👉జగన్ పాదయాత్ర ప్రజల కోసమా?.. అధికారం కోసమా?: షర్మిల సెటైర్లు…👉 ఇంకా ఎన్ని వీడియోలు బయటకు వస్తాయో?* * అజ్ఞాతంలో ఎమ్మెల్యే శ్రీధర్…👉 ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోలు హతం…👉ఖమ్మం డీఈవో ‘చైతన్య పథం’.. త’ప్పు చేస్తే డిస్మిస్”👉నా కోరిక తీర్చకపోతే నీ అంతు చూస్తా… ప్రైవేట్ కంపెనీలో మహిళా ఉద్యోగిపై HR వేధింపులు…👉ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య…👉ఏపీలో హోంగార్డు ఆస్తులు రూ.20 కోట్లు… ఏసీబీ సోదాల్లో బట్టబయలు!*.. 👉ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు*

👉జగన్ గెలవాలంటే ? ఏం చేయాలో చెప్పిన షర్మిల..! పాదయాత్రపై సెటైర్లు..!
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షురాలిగా ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా తనకు ఆస్తులు ఇవ్వని అన్న వైఎస్ జగన్ ను టార్గెట్ చేయడం ప్రారంభించిన వైఎస్ షర్మిల కూటమి అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరు కొనసాగించారు.కానీ కొంతకాలంగా జగన్ విషయంలో ఆరోపణలకు బ్రేక్ ఇచ్చిన వైఎస్ షర్మిల తిరిగి నిన్న ఆయన పాదయాత్రను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. పాదయాత్ర ఇప్పుడు ఎందుకని ప్రశ్నించిన షర్మిల.. అధికారం ఇస్తే ఏం చేశారని నిలదీశారు.

జగన్ పాదయాత్ర ఎందుకు ? అధికారం కోసమే కదా ఈ పాట్లు ? అధికారం ఇస్తే ఏం చేశారు ? వైఎస్సార్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదన్నారు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నారని,
అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మద్యనిషేధం అన్నారని,అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి, క్యాష్ పద్ధతిలో మద్యం మాఫియా చేశారన్నారు.
వేల ఏళ్ల నుంచి నిలబడ్డ రుషికొండను బోడి గుండు చేశారని షర్మిల ఆరోపించారు.అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదని,ఆ పార్టీ వాళ్ళకే అందుబాటులో లేదని విమర్శించారు.ఎన్నికలకి 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారన్నారు. అంతే తప్పిస్తే ఒకరోజు అయినా ప్రజల కోసం బయటకు వచ్చారా ? అని ప్రశ్నించారు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలి అంటే అధికారం ఇచ్చి చూడాలన్న అబ్రహం లింకన్ మాటల్ని గుర్తుచేశారు.
జగన్ ని అధికారంలో చూశామని,ఆయనకు అధికారం సూట్ అవ్వలేదని తెలిపారు.జగన్ నేచర్ మారాలని,నైజం మారాలని,మార్పు రావాలని సూచించారు.జగన్ లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలన్నారు.అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో అన్నారు.అంతవరకు దేవుడు,ప్రజలు ఆశీర్వదించడన్నారు.ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకని ప్రశ్నించారు.చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకు అని ఎద్దేవా చేశారు.
👉రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.*
*ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఒక వీడియో స్టేట్‌మెంట్ విడుదల చేశారు.** తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ‘డీప్ ఫేక్’ (Deep Fake) సాంకేతికతతో సృష్టించినవని, తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారని ఆయన వాదించారు. దీనిపై తాను న్యాయపరంగా పోరాడతానని, కోర్టులోనే అన్ని విషయాలు తేల్చుకుంటానని స్పష్టం చేశారు. మరోవైపు, ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ సదరు మహిళపై పోలీసులకు ఎదురు ఫిర్యాదు (Extortion case) చేశారు.

