👉విజయ్ ను లాగే పనిలో అమిత్ షా.. తమిళనాట సరికొత్త రాజకీయం…👉 టెన్త్ లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి…ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టండి …హాస్టళ్ళ వెల్ఫేర్ ఆఫీసర్లకు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నిర్దేశం…👉రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల…👉ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతి లో కొనసాగించాలి : వ్యవసాయ కార్మిక సంఘం…👉తమ్ముడు పై గొడ్డలితో దాడి చేసిన అన్న …

👉విజయ్ ను లాగే పనిలో అమిత్ షా.. తమిళనాట సరికొత్త రాజకీయం ??? .. తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ రాజకీయాలకు సవాల్ విసిరేలా అమిత్ షా తాజా పర్యటన సాగింది. తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ రాజకీయాలకు సవాల్ విసిరేలా అమిత్ షా తాజా పర్యటన సాగింది. ఒకవైపు అధికార డీఎంకే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే మధ్య నలుగుతున్న తమిళ రాజకీయాల్లోకి మూడో ప్రత్యామ్మాయంగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే నటుడు విజయ్ రాకను బీజేపీ ఒక అవకాశంగా మలుచుకోవాలని చూస్తోంది.

ద్రావిడ కోటకు బీటలు వేసే ‘షా’ వ్యూహం బీజేపీ అగ్రనేత అమిత్ షా తన పర్యటనలో రాష్ట్ర నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కేవలం హిందూత్వ కార్డుతోనే కాకుండా.. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ వంటి నేతలను కలుపుకొని వెళ్లడం ద్వారా ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చని బీజేపీ యోచిస్తోంది. యువత, తటస్థ ఓటర్లను ఆకర్షించేందుకు ఈ ప్లాన్ చేస్తోంది.. ఎన్డీఏ కూటమిని విస్తరించి విజయ్ ను కీలక భాగస్వామిని చూస్తోంది. మెల్లగా మెత్తబడుతున్న విజయ్? విజయ్ తన రాజకీయ ప్రవేశంలో బీజేపీ, డీఎంకే రెండింటినీ విమర్శించారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు ఉండవన్నది అనుభవజ్ఞుల మాట. అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ అధిష్టానం విజయ్ టీమ్‌తో టచ్‌లోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ మాత్రం తన పార్టీ స్వతంత్రతను కాపాడుకోవాలని భావిస్తున్నారు. పొత్తు జరిగితే అది కేవలం సీట్ల సర్దుబాటుకే పరిమితమవుతుందా? లేక అధికార భాగస్వామ్యానికి దారితీస్తుందా? అన్నది కీలక ప్రశ్నగా మారింది. బీజేపీతో కలిసి వెళ్తే విజయ్‌కు జాతీయ స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉంది. అయితే తమిళనాడులో బలమైన ద్రావిడ సెంటిమెంట్ కారణంగా మైనారిటీ, సెక్యులర్ ఓట్లపై ప్రభావం పడే ప్రమాదమూ ఉంది. ఈ రెండింటినీ తూకం వేసుకుంటూ విజయ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ***ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్?

ఢిల్లీ పెద్దలతో విజయ్ భేటీ కాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ పొత్తు కుదిరితే విజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా బీజేపీ వెనకాడకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని కమలనాథుల లెక్క భవిష్యత్తు ఏంటి? ప్రస్తుతానికి విజయ్ ఒంటరిపోరు అని చెబుతున్నా.. అమిత్ షా మార్క్ రాజకీయ చాణక్యం ముందు ఆయన ఎంతకాలం నిలబడుతారనేది ఆసక్తికరం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తమిళనాడులో డీఎంకే కూటమి వర్సెస్ ఎన్డీఏ విజయ్ తో కలిపి అన్నట్లుగా పోరు మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమిత్ షా వ్యూహాలు, విజయ్ క్రేజ్ కలిస్తే తమిళనాడులో కొత్త చరిత్ర లిఖించబడుతుందా? లేక ద్రావిడ భావజాలం ముందు ఈ కొత్త ప్రయోగాలు విఫలమవుతాయా? అన్నది కాలమే నిర్ణయించాలి….

