👉 పల్లెపండగ 1.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రహదారుల పనులు పూర్తి చేశామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. 22,500 మినీ గోకులాలు, 15 వేలకు పైగా నీటి తొట్టెలు, లక్షకు పైగా నీటి కుంటలు పనులు చేపట్టామని ఆయన వివరించారు.పల్లెపండగ 2.0లో భాగంగా రూ.6,700 కోట్లతో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, మరో 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించనున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
👉గుడ్డే బంగారమాయె.. ఒక్కోటి రూ.500 పైమాటే!*
జాతి కోళ్ల పెంపకాన్ని కొందరు కుటీర పరిశ్రమలా మలచుకుంటున్నారు. నాటు కోళ్లకంటే జాతి కోళ్ల పెంపకంలోనే అధిక లాభాలు పొందుతున్నారు. కేవలం పందెం పుంజులే కాకుండా కోడి గుడ్లను, ఒక రోజు లేదా నెలరోజుల కోడిపిల్లలను కూడా సామాజిక మాధ్యమాల్లో విక్రయాలు జరుపుతున్నారు.
👉ఫిబ్రవరి 2న ఏపీకి కాంగ్రెస్ అగ్ర నేతలు.. ఏపీకి రానున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే.. శింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లికి రానున్న కాంగ్రెస్ అగ్ర నేతలు
👉ఆ రెండింటిపై మోజు తగ్గితే మేలు!
వెండి బంగారాలపై భారతీయుల మోజు దేశానికి రికార్డు స్థాయిలో వాణిజ్య లోటు తెచ్చిపెడుతోంది. ఆర్థిక స్థిరత్వానికీ చేటు కలిగిస్తోంది. 2024తో పోలిస్తే 2025 అక్టోబరు నాటికి దేశీయంగా పసిడి దిగుమతులు మూడింతలు పెరిగి 1,472 కోట్ల డాలర్లకు చేరాయి. వెండి దిగుమతులేమో అయిదు రెట్లు పెరిగాయి. ఈ దిగుమతుల వల్ల మన విదేశీ మారకద్రవ్య నిల్వలు హరించుకుపోయి, రూపాయి విలువ పడిపోతుంది. పర్యవసానంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది.
👉అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన… యూరియా కొరతను నిరసిస్తూ అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేల ప్లకార్డుల ప్రదర్శన… షాపుల్లో లేని యూరియా.. యాప్‌లలో ఉంటుందా?అంటూ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం…ప్లకార్డులను లోపలికి అనుమతించని పోలీసులు..పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం
👉10 రోజుల నుండి కరెంట్ లేదని నిరసనకు దిగిన గురుకుల విద్యార్థులు*
సంగారెడ్డి జిల్లా::: నిర్గాపూర్ ప్రాంతంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో గత 10 రోజులుగా కరెంట్, తాగు నీరు రావడంలేదని రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన.. సమస్యలు చెబితే బూతులు తిడుతున్నాడంటూ, వార్డెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన విద్యార్థులు
👉ఎస్టీ హాస్టల్‌లో అరాచకం*పదో తరగతి విద్యార్థిపై మద్యం మత్తులో దాడి*…అందుబాటులో ఉండని వార్డెన్ మల్లు*
జనగాం ::: కొడకండ్ల ఎస్టీ బాలుర వసతి గృహంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న హింసాత్మక ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.*బాధిత విద్యార్థి ధరావత్ ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు**పాకాల నవీన్ వీరంగం:**వార్డెన్ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం:*
👉యూరియా కొరతతో రైతుల కష్టాలపై, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని.. సోయా రైతుల కష్టాలపై వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేసిన స్పీకర్
👉అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్…
తెలంగాణ: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ముఖ్య మంత్రిని విమర్శించేందుకు మైక్ ఇవ్వనని స్పీకర్ గడ్డం ప్రసాద్ తేల్చిచెప్పారు. ఈ క్రమంలో మూసీపై సీఎం రేవంత్ మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు.
👉మావోయిస్టుకు మరో ఎదురు దెబ్బ*
డిజిపి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన బర్సే దేవా… మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ గా పని చేస్తున్న దేవా… హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బరిసే దేవా … హైడ్మా, బర్సే దేవా ఒకే గ్రామానికి చెందినవారిగా గుర్తింపు…మావోయిస్టు పార్టీకి ఆయుధాల సరఫరా లో అత్యంత కీలక పాత్ర పోషించిన దేవా.దేవా నుంచి మౌంటెన్ ఎల్ఎంజి స్వాధీనం. దేవాతో పాటు లొంగిపోయిన మిల్ట్రీ ఆపరేషన్ సభ్యులు. రేపు మీడియా ముందు కు బర్సే దేవా.
👉 ‘హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్’
TG: మాజీ మంత్రి హరీశ్రావు షూటర్ కాదని, బబుల్ షూటర్ అని కవిత అన్నారు. పార్టీని మోసం చేసి అక్రమాలకు పాల్పడిన వ్యక్తికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి కట్టబెట్టారన్నారు. పిల్ల కాకులకు అసెంబ్లీలో బాధ్య తలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ పార్టీని కాపాడుకోవాలని సూచించారు. పాలమూరులో ప్యా కేజీ అమ్ముకున్న వ్యక్తి హరీశ్రావు అన్నారు. ఇలా అయితే.. బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు.
👉ప్రైవేటు కాలేజీ బస్సు బోల్తా.. 60 మంది విద్యార్థులకు గాయాలు*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట వద్ద రోడ్డు ప్రమాదం
మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోల్తా పడిన స్కూల్ బస్సు… బస్సు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులను బయటకు తీసి ఆసుపత్రికి తరలింపుగాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమం…అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పోలీసులు…కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్.
