👉ఆ మీడియా హౌస్ ను సొంతం చేసుకున్న అదానీ ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిందే. ఇప్పటికే దిగ్గజ వ్యాపారస్తుడిగా వ్యవహరిస్తున్న అదానీ కొంత కాలం క్రితమే మీడియా రంగంకి అడుగు పెట్టటం తెలిసిందే. రోటీన్ కు భిన్నమైన కొన్ని కాంబినేషన్లు ఉంటాయి. మిగిలిన రంగాలకు భిన్నంగా మీడియా సంస్థల వ్యాపారం ఉంటుంది. ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిందే. ఇప్పటికే దిగ్గజ వ్యాపారస్తుడిగా వ్యవహరిస్తున్న అదానీ కొంత కాలం క్రితమే మీడియా రంగంకి అడుగు పెట్టటం తెలిసిందే. ఆయన చేతిలో ఇప్పటికే ఎన్డీటీవీ, బీక్యూ ప్రైమ్ లలోనూ వాటాల్ని కొనుగోలు చేసి..ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న అదానీ తాజాగా మరో పెద్ద మీడియా సంస్థను సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మరింది. ఇంతకూ ఆ సంస్థ ఏదంటారా? అక్కడికే వస్తున్నాం. దేశీయంగా వివిధ బాషలకు చెందిన న్యూస్ ఏజెన్సీగా సపరిచితమైన ఐఏఎన్ఎస్ ప్రింట్.. డిజిటల్, బ్రాడ్ క్యాస్ట్ ఫ్లాట్ఫామ్స్ కు వార్తలు అందించే ఏజెన్సీగా ఉంటే ఈ సంస్థను అదానీ గ్రూపు పూర్తిగా సొంతం చేసుకుంది. 2023 డిసెంబరులో అదానీ గ్రూపు ఏఐఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీలో 50.5 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో న్యూస్ వైర్ ఏజెన్సీని ఏఎంజీ మీడియాకు అనుబంధ సంస్థగా మార్చుకున్న అదానీ గ్రూపు 2024 జనవరిలో వాటాను పెంచుకుంది. దీంతో ఏఎంజీ మీడియా 76 వాతం వోటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా 24 శాతం వాటాను సొంతం చేసుకోవటానికి అవసరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవటంతో ఈ సంస్థ ఇప్పుడు అదానీ గ్రూపులో ఒక అనుబంధ సంస్థగా మారనుంది.ఇది అదానీ ఎంటర్ ప్రైజస్ లో భాగంగా మారినట్లైంది.ఇంతకాలం వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన అదానీ గ్రూపు అతి తక్కవ వ్యవధిలో ఎంతలా విస్తరించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి గ్రూపు మీడియా, కంటెంట్ ఎకోసిస్టమ్ లో తానో బలమైన శక్తిగా మారిందని చెప్పాలి. దీంతో బిజినెస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ వరకు అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించినట్లుగా చెప్పక తప్పదు.
👉బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత: గాలి జనార్దన్ మోడల్ హౌస్ కు నిప్పు ..తొలుత మోడల్ హౌస్ మీద దాడి చేసి.. అనంతరం ఇంట్లో ఉన్న తలుపులు.. కిటికీలను ధ్వంసం చేసి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.

కొత్త సంవత్సరం ఆరంభంలో బళ్లారిలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయని భావిస్తున్న వేళలో.. అనూహ్య ఘటన చోటు చేసుకోవటం.. బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ ను నిప్పు పెట్టిన వైనం తాజా ఉద్రిక్తతలకు దారి తీసింది. కొత్త సంవత్సర వేళ బ్యానర్ కట్టే విషయంలో కాంగ్రెస్ – బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ సందర్భంగా బళ్లారిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనటం.. ఆ సందర్భంగా జరిగిన గొడవల్లో కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు.ఈ ఉదంతంలో కాంగ్రెస్ – బీజేపీ కార్యకర్తలు.. సానుభూతిపరులు.. నేతల మధ్య పరస్పర విమర్శలు.. ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఇప్పుడే అక్కడ పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయి. ఇలాంటి వేళలో.. కంటోన్మెంట్ లోని జి స్క్వేర్ లే అవుట్ లో గాలి జనార్దన్ కి చెందిన మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. తొలుత మోడల్ హౌస్ మీద దాడి చేసి.. అనంతరం ఇంట్లో ఉన్న తలుపులు.. కిటికీలను ధ్వంసం చేసి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే కం జనార్దన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి కాలిపోయిన ఇంటిని సందర్శించారు. ఇదంతా రాజకీయశత్రుత్వంలో భాగంగా బళ్లారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుల పనేనని ఆయన ఆరోపించారు. బ్యానర్ కట్టే సందర్భంలో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా.. జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెడతామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారని.. జనార్దన్ రెడ్డి ఉంటున్న ఇంటిని తగలబెట్టటం సాధ్యం కాదు కాబట్టి.. బళ్లారి మోడల్ హౌస్ ను తన అనుచరులతో నిప్పు పెట్టించి ఉంటారని ఆరోపించారు. మోడల్ హౌస్ కు నిప్పు పెట్టిన ఒక యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిప్పు పెట్టిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ ఉదంతంలో బాధ్యలుగా భావిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.మోడల్ హౌస్ పెద్ద ఎత్తున కాలిపోయినట్లుగా చెబుతున్నారు.