👉ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతి లోనే కొనసాగించాలి…  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు వి. మోజెస్ డిమాండ్…. ప్రకాశం జిల్లా…

టంగుటూరు … ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతి లోనే కొనసాగించాలి అని టంగుటూరు డిఫ్యూటీ తహసీల్దార్ డి. శ్రీనాద్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.   ఈ సందర్బంగా మోజెస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబి జి రామ్ జి పేరుతో తీసుకొచ్చిన కొత్త చట్టం రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం మోపుతూ, పేదల పొట్ట కొట్టేందుకు ఉద్దేశించినదని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీజీ పేరు తొలగించడం అన్యాయమని అన్నారు.   గతంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులతో ఈ పధకాన్ని విజయవంతం గా కొనసాగించారు అని తెలిపారు.   కొత్త చట్టం వల్ల ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలు 40% నిధులు ఖర్చు పెడితేనే మిగిలిన 60% నిధులను కేంద్రం విడుదల చేస్తుంది అని తెలిపారు. రాష్టాలు ఖర్చు పెట్టె స్థితిలో లేవు కాబట్టి ఈ కరువు పని కాస్త పేదలకు దూరం అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టానికి వ్యతిరేకంగా జరిగే పోరాటల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో గడ్డం సాల్మన్, మల్లాల యానాది శ్రీను తదితరులు పాల్గొన్నారు…

👉 టెన్త్ లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి…ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టండి …హాస్టళ్ళ వెల్ఫేర్ ఆఫీసర్లకు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నిర్దేశం

మార్కాపురం జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ.ఎన్.లక్ష్మా నాయక్ ఆదేశించారు. సోమవారం మార్కాపురం ఎంపీడీఓ కార్యాలయంలో మార్కాపురం, బెస్తవారిపేట, గిద్దలూరు మరియు కనిగిరి డివిజన్ల పరిధిలోని 44 వసతి గృహాల సంక్షేమ అధికారులతో (ASWOs & HWOs) ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.  * విద్యా ప్రగతి: పదవ తరగతి విద్యార్థులకు ఇప్పటికే స్టడీ మెటీరియల్ పంపిణీ చేశాం. ప్రతి విద్యార్థి ఉత్తమ శ్రేణిలో పాస్ కావాలి. ముఖ్యంగా ఏబీసీడీ (ABCD) గ్రేడింగ్‌లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారిని ఉన్నత గ్రేడ్‌లకు తీసుకురావాలి.

* 100 రోజుల ప్రణాళిక : పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ‘100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక’ను (100 Days Action Plan) పక్కాగా అమలు చేయాలి.. * ఆరోగ్యం & పరిశుభ్రత: విద్యార్థులకు తప్పనిసరిగా కాచి వడపోసిన మంచినీటినే అందించాలి. ప్రతి నెలా వైద్యులతో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వసతి గృహాల్లో ప్రతిరోజూ ‘ముస్తాబు’ (పరిశుభ్రత) కార్యక్రమం నిర్వహించాలి.

* మెనూ & వసతులు : ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. ప్రభుత్వ భవనాల్లో పెండింగ్‌లో ఉన్న మరమ్మతు పనులను తక్షణమే పూర్తి చేయించాలి.విద్యార్థుల ఆరోగ్యం, మెనూ మరియు సంక్షేమం పట్ల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పూర్తి బాధ్యతతో, అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు .  ఈ సమావేశంలో ఏఎస్డబ్ల్యూఓ (ASWO) రామకృష్ణా రెడ్డి మరియు జిల్లాలోని వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

👉వీడు అసలు తండ్రి కాదు….సభ్య సమాజం తల దించుకొనే ఘటన….కన్న కూతురి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు..!*

