👉 ఓడిపోయిన వాళ్ల గురించి ఇక పట్టించుకోను: సీఎం రేవంత్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన వారి గురించి ఎక్కువగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒక్క వేటుకే కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు పరిమితం అయ్యిండని, మైక్ టైసన్ తరహాలో ఒక్క పంచ్‌తోనే ప్రత్యర్థుల కథ ముగిసిందని పేర్కొన్నారు. అందుకే వారి గురించి ఇక మాట్లాడొద్దని ఫిక్స్ అయినట్లు చెప్పారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
👉 ధరణి-భూభారతి కుంభకోణం.. 15 మంది అరెస్టు..
ధరణి-భూభారతి కుంభకోణం కేసులో 15 మందిని అరెస్టు చేసినట్లు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. పరారీలో మరో 9 మంది ఉన్నట్లు తెలిపారు. యాదగిరిగుట్టలోని ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా నిందితులు మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ కుంభకోణం ద్వారా రూ. 3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని కమిషనర్ తెలిపారు.
👉కూటమి గేట్లు ఓపెన్…వారందరికీ వెల్ కమ్
ఏపీలో కూటమి పాలన నెమ్మదిగా రెండేళ్ళకు చేరువ కావస్తోంది. ఇక పాలన మీద జనాలు తమ ఒపీనియన్ ని ఓపెన్ గా రైజ్ చేసే టైమ్ కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యం ఇదే.
కూటమి గేట్లు ఓపెన్…వారందరికీ వెల్ కమ్
ఏపీలో కూటమి పాలన నెమ్మదిగా రెండేళ్ళకు చేరువ కావస్తోంది. ఇక పాలన మీద జనాలు తమ ఒపీనియన్ ని ఓపెన్ గా రైజ్ చేసే టైమ్ కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యం ఇదే. మరో వైపు చూస్తే వైసీపీ కూడా 2026 కొత్త ఏడాదిలో తన రాజకీయ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకుంటోంది. అయితే ఓటమి తరువాత వైసీపీ అయితే పెద్దగా కార్యక్రమాలు చేసినది లేదు, అధినేత జగన్ కూడా జనంలోకి వచ్చినది లేదు, కానీ ఇక మీదట వైసీపీ వెళ్లాలని చూస్తోంది. అయితే వైసీపీ జనంలోకి వెళ్ళి బలపడకుండా ఎత్తులు పై ఎత్తులు వేసేందుకు కూటమి గట్టిగానే స్కెచ్ గీస్తోంది. 2029 లోనూ గెలవాలని చూస్తోంది. అంతే కాదు ఏకంగా 15 ఏళ్ళ పాటు ఏపీలో కూటమి పాలన సాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెబుతూ వచ్చారు. అయితే ఇవి కేవలం మాటలు కాదు ఇపుడు చేతలకు టీడీపీ కూటమి దిగుతోంది అని అంటున్నారు.
*వైసీపీ వీక్ కావాల్సిందే :
వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రానీయకుండా వీక్ చేయాలని కూటమిలో ప్రధాన పార్టీలు అయిన టీడీపీ జనసేన డిసైడ్ అయ్యాయని అంటున్నారు. ఇందుకోసం తగిన రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. దీని ప్రకారం పార్టీలు ఎవాఇనా కానీ నాయకులు మంచిగా ఉంటే చాలు, వారు వివాదరహితంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంటే కనుక వారిని చేర్చుకోవడానికి టీడీపీ జనసేన సిద్ధం అవుతున్నాయని చెబుతున్నారు. వైసీపీలో బలమైన నాయకులు అనేక మంది ఉన్నారు. వారిని టార్గెట్ చేశారు అని అంటున్నారు.
*సైలెంట్ గా ఉన్న వారికి : ఇక పేరుకు వైసీపీలో ఉన్నా కూడా ఆ పార్టీలో సైలెంట్ గానే అనేక మంది ఉన్నారు. వారు సొంత పార్టీ తీరు పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో తమ రాజకీయ జీవితం మీద కూడా వారు ఆందోళన చెందుతునట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వారి విషయంలో టీడీపీ జనసేన టార్గెట్ చేసి మరీ చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నాయని అంటున్నారు. ప్రజలలో పలుకుబడి ఉండి పనిచేసే తత్వం ఉన్న వారిని చేర్చుకుంటే కూటమి ఒక వైపు మరింతగా బలపడుతుందని అదే సమయంలో వైసీపీ వీక్ అవుతుందని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దీంతో వైసీపీలో ఈ తరహా నేలత లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఎవరికి వారుగా చేర్చుకునేందుకు టీడీపీ జనసేన పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నాయని అంటున్నారు.
