👉ఇరాన్ లో ఊచకోత.. 3 వేలు కాదు 30 వేలపైగా మరణాలు.. నిజమెంత?.
కుంకుమపువ్వు నెత్తురోడిందా? వేలాదిమంది రక్తంతో ముద్దయిందా?? దీనికి ఔననే సమాధానం చెబుతోంది పశ్చిమ దేశాల మీడియా. ఇరాన్ లో ఈ నెల ప్రారంభంలో జరిగిన నిరసనలను అక్కడి ప్రభుత్వం అణిచివేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేలాది మందిని హతమార్చినట్లుగానూ కథనాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలాంటిదే ఓ కథనాన్ని తాజాగా టైమ్ పత్రిక వెలువరించింది. కరెన్సీ విలువ పడిపోవడం, ధరల పెరుగుదలతో పాటు స్వేచ్ఛ కోరుతూ ఇరాన్ ప్రజలు గత డిసెంబరు చివరి నుంచి వీధుల్లోకి రాసాగారు.
ఈ నెల 8వ తేదీకి వచ్చేసరికి ఈ నిరసన తీవ్ర రూపం దాల్చింది. దీంతో సంప్రదాయ వాదుల సారథ్యంలోని ప్రభుత్వం తొక్కిపెట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో 3 వేల మంది చనిపోయినట్లు తెలిసింది. కానీ, ఈ సంఖ్య 30 వేలు దాటి ఉంటుందని టైమ్ పత్రిక చెబుతోంది. కేవలం 8, 9 తేదీల్లోనే ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొంది.
వీధులన్నీ రక్తసిక్తం?…టైమ్ కథనం ప్రకారమే చూస్తే.. ఆ రెండు రోజుల్లో ఇరాన్ వీధులు రక్తసిక్తం అయ్యాయి. నిరసనకారలు- ప్రభుత్వ బలగాల మధ్య హింసాత్మక ఘటనల్లో 30 వేలమంది చనిపోయినట్లు పేర్కొంది. స్థానిక అధికారులను ప్రస్తావిస్తూ ఈ మేరకు రాసుకొచ్చింది. ఇరాన్ భద్రతా దళాలు ఊచకోత కోశాయని.. దీంతో అంబులెన్సుల స్థానంలో డెడ్ బాడీలను 18 చక్రాల ట్రక్కుల్లో తరలించాల్సి వచ్చిందని తెలిపింది. కాగా, ఇరాన్ లో ఏం జరిగినా సాధారణ సందర్భాల్లోనే పెద్దగా బయటకు రాదు. అలాంటిది ఆందోళనలు ఇంత తీవ్రంగా ఉండగా జరిగిన మారణహోమం వివరాలు తెలియడం కష్టమే.
*ఇంటర్నెట్ లేదు..4 వేలకు మించిన ప్రాంతాల్లో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చడంతో ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ ను బంద్ చేసింది. దీంతో అసలేం జరిగిందో ఎవరికీ స్పష్టమైన అంచనా ఉందదు. 3,117 మంది చనిపోయారని ఈ నెల 21న ప్రభుత్వం తెలిపింది. కానీ, 8, 9 తేదీల్లో 30 వేల మందిపైనే హత్యకు గురైనట్లు టైమ్ చెబుతోంది. అమెరికా నుంచి పనిచేసే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ల న్యూస్ ఏజెన్సీ.. 5,459 మరణాలను ధ్రువీకరించింది. 17వేలకు పైగా మరణాల కారణాలను విశ్లేషిస్తోంది.
*నమ్మొచ్చా? లేదా?…ఇరాన్ అంటే అమెరికాకు ఆగర్భ శత్రువు. అలాంటి దేశంపై ఎప్పుడు దాడి చేయాలా? అని చూస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకే చెందిన టైమ్ పత్రిక కథనాన్ని నమ్మడం కష్టమే. పైగా, అమెరికా ఎవరినైనా టార్గెట్ చేసుకుంటే ముందుగా దానిపై విద్రోహి ముద్ర వేస్తుంది. ఈ క్రమంలోనే ఇరాన్ లో ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రోత్సహించారు. ఇప్పుడు మీడియా ద్వారా మరో విధంగానూ ప్రచారం చేస్తున్నారు. ఆఖరికి.. ఇరాన్ పై తమ దాడిని సమర్థించుకోవడానికే ఇలా చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. నిజం ఏమిటో.. ఇరాన్ ప్రజలకే తెలియాలి.
👉ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీస్ అధికారులు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు..