👉మాజీ ఐపీఎస్,బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నోటీసులు పంపిన సజ్జనార్…
తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, 2 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని, 7 కేసులకు సంబంధించిన క్రైమ్ నంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు ఇవ్వాలని, వివరాలు ఇవ్వకపోతే క్రిమినర్ చర్యలు తప్పవని నోటీసులు
👉 తూచ్.. సజ్జనార్ నోటీసుకు ప్రవీణ్ యూటర్న్ !
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చీఫ్ సజ్జనార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఇప్పుడు స్వయంగా చిక్కుల్లో పడ్డారు. సజ్జనార్‌పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన, పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా స్వరం మార్చారు. ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లతో సహా పూర్తి వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడంతో ప్రవీణ్ కుమార్ ఆత్మరక్షణలో పడ్డారు. తాను సజ్జనార్‌పై కేసులు ఉన్నాయని అనలేదని, కేవలం నైతికత గురించే మాట్లాడానని ప్రవీణ్ కుమార్ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన సజ్జనార్, ఫోన్ ట్యాపింగ్ విచారణకు నేతృత్వం వహించడం సమంజసం కాదని మాత్రమే తన అభిప్రాయాన్ని చెప్పానంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అయితే, ప్రెస్ మీట్ పెట్టి మరీ క్రిమినల్ కేసులు ఉన్నాయని నొక్కి చెప్పిన ఆయన, ఇప్పుడు కేవలం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగానే మాట్లాడానని చెప్పడం గమనార్హం. మాజీ పోలీస్ అధికారిగా ఉండి, నిరాధారమైన ఆరోపణలతో తోటి అధికారిపై బురద చల్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ ప్రయోజనాల కోసం లేదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతరులను ఇరకాటంలో పెట్టే క్రమంలో సజ్జనార్‌ను టార్గెట్ చేయబోయి ప్రవీణ్ కుమార్ నిండా ఇరుక్కుపోయారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమే అని తెలిసినా, ఆధారాలు లేకుండా క్రిమినల్ ఆరోపణలు చేసి ఇప్పుడు నేను అలా అనలేదు అనడం చెల్లుబాటు కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ వివాదంలో సజ్జనార్ చేతికి ప్రవీణ్ కుమార్ దొరికిపోయినట్లయిందని, నోటీసులకు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఆయన మరిన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.
👉 విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన రైతు…ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వైర్ మరమ్మత్తులు రైతుతో చేయించిన జేఎల్ఎం …మరమ్మత్తులు చేసే క్రమంలో కరెంట్ ఆన్ చేసిన లైన్ మెన్, విద్యుత్ షాక్‌తో రైతు మృతి…జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన పెండ్యాల బిక్షపతి(39) అనే రైతు…
ఈ క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వైర్ కాలిపోవడాన్ని గమనించి, జేఎల్ఎం శ్రీనివాస్‌కు సమాచారమిచ్చిన బిక్షపతి…లైన్ మెన్‌కు చెప్పి LC తీసుకున్నానని, ఫీజు వైర్ నువ్వే వేసుకోమని రైతుకు చెప్పిన జేఎల్ఎం…
ఫీజు వైర్ వేసే క్రమంలో జేఎల్ఎంకు చెప్పకుండా కరెంట్ సరఫరా ఆన్ చేసిన లైన్ మెన్ కుమారస్వామి
దీంతో విద్యుత్ షాక్‌తో కిందపడిన రైతును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించిన వైద్యులు
👉యాదగిరిగుట్టలో రౌడీషీటర్ నిశాంత్ ఠాకూర్ దారుణ హత్య:* *ఇద్దరు నిందితులు లొంగుబాటు*
యాదగిరిగుట్ట పట్టణంలోని మైలార్‌గూడెంలో కలకలం రేపిన ఘటనలో, స్థానిక రౌడీషీటర్ నిశాంత్ ఠాకూర్ దారుణంగా హత్యకు గురయ్యారు. SVS కాటేజ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గతంలో అనేక నేర కేసుల్లో నిందితుడిగా ఉన్న నిశాంత్ ఠాకూర్ హత్య వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఈ హత్య జరిగిన వెంటనే, ఇద్దరు నిందితులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు,దీని వెనుక ఉన్న వ్యక్తుల గురించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసు గురించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
👉 ఏసీబీ అడిషినల్ ఎస్పి మహేంద్ర మాతే కామెంట్స్….
