👉 ఇరాన్ లో జెన్ జీ విప్లవం!.. ఖోమైనీ ని గద్దె దింపేందుకు అమెరికా కుట్ర???..👉మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం😲…👉బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…!!! కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు…👉“మటన్ ముక్క వేసుకోండి సార్!” – కాంగ్రెస్ నేతలకు వడ్డించిన నకిరేకల్ సీఐ*👉 థానేలో భారీ డ్రగ్ రాకెట్ బట్టబయలు..

👉 ఇరాన్ లో జెన్ జీ విప్లవం!.. ఖోమైనీ ని గద్దె దింపేందుకు అమెరికా కుట్ర???

జెన్ జీ.. ఈ పేరు వింటేనే పాల‌కులు ఉలిక్కిప‌డే ప‌రిస్థితి.. అనేక దేశాల్లో పీఠాల‌ను క‌దిలించిన త‌రం ఇది.. ఇప్పుడు మ‌రో దేశంలోనూ జెన్ జీ ఉద్య‌మిస్తోంది. జెన్ జీ.. ఈ పేరు వింటేనే పాల‌కులు ఉలిక్కిప‌డే ప‌రిస్థితి.. అనేక దేశాల్లో పీఠాల‌ను క‌దిలించిన త‌రం ఇది.. ఇప్పుడు మ‌రో దేశంలోనూ జెన్ జీ ఉద్య‌మిస్తోంది. కుంకుమ పువ్వుకు పేరుగాంచిన ఆ దేశంలో శీతాకాలంలోనూ వేడి ర‌గిలిస్తోంది. దాదాపు మూడున్న‌రేళ్ల కింద‌ట ఇదే దేశంలో ఓ యువ‌తి మ‌ర‌ణంపై ప్ర‌జ‌లు తీవ్ర స్థాయిలో నిర‌స‌న‌ల‌కు దిగారు. మ‌ళ్లీ అంత‌లా కాకున్నా.. ఆర్థిక ప‌రిస్థితుల‌పై త‌మ గ‌ళాలు వినిపిస్తున్నారు. ఒక‌వైపు హ‌ద్దు లేని ధ‌ర‌ల పెరుగుద‌ల, మ‌రోవైపు రెండేళ్లుగా ప‌డిపోతున్న క‌రెన్సీ విలువ‌..! దీంతో జీవితం భార‌మై యువ‌త వీధుల్లోకి వ‌స్తున్నారు. ప్ర‌భుత్వం ఎప్ప‌టిలాగానే జోక్యం చేసుకుంటోంది. ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగి.. అమాయ‌క పౌరుల ప్రాణాలు పోతే తాము రంగంలోకి దిగుతామంటూ ఏకంగా అమెరికానే హెచ్చ‌రించింది. *** నెమ్మ‌దిగా పాకుతున్న ఉద్య‌మం ఇరాన్.. ప‌శ్చిమాసియాలోని ఈ కీల‌క దేశంలో గ‌త ఆదివారం నుంచి ప్ర‌జ‌ల నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి. ప్ర‌పంచంలో పండే కుంకుమ పువ్వులో 90 శాతం ఇరాన్ లోనే. 1970కి ముందు పాశ్చాత్య దేశాల త‌ర‌హాలో ఉండేది. ఇస్లామిక్ విప్ల‌వం అనంతరం సంప్ర‌దాయ దేశంగా మారింది. అయితే, పాల‌న‌లో వైఫ‌ల్యాలు ఇరాన్ ను దెబ్బ‌తీస్తున్నాయి… అధిక ధ‌ర‌లు, క‌రెన్సీ విలువ ప‌త‌నం కూడా ప్ర‌జ‌లలో ఆగ్ర‌హానికి దారితీస్తోంది. దీంతో ప‌లు ప్రావిన్సుల్లో వీధుల్లోకి వ‌చ్చి ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్నారు. పోలీసుల కార్ల‌కు నిప్పు పెట్టారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాల కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు, చాలామంది కూడా గాయ‌ప‌డిన‌ట్లుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభం… ఇరాన్ కరెన్సీ రెండేళ్లుగా ప‌త‌నం అవుతోంది. దీంతో ఆర్థిక సంక్షోభం త‌లెత్తుతోంది. దీనికి అడ్డుక‌ట్ట ఎంత‌కూ లేదు. అందుక‌ని ప్ర‌జ‌లు నిర‌స‌న‌ల‌కు దిగుతున్నారు. 👉అయితే, వీరిపై భ‌ద్ర‌తా ద‌ళాలు గ‌నుక కాల్పులు జ‌రిపితే తాము జోక్యం చేసుకుంటాం అని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇరాన్ పౌరుల‌ను ర‌క్షించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కుట్ర ఉందని పలువురు మేధావులు భావిస్తున్నారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌ను ఇరాన్ సుప్రీం లీండ‌ర్ అయ‌తుల్లా అలీ ఖ‌మేనీ సీనియ‌ర్ స‌ల‌హాదారు లార్జాని త‌ప్పుబ‌ట్టారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయ‌ని హెచ్చ‌రించారు. ** ముల్లాలు వెళ్లిపోవాలి ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీకి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు నిర‌స‌న‌ల‌కు దిగుతూ.. ముల్లాలు వెళ్లిపోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. గ‌త ఆదివారం రాజ‌ధాని టెహ్రాన్ లో మొద‌లైన నిర‌స‌న‌లు దేశ‌మంతా వ్యాపించాయి. చాలా న‌గ‌రాలు,ప‌ట్ట‌ణాల్లో ప్ర‌జ‌లు భ‌ద్రతా ద‌ళాల‌తో ఘ‌ర్ష‌ణ‌ల‌కు దిగుతున్న వీడియోలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 2022లో అమిని మ‌ర‌ణం త‌ర్వాత ఇరాన్ లో జ‌రుగుతున్న పెద్ద నిర‌న‌స‌న‌లు ఇవేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

