👉వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ నివేదిక కోరిన సుప్రీం…👉మైక్రో ఫైనాన్స్ దోపిడీకి మరో రెండు నిండు ప్రాణాలు బలి…👉క‌న్న కూతురి కోసం దివ్యాంగ తండ్రి ఆవేద‌న‌…👉 నంద్యాల జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులపై ఉక్కుపాదం..!!*👉శభాష్ రాజాబాబు..! ప్రకాశం జిల్లా కలెక్టరుకు ప్రత్యేక అవార్డు…👉మహిళలు మరియు చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు… ప్రకాశం జిల్లా ఎస్పీ…👉కంభం చెరువు కట్టపై మందు బాబులకు చెక్ …

👉వివేకా కేసులో కీలక పరిణామం.. సీబీఐ నివేదిక కోరిన సుప్రీం… సుప్రీం సూచనలతో ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన తర్వాత పాక్షిక దర్యాప్తునకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని వైఎస్ సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ అర్ధాంతరంగా నిలిపివేసిందని, కుట్రదారుల పాత్రను బయటపెట్టలేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే ఈ విషయమై దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే అప్పట్లో సునీత వేసిన పిటిషనుపై విచారించి నిర్ణయం తీసుకోవాలని ట్రయిల్ కోర్టును సుప్రీం సూచించింది. సుప్రీం సూచనలతో ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన తర్వాత పాక్షిక దర్యాప్తునకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై సంతృప్తి చెందని వైఎస్ సునీత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు…

ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు మంగళవారం వైఎస్ సునీత అప్పీలుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు ముగియాలంటే ఎవరెవరిని విచారించాల్సివుంది? … ఎవరిని కస్టడీకి తీసుకోవాల్సివుందనే విషయమై తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరిగింది. ముందుగా సునీత తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రయల్ కోర్టుకు వెళ్లామని అక్కడ తదుపరి దర్యాప్తు అవసరమని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. తాము పేర్కొన్న అంశాల్లో ఏ ఒక్కటీ ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము పిటిషనులో పేర్కొనని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిమితమైన మేరకు పాక్షికంగా దర్యాప్తునకు అనుమతిచ్చారని సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదించారు. ట్రయల్ కోర్టు తీర్పు న్యాయబద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. వివేకా కేసును దర్యాప్తును పాక్షికంగా జరిపించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని న్యాయవాది లూద్రా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో జస్టిస్ ఎంఎం సుందరేశ్ కల్పించుకుని వివేకా హత్య కేసులో తదుపరి విచారణ అవసరమని భావిస్తున్నారా? అని సీబీఐని కోరారు. ఏయే అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని సీబీఐని న్యాయమూర్తి కోరారు. ఎరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అనుకుంటున్నారో కూడా చెబితే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇంకా ఎవరినైనా విచారించాల్సిన అవసరం ఉందా? అనేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసరును అడిగి చెప్పగలమని, ఇందుకోసం రెండు వారాల సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఈ క్రమంలోనే కేసు విచారణను ఫిబ్రవరి 5వతేదీకి వాయిదా వేశారు.

👉మైక్రో ఫైనాన్స్ రాక్షసత్వం మరో రెండు ప్రాణాలు బలితీసుకుంది!…వడ్డీ వేధింపులు తాళలేక తల్లీ–కొడుకు ఆత్మాహుతి… బాపట్ల జిల్లా చీరాలలో హృదయ విదారక విషాదం… చీరాల పట్టణంలో మైక్రో ఫైనాన్స్ పేరుతో సాగుతున్న వడ్డీ దోపిడీ, అమానుష వేధింపులు మరో కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేశాయి. అప్పు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల నిరంతర ఒత్తిడిని భరించలేక తల్లీ, కుమారుడు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు విడిచారు. ఇది ఆత్మహత్య కాదు… వ్యవస్థ చేసిన హత్య!

చీరాల కొట్లబజారులో నివసించే వేముల సుజాత, ఆమె కుమారుడు సాయి రైల్వే స్టేషన్ వద్ద చిన్న టిఫిన్ బండి నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. భర్త మరణంతో సుజాతపై కుటుంబ బాధ్యతలన్నీ పడ్డాయి. దిక్కుతోచని పరిస్థితిలో మైక్రో ఫైనాన్స్ వారి వద్ద అప్పు తీసుకున్నారు.కానీ ఆ అప్పు కాస్తా వడ్డీ మృత్యుశిక్షగా మారింది…. రోజుకో ఫోన్, గంటకో బెదిరింపు, బహిరంగంగా అవమానాలు, మానసిక వేధింపులు —వడ్డీ వ్యాపారుల పీడకల ఈ కుటుంబాన్ని ఊపిరి పీల్చుకోనివ్వలేదు.ఈ నెల 13న వేటపాలెం మండలం శ్రీనివాసనగర్ సమీపంలోని పొలాల్లో తల్లి–కొడుకు ఇద్దరూ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా ముందుగా సుజాత మృతి చెందింది…ఆమె వెనకే ఆదివారం తెల్లవారుజామున సాయి కూడా కన్నుమూశాడు.