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, ఎందరో మేధావులు, త్యాగధనులు అనేక సంవత్సరాల పాటు అహర్నిశలు కృషి చేసి మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుండి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిందని, ఆ చారిత్రక రోజు నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటు న్నామన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు, హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది రాజ్యాంగ స్ఫూర్తితో నిబద్ధత, నిష్పక్షపాతతతో ప్రజల హక్కులను కాపాడుతూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు ఇంకా మెరుగైన సేవాలందించాలన్నారు.అనంతరం జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు,సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు,ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాస రావు,DPO AO రామ్ మోహన్ రావు, సీఐలు, ఆర్ఐలు,ఎస్సైలు,డిపిఓ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.
👉 ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.రాజా బాబు,జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ,సంయుక్త కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ , మరియు జిల్లా అధికారులు.
👉 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కాపురం లో SVKP డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేడుకలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి,కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి,యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు
👉 ఒంగోలు లోని ప్రకాశం హాస్పిటల్ లో కావేరి ఆనందరావును పలకరించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ..
👉 ఒంగోలు PVR బాయ్స్ హై స్కూల్ లో ఈదర హరి బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ కళాపరిషత్ కళల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అయినాబత్తిన ఘనశ్యామ్ సీనారెడ్డి,ఆవుల రమణారెడ్డి, ఆళ్ళ శ్రీనివాస రెడ్డి

👉”మదరసాయే మిస్ బాబుల్ ఉలూమ్ మిస్వాన్ ” లో గణతంత్ర వేడుకలు ..నంద్యాల జిల్లా… నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని “మదరసాయే మిస్ బాబుల్ ఉలూమ్ మిస్వాన్ ” లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన బాలికలకు మదరసా కమిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ యూసుఫ్ సాహెబ్ బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సయ్యద్ సిరాజ్ బియాబానీ 1960 నుండి నిర్వహిస్తున్న ఈ మదరసా ఎంతోమంది పేదలకు ఖురాన్ దివ్యగ్రంధం పారాయణంతోపాటు విద్యాబుద్ధులు నేర్పిస్తుందని కొనియాడారు. మౌలానా మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ అయుబ్, పేష్ ఇమాం మహమ్మద్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.

👉 గిద్దలూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు: ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి .. 
* గిద్దలూరు పట్టణంలోని మండల తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.ఎందరో వీరుల పోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారు అందచేసిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.భారతదేశం నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అన్నీ రంగాల్లో ముందంజలో నిలుస్తోందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశం సాధిస్తున్న పురోగతి అమోఘమని కొనియాడారు.అదే విధంగా యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.”మనం ఏ స్థాయిలో ఉన్నా సరే, మాతృభూమి పట్ల గౌరవాన్ని,బాధ్యతను మరువకూడదనీ,భారతదేశాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టడమే మనం ఆ మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి,పార్లమెంట్ నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి,సొసైటీ బ్యాంకు చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య మరియు పట్టణ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు,నాయకులు, అధికారులు పాల్గొన్నారు..
👉నూతన మార్కాపురం జిల్లా కేంద్రంలోని SVKP కళాశాల ప్రాంగణంలో ఘనంగా “గణతంత్ర దినోత్సవ” వేడుకలు..
* “గణతంత్ర దినోత్సవ” వేడుకల్లో పాల్గొన్న గిద్దలూరు శాసనసభ్యులు “ముత్తుముల అశోక్ రెడ్డి “..
👉దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న ముత్తుముల క్రిష్ణ కిశోర్*
*మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆరవిటికోట గ్రామంలో మాజీ ఎంపీపీ షైక్ నాయబ్ రసూల్ తండ్రి అయిన షైక్ ఖాసీంపిరా దశదిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముత్తుముల క్రిష్ణ కిశోర్ రెడ్డి” పాల్గొన్నారు నాయబ్ రసూల్ కుటుంబ సభ్యులతో ఇంటి పెద్ద కోల్పోవడం చాలా బాధాకరం అని దైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు*కార్యక్రమంలో రాచర్ల మండల పార్టీ అధ్యక్షులు కటిక యోగానంద్,యాసం లక్ష్మిరెడ్డి,సూర జయచంద్రరెడ్డి,గువ్వా పిచ్చయ్య,సూర ఆదినారాయణ రెడ్డి,సిరిగిరి వెంకటపతి,భవనం శ్రీధర్ రెడ్డి,రసూల్ రెడ్డి,కళ్యాణ్ రెడ్డి,దానం శేఖర్ తదితరులు పాల్గొన్నారు*