👉బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్…⭐ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు…

⭐ నేడు హైదరాబాద్ గాంధీ భవన్ లో మహబూబాబాద్ శాసనసభ్యులు   డాక్టర్ భుక్య మురళి నాయక్  ఆధ్వర్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నీలం దుర్గేష్ ముదిరాజ్ , బిఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచ్లు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు,నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి అధ్యక్షులు  బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ,రాష్ట్ర పశుసంవర్థ, క్రీడా శాఖ మంత్రివర్యులు  వాకిటి శ్రీహరి ,మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ,మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్ రెడ్డి *ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ రెడ్డి ,కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంకర అయ్యప్ప రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, మాజీ పిఎస్ఈఎస్ చైర్మన్ బండారు వెంకన్న,బండారు దయాకర్, పిసిసి మెంబర్ దస్రు నాయక్,మేకల వీరన్న యాదవ్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు….*

👉 థానేలో భారీ డ్రగ్ రాకెట్ బట్టబయలు..!!!… తెలంగాణ వాసి అరెస్ట్* థానే: మహారాష్ట్ర థానే జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్ రాకెట్‌ను గుట్టు రట్టు చేశారు. ముంబై–నాసిక్ జాతీయ రహదారిపై ఖరేగావ్ టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు 638 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2.04 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.ఈ కేసులో తెలంగాణకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మహబూబ్‌నగర్ జిల్లా నివాసి చిన్న ఠాగూర్ లక్ష్మణ్ నాయక్‌గా గుర్తించారు. ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముంబైకి గంజాయి రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.లక్ష్మణ్ నాయక్‌పై NDPS చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతరులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో డ్రగ్ మాఫియాపై పోలీసుల నిఘా మరింత కఠినంగా మారింది.

👉మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం😲😲😲

కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో అవైన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ను గుర్తించారు. దీంతో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అటు నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు గల జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ చెకోపోస్టులు ఏర్పాటు చేసింది.   వైరస్ వ్యాపించకుండా కోళ్ల వ్యాన్స్ను వెటర్నరీ టీమ్స్ తనిఖీ చేస్తున్నాయి~£

👉“మటన్ ముక్క వేసుకోండి సార్!” – కాంగ్రెస్ నేతలకు వడ్డించిన నకిరేకల్ సీఐ*

నకిరేకల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఖాకీ గౌరవంపై తీవ్ర చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. పోలీస్ అధికారిగా విధులు నిర్వహించాల్సిన నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం సహా అధికార పార్టీ నాయకులకు స్వయంగా భోజనాలు వడ్డించడం వివాదాస్పదంగా మారింది. కార్యక్రమంలో సీఐ క్యాటరింగ్ సిబ్బంది మాదిరిగా వ్యవహరించడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి…***ఒక పోలీస్ అధికారి రాజకీయ కార్యక్రమాల్లో ఈ విధంగా పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఐ ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఖాకీ మర్యాదపై చర్చ మొదలైంది. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందిస్తారా? శాఖాపరమైన విచారణ చేపడతారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!