👉ఇరాన్ పై దాడి చేసే దమ్ము అమెరికాకు ఉందా? ట్రంప్ వి ఉత్తమాటలేనా? మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గతేడాది ఇజ్రాయెల్ జరిపిన దాడి తర్వాత ఇరాన్-అమెరికా మధ్య సంబంధాలు అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటు న్నాయి.గతేడాది ఇజ్రాయెల్ జరిపిన దాడి తర్వాత ఇరాన్-అమెరికా మధ్య సంబంధాలు అత్యంత క్లిష్టదశకు చేరుకున్నాయి.
అయితే ఈ సంక్షోభంలో ఇటు అమెరికాకు.. అటు ఇజ్రాయెల్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశించిన రీతిలో అనుకూలించకపోవడం గమనార్హం. మిత్రదేశాల విముఖత.. అమెరికాకు తప్పని వెనకడుగు గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు బలమైన మిత్రదేశాలు ఉన్నప్పటికీ ఇరాన్‌పై నేరుగా దాడి చేసే విషయంలో అవి సముఖత చూపడం లేదు. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు తమ భూభాగం నుంచి ఇరాన్‌పై దాడులు చేయడానికి విముఖత వ్యక్తం చేశాయి. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయనే భయం ఈ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమి కాల్పుల విరమణకు అంగీకరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ప్లాన్-బి కూడా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. నేరుగా సైనిక దాడి చేయడం కంటే, ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోవడమే ఉత్తమమని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అంతటా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశం విడిచిన రేజా పహ్లావీ మళ్లీ తెరపైకి రావడం, నిరసనకారులకు మద్దతు తెలపడం వెనుక పాశ్చాత్య దేశాల హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వెనెజులాలో మదురోపై అనుసరించిన కఠిన వ్యూహాలనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీపై కూడా అమలు చేస్తామని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 🌟ప్రత్యక్ష దాడి సాధ్యమేనా? అమెరికా ఇరాన్‌పై దాడి చేయాలంటే ఎదురయ్యే ప్రధాన సవాళ్లున్నాయి. మిత్రదేశాల సహకారం లేనిదే ఇరాన్ వంటి పటిష్ట రక్షణ వ్యవస్థ ఉన్న దేశాన్ని ఢీకొట్టడం కష్టమని అమెరికాకు తెలుసు. పట్టణ ప్రాంతాలపై దాడులు జరిగితే పౌర నష్టం జరిగి, అమెరికాపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ దాడి జరిగితే ఇరాన్ ప్రజలు తమ అంతర్గత విభేదాలను మర్చిపోయి ప్రభుత్వానికి అండగా నిలబడే ప్రమాదం ఉంది. ఇది ప్రస్తుత నిరసనలను నీరుగారుస్తుంది. ఇది కేవలం మాటల యుద్ధమేనా? ప్రస్తుతానికి ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు కేవలం ఇరాన్‌పై మానసిక ఒత్తిడి పెంచడానికే పరిమితమైనట్లు కనిపిస్తున్నాయి. అటు సైనిక సహకారం లేకపోవడం ఇటు ఆర్థిక పరిణామాలు అమెరికాను వెనక్కి లాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇవి ‘నిజమైన యుద్ధ సంకేతాల’ కంటే అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో భాగంగా చేస్తున్న వ్యూహాత్మక హెచ్చరికలే అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
👉చైనా అభివృద్ధిని అడ్డుకోవడానికే వెనిజులాపై ట్రంపు దాడి …సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు .. కందుకూరు:
చైనా అభివృద్ధిని అడ్డుకోవడానికి వెనుజులాపై అమెరికా అధ్యక్షుడు పంపు దాడి చేస్తున్నాడని, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు, బివి రాఘవులు, ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు, బీవీ రాఘవులు గారు తన స్వగ్రామమైన, కందుకూరు మండలం మోపాడుకు రావడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా రాఘవులు మోపాడు వచ్చిన సందర్భంగా, కందుకూరు నియోజకవర్గం లోని సిపిఎం నాయకులు కార్యకర్తలు ఆయనను కలుసుకోవడానికి బుధవారం మోపాడు వెళ్లారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిగింది. గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కన్వీనర్ జీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ, కమ్యూనిస్టు నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి అవుతున్న, చైనాను చూసి ఓర్వలేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వెనిజులా నుండి చైనాకు వెళుతున్న ఆయిల్ కు అడ్డుకట్ట వేయాలని, వెనుజులాపై దాడి చేసి, అధ్యక్షుడు మదురోను, వారి సతీమణి నీ జైల్లో పెట్టడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. ప్రపంచ ప్రజలందరూ ముక్తకంఠంతో అమెరికా సామ్రాజ్యవాదాన్ని ట్రంప్ దురాగతాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ట్రంపు సుంకాలవలన భారతదేశంలో, పరిశ్రమలు దెబ్బతిని పోతున్నాయని, దీనిపై మోడీ ప్రభుత్వం ఒక్క మాట కూడా ఎదురు చెప్పడం లేదని ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆక్వా రంగం ,సుబాబులు జామాయిలు బట్టల పరిశ్రమలు దెబ్బతిని పోతున్నాయని దీనివల్ల మన దేశ ప్రజలు కష్టాల పాలవుతారని ఆయన అన్నారు. ట్రంపు సుంకాలపై ప్రజలు పెద్ద ఎత్తున పోరాడి వెనక కొట్టాలని అన్నారు. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందని, దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. లక్ష కోట్లు వెచ్చించిన, ఉద్యోగాలు మాత్రం 300 మాత్రమేనని. దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటనీ ప్రశ్నించారు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను విధించి కార్మికులు హక్కులను కాలరాస్తుందని, దీనిపై ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె చేస్తున్నామని ఆయన తెలిపారు. విద్య, వైద్యం ప్రజలకు అందుబాటు లేకుండా పోతుందని, కేంద్ర ప్రభుత్వం ఈ రెండిటిని ప్రవేట్ పరం చేసి కార్పొరేట్లు అనుకూలంగా మారుతుందని ఆయన ఉద్యోగ చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, ఆయన అన్నారు. విద్యకు వైద్యానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు, దాసరి రామ్మూర్తి, గుడ్లూరు నాయకులు,ఎం జాలయ్య, కే అంజయ్య, వెంకటేశ్వర్లు, దా మా కృష్ణయ్య కొట్టే వెంకయ్య, గుత్తి మల్లికార్జున, ఐద్వా నాయకులు, ఎస్ విజయలక్ష్మి, మల్లేశ్వరి, రమాదేవి, అనూష, పొం దూరి కొండమ్మ, సిఐటియు నాయకులు, పొట్లూరి తిరుమలరావు, సుధాకర్, ఎస్ డి సుభాని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం సుభాన్, సిపిఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శి జి వి బి కుమార్, ఎస్.బి గౌస్ బాషా, సాధు చెన్నకేశవులు దువ్వూరు జాన్, సన్యాసి బాలకోటయ్య పాల్గొన్నారు.
👉రాఘవులు ను సన్మానించిన కూనం రాఘవరెడ్డి
బివి రాఘవులు మోపాడు గ్రామానికి వచ్చారని తెలుసుకున్న, కె వి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ (కూనం వెంకటసుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్) చైర్మన్ కూనం రాఘవరెడ్డి బుధవారం నాడు, ఆయనను బొకే ఇచ్చి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, వెంకట సుబ్బారెడ్డితో జవహర్ భారత్ కాలేజీలో మాకు, ఎస్ఎఫ్ఐ ద్వారా పరిచయాలు ఏర్పడ్డాయని, 25 మంది కార్యకర్తలం, సోషలిస్ట్ నిర్మాణం కోసం, కృషి చేయాలి అని నిర్ణయించుకొని, చేసామని, విద్యార్థి ఉద్యమాలతో పాటు ఆటపాటలలో మేము చురుకుగా ఉండే వాళ్ళమని, వారిలో మీ నాన్నగారు, ఒకరని, ఈ సందర్భంగా సుబ్బారెడ్డిని జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. రాఘవులుతో రాఘవరెడ్డి మాట్లాడుతూ, మీరు చేస్తున్న పోరాటాలు, బాగా ఉన్నాయని, మీ పోరాటాలకు, నేను అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.