*వైసీపీ రాకుండానే : వైసీపీ ఇపుడు విపక్షంలో ఉంది. ఆ పార్టీ ఏజ్ 15 ఏళ్ళు, గతంలో బలమైన ప్రతిపక్షంగా ఉంది, ఆ తరువాత అధికారంలోకి వచ్చింది. ఇపుడు చూస్తే విపక్షంలో 11 సీట్లు సాధించినా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. దాంతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి తప్పకుండా వస్తామని అంటోంది. అయితే ఆ చాన్స్ వైసీపీ ఇవ్వకూడదు అంటే బాగా వీక్ చేయాలన్నది కూటమి పార్టీల రాజకీయ మంత్రాంగం గా ఉందని అంటున్నారు.
*వారికి కండువాలతో : వైసీపీ నుంచి వచ్చే నాయకులకు స్వాగతం పలకాలన్నది సూత్రప్రాయంగా నిర్ణయించారని అంటున్నారు. రాజకీయంగా వైసీపీని ఈ విధంగా దెబ్బ తీయాలని కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ఏ ప్రాంతం అని కానీ ఏ నియోజకవర్గం అని కానీ ఏ జిల్లా అని కానీ చూడకుండా బెస్ట్ లీడర్ జనంలో ఎంతో కొంత పేరుంది అని కనుక రిపోర్టు ఉంటే చాలు వారికి ఎర్ర తివాచీ పరచి వెల్ కం చెబుతారని అంటున్నారు. ఇది ఒక విధంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు మంచి అవకాశంగా చెబుతున్నారు.అయితే వైసీపీకి మాత్రం అగ్ని పరీక్షగా పేర్కొంటున్నారు. ఈ భారీ రాజకీయ సవాల్ కూటమి నుంచి ఎదురైతే వైసీపీ ఎలా తట్టుకుంటుందన్నది కూడా పెద్ద చర్చగా ఉంది.
గతంలో బలమైన ప్రతిపక్షంగా ఉంది, ఆ తరువాత అధికారంలోకి వచ్చింది. ఇపుడు చూస్తే విపక్షంలో 11 సీట్లు సాధించినా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుంది. దాంతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి తప్పకుండా వస్తామని అంటోంది. అయితే ఆ చాన్స్ వైసీపీ ఇవ్వకూడదు అంటే బాగా వీక్ చేయాలన్నది కూటమి పార్టీల రాజకీయ మంత్రాంగం గా ఉందని అంటున్నారు. **వారికి కండువాలతో : వైసీపీ నుంచి వచ్చే నాయకులకు స్వాగతం పలకాలన్నది సూత్రప్రాయంగా నిర్ణయించారు అని అంటున్నారు. రాజకీయంగా వైసీపీని ఈ విధంగా దెబ్బ తీయాలని కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ఏ ప్రాంతం అని కానీ ఏ నియోజకవర్గం అని కానీ ఏ జిల్లా అని కానీ చూడకుండా బెస్ట్ లీడర్ జనంలో ఎంతో కొంత పేరుంది అని కనుక రిపోర్టు ఉంటే చాలు వారికి ఎర్ర తివాచీ పరచి వెల్ కం చెబుతారు అని అంటున్నారు. ఇది ఒక విధంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు మంచి అవకాశంగా చెబుతున్నారు. అయితే వైసీపీకి మాత్రం అగ్ని పరీక్షగా పేర్కొంటున్నారు. ఈ భారీ రాజకీయ సవాల్ కూటమి నుంచి ఎదురైతే వైసీపీ ఎలా తట్టుకుంటుంది అన్నది కూడా పెద్ద చర్చగా ఉంది. ఫస్ట్ టైమ్! న్యూట్రల్ లీడర్స్ తో : అంతే కాదు ఏ రాజకీయ పార్టీకి చెందని న్యూట్రల్ లీడర్స్ ని కూడా తమ పార్టీలలో చేర్చుకోవడం ద్వారా వైసీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగకుండా చెక్ పెట్టాలని టీడీపీ జనసేన వ్యూహ రచన చేస్తున్నాయని అంటున్నారు. ఎన్నికలు చూస్తే ఇంకా మూడేళ్ళకు పై దాటి ఉన్నాయి కానీ ఇప్పటి నుంచే తమ పొలిటికల్ యాక్షన్ అమలు చేయాలని కూటమి పార్టీలు డిసైడ్ కావడం అయితే రాజకీయంగా ప్రకంపనలు రేపేలా ఉందనే అంటున్నారు.