ఏసీబీ డిజి అతుల్ సింగ్ ఆధ్వర్యంలో దాడులు చేశాము…
DRO మురళి మూడు లక్షలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నాం…
2023న మాజీ సీఎం ప్రోగ్రాంలో సాగర్ మాత క్యాటరింగ్ వారికి భోజనాల బిల్లు 37 లక్షలు అయింది…
దానిలో పది లక్షల బిల్లు గతంలో చెల్లింపులు జరిగాయి…
మిగిలిన 27 లక్షల క్యాటరింగ్ బిల్లు బకాయిలు మంజూరు చేయడానికి DRO మురళి 3లక్షలు లంచం అడిగాడు…
కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం…
మురళిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నాం…
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం…
👉శోభ యాత్ర సందర్బంగా కడప సెవెన్ రోడ్స్ సర్కిల్ వద్ద టపాసులు పెల్చడంతో కృష్ణ హోటల్ సెక్యూరిటీ పొట్టలోకి దూసుకెళ్లిన రాకెట్….పొట్ట పగలి బయటకు వచ్చిన పేగులు…కడప జిల్లా…హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు చేరుకుని పొట్ట పగలిన వ్యక్తిని అంబులెన్సు చికిత్స నిమిత్తం తరలించిన పోలీసులు….
👉పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం వీరాపురం లో రెచ్చిపోయిన దారి దోపిడి దొంగలు*
దాచేపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంకి రోజువారి వ్యవసాయ కూలీ నిమిత్తం పనులకు వెళ్లిన ఇరువురు మహిళలు…
రోజువారీ కూలి పనుల నిమిత్తం ఆటోలో వెళ్లి అక్కడ నుంచి పొలానికి నడిచి వెళ్తున్న సమయంలో జరిగిన సంఘటన…
వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్న సమయంలో దారిలో మహిళలను అడ్డగించిన ఇద్దరు దుండగులు…
ఇరువురు మహిళల లను కత్తులతో చంపుతాం అని బెదిరించి, వారి వద్ద ఉన్న బంగారు నాంతాడును మరియు లాకెట్ మరియు సెల్ ఫోన్ ను లాక్కుని వెళ్లిన దుండుగులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు
👉మహిళలకు శిక్షణ ద్వారా ఉపాధి రక్షణ..*
*మైనారిటీ సంక్షేమ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్*
*ఆలియా సుల్తానాను అభినందించిన మహ్మద్ అలీఖాన్ బాబర్* *మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత శిక్షణ..*
మహిళలకు సరైన శిక్షణ అందించడం ద్వారా వారిని ఉపాధి వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నామని మైనారిటీ సంక్షేమ చైర్మన్ ఒబెధుల్లా కొత్వాల్ అన్నారు. ఇటీవలే ఆలియా సుల్తానాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా షాద్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ బాబర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 60 రోజుల బ్యూటీ పార్లర్, అడ్వాన్స్ మేకప్ నేర్పించేందుకు శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం ఏదో ఒక కృషి చేస్తూనే ఉందన్నారు. మహిళలు ఉపాధి దిశగా ఉన్నత స్థాయికి ఎదిగితే పేదరికం దానంతట అదే దూరమవుతుందని పేర్కొన్నారు. అది దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను అన్ని విధాల ఆదుకునేందుకు కృషి చేస్తున్నారని వెల్లడించారు.మహిళా సేవ మండల అధ్యక్షురాలు అలియా సుల్తానా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆమెకు ధ్రువపత్రాన్ని అందజేశారు. పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, సయ్యద్ ఖాదీర్, మెహబూబ్, బాబా, సమద్ తదితరులు పాల్గొన్నారు..