2. *జనసేన పార్టీ నిర్ణయం…
ఈ వ్యవహారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ *సీరియస్‌గా తీసుకున్నారు:
విచారణ కమిటీ: నిజానిజాలు తేల్చడానికి టి. శివశంకర్, తంబళ్లపల్లి రామదేవి, టి.సి. వరుణ్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు.
*సస్పెన్షన్ హెచ్చరిక* : విచారణ పూర్తయ్యే వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. 7 రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ విధించారు
3. *వైస్సార్సీపీ (YSRCP) విమర్శలు*.
ప్రతిపక్ష వైస్సార్సీపీ ఈ అంశంపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో *విరుచుకుపడుతోంది* :
మహిళా ఉద్యోగినిపై ఎమ్మెల్యే అరాచకాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నిస్తోంది.
బాధితురాలు గతంలోనే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది
4. *ఆ మహిళ (బాధితురాలు) పరిస్థితి*
ఆరోపణలు చేసిన మహిళ ఒక ప్రభుత్వ ఉద్యోగినిగా గుర్తించారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం:
*తీవ్ర ఆరోపణలు* : తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నరగా వాడుకున్నారని, తన భర్తకు విడాకులు ఇవ్వాలని బెదిరించారని ఆమె ఆరోపించారు.
*బలవంతపు అబార్షన్లు* : ఈ కాలంలో ఐదుసార్లు తనకు బలవంతంగా అబార్షన్లు చేయించారని బాధితురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
*భద్రత* : ప్రస్తుతం ఆమె న్యాయవాదుల సహాయంతో మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన లీగల్ టీమ్‌తో చర్చించిన తర్వాత పోలీసుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
👉జనసేన ఎమ్మెల్యే అగ్గితో పెట్టుకున్నట్టు వుంది !!! … ఇంకా ఎన్ని వీడియో లు బయటకు వస్తాయో?*
* అజ్ఞాతం లో MLA శ్రీధర్…
*రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మరో వీడియో రిలీజ్*
*కారు డ్రైవింగ్ చేస్తూ బాధిత యువతి తో మాట్లాడిన MLA శ్రీధర్*
*చెయ్యి కోసుకొని బాధిత యువతితో చాటింగ్*
*వీడియో కాల్ లో MLA బోరున ఏడుస్తున్న దృశ్యాలు వున్న వీడియో రిలీజ్*
*డ్రైవింగ్ చేస్తూ బాధిత మహిళతో చాటింగ్*
*చెయ్యి కోసుకొని ఏడుస్తున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్..
👉
పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజబాబు..
వైద్యులు సమయపాలన పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవు..రోగులకు ప్రభుత్వం అందిస్తున్న మందులను తప్పక అందించాలి..ఇక మీదట ప్రభుత్వ ఆసుపత్రి గురించి ఫిర్యాదులు అందుకే ఉపేక్షించేది లేదు..హెచ్చరించిన జిల్లా కలెక్టర్ రాజబాబు.
👉ఖమ్మం డీఈవో ‘చైతన్య పథం’.. త’ప్పు చేస్తే డిస్మిస్”..!
ఖమ్మం DEOగా విధుల్లో చేరిన చైతన్య జైని విద్యాశాఖ ప్రక్షాళన దిశగా తీసుకుంటున్న చర్యలు ఉపాధ్యాయుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. విద్యార్థినులతో అసభ్యంగా ప్ర_వర్తించిన నర్సింహులగూడెం టీచర్ను సర్వీసు నుంచి డిస్మిస్ చేయగా.. విధి నిర్వహణలో రీల్స్ చేస్తూ, ప్రైవేటు సంస్థలను ప్రమోట్ చేస్తున్న మరో టీచర్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఒత్తిళ్లకు లొ*గకుండా, విద్యాశాఖను సరిదిద్దుతున్న DEOను పలువురు అభినందిస్తున్నారు.

