👉 ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ముగిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ …మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రంలో చేసే పోరాటంలో పాల్గొనాలని రాహుల్ ని కోరిన ఎపీసీసీ చీఫ్
*వైఎస్ షర్మిలా రెడ్డి*డిల్లీ…

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి పిబ్రవరి 2 తో 20 ఏళ్లు … బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసింది .. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరణకు ఏపీలో భారీ ఎత్తున ఉద్యమం .. ఉపాధి హామీ పథకాన్ని తొలుత ప్రారంభించింది ఏపీ లోనే ఏపీ నుంచే మన్రెగా మొదలయింది
– ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన బండ్లపల్లి నుంచి రాష్ట్రంలో ఉద్యమం .. ఉపాధి హామీ పోరాటానికి రాష్ట్రానికి రావాలని రాహుల్ ని ఆహ్వానించడం జరిగింది రాహుల్ గాంధీ వచ్చేందుకు అంగీకరించారు… రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నాం
👉ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘డ్రగ్స్ పై దండయాత్ర’ కార్యక్రమాన్ని హాం మంత్రి అనిత మరియు సహచర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ , ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ,ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు , డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా,కలెక్టర్ లక్ష్మీశా ,విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తో హాం మంత్రి అనిత కలిసి ప్రారంభించినారు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు కడలి రేవతి, గుమ్మడి ప్రవీణ, షేక్ బీబీ శైలజ,చీపు త్రివేణి,వాయిబోయిన ఉషారాణి తమ కుటుంబంతో పాటు.. సమాజం మొత్తం సురక్షితంగా ఉండాలన్న సంకల్పంతో ప్రజల్లో అవగాహన పెంచేందుకు మార్చి 1వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సందర్శించనున్నారు. వేదికపై డ్రగ్స్ పై పోరాటానికి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు, పోలీసులతో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.
👉ధర్మవరంలో కల్తీ నూనె గుట్టురట్టు: జంతువుల కొవ్వుతో వంట నూనె తయారీ!
ప్రత్తిపాడు:ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, జంతువుల కొవ్వు మరియు క్రూడ్ ఆయిల్ కలిపి కల్తీ వంట నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టును కాకినాడ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నిర్వహిస్తున్న ఈ నకిలీ నూనె తయారీ కేంద్రంపై పోలీసులు మెరుపు దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.
అసలేం జరిగిందంటే?
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దాపురం డిఎస్పీ డి.శ్రీహరిరాజు పర్యవేక్షణలో ప్రత్తిపాడు పోలీసులు నిఘా పెట్టారు. సోమవారం (జనవరి 26) మధ్యాహ్నం ప్రత్తిపాడు ఎస్‌ఐ ఎస్. లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి ధర్మవరం NH-16 సమీపంలోని ఒక రేకుల షెడ్డుపై దాడి చేశారు. గత మూడు నెలలుగా ఇక్కడ రహస్యంగా కల్తీ నూనె వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు:
ఈ కేసులో ప్రధాన నిందితుడు పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలెంకు చెందిన బండారు ఫణి ప్రసాద్ (38) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి:
* చెందుర్తికి చెందిన ఏడిద విజయకుమార్, అరుగుల సురేష్‌ల నుంచి తక్కువ ధరకు జంతువుల కొవ్వును సేకరిస్తున్నాడు.
* కాకినాడ లైట్ హౌస్ ప్రాంతానికి చెందిన చిట్టిబాబు వద్ద నుండి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాడు.
* వీటన్నింటినీ కలిపి వంట నూనెగా మార్చి, ఇచ్చాపురానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని సంతోష్ శ్రీనివాస్ దాస్ కు రాజమండ్రికి చెందిన ఎండి ఇర్ఫాన్ కు అక్రమంగా సరఫరా చేస్తున్నాడు.
సీజ్ చేసిన సామగ్రి:
ఈ దాడుల్లో సుమారు రూ. 1,50,000/- విలువైన కల్తీ వంట నూనె, క్రూడ్ ఆయిల్, గ్యాస్ సిలిండర్లు మరియు ఇతర తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇటువంటి అక్రమ వ్యాపారాల పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ ఆపరేషన్‌లో ప్రత్తిపాడు సిఐ బి. సూర్య అప్పారావు, ఎస్‌ఐ లక్ష్మీకాంతం మరియు పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
👉రోడ్డు ప్రమాదాల నివారణ,మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు లక్ష్యంగా హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు*
హెల్మెట్ ధరించడం తలకు భారం కాదు ప్రాణానికి రక్షణ.

ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ ల పరిధిలోని పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలసి రోడ్డు భద్రతా నియమాలను వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన కూడలి, బ్లాక్ స్పాట్స్/ఆక్సిడెంట్ ప్రొనె ఏరియా వద్ద ప్రజలకు, వాహనచోదకులకు అవగాహన ఫెక్సీలు ఏర్పాటుచేయటం, జాతీయ రహదారి పై రోడ్డు భద్రత, రక్షణ, అతివేగం వంటి విషయాలపై సంకేత బోర్డులతో అవగాహన కల్పిస్తున్నారు.
రహదారులపై ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడంతో ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయని, తప్పనిసరిగా ప్రామాణిక కలిగిన హెల్మెట్ ధరించి వాహనం నడపాలని అధికారులు సూచిస్తున్నారు.తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదన్నారని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఎక్కువ స్పీడ్ తో వెళ్లరాదని,ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.
*మత్తు పదార్థాల వాడకం వల్ల ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్తుపై కలిగే తీవ్రమైన నష్టాల గురించి వివరించారు. డ్రగ్స్‌కు అలవాటు పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు పెంపొందించుకుని చదువు, క్రీడలు, ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టాలని, డ్రగ్స్ అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.ప్రకాశం జిల్లా పోలీసులు డ్రగ్స్ రహిత సమాజం కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
👉ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఫిర్యాది ఇంటి ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి మరియు ఇంటి నిర్మాణ బిల్లులను మంజూరు చేయడానికి ఫిర్యాది నుండి రూ. 10,000/- #లంచం డిమాండ్ చేస్తూ, స్వీకరిస్తుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు*
👉మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు..*
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఫిర్యాదు..
పేర్ని నానిపై BNS 196 (1), 353 (2), 351 (2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు..
👉మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్*..ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు పోగొట్టుకున్న ఊర్మిళ.
ఊర్మిళ వాట్సప్ నంబరుకు గత ఏడాది నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఒక లింక్ వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే 500 రెట్లు ఆదాయం వస్తుందని ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు..ట్రేడింగ్ మీద అవగాహన లేకపోవడంతో భర్త జేడీ లక్ష్మీనారాయణ సహాయం తీసుకున్న ఊర్మిళ.. డిసెంబర్ 24 నుండి జనవరి 5 వరకు 19 విడతలుగా రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించి 2 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా నమ్మించిన సైబర్ నేరగాళ్లు…విత్ డ్రా చేసుకోవాలంటే మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారుఈ నేరానికి పాల్పడ్డ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్రంలో చేసే పోరాటంలో పాల్గొనాలని రాహుల్ ని కోరిన ఎపీసీసీ చీఫ్ *వైఎస్ షర్మిల… 👉విజయవాడలో’డ్రగ్స్ పై దండయాత్ర’👉ధర్మవరంలో కల్తీ నూనె గుట్టురట్టు: జంతువుల కొవ్వుతో వంట నూనె తయారీ!…👉మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు..👉రోడ్డు ప్రమాదాల నివారణ,మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు…👉మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్*
Recent Posts

