👉 అణు పరీక్షల కారణంగా 40 లక్షల మంది మృతి! …ఎన్.పీ.ఏ. షాకింగ్ రిపోర్ట్…👉తెలంగాణలో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్… ఏయే కేసుల్లో అంటే..!…👉ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి…👉కుక్కలను విషం పెట్టి చంపడంపై మంత్రి సీతక్క సీరియస్*… 👉నంద్యాల – ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..*👉ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పని సరిగా పాటించాలి : డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి*కోదాడ…

👉 అణు పరీక్షల కారణంగా 40 లక్షల మంది మృతి! …ఎన్.పీ.ఏ. షాకింగ్ రిపోర్ట్…

ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన అణు ప్రయోగాలు మానవాళికి తీరని శాపంగా మారాయి. ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో భాగంగా జరిగిన అణు ప్రయోగాలు మానవాళికి తీరని శాపంగా మారాయి. రోజు రోజుకీ పెరుగుతున్న యుద్ధ భయాలు, దురాక్రమణల ఆందోళనల నేపథ్యంలో.. ఈ అణ్వాయుధాల టాపిక్ రోజు రోజుకీ తీవ్రమవుతోంది. ఈసారి మరో ప్రపంచ యుద్ధం వస్తే వీటి ద్వారా భూగ్రహం దాదాపు నాశనం అయిపోతుందని చెబుతున్నా.. ఎవరూ తగ్గడం లేదు సరికదా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. గత నవంబర్‌ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. వాషింగ్టన్ అణు పరీక్షలను తిరిగి ప్రారంభించవచ్చని సూచించారు. రష్యా, చైనా ఇప్పటికే అలా చేస్తున్నాయని ఆయన ఆరోపించాగా.. ఆ దేశాలు ఈ ఆరోపణలను ఖండించాయి. మరోవైపు అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశంగా పాకిస్థాన్ ఉండగా.. ఇరాన్ కూడా ఇటీవల ఆ ప్రయత్నాలు చేసిందని అంటారు. దీంతో.. ఆ ప్రయత్నాలను ఇజ్రాయెల్ అడ్డుకుంది. ***ఈ క్రమంలో అణ్వాయుధాలు, అణు పరీక్షలపై ప్రపంచ దేశాలు అత్యుత్సాహం చూపిస్తోన్న తరుణంలో ఓ షాకింగ్ నివేదిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ప్రపంచ దేశాలు తమ సైనిక పరాక్రమాన్ని చాటుకునేందుకు నిర్వహించిన అణు పరీక్షలు, భూమిపై ఉన్న లక్షలాది మంది అమాయకపు ప్రజల ప్రాణాలు తీశాయని ‘నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్’ (ఎన్.పీ.ఏ) విడుదల చేసిన 304 పేజీల నివేదిక తెలిపింది. ఇందులోని విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. ఇందులో భాగంగా…1945 నుంచి 2017 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన 2,400కు పైగా అణు పరీక్షల వల్ల సు మారు 40 లక్షల మంది అకాల మరణం చెందారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్పందించిన ఫ్రెంచి పాలినేషియాకు చెందిన 37 ఏళ్ల ఎంపీ.. 1996లో పాలినేషియాలోని తమ ఇంటి వద్ద అణు పరీక్షలు నిర్వహించారని.. ఫలితంగా వాళ్లు మాకు విషం పెట్టారని.. అప్పుడు తన వయసు ఏడేళ్లని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఎన్.పీ.ఏ చీఫ్ రేమండ్ జోహన్సెన్.. గత అణ్వాయుధ పరీక్షలు నేటికీ ప్రాణాలను బలిగొంటున్నాయని అన్నారు. అణ్వాయుధాలను మళ్లీ పరీక్షించకుండా లేదా ఉపయోగించకుండా నిరోధించాలనే దృఢ సంకల్పాన్ని ఈ తాజా నివేదిక బలోపేతం చేస్తుందని తెలిపారు. ఇదే సమయంలో.. అణు పరీక్షల కాలం పరిణామాలు చాలా దీర్ఘకాలికంగా, చాలా తీవ్రంగా ఉన్నాయని కొలంబియా విశ్వవిద్యాలయ కెమిస్ట్రీ లెక్చరర్, న్యూక్లియర్ ఏజ్ పీస్ ఫౌండేషన్ అధిపతి, ఎన్.పీ.ఏ నివేదికకు దోహదపడిన ఇవానా హ్యూస్ హెచ్చరించారు.

ఇదే క్రమంలో… నేడు జీవించి ఉన్న ప్రతి వ్యక్తి వారి ఎముకలలో వాతావరణ పరీక్షల నుండి రేడియోధార్మిక ఐసోటోపులను కలిగి ఉంటారని ఈ నివేదిక సహ రచయిత, సౌత్ కరోలినా విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర ప్రొఫెసర్ మాగ్డలీనా స్టాకోవ్స్కీ తెలిపారు. ఇదే సమయంలో… రేడియేషన్ వల్ల కలిగే ప్రమాదాలు గతంలో అనుకున్నదానికంటే చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి.. నివేదిక సహ రచయిత టిల్మాన్ రఫ్ చెప్పారు. ఇదే సమయంలో… అణ్వాయుధాలను కలిగి ఉన్న తొమ్మిది దేశాలైన రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌ డమ్, భారతదేశం, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఉత్తర కొరియాలలో గోప్యతా సంస్కృతి కొనసాగుతుందని.. ఈ దేశాలు నిర్వహించిన అణు పరీక్షల వల్ల సంభవించిన ఆరోగ్య, పర్యావరణ నష్టాలు వెల్లడి కాలేదని.. పరీక్షల తర్వాత రేడియోధార్మిక వ్యర్థాలను పాతిపెట్టిన ఖచ్చితమైన ప్రదేశాలు బహిర్గతం కాలేదని నివేదిక పేర్కొంది.