👉మెడికల్ సీటు.. ‘దివ్యాంగుల కోటా’ కోసం పాదం నరుక్కున్న విద్యార్థి!*
* డాక్టర్ కావాలని కలలు కనే విద్యార్థులు.. వాటిని సాకారం చేసుకునేందుకు కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తారు. కానీ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి మాత్రం వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు. రెండు సార్లు నీట్ ప్రవేశ పరీక్ష రాసి విఫలమైన అతడు.. దివ్యాంగుల కోటాలో తేలికగా సీటు పొందవచ్చని భావించి తీవ్ర చర్యకు దిగాడు. ఇందుకోసం తన పాదాన్నే నరుక్కున్నాడు. _*కానీ, ఆ ప్లాన్ బెడిసికొట్టింది!!*_
👉ఏసీబీకి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్*
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కే.మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ…
కాప్రాలో 300 చ.గజాల మూడంతస్తుల ఇళ్లు, పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నంలో ఓపెన్ ప్లాట్, ఒక ఎకరా కమర్షియల్ ల్యాండ్, 1.2 కోట్ల విలువ గల ఫామ్ హౌస్, 1.2 కేజీల బంగారు ఆభరణాలు, ఫర్చ్యునర్, వోల్వో, వోక్స్ వాగన్, టైగన్ వాహనాలు, రూ.9 లక్షల నగదు గుర్తింపు
ఏఆర్కే స్పిరిట్స్ కంపెనీలో రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టిన మధుసూదన్ రెడ్డి
భార్య, పిల్లల పేరుతో రెండు షెల్ కంపెనీల ఏర్పాటు
👉రూ.2 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కాడు*
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి తెలంగాణ అనిశా (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుని పేరిట ఉన్న 8.35 ఎకరాల భూమికి సంబంధించిన సాదా బైనామా రిజిస్ట్రేషన్ దస్తావేజును ప్రాసెస్ చేసి పంపించేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యాసాగర్ రెడ్డి, ఫిర్యాదుదారుని నుంచి రూ.2,00,000/- లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అనిశా అధికారులు వలపన్నించి ఈ దాడిని విజయవంతంగా నిర్వహించారు. ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి కలకలం రేగింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
👉ప్రాజెక్టులపై చర్చకు సవాల్, ప్రతిసవాల్ విసురుకున్న నేతలు😱
తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఇరు నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ప్రభాకర్ రెడ్డి, చర్చకు తాను సిద్ధమని, పెద్దారెడ్డి ఇంటి వద్దకే వస్తానని ప్రతి సవాల్ చేశారు. ఈ పరిణామంతో తాడిపత్రిలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. ఇరువర్గాల కార్యకర్తలు గుమిగూడే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా, ఇద్దరు నేతల నివాసాల మధ్య ఉన్న కాలేజీ గ్రౌండ్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న రాళ్ల డంప్‌ను తొలగించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, పోలీసుల నియంత్రణలో ఉంది.
👉వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య*
పెద్దారవీడు మండల పరిధిలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా భర్తను తమ్ముడి సాయంతో కళ్లలో కారం కొట్టి ఓ భార్య హత్య చేసిందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ ఘటన బుధవారం జరిగిన విషయం తెలిసిందే. పూర్తివివరాలు సేకరించి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వెల్లడిస్తున్నట్లు ఆయన తెలిపారు.
👉ఆనారోగ్యంతో బాధపడే వారికీ, ఆపన్న హస్తం.. ముఖ్యమంత్రి సహాయనిధి..*
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 35 మందికి రూ. 26,53,244-00 లు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే ముత్తుముల*

*గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆదివారం ఉదయం నియోజకవర్గంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న 35 మందికీ 14 వ విడతగా మంజూరు అయిన, రూ,26,53,244-00 లు (అక్షరాల ఇరవైఆరు లక్షల యాబై మూడు వేల రెండు వందల నలబై నాలుగు రూపాయలు) ముఖ్యమంత్రి సహాయ నిధి, చెక్కులను అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఆపన్న హస్తం అని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని, వారికీ అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారాపొందవచ్చు అని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేకమంది పేద ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారని వారికీ అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 847 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 7,47,19,560 -00 లు(అక్షరాల ఏడు కోట్ల నలబై ఏడు లక్షల పంతొమ్మిది వేల అయిదు వదల అరవై రూపాయలు) అందచేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం చేసిన మంచి ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ,నాయకులు , కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు*
👉 మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మరియు మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను సందర్శించారు.

ఈ సందర్భంగా అన్న క్యాంటీన్ కు విచ్చేసిన వారితో వారి ఇరువురు భోజనం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు స్వయంగా భోజనం పెట్టించుకుని భోజనం చేశారు.అనంతరం సందర్శకులు రిజిస్టర్లో వారిద్దరూ సంతకాలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

