు అవార్డు వచ్చింది. సేవ చేసే అవకాశం తక్కువ మందికి వస్తుంది అని నాన్న ఎప్పుడూ అనేవారు. బంధువులు, తెలిసినవారు నన్ను, నాన్నను నిరుత్సాహపరిచేవారు. అయినా వెనక్కి తగ్గలేదు. ఇవాళ గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాను అని నాన్న అంటారు’ అంటూ గుర్తు చేసుకున్నారు పవన్‌.
స్నేహితులు ఎడ్మ రిశాంత్‌ రెడ్డి, ప్రియాంకతో కలిసి ప్రిపేర్‌ అయ్యారు పవన్‌. రిశాంత్‌కు ఐపీఎస్, ప్రియాంకకు ఐఏఎస్‌ వచ్చింది. ముగ్గురూ ఒకే ఏడాది విజయం సాధించారు. పేపర్‌ దిద్దే వాళ్లకు పని సులభంగా ఉండేలా జవాబులు ఉండాలని నాన్న అనేవారని పవన్‌ చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే నాల్గవ ప్రయత్నంలో మెయిన్స్‌కు సన్నద్ధమయ్యాయని తెలిపారు. ‘హైదరాబాద్‌లో రూమ్‌ తీసుకున్నాను. ప్రిపరేషన్‌ సులభం కావడానికి రంగాల వారీగా చార్టులు తయారు చేసుకున్నాను. గత వైఫల్యాలు పునరావృతం కాకుండా శ్రమించాను. సాయంత్రం మొదలయ్యే చదువు తెల్లారేవరకు సాగేది. అహోరాత్రులు కష్టపడ్డాను. నాన్న కూడా నాతోపాటే ఉన్నారు. నాల్గవ ప్రయత్నమే చివరిది అని ముందే అనుకున్నాను. నేను ప్రిపేర్‌ చేసుకున్న చార్టులు మెయిన్స్‌లో బాగా ఉపయోగపడ్డాయి. కొన్ని ప్రశ్నలకు చార్టుల ద్వారా సమాధానం రాశాను. మెయిన్స్‌ కాగానే విజయం వరిస్తుందని ధీమా వచ్చింది. రమేష్‌ అన్న గైడెన్స్‌ కూడా ఉంది. ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్‌ ఫారెన్‌ సర్వీసు అధికారి కావడంతో ఒకింత భయపడ్డాను. గ్రామీణ నేపథ్యం నుంచి రావడం వల్ల ఇంగ్లీషులో వారి స్థాయికి తగ్గట్టుగా సమాధానం ఇవ్వలేనోమో అని అనిపించింది. వ్యవసాయానికి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో ప్రణాలు లేచి వచ్చాయిని వివరించారు.
వైఫల్యాలను ఒకరిపైనో, వ్యవస్థపైనో వేయకూడదని అంటారు పవన్‌. ముఖ్యంగా సివిల్స్‌ విషయంలో నెపం ఒకరిమీద వేయకుండా మన తప్పులను సరిచేసుకుంటే విజయం తథ్యమని చెప్పారు. మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే విజయం వరిస్తుందని చెబుతారాయన. అయితే తాను ఏనాడూ పోలీసు అవుతానని అనుకోలేదని నవ్వుతూ అంటారు పవన్‌. ‘పోలీసు స్టేషన్‌కి, హాస్పిటల్‌కి వెళ్లాలని ఎవరూ కోరుకోరు. విధుల్లోకి చేరిన తర్వాత నేను అందరికీ అందుబాటులో ఉంటాను. సాయం కోసం వచ్చినవారికి చిరునవ్వుతో పలకరించి నేనున్నానని ధైర్యం ఇస్తాను. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మెరికల్లాంటి విద్యార్థులకు అన్ని రకాలుగా సాయపడాలని నిర్ణయించా. తెలుగు మీడియంలో సివిల్స్‌ మెటీరియల్‌ రూపొందించే ఓ ప్రయత్నం జరుగుతోంది. సివిల్స్‌ విజేతలతో నేనూ చేయి కలుపుతున్నాను’ అని
👉 ఏలూరు – చింతలపూడి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కనకదుర్గ ఫైనాన్స్ చోరీ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 4.490 కిలోల బంగారు ఆభరణాలు (ప్రస్తుత విలువ సుమారు ₹7 కోట్లు)ను ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, పోలీస్ ప్రధాన కార్యాలయంలో కనకదుర్గ ఫైనాన్స్ హెడ్ ఆఫీస్ అధికారులకు అధికారికంగా అప్పగించారు.
ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జ్ డీఎస్పీ యు. రవిచంద్ర,మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు,కనకదుర్గ ఫైనాన్స్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు.జిల్లాలో నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం.
👉 ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలు ఉంటే సజ్జనార్ కోర్టులో పెట్టాలి…కేటీఆర్
సజ్జనార్ ఏమైనా ఈ మధ్యలో జడ్జ్ అయ్యాడు కావచ్చు…
ట్వీట్ లతో, లీక్ లతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు…
అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదు –
👉 మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ ..కడప జిల్లా..
మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు మీద జరిగిన దాడి కి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఐ రమణారెడ్డికి ఫిర్యాదు..రాష్ట్రంలో అరాచక పాలన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. రాష్ట్రము బీహార్ ను మించిపోయినట్లుంది..తిరుమలలో లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు, జంతువు కొవ్వు ఉందని చంద్రబాబు ఆరోపించారు..
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ఆరోపణలు చేశారు..
పరమ పవిత్రమైన దేవాలయం తిరుమల అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ అడిగేది లడ్డు ప్రసాదం..
నేను కూడా స్వామిని కోరుకున్నాను లడ్డు ప్రసాదం పై చేసిన వ్యక్తులపై శిక్షించాలని కోరాను..
సిబిఐ అన్ని విచారణలు చేసి రిపోర్టు సమర్పించింది.. దీనితో సీఎం చంద్రబాబు కంగు తిన్నారు..
తప్పుడు ప్లెక్సీలు వేపించారు వాటి వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు ఇంటిని ఆస్తులను ధ్వంసం చేశారు..
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి హత్యాయత్నం చేశారు..
ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..
ప్రజలను రక్షించాల్సిన రక్షకబటులు రక్షణకు తూట్లు పొడుస్తున్నారు..ఇలాంటివి రాయలసీమలో జరిగితే హత్యల వరకు పోతాయి..వైఎస్ఆర్, జగన్ ఎన్నికల వరకే పార్టీలు తర్వాత ప్రజాసంక్షేమం మాత్రమే చూశారు..
వైసిపి నాయకులు పై దాడులు జరిగితే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది..పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతే మీరు కూడా సామాన్యుల్లాగా తయారవుతారు..
రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం ఎన్ని అయినా చెబుతారు..నీరపరాదులపై కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా శిక్షిస్తే ప్రజలు క్షమించరు.
👉మంచిర్యాలలో మద్యం సేవించి కానిస్టేబుల్ రవి ప్రసాద్ వీరంగం*
మంచిర్యాల పట్టణంలో రెడ్డి కాలనీ రోడ్ నెంబర్–14లో ఓ పోలీస్ కానిస్టేబుల్ పీకలదాకా మద్యం సేవించి, నగ్నంగా వీధిలో తిరుగుతూ, అదే సమయంలో తన భార్యను ఇంటి నుంచి బయటకు లాగి తీసుకొచ్చి అమానుషంగా కొట్టడం, ఆమె పీకపై కాలు వేసి చంపేందుకు ప్రయత్నించడం అత్యంత హేయమైన చర్యగా బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు., ప్రజలు భయంతో తమ ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
👉పైలట్‌ కావాలనుకుని.. ఐఏఎస్‌ అయ్యా..*

నరసరావుపేట అర్బన్‌: గ్రామీణ నేపథ్యం ఉన్న జిల్లాకు జాయింట్‌ కలెక్టర్‌గా రావడం ఆనందంగా ఉందని ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవన విధానం తెలుసుకుని పల్నాడు వాసుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జేసీ సంజనా సింహ చెప్పారు. సామాజిక మాధ్యమాలతో యువత సమయాన్ని వృథా చేసుకుంటోంది. ఆనందం పేరుతో జీవిత లక్ష్యాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు.
👉 మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి నిర్వహించిన రహదారి భద్రత అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు తప్పక ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని త్వరలో మార్కాపురం పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబోతు న్నామని అధికారులతో కలిసి మార్కాపురం పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు.కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పి యు.నాగరాజు,పట్టణ సిఐ,పట్టణ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.
👉సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పై గిద్దలూరు నియోజకవర్గంలో ఫిర్యాదుల వెల్లువ..
గిద్దలూరు :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన అసభ్యకర, వ్యక్తిగత విమర్శలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబటి రాంబాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మార్గదర్శకత్వంలో మండల అధ్యక్షులు,ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఎక్కడా సంయమనం కోల్పోకుండా, చట్టం పై గౌరవంతో శాంతియుత వాతావరణంలో ఫిర్యాదులు అందచేశారు. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్ధవీడు, కంభం,బెస్తవారిపేట,రాచర్ల,కొమరోలు,గిద్దలూరు పోలీస్ స్టేషన్లలో లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేశారు.**ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ,అంబటి రాంబాబు తీరు పై నిప్పులు చెరిగారు. వ్యక్తిగత దూషణలు తగవని, ప్రజాస్వామ్యంలో విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ, పదే పదే వ్యక్తిగత దూషణలకు దిగడం అంబటి రాంబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.గత ఎన్నికల్లోనే ప్రజలు వైకాపాకు తగిన గుణపాఠం చెప్పారని,ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే ఆ పార్టీకి రాష్ట్రంలో ఉనికి కూడా ఉండదని హెచ్చరించారు. “ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన చంద్రబాబు గారిని దూషించడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి పై బురద జల్లడం మానుకోవాలని, లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని టీడీపీ నాయకులు హెచ్చరించారు..

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!