👉 ఇంకెన్ని ప్రాణాలు కావాలి?  ఈ అమానుష ఘటనపై నిరసనగా సోమవారం చీరాలలో టిఫిన్ బండ్లు మూతపడ్డాయి.చిరువ్యాపారులను పీల్చిపిప్పి చేసే వడ్డీ రాక్షసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం నాయకులు డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు.మైక్రో ఫైనాన్స్ పేరుతో జరుగుతున్న ఈ మానవహక్కుల ఉల్లంఘనలకు ఇకైనా చెక్ పెట్టాలి!లేకపోతే…ఇవి చివరి శవాలు కావు.

👉క‌న్న కూతురి కోసం దివ్యాంగ తండ్రి ఆవేద‌న‌…త‌న కూతురు బతికుందో.. లేదో చెప్పాల‌ని గుంటూరు పోలీసుల‌కు వేడుకోలు…

కూతురు కనిపించడం లేదని ఏడాది క్రితం ఫిర్యాదు చేసిన దివ్యాంగుడు.. కేసులో పురోగ‌తి సాధించ‌ని పోలీసులు….గుంటూరు జిల్లా ఆర్.ఆగ్రహారంలో తన కూతురు(15) కనిపించడం లేదని 2025 ఫిబ్రవరి నెలలో ఫిర్యాదు చేసిన ఏసోబు అనే దివ్యాంగుడు

4 నెలల తరువాత ఒక కొత్త నంబర్ నుండి తన కూతురు ఫోన్ చేసి, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నానని చెప్పిందని, అమ్మాయి మాట్లాడుతుంటే ఎవరో ఫోన్ కట్ చేశారని,ఈ విషయం చెప్పినా కూడా పోలీసులు కనీసం స్పందించలేదని తండ్రి ఏసోబు ఆవేదనమరికొన్ని రోజుల తర్వాత అదే నెంబర్ నుండి ఫోన్ చేసి, మీ అమ్మాయి చనిపోయిందని చెప్పారని, ఆ ఫోన్ నంబర్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని మండిపాటుఇప్పటికైనా తన కూతురు బతికి ఉందో, చనిపోయిందో తేల్చాలని పోలీసుల ముందు కన్నీటి పర్యంతమైన బాలిక తండ్రి

👉పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు…చలాన్ల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దని, స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని, చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలని వ్యాఖ్యానించిన హైకోర్టు

👉..జిల్లా వ్యాప్తంగా నకిలీ వైద్యులపై ఉక్కుపాదం..!!* నంద్యాల*.. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాలతో అక్రమ వైద్యులపై కఠిన చర్యలకు సిద్ధమైన వైద్య శాఖ..!!*

*..నకిలీ,ఆర్ఎంపీ వైద్యుల వల్ల ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరిక..!!*…*అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తే కేసులు నమోదు తప్పదని స్పష్టం..!!….*..ప్రత్యేక బృందాలతో ఆకస్మిక తనిఖీలు – అక్రమ క్లినిక్‌లు సీజ్ చేయనున్నట్లు ప్రకటన..!!*

*..నకిలీ వైద్యులపై సమాచారం ఇచ్చేవారికి పూర్తి రక్షణ ఉంటుందని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వెల్లడి..!!*

👉శభాష్ రాజాబాబు..! ప్రకాశం కలెక్టరుకు ప్రత్యేక అవార్డు…ఓటర్ల జాబితా మ్యాపింగులో పనితీరుకు గుర్తింపు…💐💐💐ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ ( ఎస్.ఐ.ఆర్ )-2026లో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల మ్యాపింగ్ లో సాధించిన పురోగతికిగాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ -2025కు ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. 2002 ఎస్.ఐ.ఆర్. డేటాతో 2026 ఎస్.ఐ.ఆర్. డేటాను సరిపోల్చటంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు.

👉మహిళలు మరియు చిన్నారుల రక్షణ, భద్రతే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ  వి. హర్షవర్ధన్ రాజు, *పోలీస్ అధికారులు, శక్తి బృందాలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు

మహిళలు, చిన్నారుల రక్షణ మరియు భద్రతను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒంగోలు, దర్శి, కందుకూరు, కనిగిరి మరియు మార్కాపురం సబ్‌డివిజన్‌ల డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శక్తి బృందాల విధులు, శక్తి యాప్ డౌన్‌లోడ్ ప్రక్రియ, మహిళల భద్రత, గంజాయి మరియు మాదకద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు గ్రామ మరియు వార్డు పరిధిలోని బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లు, ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రదేశాలు, పాఠశాలలు, కళాశాలల వద్ద నిరంతరం పర్యటిస్తూ మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ఏ సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించే విధంగా పని చేయాలని సూచించారు. మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యత, అందులో లభించే సేవలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు, మహిళలు మరియు ప్రజలకు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించి, వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ ఇన్‌స్టాల్ చేయించి, పోలీస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. మహిళలపై వేధింపులు జరిగే ప్రాంతాలు, ఆకతాయిల సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మహిళలు, బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారికి భద్రతతో కూడిన స్వేచ్ఛను కల్పించడమే శక్తి బృందాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నేరాలను అరికట్టడమే కాకుండా, మహిళలకు భద్రతా సూచనలు ఇవ్వడం, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి సంబంధించిన చట్టాలు, శిక్షలపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోక్సో కేసులకు సంబంధించిన బాధితుల ఇళ్లను సందర్శించి, వారికి ధైర్యం, నమ్మకం, భరోసా కల్పించే విధంగా విధులు నిర్వహించాలన్నారు. శక్తి టీములు, మహిళా పోలీస్‌లు, డ్వాక్రా మహిళలు సమన్వయంతో మహిళలకు ఉన్న చట్టపరమైన హక్కులు, రక్షణ చట్టాలు, శక్తి యాప్ గురించి వివరించాలని, శక్తి టీమ్ సభ్యులు, గ్రామ పోలీసులతో కలిసి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు స్వీయ రక్షణ (Self-Defence), గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, శక్తి వారియర్స్ ద్వారా సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శక్తి కాల్స్, డయల్ 100/112, ఉమెన్ హెల్ప్‌లైన్–181 ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీసులు చురుకుగా స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

👉కంభం చెరువు కట్టపై మందు బాబులకు చెక్ … శభాష్ పోలీస్ అంటున్న ప్రజలు… మందుబాబులతో పరిసరాలను శుభ్రం చేయించిన పోలీసులు… శభాష్ పోలీస్ అంటున్న ప్రజలు… ప్రకాశం జిల్లా కంభం…

ప్రకృతి అందాలకు ఆలవాలమైన కంభం చెరువు అందాలను తిలకించేందుకు నిత్యం ఎంతోమంది సందర్శకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల కొందరు వ్యక్తులు ప్రవేశద్వారం వద్ద బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నట్లు , వారి బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా చెరువు కట్ట పరిసరాలలో మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తదితర చెత్త చెదారాలు పేరుకొని పోతున్నాయి. దీంతో సందర్శకులకు ఇబ్బంది కలిగించడంతో పాటు పరిసరాలు అశుభ్రంగా మారుతున్నాయని కంభం పోలీస్ వారి దృష్టికి రావడంతో మంగళవారం కంభం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కే మల్లికార్జున రావు, ఎస్సై శివ కృష్ణారెడ్డి లు చెరువు కట్టను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. మార్కాపురం ఎస్పీ వారి ఆదేశాల మేరకు, ప్రజలకు సురక్షితమైన మరియు శుభ్రమైన వాతావరణం కల్పించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు…..             👉  అందులో భాగంగా మంగళవారం చెరువు కట్టపై   బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులను పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. అనంతరం పంచాయితీ కార్మికులు మరియు స్థానిక గ్రామస్తుల సహకారంతో శుభ్రత కార్యక్రమం నిర్వహించి చెరువు సందర్శకుల ప్రదేశమంతటా ఉన్న చెత్తను పూర్తిగా తొలగించారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించి పోలీసు చర్యలకు మద్దతు తెలిపారు. ప్రజా ప్రదేశాల్లో బహిరంగ మద్యపాన సేవనం మరియు చెత్త వేయడం వంటి చర్యలకు వ్యతిరేకంగా బలమైన సందేశంగా నిలిచింది.

7k network
Recent Posts

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!

👉పాక్ వేదికగా చర్చలు విఫలం.. రంగంలోకి పుతిన్!…👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట… 👉ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ వజ్ర ప్రహార్… 👉చలివేంద్రం ప్రారంభం చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల… 👉రాసలీలలు… లంచాలు వసూళ్లు… సి ఐ సస్పెండ్

👉జగన్ గురించి లోకేష్ ఏం చెప్పారంటే ? …👉 కాల్పుల విరమణను అతిక్రమించి బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి…👉 మళ్లీ మొదటికి: లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో హోర్మూజ్ మూసివేత!…👉 కేరళలో కామ్రేడ్స్ గెలుస్తారా…కామ్రేడ్స్ ఉనికి నిలుస్తుందా ?… 👉 ఇండియాలో జాంబీ డ్రగ్ క‌ల‌క‌లం!😱…👉ఒంగోలులో డ్రగ్స్ పై అవగాహన…👉పోలీసులే డ్రంకెన్ డ్రైవ్ చేస్తే ఎలా..? నిలదీసిన యువకుడు – గుంటుపల్లి హైవేపై ఘటన*

👉పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ పనుల సమీక్ష కార్యక్రమం…👉బెంగాల్ లో మరో రచ్చ.. 91 లక్షల ఓట్లు అవుట్😲 …👉అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు*…👉మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతాం.. ఎమ్మెల్యే కందుల…