పేదల ఓట్లను తొలగించేందుకు బిజెపి కుట్ర: “స‌ర్‌”పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు.. 👉కృష్ణా జిల్లాలో కోడిపందేల బరివద్ద దళితులపై దాడిచేసిన నిర్వాహకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్… 👉చిమకుర్తి యల్లయ్య నగర్‌లో గంజాయిపై ఉక్కుపాదం… 👉కంభంలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ బహుమతుల ప్రధానం

👉’స‌ర్‌’పై రేవంత్ రెడ్డి హాట్ కామెంట్లు… పేదల ఓట్లు తొలగించేందుకు బిజెపి కుట్ర… బ్రిటీష్ వారి కంటే కూడా.. బీజేపీనే అత్యంత ప్రమాదకరం …  స‌ర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ (స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్)- స‌ర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

*పేద‌ల ఓటు హ‌క్కును తొల‌గించేందుకు బీజేపీ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేప‌ట్టిన కీల‌క కార్య‌క్ర‌మంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. పేద‌లను ఇప్ప‌టికే అన్నింటికీ దూరం చేశార‌ని.. ఇప్పుడు ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకునే హ‌క్కును కూడా లేకుండా చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్-మే మ‌ధ్య తెలంగాణ‌లోనూ స‌ర్ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు ప్రాదాన్యం సంత‌రించుకున్నారు. ఖ‌మ్మంలో ఆదివారం జ‌రిగిన సీపీఐ శ‌తాబ్ది ఉత్స‌వాల ముగింపు స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కామ్రెడ్లు.. గ‌జ‌మాల‌తో స్వాగ‌తించారు. అనంత‌రం.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. **బ్రిటీష్ వారి కంటే కూడా.. బీజేపీనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ వాళ్లు భార‌త దేశాన్ని, ప్ర‌జ‌ల‌ను కూడా విభ‌జించి పాలించే సూత్రాన్ని అమ‌లు చేశార‌ని.. పేద‌ల ను మాత్రం వారు ప‌ట్టించుకోలేద‌ని వ‌దిలేశార‌ని చెప్పారు. కానీ, ఇప్పుడు బ్రిటీష్ వారికంటే కూడా ఘోరం గా బీజేపీ.. పేద‌ల‌పైనే ఉక్కుపాదం మోపుతోంద‌ని సీఎం చెప్పారు. పేద‌ల‌కు ఉపాధి హామీ ప‌థ‌కాన్ని దూరం చేసింద‌ని.. పేద‌ల ఓటు హ‌క్కును స‌ర్ ప్ర‌క్రియ ద్వారా తొల‌గిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల‌కు మ‌న హ‌క్కుల‌ను తాక‌ట్టు పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి కొట్లాడితేనే.. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చింద‌ని రేవంత్ చెప్పారు. దున్నేవాడిదే భూమి అని ఆనాడు క‌మ్యూనిస్టులు పిలుపునిచ్చార‌ని తెలిపారు. దీనిని కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం చ‌ట్టం చేసింద‌న్నారు. **క‌మ్యూనిస్టుల సూచ‌న‌ల‌తోనే ఆనాడు 2004-05 మ‌ధ్య ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీసుకొచ్చింద‌న్నారు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా క‌మ్యూనిస్టులు జ‌రుపుతున్న పోరుకు.. కాంగ్రెస్ అండ‌గా ఉంటుంద‌న్నారు.

👉కృష్ణా జిల్లాలో కోడిపందేల బరివద్ద దళితులపై దాడిచేసిన నిర్వాహకులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి..కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)…

