👉బాలీవుడ్‌పై ప్రకాష్ రాజ్ క్రేజీ కామెంట్స్! ఇటీవల శివాజీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.కేరళలోని కోజికోడ్‌లో కేరళ లిటరేచర్ ఫెస్టివెల్‌లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. కోలీవుడ్ టు బాలీవుడ్ వరకు విభిన్నమైన క్యారెక్టర్లతో విలక్షణ నటుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు ప్రకాష్ రాజ్. విలన్ పాత్రలకు ప్రత్యేకతను తీసుకొచ్చి నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తుంపుని సొంతం చేసుకున్నారు. గత కొంత కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వంపై,ప్రదాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇటీవల శివాజీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయన తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. కేరళలోని కోజికోడ్‌లో కేరళ లిటరేచర్ ఫెస్టివెల్‌లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్ ప్రస్తుతం తన మూలాలని రోల్పోయిందని, ఎంచుకుంటున్న కథల్లో పూర్తిగా ఆత్మను పూర్తిగా వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా బాలీవుడ్ పైకి ఎంతో అందంగా, కలర్ ఫుల్‌గా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం జీవం లేని డొల్లగా మారిందన్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌ను మూడమ్ టుస్సాడ్స్‌లోని మైనపు విగ్రహాలతో పోలుస్తూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలను, దళితుల ఆవేదనను ఎంతో సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.మన మూలాలు మన కథల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే అవి ప్రేక్షకులకు చేరువవుతాయి. అలా కాకుండా గ్లామర్ వెంట పరుగెత్తడమే లక్ష్యంగా పెట్టుకుంటే అలాంటి సినిమాలు ప్రేక్షకులకు దూరమవుతాయన్నారు. తమిళంలో రూపొందిన `జై భీమ్`, మామన్నన్ వంటి సినిమాలు సమాజంలో మార్పుకు నాందిపలకాలని సూచిస్తుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం మూలాలని మర్చిపోయి గ్లామర్, డబ్బు, లుక్స్, రీల్స్, ప్రమోషన్స్ వంటి కమర్షియల్ హంగులకే పరిమితమైందని, ఆ కారణంగానే బాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త దూరమైందని విమర్శలు గుప్పించారు. దీంతో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజు అంతరిక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో కలిసి ఓ ఫొటో దిగారు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని పొందిన వ్యక్తితో ఇలా ప్రకాష్ రాజ్ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ విషయం పక్కన పెడితే విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం వారణాసి, స్పిరిట్, గూఢచారి 2, డెకాయిట్, ఫాదర్, మిరాకిల్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో పాన్ వరల్డ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా మూవీస్‌కూడా ఉండటం గమనార్హం.
👉 బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి… పక్కా ప్లాన్‌తో భర్తను చంపేసింది: గుంటూరు పోలీసులు*
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి ఘాతుకం…
బిర్యానీలో నిద్రమాత్రలు ఇచ్చి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య…సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం..
వారం రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులు…నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన గుంటూరు ఎస్పీ…
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడు, అతని స్నేహితుడితో కలిసి ఓ భార్య అతి కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించి భార్యతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం మీడియాకు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే, చిలువూరు గ్రామానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు (42) ఈ నెల 18న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్యాస్ సమస్య కారణంగా గుండెపోటుతో సహజంగానే చనిపోయాడని అతని భార్య లక్ష్మీమాధురి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అనుమానం వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. శవపరీక్షలో శివనాగరాజు ఛాతీ ఎముకలు విరిగినట్లు తేలడంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనుమానిత మృతిగా కేసు నమోదు చేసి, లోతుగా దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. లక్ష్మీమాధురికి, సత్తెనపల్లికి చెందిన గోపీకి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. 