👉 సీఎం రేవంత్ రెడ్డి పై ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసిన నారాయణపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి…మొన్న ఖమ్మం సభలో రెచ్చగొట్టే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా సీఎం రేవంత్ మాట్లాడారని ఆయనపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ లింగయ్యకు ఫిర్యాదు కాపీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే…..
👉నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పారిశుధ్య కార్మికుల ఆందోళన…సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన డోర్ టు డోర్ చెత్త సేకరణ సిబ్బందినాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఈఏంఐలు కట్టలేక ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుని తిరుగుతున్నామని కార్మికుల ఆవేదన..వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్…..
👉వెయ్యి మందితో బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ నేత మూల రాజిరెడ్డి…
తెలంగాణ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వెంకటస్వామికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్‌ను వీడి.. వెయ్యి మందికిపైగా అనుచరులతో ఇవాళ బీఆర్ఎస్‌లో చేరనున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి రాజిరెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీనికోసం చెన్నూరు నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కి తన అనుచరులతో కలిసి వందలాది వాహనాల్లో బయల్దేరారు.
👉హరీష్ ఫోన్ ట్యాప్.. బీఆర్ఎస్ లో సంచలనం… విచారణ సందర్భంగా హరీష్ రావుకు పోలీసులు వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. మీరు అధికారంలో ఉండగా మీఫోన్ కూడా ట్యాప్ అయింది తెలుసా అని పోలీసులు ప్రశ్నించారు. నేను నమ్మనని హరీష్ చెప్పినా, ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, బీఆర్ఎస్ లోనూ సంచలనంగా మారింది. తీవ్ర చర్చకూ దారితీసింది. ఏకంగా హరీష్ ఫోన్ కూడా ట్యాప్ చేసేంతగా విషయం ఎందుకు వెళ్లిందన్న చర్చ జరుగుతోంది. పార్టీలో, ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్న హరీష్ ను కూడా వదిలిపెట్టలేదా, ఆయనపై అనుమానాలు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది.
👉కవిత ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి: మంత్రి పొన్నం…
తెలంగాణ : సింగరేణిపై బీఆర్‌ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లు అప్పగించిందని ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఎంతో అవినీతి జరిగినట్లు కవిత అన్నారని, ఆమె ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు సమాధానం ఇవ్వలేదన్నారు. హిల్ట్ పాలసీలపైనా ఇలాగే ఆరోపణలు చేశారని, అసెంబ్లీలో చర్చ పెడితే బహిష్కరించి వెళ్లిపోయారని చెప్పారు.
👉 అదనపు కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం*తెలంగాణ…
ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై…, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులు భారీగా నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ వెంకట్‌రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.పాఠశాల అనుమతి విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది
👉విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్న 4 ట్రావెల్స్ బస్సులు!…26మంది విద్యార్థులకు గాయాలు*
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా గుండ్లపల్లి ప్రభుత్వ పాఠశాల, కళాశాలకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మూడు రోజుల క్రితం రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో విహారయాత్రకు వెళ్లారు. టూర్‌లో బాగంగా అరకు, పాడేరు సహా మిగతా టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. అయితే సరిగ్గా రాజమహేంద్రవరం దివాన్‌చెరువు వద్దకు రాగానే ఒక గేదె అడ్డు రావడంతో ముందు వెళ్తున్న ట్రావెల్ బస్సు డ్రైవర్ సడన్‌బ్రేక్ వేశాడు. దీంతో వెనుక పిల్లలతో ప్రయాణిస్తున్న రెండు బస్సులు, మరో ట్రావెల్ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో సుమారు 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించారు. మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువులోని బాలవికాస్ మందిరానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
👉బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.*
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు. విద్యార్థి దశలోనే మాదకద్రవ్యాల వలలో చిక్కుకుంటే జీవితం అంధకారంగా మారిపోతుందని హెచ్చరించారు.
డ్రగ్స్ వాడకం కేవలం వ్యక్తిగత నష్టమే కాక సమాజానికి కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించాలని తెలిపారు. సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, డిజిటల్ అరెస్ట్ పలు ఇతర రకాల సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు… ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు…గోల్డెన్ అవర్ లో సమాచారాన్ని అందిస్తే బాధితుల డబ్బు సురక్షితంగా తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు…ప్రజల భద్రత, యువత భవిష్యత్తు రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
👉బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే శిక్ష తప్పదు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు..*
**జిల్లా యస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్ మద్యం బాబులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం…..పొదిలి పట్టణంలోని పరిసర ప్రాంతాలలో మధ్యంబాబులు మరియు నగర పంచాయతీ కార్మికుల చేత పారిశుద్ధ్య పనులు చేయించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్….
*బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే ఆస్కారం ఉన్నందున మద్యం సేవిస్తున్న బహింగ ప్రదేశాల దగ్గర పోలీసులు ముమ్మరంగా గస్తీ చేపట్టామని తెలిపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్….**అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బంది కరంగా మారితే శిక్ష తప్పదని మద్యం బాబులను హెచ్చరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ కుమార్….*ఈ పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందితోపాటు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు…*
👉జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల వద్ద విస్తృత భద్రతా చర్యలు – డ్రోన్ కెమెరాలతో నిఘా*ప్రకాశం జిల్లా
విద్యార్థులు భద్రతతో, ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలనే లక్ష్యంతో వ్యాప్తంగా స్కూల్స్, కాలేజీల పరిసరాల్లో పోలీసు నిఘాను సమర్థవంతమైన భద్రతా చర్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, తెలిపారు.జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుఆదేశాల మేరకు పిసిఆర్ మరియు డ్రోన్ కెమెరాల ఇంచార్జి ఇన్స్పెక్టర్ దుర్గప్రసాద్ ఆధ్వర్యంలో స్కూల్, కాలేజీ ప్రారంభం మరియు ముగింపు సమయాల్లో పోలీసు బీట్స్‌తో పాటు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేయటం జరిగింది. విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు వెళ్లే సమయంలో మోటార్ సైకిళ్లు, ఆటోల్లో వేధింపులకు పాల్పడే అకతాయిలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరిగింది. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ వంటి అనుచిత చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్స్, కాలేజీల వద్ద దింపే సమయంలో పరిసర ప్రాంతాలపై కాస్త శ్రద్ధ చూపాలని, ఏవైనా అనుమానంగా అనిపిస్తే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ మరియు కాలేజీల వద్ద బయట రహదారి కనిపించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా పరిసరాల్లో జరుగుతున్న అంశాలను సులభంగా గమనించవచ్చని తెలిపారు. స్కూల్స్ లేదా కాలేజీల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.స్కూల్ ప్రారంభానికి ముందు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఉపాధ్యాయులు స్కూల్ పరిసరాలను కాస్త గమనిస్తే భద్రత మరింత మెరుగవుతుందని పోలీసులు తెలిపారు.అలాగే స్కూల్స్ లేదా కాలేజీల పరిసరాల్లో ఇబ్బందులు కలిగించే లేదా వేధింపులకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
👉పలు సమస్యలను పరిష్కారం చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే జి.ఎం కు వినతి పత్రం అందచేసిన టీడీపీ నాయకులు కృష్ణ కిషోర్ రెడ్డి.. గిద్దలూరు: దక్షిణ మధ్య రైల్వే జోనల్ జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ సంజయ్ కుమార్ బుధవారం గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి కూటమి నాయకులతో కలిసి రైల్వే జీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.
గిద్దలూరు నియోజకవర్గ రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు మరియు స్టేషన్ ఆధునీకరణ పై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రూపొందించిన సమగ్ర వినతిపత్రాన్ని ఈ సందర్భంగా ఆయన జీఎంకు అందజేశారు.పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు గిద్దలూరులో స్టాపింగ్ ఇవ్వాలని కోరారు. అదే విధంగా రేణిగుంట – నంద్యాల రైలును గిద్దలూరు వరకు, అలాగే తెనాలి – మార్కాపూర్ రైలును గిద్దలూరు/నంద్యాల వరకు పొడిగించాలని విన్నవించారు. గిద్దలూరు మీదుగా చెన్నైకి కొత్త రైలు సర్వీసు ప్రారంభించాలని, పగటిపూట గుంటూరు, నంద్యాల వైపు ప్రయాణించే వారికి అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. రైల్వే స్టేషన్‌లో కోచ్ పొజిషన్ డిస్ప్లే బోర్డులు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని కోరారు. నల్లబండ బజార్, పాములపల్లె రోడ్డు నుండి రాచర్ల రోడ్ వరకు మూసివేసిన రైల్వే గేటును ప్రజల ఇబ్బందుల దృష్ట్యా వెంటనే తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సోదరుడి విజ్ఞప్తి పై జీఎం సంజయ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి మరియు పనుల వేగవంతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశా వలి, బీజేపీ నాయకులు జేవీ నారాయణ, మాజీ సర్పంచ్ దప్పిలి భాస్కర్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు..