చిత్తూరు జిల్లా…రక్షించాల్సిన తండ్రే భక్షకుడయ్యాడు. నూతన సంవత్సర వేడుకల వేళ కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడి మృగంగా మారాడు.పెద్దపంజాణి మండలం పెద్ద బూరుగుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పెద్దబ్బ అనే వ్యక్తికి 12 ఏళ్ల కూతురు ఉంది. భార్య వదిలేసి వెళ్లిపోవడంతో పెద్దబ్బ రెండో పెళ్లి చేసుకుని అదే గ్రామంలో వేరుగా ఉంటున్నాడు. మైనర్ బాలిక తన నానమ్మ వద్ద ఉంటూ పెరుగుతోంది..జనవరి 1న న్యూఇయర్ సందర్భంగా కూతురిని చూసేందుకు పెద్దబ్బ నానమ్మ ఇంటికి వచ్చాడు. తండ్రి వచ్చాడన్న సంతోషంతో ఆ బాలిక దగ్గరకు వెళ్లగా, మద్యం మత్తులో ఉన్నాడో లేక కీచక బుద్ధి పుట్టిందో గానీ ఆ కసాయి తండ్రి బాలికను బలవంతంగా ఇంటి వెనుక ఉన్న మామిడి తోటలోకి లాక్కెళ్లాడు. అడ్డువచ్చిన తన కన్న తల్లిని విచక్షణా రహితంగా కొట్టి, మామిడి తోటలోని ఒక బండరాయి వద్ద బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.బాలిక కేకలు విని నానమ్మ అక్కడికి చేరుకునేలోపే నిందితుడు పారిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పెద్దపంజాణి పోలీసులు రంగంలోకి దిగారు. పలమనేరు రూరల్ సీఐ పరశురాముడు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడు పెద్దబ్బను రాయలపేట – పలమనేరు రోడ్డులోని గుత్తివారిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు

👉రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 37వ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళవారం ఒంగోలులో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాతలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

👉 పల్నాడు జిల్లా…సత్తెనపల్లి నియోజకవర్గం..

పెదకూరపాడు అచ్చంపేట మండలం అన్నదమ్ముల మధ్య గొడవ…అన్న నీ తమ్ముడు మందలించడంతో, ఇద్దరి మధ్య ఘర్షణ…ఘర్షణ నేపథ్యంలో తమ్ముడు సైదా వలి పై గొడ్డలితో దాడి చేసిన అన్న భాష…సైదా వలి తలకు తీవ్ర గాయాలు, పూర్తిగా తెగిన ముక్కు.. సత్తెనపల్లి ప్రభుత్వలో చికిత్స పొందుతున్న వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలింపు…కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

*విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసుల అవగాహన కార్యక్రమం* ప్రకాశం జిల్లా

కొండపి ప్రభుత్వ హైస్కూల్‌లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మైనర్ డ్రైవింగ్, రోడ్డు ప్రమాదాలు, సైబర్ అండ్ ఏ టి యం మోసాలపై అవగాహన కల్పించిన కొండపి సీఐ మరియు ఎస్సైలు

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొండపి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు కొండపి సబ్ ఇన్స్పెక్టర్లు ప్రభుత్వ హైస్కూల్, కొండపిలో విద్యార్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల భద్రత, చట్టాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన గురించి వివరించి, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలో, అనుచిత ప్రవర్తన ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల కారణాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలు మరియు చట్టపరమైన చర్యలు గురించి అవగాహన కల్పించారు.అదే విధంగా, పెరుగుతున్న ఏ టి యం మోసాలు, సైబర్ మోసాలు గురించి కూడా విద్యార్థులకు వివరించారు. తెలియని లింకులపై క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదని, ఎటువంటి అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ సమావేశంలో పోలీస్ అధికారులు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ చట్టాలను గౌరవించాలని, తమ భద్రత తమ చేతుల్లోనే ఉందని గుర్తించాలన్నారు. భవిష్యత్ పౌరులైన విద్యార్థులు చట్టపరమైన అవగాహనతో బాధ్యతాయుతంగా ఎదగాలని కోరారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!