👉భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తి అని గర్వపడుతున్నాం… కానీ లక్షలాది పిల్లలు ఆకలితో చస్తున్నారు, ఫుట్‌పాత్‌ల మీద బతుకుతున్నారు. ఇది గొప్ప దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు మనం మరచిపోతున్న బాధాకరమైన నిజం.
కొన్ని కీలక అంశాలు (తాజా డేటా ప్రకారం)…
పిల్లలు ఆకలితో చావడం: భారతదేశంలో ప్రతి రోజు సుమారు 2,000 మంది పిల్లలు ఆకలి, పోషకాహార లోపం (మాల్‌న్యూట్రిషన్) వల్ల చనిపోతున్నారు (NFHS-5 & UNICEF 2024–25 రిపోర్టులు). ఇది ఏటా 7 లక్షలకు పైగా పిల్లల మరణాలకు కారణమవుతోంది.
పోషకాహార లోపం: 5 ఏళ్లలోపు పిల్లల్లో 35.5% స్టంటెడ్ (ఎత్తు తక్కువ), 19.3% వేస్టెడ్ (బరువు తక్కువ), 32.1% అండర్‌వెయిట్ (NFHS-5, 2019–21). ఇది ప్రపంచంలోనే అత్యధికం.
ఫుట్‌పాత్ పిల్లలు: భారతదేశంలో సుమారు 1.7 నుంచి 3.7 మిలియన్ (17–37 లక్షలు) పిల్లలు ఫుట్‌పాత్‌లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో బతుకుతున్నారు (Census 2011 & NCPCR అంచనా). ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉంటుంది.
ఫుట్‌పాత్ మీద ఉన్న పిల్లల విషయం లో భారతదేశంతో పోల్చితే ఇతర దేశాలు:
అమెరికా: ప్రతి రోజు 10,000 మంది పిల్లలు ఆకలితో బతుకుతున్నారు కానీ ఫుడ్ స్టాంప్స్, SNAP ప్రోగ్రామ్‌లతో 90%+ కవర్ అవుతారు…యూకే: ఫుడ్ బ్యాంక్స్, ఫ్రీ స్కూల్ మీల్స్ – ఆకలి మరణాలు చాలా తక్కువ….జపాన్: దాదాపు జీరో చైల్డ్ హంగర్ – ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది….చైనా: ప్రపంచంలోనే అతి తక్కువ చైల్డ్ మాల్‌న్యూట్రిషన్ రేటు (5% కంటే తక్కువ) – ప్రభుత్వ ఫుడ్ సప్లై సిస్టమ్ బలంగా ఉంది.
భారతదేశంలో ఎందుకు ఇలా జరుగుతోంది?
ప్రభుత్వ బడ్జెట్‌లో హెల్త్ & న్యూట్రిషన్‌కు కేటాయింపు చాలా తక్కువ (GDPలో 1.5–2% మాత్రమే).
పోషణ్ అభియాన్, మిడ్-డే మీల్ వంటి పథకాలు ఉన్నాయి కానీ అమలు లోపాలు, కరప్షన్, ఫండ్ లీకేజ్ వల్ల పిల్లల దగ్గరికి చేరడం లేదు.
ఆర్థిక అసమానత్వం: టాప్ 1% దగ్గర 40% సంపద – దిగువ 50% (ఎక్కువ మంది దళితులు, గిరిజనులు) దగ్గర 6% మాత్రమే (Oxfam 2025).
గ్లోరిఫై చేస్తున్న ఆర్థిక వృద్ధి (GDP 4వ స్థానం) మనకు గర్వం కలిగిస్తుంది కానీ ఆ వృద్ధి పేదల దగ్గరికి చేరడం లేదు…..మనం ఏం చేయాలి?
