👉ప్రపంచ శాంతికి ప్రమాదంగా మారుతున్న ట్రంప్‌ విధానాలు…🌟భారత ఎగుమతులపై ఈయూ పిడుగు.. తీవ్రంగా నష్టపోనున్న భారతీయ గార్మెంట్స్‌ రంగం* …👉ఇరాన్‌ దిశగా అమెరికా యుద్ధ నౌకలు*👉వలపు వలకు చిక్కి రూ.2.14 కోట్లు పొగొట్టుకున్న హైదరాబాద్ టెక్కీ😱..👉 రహదారి ప్రమాదాల నివారణకై జిల్లా కమిటీ ప్రత్యేక సమావేశం …ప్రకాశం జిల్లా…🌟విపత్తు నిర్వహణలో ప్రకాశం జిల్లా ఆదర్శం!…🌟… ఒంగోలులో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు..👉కాన్పూర్‌లో భారీ హవాలా రాకెట్ గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్ట్*👉ఐదు తప్పులు దాటితే లైసెన్స్‌ రద్దే*.

👉ప్రపంచ శాంతికి ప్రమాదంగా మారుతున్న ట్రంప్‌ విధానాలు ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా గాజాలో ‘శాంతి మండలి’ ఏర్పాటుపై ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ఎలాన్ మస్క్ తూర్పారబట్టారు ప్రపంచ రాజకీయ యవనికపై మరోసారి ఉత్కంఠ రేగుతోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి, వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు ట్రంప్‌కు అండగా నిలిచిన వర్గాల నుంచే ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతుండటం గమనార్హం. ముఖ్యంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ట్రంప్ విధానాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మస్క్ ‘పీస్’ సెటైర్.. వైరల్ అవుతున్న వ్యంగ్యం ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా గాజాలో ‘శాంతి మండలి’ ఏర్పాటుపై ట్రంప్ చేసిన ప్రతిపాదనలను ఎలాన్ మస్క్ తూర్పారబట్టారు. “ఇది శాంతి మండలి కాదు.. కేవలం ఒక ముక్క మాత్రమే” అంటూ మస్క్ చేసిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టించింది. గ్రీన్‌లాండ్, వెనెజువెలా వంటి ప్రాంతాలను ప్రస్తావిస్తూ.. శాంతి స్థాపన ముసుగులో భూకబ్జా రాజకీయాలు లేదా విస్తరణవాద ధోరణులు సాగుతున్నాయని మస్క్ పరోక్షంగా హెచ్చరించారు. ఇది ట్రంప్ తీసుకుంటున్న అంతర్జాతీయ నిర్ణయాల వెనుక ఉన్న అసంతృప్తిని స్పష్టం చేస్తోంది. ప్రజాస్వామ్యమా? వ్యక్తిగత అహంకారమా? ట్రంప్ రాజకీయ శైలి ఎప్పుడూ వివాదాస్పదమే. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆయన అనుసరిస్తున్న విధానాలు వాస్తవాలకు దూరంగా ఉండే ప్రకటనలుగా మారుతున్నాయి. ఇతర దేశాలను ఆర్థికంగా సైనికంగా భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను పక్కన పెట్టడం ద్వారా సవాల్ చేస్తున్నారు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ అమెరికా ప్రజాస్వామ్య సంప్రదాయాల కంటే తన వ్యక్తిగత అహంకారానికే పెద్దపీట వేస్తున్నారు. విదేశీ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి.
చరిత్ర పునరావృతమవుతుందా? ప్రపంచ యుద్ధాలు ఒక్కరోజులో పుట్టవు. అతిజాతీయవాదం, బలాధిక్యత ప్రదర్శించాలనే తపన నెమ్మదిగా దేశాల మధ్య చిచ్చు పెడతాయి. ఒకప్పుడు ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు నేర్పిన అమెరికా నేడు సామ్రాజ్యవాద ధోరణులతో సాగుతుండటం ప్రమాదకర సంకేతం. ట్రంప్ హయాంలో పెరిగిన డ్రోన్ దాడులు, వైమానిక దాడులు.. ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాల బెదిరింపులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బతీస్తున్నాయి. వ్యవస్థాపకుల ఆశయాలకు విరుద్ధం  అమెరికా నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ వంటి మహనీయులు కలలుగన్న అమెరికా ఇది కాదు. ఇతర దేశాలతో సామరస్యంగా ఉంటూ మానవాళి అభ్యున్నతికి తోడ్పడాలన్న వారి ఆశయాలకు ట్రంప్ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను కాలరాస్తూ ముందుకు వెళ్లడం వల్ల చివరికి అమెరికా తన మిత్రదేశాల విశ్వాసాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మేల్కొనాల్సిన సమయం ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అమెరికా పౌరులే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ దూకుడు వైఖరిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. శాంతి, ప్రజాస్వామ్యం కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించాలి. చరిత్ర నేర్పిన చేదు పాఠాలను గుర్తు చేసుకుని, మరో ప్రపంచ విపత్తు సంభవించకముందే అంతర్జాతీయ సమాజం మేల్కొనాలి. లేకపోతే, అగ్రరాజ్యపు అహంకారం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టే అవకాశం ఉంది.