👉 ఎన్కౌంటర్.. ఇద్దరు మావోలు హతం
ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. మావోలు కదలికల సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోలు తారసపడ్డారు. దీంతో బలగాలు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగటంతో ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారు. ఘటనాస్థలంలో ఒక ఏకే 47, పిస్టల్, పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు….
👉నా కోరిక తీర్చకపోతే నీ అంతు చూస్తా…
ప్రైవేట్ కంపెనీలో మహిళా ఉద్యోగిపై HR వేధింపులు, క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు …
హైదరాబాద్ – జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఎకోరెన్ ఎనర్జీ అనే ప్రైవేట్ కంపెనీలో మహిళా ఉద్యోగిని వేధిస్తున్న HR మేనేజర్ స్వామి రెడ్డి…తన కోరిక తీర్చాలని, తనతో కలిసి పబ్‌కు రావాలని, ట్రిప్‌కు రావాలని, లేకపోతే నీ అంతు చూస్తానని వేధిస్తున్న HR మేనేజర్ …తోటి ఉద్యోగులకు తన గురించి అసభ్యంగా చెప్పడంతో, వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు…బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉పనిచేసింది ఏసీబీలో.. కూడబెట్టింది రూ.కోట్లలో!*
అవినీతి నిరోధక శాఖలోనే పనిచేస్తూ.. కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారో హోంగార్డు. చేస్తుంది చిరుద్యోగమైనా అడ్డదారిలో భారీగా సంపాదించారు. వీటిపై అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా.. బంగారం, వెండి, నగదుతో పాటు అక్రమంగా సంపాదించిన ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు దొరికాయి.
👉ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య…
వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్..
తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ, డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని, వేరే ఎవరితో చనువుగా మాట్లాడవద్దని వేదింపులకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే దూరపు బంధువు…
రాజేందర్ వైఖరి నచ్చక అతనితో తమ కూతురు వివాహానికి నిరాకరించిన అనిత తల్లిదండ్రులు…ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని, తనను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందని గుర్తించిన రాజేందర్…దీంతో జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసి, అనిత గురించి తప్పుడు సమాచారమివ్వగా, అనితను వేధించడం మొదలు పెట్టిన జబ్బార్ లాల్…డబ్బులు ఇస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటానని జబ్బార్ లాల్ వేధింపులకు దిగడంతో, రాజేందర్‌కు ఫోన్ చేసి మీ ఇద్దరి వల్ల నా జీవితం నా నాశనం అయిందని, చావే దిక్కని కన్నీరు పెట్టుకున్న అనిత…చస్తే చావు అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో, గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన అనిత .రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

👉ఏపీలో హోంగార్డు ఆస్తులు రూ.20 కోట్లు… ఏసీబీ సోదాల్లో బట్టబయలు!*
విజయనగరం హోంగార్డు శ్రీనివాసరావుపై ఏసీబీ మెరుపుదాడులు…సుమారు రూ. 20 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తింపు…గతంలో ఏసీబీలోనే 15 ఏళ్లు పనిచేసినట్లు వెల్లడి…అవినీతి అధికారులకు సమాచారం లీక్ చేసి డబ్బు సంపాదించినట్లు ఆరోపణలు…
విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న నెట్టి శ్రీనివాసరావు అనే హోంగార్డు ఇళ్లు, ఇతర ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అతడు ఆదాయానికి మించి సుమారు రూ. 20 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు.
శ్రీనివాసరావు గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఏసీబీ విభాగంలోనే హోంగార్డుగా పనిచేయడం గమనార్హం. ఆ సమయంలో ఏసీబీ చేపట్టే దాడుల రహస్య సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని, అవినీతి అధికారులకు చేరవేసేవారని, అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంతోనే గతంలో అతడిని ఏసీబీ నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయినప్పటికీ, పాత పరిచయాలతో తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది.విజయనగరం, విశాఖపట్నం, గుర్ల మండలంలోని శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పలు విలాసవంతమైన భవనాలు, భూముల పత్రాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ ఘటనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ అవినీతి వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
👉ఆఫీస్‌ సబార్డినేట్ ఇంట్లో రూ.50 కోట్ల ఆస్తులు.. విస్తుపోయిన ఏసీబీ అధికారులు*
రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు…అక్రమాస్తుల కేసులో అటెండర్ తిరుమలేశ్‌పై చర్యలు…రూ.50 కోట్లకు పైగా మార్కెట్ విలువైన ఆస్తులు గుర్తింపు…11 స్థిరాస్తులు, భారీగా బంగారం,వెండి స్వాధీనం.తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో రూ.50 కోట్లకు పైగా అక్రమాస్తులు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గ్రేడ్‌-3 ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న నల్లిపోగు తిరుమలేశ్‌ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో గుర్తించిన ఆస్తుల మార్కెట్ విలువ చూసి అధికారులే విస్మయానికి గురయ్యారు.అక్రమాస్తుల కేసులో కొద్ది రోజుల క్రితమే సస్పెన్షన్‌కు గురైన తిరుమలేశ్‌పై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. గురువారం తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు నెల్లూరు జిల్లా డీసీ పల్లెలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మొత్తం ఐదు చోట్ల ఈ తనిఖీలు జరిగాయి.ఈ సోదాల్లో ఇప్పటివరకు 11 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, 1.47 కిలోల‌ బంగారం, 8.77 కిలోల వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.15.26 లక్షల నగదు,ఇంట్లోని విలువైన ఫర్నిచర్,ఇతర గృహోపకరణాలను కూడా సీజ్ చేశారు.ఓ సాధారణ స్థాయి ఉద్యోగికి ఈ స్థాయిలో ఆస్తులు ఎలా సమకూరాయన్న కోణంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!