కృష్ణాజిల్లా  కంకిపాడు మండలంలోని ఉప్పులూరు కోడిపందేల బరి వద్ద దళితులను బట్టలూడదీసి, తాళ్లతో కట్టేసి అమానుషంగా హింసించిన నిర్వాహకులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. చట్టవిరుద్ధంగా కోడి పందేలు నిర్వహించినవారిపైనా, వారిని అనుమతించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి… బాధితులకు రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ప్రజలందరూ దీనిని తీవ్రంగా నిరసించాలని విజ్ఞప్తి చేసింది…సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, కృష్ణాజిల్లా కార్యదర్శి వై. నరసింహారావు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ. మాల్యాద్రి, యం. హరిబాబు తదితరులు ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 15వ తేదీన నిర్వహించిన కోడి పందేల బరి వద్ద నిర్వహించే పత్తలా ఆట కోసం నిర్వాహకులు తోట్లవల్లూరుకు చెందిన 11 మందిని కూలి కోసం తీసుకువెళ్లారని, వచ్చిన డబ్బుల్లో లెక్క తేడా రావడంతో, కూలికి వచ్చినవారే ఆ సొమ్మును తీశారనే నెపంతో బట్టలూడదీసి తాళ్లతో కట్టేసి, అత్యంత దారుణంగా, అమానుషంగా హింసించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నది. ఆ దారుణాన్ని వీడియోకూడా చిత్రీకరించడం వారి రాక్షసానందానికి నిదర్శనం అన్నారు

*హైకోర్టు తీర్పును సైతం ధిక్కరిస్తూ, అధికార పార్టీ అండదండలతో రాష్ట్ర మంతటా బరులువేసి పందేలను నిర్వహించి కోట్లలో కోడి పందేలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం గుడ్లప్పగించి చూసిందే తప్ప ఎక్కడా నిలువరించే ప్రయత్నం చేయలేదనీ ఆరోపించారు. పైగా ప్రజా ప్రతినిధులు, మంత్రులు సైతం ప్రత్యక్షంగా హాజరై ప్రోత్సహించారనీ ,అలాంటి ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని సిపిఐ (యం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు.

👉గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం పట్టణంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో కీ.శే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 30 వర్ధంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ బహుమతుల ప్రధాన కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు & కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి , ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ముఖ్య అతిధులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు ఆశయాలకు కట్టుబడి మార్కాపురం జిల్లాను అందరం కలిసి అభివృద్ధి పదంలో నడిపిస్తామని క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒక గంట క్రీడలకు కానీ వ్యాయామానికి కానీ కేటాయించాలని తద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉందామని అన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు స్థానిక ఏఎంసి చైర్మన్లు ప్రజాప్రతినిధులు,  పార్టీ నాయకులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.
👉 మార్కాపురం పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ లో, మార్కాపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా నియమితులైన ” పులి శ్రీనివాసులును మర్యాద పూర్వకంగా కలిసిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ,కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, యర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు
👉..ప్రకాశం మార్కాపురం జిల్లా ఒంగోలు పట్టణంలోని ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎం.ఆర్.కే భాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ ముఖ్య అతిథిగా పాల్గొని, ముస్లింల అభివృద్ధికి విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముస్లిం సంక్షేమ సంఘం ముస్లింల కష్టసుఖాల్లో అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
👉చిమకుర్తి యల్లయ్య నగర్‌లో గంజాయిపై ఉక్కుపాదం – కార్డన్ అండ్ సెర్చ్, అవగాహన ర్యాలీ, యాంటీ గంజాయి ప్రతిజ్ఞతో ముందుకు వచ్చిన పోలీసులు*

ప్రకాశం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు , ప్రకాశం పోలీసులు గంజాయి అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా, ఒంగోలు డీఎస్పీ గారి పర్యవేక్షణలో,చిమకుర్తి సీఐ గారి సమక్షంలో, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో చిమకుర్తి మండలం యల్లయ్య నగర్ ప్రాంతంలో విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించబడినాయి.ఈ సందర్భంగా గంజాయి నిల్వలు, రవాణా, వినియోగానికి పాల్పడుతున్నారనే అనుమానంతో ఉన్న ఇళ్లలో ఇంటెన్సివ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడంతో పాటు, యల్లయ్య నగర్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అక్రమ గంజాయి కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.అదేవిధంగా, గంజాయి సాగు మరియు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రజలతో యాంటీ గంజాయి ప్రతిజ్ఞ చేయించగా, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.గంజాయి వంటి మత్తు పదార్థాలపై యుద్ధంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ఎవరైనా అక్రమ గంజాయి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయి నియంత్రణ, యువత భవిష్యత్తు రక్షణ, సమాజ భద్రత లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు తమ చర్యలను మరింత కఠినతరం చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!