👉కుక్కలను విషం పెట్టి చంపడంపై మంత్రి సీతక్క సీరియస్* కుక్కలను చంపకుండా గ్రామ పంచాయతీలకు మార్గదర్శకాలు జారీ… కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలను విషప్రయోగంతో చంపిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక..ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిపిన మంత్రి సీతక్క… వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్దం అన్నారు.ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలిపారు…**నిజమే కానీ చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తుంటే ఎంతో మంది చిన్నారులు కుక్క కాటుకు బలైపోతుంటే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుంటే ప్రజలు ఎలా రోడ్లపై నడవాలో ఆలోచించాలని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు..

👉ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పని సరిగా పాటించాలి : డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి*కోదాడ టౌన్..

*కోదాడ పట్టణంలో కోదాడ పట్టణ, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించడం, ఈ కార్యక్రమం నందు కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ సీఐ శివ శంకర్, మోటార్ వెహికల్ ఆర్టిసి డివిజన్ మేనేజర్, పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి, ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమమే అరైవ్ అలైవ్ అని దీనిని పోలీస్ శాఖ తరపున విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తామని తెలిపారు.

👉 విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మహిళా కానిస్టేబుల్, సోదరి జయశాంతి ని, వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర హాం మంత్రి అనిత కలవడం జరిగినది. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల నాకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుంది… జయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మన రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

👉నంద్యాల – ఆళ్లగడ్డ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..**శిరివెళ్ల :- మెట్ట వద్ద అగ్నికి ఆహుతి అయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…*నెల్లూరు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు టైర్ బ్లాస్ట్ కావడంతో బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి అవతల వైపుకు వెళ్లి లారీని ఢీకొన్న ఘటనలో ప్రమాదం చోటుచేసుకుంది..*ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి పైగా తీవ్ర గాయాలు అవ్వడంతో 108 అంబులెన్స్ లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు..*ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుండి హైదరాబాద్ కు వెళ్తున్న (AR .BCVR) ట్రావెల్స్ బస్సు గా గుర్తింపు..*ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్న జిల్లా ఎస్పీ సునీల్ షేరన్..

👉తెలంగాణలో ఇంటి వద్దే ఎఫ్ఐఆర్… ఏయే కేసుల్లో అంటే..! కొన్ని ప్రత్యేక నేరాలు జరిగిన విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక నేరాలు జరిగిన విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండా.. సమాచారం అందింస్తే, పోలీసులే వారి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేసుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో.. దీని అమలుకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్.ఓ.పీ)ని సీఐడీ రూపొందించింది. అవును… కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. వారి ఇంటికే వెళ్లి కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది. ప్రధానంగా తీవ్రమైన నేరం బారిన పడినప్పుడు బాధితులు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశమున్న దృష్ట్యా ఈ సౌలభ్యం కల్పించబోతోన్నట్లు తెలిపింది! ఈ మేరకు రూపొందించిన ఎస్.ఓ.పీ.ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లు అనుసరించాలని సీఐడీ చీఫ్‌ చారుసిన్హా స్పష్టం చేశారు… బాధితుల గౌరవానికి, హక్కులకు భంగం కలిగించకుండా పోలీస్‌ సేవలందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఐడీ ప్రకటించింది. ఇలా.. బాధితులు పోలీసు స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయాలని నిర్ణయించడం దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. దీనిపై తెలంగాణ పోలీసులకు ప్రశంసలు లభిస్తున్నాయి. ఇది చాలా మంచి నిర్ణయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు! ఈ కొత్త నిర్ణయం ప్రకారం… కొన్ని ప్రత్యేక నేరాలు జరిగిన సమయంలో బాధితులు పోలీస్ స్టేషన్ కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి! ఆ ఫోన్ కాల్ అందుకున్న అనంతరం పోలీసులే వారి వద్దకు వెళ్లి, ఫిర్యాదు స్వీకరిస్తారు. అనంతరం.. ఆ వివరాలను పోలీస్‌ స్టేషన్‌ కు పంపించి ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయించి.. దానికి సంబంధించిన ఓ కాపీని బాధితులకు అందజేస్తారు. అక్కడికక్కడే బాధితుల వాంగ్మూలం నమోదు చేస్తారు! ఈ సందర్భంగా సుమారు 7 రకాల ప్రత్యేక కేసుల్లో ఈ ఎస్.ఓ.పీ.ని అమలు చేయనున్నారు..! * పోక్సో చట్టం కేసులు * మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు * ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు * శారీరక దాడులు * బాల్య వివాహాల నిషేధ చట్టం * ర్యాగింగ్‌ నిరోధక చట్టం * ఆస్తి సంబంధ వివాదాల్లో బాధితులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు.. ఈ ఎస్.ఓ.పీ. అమలు చేయబడుతుంది.*రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు డీఎస్పీ హెచ్చరిక*

👉సీసీ ఫుటేజ్.. ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి

హైదరాబాద్ – సూరారం పీఎస్ పరిధిలో ఘటన…వీధికుక్క దాడిలో బాలుడి ముఖంపై గాయాలు…స్థానికులు అరవడంతో బాలుడిని వదిలి వెళ్లిపోయిన కుక్క…బాలుడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలింపు…ఈ ఘటనపై గాజుల రామారం సర్కిల్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!