2007లో శివనాగరాజుతో వివాహం జరగగా, తర్వాత విజయవాడలోని ఓ సినిమా హాల్‌లో పనిచేస్తున్నప్పుడు గోపీతో పరిచయం ఏర్పడింది. ఈ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లక్ష్మీమాధురి, అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్నింది.పథకం ప్రకారం, గోపీ తన స్నేహితుడైన ఆర్‌ఎంపీ డాక్టర్ సురేశ్ వద్ద నుంచి నిద్రమాత్రలు తెచ్చి లక్ష్మీమాధురికి ఇచ్చాడు. ఈ నెల 18న రాత్రి ఆమె బిర్యానీలో ఆ నిద్రమాత్రల పొడిని కలిపి భర్తకు పెట్టింది. అది తిన్న శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాక, ఆమె తన ప్రియుడు గోపీని, అతని స్నేహితుడు సురేశ్‌ను ఇంటికి పిలిపించింది. ముగ్గురూ కలిసి అపస్మారక స్థితిలో ఉన్న శివనాగరాజును దిండుతో ఊపిరాడకుండా చేశారు. గుండెలపై రొట్టెల కర్రతో బలంగా కొట్టి చంపేశారు. ఆ తర్వాత ప్రియుడు వెళ్లిపోగా, ఆమె రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.తన వివాహేతర సంబంధం గురించి తెలియడంతో భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు లక్ష్మీమాధురి పోలీసుల విచారణలో అంగీకరించింది. టెక్నికల్ ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు, నిందితులైన లక్ష్మీమాధురి, గోపీ, సురేశ్‌లను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన వారం రోజుల్లోనే కేసును ఛేదించిన మంగళగిరి రూరల్ సీఐ ఏవీ బ్రహ్మం, దుగ్గిరాల ఎస్సై వెంకట రవి, వారి సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారు
👉కడప నగరంలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి దారుణ ఘటన…*కడప జిల్లా…
ఓ ఇంటిని నేలమట్టం చేసిన రెండు జెసిబిలు…
వంద మంది రౌడీలతో ఇంటిపై దాడి…ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను బయటకు లాగిన దుండగులు…భాస్కర్, లక్ష్మీ చలపతి, భారవి కుటుంబానికి చెందిన ఇల్లు ధ్వంసం…ముందస్తు నోటీసులు లేకుండానే ఇల్లు కూల్చివేత..దొంగ రిజిస్ట్రేషన్లతో భూమి కబ్జా ప్రయత్నమని బాధితుల ఆరోపణ…
ఇల్లు కూల్చడం వెనుక శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ద్వారకనాథరెడ్డి ఉన్నారన్న ఆరోపణ…
ఘటన సమయంలో తీవ్ర భయాందోళనలో కుటుంబ సభ్యులు…ముసలివారు, చిన్నారులను బలవంతంగా బయటకు తరలింపు…ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం…న్యాయం చేయాలని బాధితుల ఆవేదన..ఎర్రముక్కపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి..
👉కడపలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్‌చల్..!*
*పలు నివాసాల్లో బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు.**విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేసిన దొంగలు.**కానిస్టేబుల్ తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలింపు.*
👉 బొగ్గు స్కాం పై హైకమాండ్ సీరియస్.. ఢిల్లీకి పిలుపు?
తెలంగాణలో జరుగుతున్న బొగ్గు స్కాం,HILTP స్కాం వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రులకు ఢిల్లీకి రమ్మని హైకమాండ్ ఆదేశం

లేఖ మెయిల్ పంపిన ఓ మంత్రి, కీలక నాయకులు…
ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డితో ఢిల్లీ పెద్దలు భేటీ అయ్యే అవకాశం…సింగరేణి- నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ స్కాం, HILT స్కాం వంటి వివాదాలపై రేవంత్ రెడ్డికి కాల్…మంత్రుల మధ్య చెలరేగుతున్న వివాదాలు, మంత్రులపై న్యూస్ ఛానెళ్లలో ప్రసారమయ్యే వివాదాల పై హైకమాండ్ అసంతృప్తి…తెలంగాణలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, పరిస్థితులు అదుపు తప్పకముందే నియంత్రణలో పెట్టాలని హైకమాండ్ నిర్ణయం…
తెలంగాణలో స్కాంలపై, వివాదాలపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన సీనియర్ నాయకులు…
పార్టీలోని కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో తమ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని సోనియా గాంధీకి మెయిల్ పంపిన ఓ కీలక నాయకుడు…
ఇతర పార్టీల నుండి కొత్తగా చేరిన నాయకులకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని హైకమాండ్ పెద్దల దగ్గర ఆవేదన వ్యక్తం చేసిన మరికొంతమంది సీనియర్ నేతలు…తమకు మంత్రిత్వ శాఖలు ఇవ్వాలని ఢిల్లీ పెద్దలను కోరిన కొంతమంది నేతలు..