👉ఐదు తప్పులు దాటితే లైసెన్స్‌ రద్దే*

* సిగ్నల్‌ దాటినా, హెల్మెట్‌ లేకపోయినా శిక్ష తప్పదు

* జనవరి 1 నుంచే అమల్లోకి కొత్త నిబంధన

రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టంలో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది.

తరచూ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లు ఇక ఎంతమాత్రం శిక్ష నుంచి తప్పించుకోలేరు. చిన్న తప్పయినా ఏడాదిలో ఐదుసార్లు జరిగితే మూడు నెలలపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిలిపివేస్తారు. ప్రాంతీయ రవాణా లేదా జిల్లా రవాణా అధికారికి సదరు డ్రైవర్‌ లైసెన్స్‌ రద్దు చేయడానికి లేదా నిలిపివేయడానికి కొత్తచట్టం ప్రకారం అధికారం ఉంటుంది. జనవరి 1 నుంచి నిశ్శబ్దంగా ఈ నిబంధన అమల్లోకి వచ్చేసింది.

గతంలో శిక్షార్హమైన పెద్ద నేరాలకు మాత్రమే.. వాహన దొంగతనం, ప్రయాణికులపై దాడి, కిడ్నాప్‌, అధిక వేగం, ఓవర్‌ లోడ్‌, బహిరంగ ప్రదేశాల్లో వాహనాన్ని వదిలేయడం వంటి వాటికి మాత్రమే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు వంటి శిక్ష ఉండేది. తాజా చట్ట సవరణతో హెల్మెట్‌ లేకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, రెడ్‌ లైట్‌ను పట్టించుకోకుండా కదలడం వంటి తప్పులకు కూడా లైసెన్స్‌ రద్దు చేయవచ్చు. కేంద్ర మోటారు వాహన నిబంధనలు రెండవ సవరణ, 2026 ప్రకారం టోల్‌ ఫీజు బకాయి ఉంటే ఆ వాహనం అమ్మకానికి, అంతర్రాష్ట్ర బదిలీకి ఎన్‌వోసీ జారీ చేయరు.

👉కాన్పూర్‌లో భారీ హవాలా రాకెట్ గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్ట్*😲😲😲

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో పోలీసులు ఒక భారీ హవాలా రాకెట్‌ను ఛేదించారు. ధన్‌కుటి ప్రాంతంలో అక్రమ వ్యాపారాలు చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 61 కిలోల వెండి, రూ.2 కోట్ల నగదుతో పాటు నేపాల్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.బెట్టింగ్, అక్రమ ట్రేడింగ్ జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ADCP సుమిత్ రామ్‌టేకే తెలిపారు.

👉ఇరాన్‌ దిశగా అమెరికా యుద్ధ నౌకలు*

* వాషింగ్టన్‌: ఇరాన్‌ దిశగా భారీగా అమెరికా యుద్ధనౌకలు కదులుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దావోస్‌ నుంచి యూఎస్‌కు బయలుదేరుతుండగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ వైపుగా భారీ సైన్యం వెళుతున్నట్లు.. ఏం జరుగుతుందో చెప్పలేమని అన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. అయితే సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చని ట్రంప్‌ తెలిపారు.

👉హాయ్ అని మాటలు కలిపింది….ఆ వలపు వలకు చిక్కి రూ.2.14 కోట్లు పొగొట్టుకున్న హైదరాబాద్ టెక్కీ😱

సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ మాయలో టెక్కీ…ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం…విడతలవారీగా రూ.2.14 కోట్లు బదిలీ చేయించిన కేటుగాళ్లు…అప్పులు చేసి, ఆస్తులు అమ్మి డబ్బు కట్టిన బాధితుడు….మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు.. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సైబర్ మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ చెప్పిన మాయమాటలు నమ్మి, నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.2.14 కోట్లు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది.

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం, టీఎన్‌జీవో కాలనీకి చెందిన 44 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గతేడాది డిసెంబరులో సోషల్ మీడియా ద్వారా ఓ మహిళ పరిచయమైంది. తాను స్టాక్ ట్రేడింగ్‌లో భారీగా లాభాలు గడిస్తున్నట్లు నమ్మించింది. ఆమె మాటలు విశ్వసించిన బాధితుడి చేత ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించింది…డిసెంబర్ 12న తొలిసారిగా రూ.31.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, యాప్‌లో భారీగా లాభాలు కనిపించాయి. దీంతో మరింత పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని ఆ మహిళ ఆశ చూపింది. ఆమెను నమ్మి రెండోసారి రూ.42.27 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత లాభాలను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, వచ్చిన లాభంలో 30 శాతం పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాలని మోసగాళ్లు మెలిక పెట్టారు….యాప్‌లో కనిపిస్తున్న వర్చువల్ లాభాలను నిజమని నమ్మిన బాధితుడు, ఆఫీసు సహోద్యోగుల నుంచి రూ.90 లక్షలు అప్పు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి డబ్బు సేకరించి, కొన్ని ఆస్తులను కూడా అమ్మి మొత్తం 8 విడతల్లో రూ.2.14 కోట్లు వారికి పంపాడు. చివరకు డబ్బు విత్‌డ్రా కోసం ప్రయత్నించగా, అదనంగా మరో రూ.68 లక్షలు కట్టాలని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు….వెంటనే అప్రమత్తమైన బాధితుడు, ఆ మహిళ ఫొటోను ఇంటర్నెట్‌లో వెతకగా, అది ఇన్‌స్టాగ్రామ్‌లోని వేరొకరి ప్రొఫైల్ నుంచి దొంగిలించిందని తేలింది. దీంతో తాను నకిలీ ప్రొఫైల్‌తో మోసపోయానని నిర్ధారించుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