ప్రభుత్వ బడ్జెట్‌లో హెల్త్ & న్యూట్రిషన్‌కు కనీసం 6% GDP కేటాయింపు డిమాండ్ చేయాలి…మిడ్-డే మీల్, పోషణ్ అభియాన్‌లలో కరప్షన్ లేకుండా ట్రాన్స్‌పరెన్సీ తీసుకురావాలి…దళిత-గిరిజన-బీసీ పిల్లలకు ప్రత్యేక ఫుడ్ సెక్యూరిటీ పథకాలు…ఆర్థిక అసమానత్వం తగ్గించే పాలసీలు (వెల్త్ టాక్స్, ల్యాండ్ రిఫార్మ్స్) డిమాండ్ చేయాలి….GDP ర్యాంక్ గురించి గర్వపడటం మంచిదే కానీ ఆకలితో చస్తున్న పిల్లలను మరచిపోతే అది అవమానకరం. ఈ దేశం నిజంగా గొప్పదవ్వాలంటే ముందు పిల్లల ఆకలి తీర్చాలి.
👉ఒంగోలు మున్సిపాలిటీ యూనియన్ కార్మికులపై అసభ్యపదాలు ,భౌతిక దాడులు ఖండించాలని వారిపై చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ అధికారులు ఏకపక్ష నిర్ణయాల్లో విధులు ఆపిన యూనియన్ నాయకులను వెంటనే విధులు తీసుకోవాలని. శుక్రవారం ఒంగోలు నగరపాలక పారిశుద్ధ్యం మస్టర్ పాయింట్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ పి కల్పన సిఐటియు జిల్లా నాయకులు జి శ్రీనివాసరావు సిఐటియు నగర నాయకులు టి మహేష్, యూనియన్ నాయకులు కే శ్రీనివాసరావు ,ఆర్ శ్రీనివాసరావు ,జి నరసింహ, ఆనంద్, యు రత్నకుమారి, సంతోషమ్,కసుకుర్తి వెంకటేశ్వర రావు, సాల్మన్ పిచ్చయ్య, మోహన్ రావు ,రవి బాబు తదితరులు పాల్గొన్నారు
👉పల్నాడు హత్యలపై మాజీ సీఎం జగన్ ట్వీట్♦
రాజకీయ కక్షలతో ఎంతమందిని బలితీసుకుంటారు… రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో అరాచకాలు..మా కార్యకర్త సాల్మాన్‌ను ఐరన్‌రాడ్లతో కొట్టి చంపారు.. ఇలాంటి దారుణాల కోసమే అధికారంలోకి వచ్చారా: జగన్…
👉 గంజాయి,డ్రగ్స్ ,మాదకద్రవ్యాల నిర్మూలించి నవ యువ సమాజాన్ని స్థాపించాలి….*ఒంగోలు..
సంక్రాంతి పండుగ సందర్భంగా “ఐక్యత కొరకు ఆటలు యువజన మైత్రికి బాటలు” అనే నినాదం తో గత కొన్ని సంవత్సరాలుగా DYFI, ఐద్వా ఆధ్వర్యం లో సంక్రాంతి సంబరాలు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా స్థానిక 49వ డివిజన్, సత్యనారాయణపురం లో డైఫీ, ఐద్వా, సీటు, ఎస్ ఎఫ్ ఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యం లో గంజాయి,మాదక ద్రవ్యాల ను నిర్మూలించి ఆటపాటల మారో సంస్కృతి క పోరాటం నిర్వహించి మంచి సమాజాన్ని నిర్మించాలనే నినాదం తో సంక్రాంతి క్రీడలు, సంస్కృతి క కార్యక్రమాలు నిర్వహించారు,అనంతరం జరిగిన సభకి డైఫీ స్థానిక నాయకులు వి. ఖాసిం,citu నాయకులు మెత్తాల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు, ముఖ్య అతిథులుగా పాల్గొన్న డైసీ రాష్ట్ర కార్యదర్శి రామన్న, సర్కిల్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ విభాగం ఎస్ జగదీష్ ,డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు, జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా ఒంగోలు అధ్యక్షులు శబరీనాథ్ పి నాయర్,ఐద్వా నగర కార్యదర్శి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ,డైఫీ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ. ప్రజా పోరాటం లో డైఫీ,ఐద్వా తదితర ప్రజాసంఘాలు ప్రజల కోసం పోరాడేందుకు ముందుంటాయి అని అన్నారు, ట్రాఫిక్ సిఐ జగదీష్ మాట్లాడుతూ డివైఎఫ్ఐ లాంటి ప్రజాసంఘాలు ఇలాంటి క్రీడలు నిర్వహించడమే కాకుండా యువత పెడత్రోవ పట్టకుండా గంజాయి మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని చెప్పడం చాలా మంచి విషయం అని అన్నారు. అనంతరం డాక్టర్ అనపర్తి శ్రీనివాసరావు, DYFI మాజీ జిల్లా అధ్యక్షులు గంధవల్ల బాలకృష్ణ, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి వీరస్వామి, డైఫీ జిల్లా అధ్యక్షులు కే వీ పిచ్చయ్య, ఐద్వా జిల్లా నాయకులు రాజేశ్వరి, చేజెర్ల కళ్యాణి 15రకాల ఆటల పోటీల్లో విజేతలైన 65మందికి బహుమతులు అందించారు. పలురకాల ప్రజా గీతాలు ,నృత్యాలు ఆద్యంతం ప్రజలని అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో డైఫీ నాయకులు ధాన్యేలు, టి.వీరయ్య డాక్టర్ మాలకొండయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేశారు
👉 పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఒంగోలు ఎంపీ మాగుంట… ఒంగోలు గద్దలగుంటలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించు పారువేట కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ , OUDA చైర్మన్ షేక్ రియాజ్ , ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకటరావు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
*మార్కాపురం మాజీ ఏఎంసి చైర్మన్ డి వి కృష్ణ రెడ్డి కి ఇటీవల బైపాస్ సర్జరీ కాగా వారిని కలిసి పరామర్శించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బెజవాడ సురేష్ రెడ్డి రవీందర్ రెడ్డి సతీష్ రెడ్డి

👉 మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బెజవాడ సురేష్ రెడ్డి, రవీందర్ రెడ్డి కందుల రామిరెడ్డి, AMC చైర్మన్ వెంకట రెడ్డి పరమేశ్వర్ రెడ్డి, పోల్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా.. ఎమ్మెల్యే ముత్తుముల ఆధ్వర్యంలో “లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్”..
* ఈ నెల 18 వ తేదీన, ఆదివారం రోజు… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అన్న నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్బంగా, గిద్దలూరు శాసనసభ్యులు, & ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో ఉదయం 8.00 గంటలకు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు మరియు లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ (మహా రక్తదానం) కార్యక్రమం నిర్వహించనున్నట్లు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు.* కావున గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు నందమూరి అభిమానులు మరియు యువకులు ఈ మహా రక్తదాన కార్యక్రమంలో విరివిగా పాల్గోని, రక్తదానం చేసి ఎన్టీఆర్ కు ఘనమైన నివాళులు అర్పించాలని కోరారు..
👉భర్తీ అవుతున్న కాంట్రాక్టు ఉద్యోగాల వివరాలు ముందుగా అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దగ్గరకి పోవాలి అంట!!!
ఆ లిస్టు మీద సంపత్ కుమార్ టిక్ పడితేనే బైటకి పోవాలి అంట.. ఆ లిస్ట్ మీద టిక్ పడాలి అంటే పైసల్ రావాలి ఒకవేళ ఆ అధికారి మాత్రం టిక్ వేయడానికి లిస్ట్ ఇవ్వకపోతే వెంటనే అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్..
👉మీడియా చానల్స్ మీద సిట్ విచారణ చేస్తున్నారు, మరి అలంపూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ దందాల మీద విచారణ ఎందుకు చేయరు.. కాంట్రాక్ట్ పనులు జరగాలంటే తనకు రూ.8 కోట్ల కమిషన్ డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డ సంపత్ కుమార్ మీద సిట్ విచారణ చెయ్యరా రేవంత్ రెడ్డి – బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
👉అసలు సెక్షన్లు పెట్టింది పేదల కోసమేనా*
*పేదవాడు తప్పు చేస్తే జైల్లో వేస్తారు*
*మరి ధనమున్నవాడు కోట్లల్లో దోచుకుంటే మాత్రం ఊళ్లో ఉంచుతారు*…పేదోడికి ఒక న్యాయం * బలిసినోడికి ఇంకో న్యాయం ఇదెక్కడి న్యాయం**భారత రాజ్యాంగంలో అందరికీ సమానమే అని సెక్షన్లు మరియు శిక్షలు కూడా అన్ని సమానమే అని ఉన్నది కదా**మరి ధనవంతుడు తప్పు చేస్తే ఊళ్లో ఎందుకు ఉంచుతున్నారు**పేదవాడు తప్పు చేస్తే వెంటనే పీడీ యాక్ట్ కేసులు**మరి బలిసినోడు తప్పు చేస్తే మాత్రం పీడి యాక్ట్ కేసులు వర్తించయ*…అని పేద ప్రజలకు చట్టాల మీద నమ్మకం కలగాలంటే ఇలాంటి వాళ్లను వెంటనే శిక్షించాలి*