👉కేంద్రం కొత్త విద్యుత్ విధానం: బిల్లులు పెరిగే అవకాశం…
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చేలా కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. జాతీయ విద్యుత్ విధానం 2026 ముసాయిదా ప్రకారం, ద్రవ్యోల్బణం, ఉత్పత్తి ఖర్చులతో విద్యుత్ ఛార్జీలను అనుసంధానించనున్నారు. దీనివల్ల ప్రతీ ఏడాది లేదా నిర్ణీత వ్యవధిలో విద్యుత్ బిల్లులు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రాల డిస్కంలు సకాలంలో ఛార్జీలను సవరించడంలో విఫలమైతే, విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడేందుకు ఈ విధానం దోహదపడుతుందని భావిస్తున్నారు.
👉చైనా మాంజాకు ఐదేళ్ల చిన్నారి బలి*
*చైనా మాంజాకు ఐదేళ్ల చిన్నారి బలైంది. తల్లిదండ్రుల ద్విచక్ర వాహనంపై ముందు కూర్చున్న బాలిక మెడకు దారం చుట్టుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.
👉శ్రీశైలం టోల్ గేట్ వద్ద భారీగా నోట్ల కట్టలు పట్టివేత*
నంద్యాల జిల్లా… శ్రీశైలంలో టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన వాహనంలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి.
వాహనంలో వచ్చిన వ్యక్తులు తాము బంగారం వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చి, శ్రీశైలం దర్శనానికి వచ్చామని సిబ్బందికి వివరించారు. ఈ ఘటనతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
👉 రూ.400 కోట్లతో తిరుపతి రావాల్సిన కంటైనర్ దోపిడీ… స్పందించిన కర్ణాటక హోంమంత్రి
గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ.400 కోట్లతో తరలిస్తున్న కంటైనర్ దోపిడీ
మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపిన హోంమంత్రి…నాసిక్ ప్రాంతంలో కొంతమంది అనుమానితులను అరెస్టు చేసినట్లు వెల్లడి
400 కోట్లను తరలిస్తున్న కంటైనర్‌ను దొంగిలించినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర పేర్కొన్నారు. గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ.400 కోట్లను తరలిస్తున్న కంటైనర్‌ను దోపిడీ దొంగలు దారి మళ్లించిన వ్యవహారంపై ఆయన స్పందించారు. బాధితులు కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేయడానికి సిద్ధమని, ఈ ఘటనలో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన అన్నారు.
కర్ణాటక సరిహద్దుల్లో దోపిడీ జరగగా, మహారాష్ట్రలోని నాసిక్‌లో కేసు నమోదైంది. కొన్ని రాష్ట్రాల్లో త్వరలో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికలకు ఈ డబ్బు కాంగ్రెస్ పార్టీ తరలిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ కొట్టి పారేస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, గోవాలలో బీజేపీ యే అధికారంలో ఉందని కర్ణాటక కాంగ్రెస్ మంత్రులు గుర్తు చేశారు.కాగా, కర్ణాటక సరిహద్దుల్లో కంటైనర్‌ను దొంగిలించగా, మహారాష్ట్ర పోలీసులు విచారణ జరుపుతున్నారని, దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు జి. పరమేశ్వర చెప్పారు. నాసిక్ ప్రాంతంలో కొంతమంది అనుమానితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు.గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో రూ. 400 కోట్లను తరలిస్తున్న కంటైనర్‌ను దోపిడీ దొంగలు దారి మళ్లించారు. ఆ వాహనం గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా కర్ణాటకలో ప్రవేశించి తిరుపతికి చేరాల్సి ఉంది. దీనిని ఎవరు దారి మళ్లించారనే అంశంపై మహారాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది.
👉బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఎంపికైన ప్రకాశం జిల్లా తరపున విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిఇవో వివేక్ యాదవ్, చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులమీదుగా ఉత్తమ అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
👉 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ చేతుల మీదుగా ఎన్నికల విధుల్లో భాగంగా ఉత్తమ అసిస్టెంట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి గా అవార్డు అందుకున్న పొదిలి తహసీల్దార్ M.V కృష్ణారెడ్డి…

👉 ఒంగోలు పార్టీ ఆఫీస్ లో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ,జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి,పట్టణ అధ్యక్షులు కటారి శంకర్ , మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యదర్శి కె.ఆదెన్న,బొట్ల రామారావు మరియు పార్టీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