🌟భారత ఎగుమతులపై ఈయూ పిడుగు.. తీవ్రంగా నష్టపోనున్న భారతీయ గార్మెంట్స్‌ రంగం*

🌟 భారతీయ ఎగుమతుల్లో అత్యధిక వస్తువులపై ఇస్తున్న జనరలైజ్డ్‌ స్కీమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌(జీఎస్‌పీ) రాయితీలను ఈయూ ఈ ఏడాది జనవరి 1 నుంచి రద్దు చేసింది.

🌟 దీని ఫలితంగా ఈయూకు ఎగుమతి అయ్యే *భారతీయ ఎగుమతుల్లో 87 శాతం అధిక దిగుమతి సుంకాలను చెల్లించాల్సి* వస్తుందని గ్రోబల్‌ ట్రేడ్‌ రిసెర్చ్‌ ఇనిషియేటివ్‌(జీటీఆర్‌ఐ) తన నివేదికలో వెల్లడించింది.

🔅 ప్రపంచ వాణిజ్య పరిస్థితులు బలహీనంగా ఉన్న తరుణంలో దిగుమతి సుంకాల పెంపు భారతీయ ఎగుమతిదారులకు పెను భారం కానున్నది.

👉 రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించడం ద్వారా వాటిని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో రహదారి భద్రత జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి దారి తీసిన పరిస్థితులు, నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ .వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ సమీక్షించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 22 ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రహదారి భద్రతకు సంబంధించిన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నెలరోజులపాటు ప్రత్యేక విజిలెన్స్ ఉండాలన్నారు. స్పీడు గన్స్ ద్వారా వాహనాల వేగాన్ని గమనించి, పరిమితికి మించిన స్పీడుతో వెళ్తున్న వాహనాలపై జరిమానా విధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లాలో రోడ్డు భద్రతకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు అవసరమైన సత్వర వైద్య సహాయంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఐరాడ్ యాప్ ను సమర్థంగా వినియోగించాలన్నారు. ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు  మాట్లాడుతూ జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్స్ పై దృష్టి సారించాలన్నారు. జాతీయ రహదారుల్లోకి సర్వీస్ రోడ్లు కలుస్తున్న చోట ప్రమాదాల నివారణకు మిర్రర్లు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాహనాలను జాతీయ రహదారులపైనే నిలపకుండా చూసేందుకు ఆయా మార్గాలలో ప్రభుత్వం కల్పించిన వాహనాల నిలుపుదల ప్రదేశాలు, ఇతర సౌకర్యాల గురించి టోల్గేట్ల వద్ద వాహనదారులకు మైకుల ద్వారా అవగాహన కల్పించాలన్నారు .ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తామంటూ ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.  ఈ సమావేశంలో డిటిసి సుశీల, మార్కాపురం ఆర్టీవో శ్రీచందన, రోడ్లు భవనాల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ రవి నాయక్, డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, డి.సి.హెచ్.ఎస్. శ్రీనివాస నాయక్, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

🌟విపత్తు నిర్వహణలో ప్రకాశం జిల్లా ఆదర్శం!🌟


విపత్తు నిర్వహణలో ప్రకాశం జిల్లా యంత్రాంగం చూపిన ప్రతిభను చాటుతూ రూపొందించిన ‘మొంథా తుఫాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మాన్యువల్‌ను’ ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి . మరియు స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రకాశం భవనంలో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జియో కోఆర్డినేట్స్, ఫొటోలు మరియు క్షేత్రస్థాయి అనుభవాలను క్రోడీకరించి రూపొందించిన ఈ మాన్యువల్ భవిష్యత్తులో విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులు, సిబ్బంది చూపిన అంకితభావం మరియు సమన్వయానికి గుర్తింపుగా ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.

🌟 ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

👉ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా, మానవ వనరుల శాఖ మంత్రివర్యులు  నారా లోకేష్  పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు, నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందుఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో  ఒంగోలు పార్లమెంట్ సభ్యులు  మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు  దామాచర్ల జనార్దన్ రావు , నగర మేయర్  గంగాడ సుజాత, నగర కమిషనర్  వెంకటేశ్వర్ రావు ,ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  రాచగర్ల వెంకట్రావు అయినా బత్తిన ఘనశ్యామ్  తాత ప్రసాద్  కోలా ప్రభాకర్  కొర్రపాటి శ్రీనివాస రావు, మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!