⭐ప్రజలను ఆప్యాయంగా పలకరించే మంచి గుణం కామ్రేడ్ బివి రాఘవులు సొంతం …ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు బివి రాఘవులు మోపాడు గ్రామానికి వస్తారు. ఇక్కడ విశ్రాంతి తీసుకోకుండా, తన చిన్ననాటి మిత్రులను, పార్టీ కార్యకర్తలను, నాయకులను, స్వయంగా ఇండ్లకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తారు. ఎంత పెద్ద నాయకుడు అయినప్పటికీ, ఒదిగి ఉండడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య లాంటిదనీ, ఆయన చాలా సాదాసీదాగా ఉంటారని,సౌమ్యంగా మాట్లాడుతారని, అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తారని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి మన ప్రాంతంలో నుండి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడం మన ప్రాంతానికి గర్వకారణం అని కొనియాడారు .
👉ఒంగోలులోని 48వ డివిజన్ దిబ్బల రోడ్డు చైతన్య నగర్ కాలనీ లో భోగిమంటలలో గంజాయి డగ్స్ భూతం దగ్ధం ..లేబర్ కోడ్స్ జీవో కాపీలు దగ్ధం.. కొత్త ఉపాధి హామీ పథకం జిఓలు దద్దం సిఐటియు ఐద్వా ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. సిఐటి యుజిల్లా ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ లేబర్ కోర్స్ జీవోలు పాత ఉపాధి హామీ పథకం రద్దు జిఓ తేవడానికి తీవ్రంగా వ్యతిరేకించారు.
వీటి వలన ప్రజలు కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కార్మికులు తమ హక్కును కోల్పోవడం జరుగుతుంది. యూనియన్ పెట్టుకునే హక్కు ఉన్నా అది నిరుపయోగంగా ఉంటుంది .కార్పొరేట్లకు లాభాలు కలిగేకార్మికుల చట్టాలను తెచ్చారు వీటిని రద్దు చేయాలని కోరారు.ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాలరమాదేవి నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ పిల్లలను కాలేజీ విద్యార్థులను తీవ్ర ప్రభావానికి గురిచేస్తున్నాయి. మత్తు పదార్థాలు సేవించడం వలన విద్యార్థులు యువకులు, విచక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారు ప్రజలకు పిల్లలకు నష్టం కలిగించే డ్రగ్స్ గంజాయిని నిర్మూలించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలించాలని ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. గంజాయి డ్రగ్స్ భూతాన్ని ఐద్వా సీనియర్ నాయకురాలు వైఆంజనీదేవి నిప్పు అంటించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి రమేష్ సిఐటి యునాయకులు ఎన్ వీరాస్వామి యం ఆదినారాయణ సిహెచ్ రామయ్య సి రామారావు ప్రజానాట్మ నాట్యమండలి జి బాలకృష్ణ ఐద్వా నాయకులు జి కళ్యాణి పీ లక్ష్మి స్థానిక నాయకులు కే కోటిలింగాచారి కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
👉పేకాట స్థావరం పై ఆకస్మిక దాడి.. . 6 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్… రూ 2900లు నగదు …ఐదు బైకులు, ఆరు సెల్ ఫోన్ లు స్వాధీనం.. ప్రకాశం జిల్లా కంభం … మండలంలోని ఎర్రబాలెం గ్రామ సమీపంలోని పేకాట ఆడుతున్న పేకాట స్థావరంపై కంభం ఎస్సై శివ కృష్ణారెడ్డి తమ సిబ్బందితో ఆకస్మికంగా దాడి చేశారు .ఈ సందర్భంగా వారి నుండి ర2900లు నగదు,ఐదు బైకులు, ఆరు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని, ఆరు మంది జూదరులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