👉10 నిమిషాల్లో డెలివరీ ప్రమాదకరమా?: జొమాటో సీఈఓ పోస్ట్ వైరల్*
* పని పరిస్థితులు, సామాజిక భద్రత వంటి అంశాలతో డిసెంబరు 31న గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మెతో ‘క్విక్ డెలివరీ’ల అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొత్త సంవత్సరం వేళ ఆర్డర్లపై వీరి సమ్మె పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ.. 10-మినట్స్ డెలివరీ (10-Minute Delivery) మోడల్ వల్లే రైడర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురిసింది.
👉 కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కామెంట్స్..*అనంతపురం జిల్లా…
ఉపాధి హామీ పథకం అపడం మంటే బీజేపీ నాయకులు మహాత్మగాంధీ గొంతుకోసినట్లు . వెంటనే కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి…కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగించాలి…ఉపాధి హామీ పథకం ప్రారంభించిన నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో నిరసన కార్యక్రమం ఉంటుంది
ఫిబ్రవరి 2న ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన నార్పల మండలం బండ్లపల్లి లో నుంచి నిరసన తెలిపే యోచనలో కాంగ్రెస్ ఉంది.ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే , సోనియా గాంధీ ,వచ్చే అవకాశం ఉంది.
రాయలసీమ లో నిరుద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది…మహాత్మ గాంధీ ఉపాధి పథకం ఆపడం దేశ ద్రోహం…ప్రపంచంలోనే తిరుపతి దేవస్థానం పుణ్యక్షేత్రం ప్రసిద్ధి….టీటీడీ కి వందల కిలోల బంగారు నిల్వలు ఉన్నాయి. ఎంత ఉంది, ఎక్కడ పెట్టారో చెప్పాలి.టీటీడీ లో ఉన్న ఉద్యోగాలను రాయలసీమ యువతకే ఇవ్వాలి.మైక్రోసాఫ్ట్ కంపెనీ రాయలసీమ కి రావాలని తిరుపతి దేవుణ్ణి ముక్కున్నాను…. రాయలసీమలోని యువత ఎంటెక్, బీటెక్ లు చదివి కూలికి పోలేక ఇంట్లో నే సంవత్సరాలు గడుపుతున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి 7 మంది సీఎం లు అయ్యారు. 45 సంవత్సరాలు పాలించారు.రాయలసీమ కి చేసింది ఏమి లేదు. వైస్సార్ కుటుంబం, చంద్రబాబు కుటుంబాలు రెండు ఆర్థికంగా బాగా ఎదిగాయి అంతే. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేండ్ల మొన్న ఢిల్లీ కి వచ్చాడు. ఢిల్లీలో ఉన్న ఒక పెద్దాయన గుజరాత్ కి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులను తీసుకెళ్ళికి చూస్తున్నాడు.ఇప్పటి కైనా సీఎం చంద్రబాబు రాయలసీమ కి మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు వచ్చేలా చూడాలి…సీఎం చంద్రబాబు వల్లే NDA ప్రభుత్వం నడుస్తోంది…సీఎం చంద్రబాబు రాయలసీమ కి న్యాయం చేసేలా కృషి చేయాలి.
👉ప్రకాశం జిల్లా బేస్తవారిపేట లోని బీసీ కాలనీలో హత్య…
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం బేస్తవారిపేట లోని బిసి కాలనీలో ఇద్దరు పొట్టేళ్ల వ్యాపారస్తులు ఒక ఇంటిని తీసుకుని నివాసం ఉంటుండగా వారిలో ఒకరు మృతి… కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన బేస్తవారిపేట పోలీసులు..
👉గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిచేస్తుంది.. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం -పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు భరోసా..
*గిద్దలూరు శాసనసభ్యులు & ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి .. *అనుమలపల్లె గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల.. *ప్రజా ధనంతో ముద్రించిన పాస్ పుస్తకాల పై, జగన్ ఫోటోలు వేసి పబ్లిసిటీ చేశారు.
*నియోజకవర్గంలోని 9094 మంది రైతులకు రాజముద్రతో కూడిన నూతన పాస్ పుస్తకాలు పంపిణీ..
*చేతకాని పాలనతో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరి చేస్తుంది. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించటంతో పాటు రాజముద్రతో అందించే పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు భరోసా కలిగిస్తుందని గిద్దలూరు శాసనసభ్యులు & ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం తప్పులతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో…. రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు..
*రాచర్ల మండలం, అనుమలపల్లె గ్రామంలో రీ సర్వే గ్రామసభ కార్యక్రమం శుక్రవారం ఉదయం జరిగింది. భూమి యజమాన్యపు హక్కు మరియు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు వారి భూమి పై హక్కును స్పష్టంగా నిర్ధారించే పట్టాదారు పాసు పుస్తకాలు అందించటం సంతోషంగా వుందన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను గందరగోళానికి గురిచేసి రైతులను అయోమయంలో పడేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భవిష్యత్‌లో రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందేందుకు ఈ పాసు పుస్తకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. గత పాలకులు వ్యవస్థలను ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసున్నారు. ప్రజల ఆస్తుల పై జగన్ రెడ్డి ఆయన ఫోటోలను ముద్రించుకొని, ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారు. భూ యజమానుల ఫోటోలతో కూడిన పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులు ఎంతో ఆనందంగా తీసుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే 9094 మంది రైతులకు పాసు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నేటి నుండి ఈ నెల 9వ వరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చెప్పారు. రైతాంగం ఆనందపడేలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
*ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, సొసైటీ బ్యాంకు చైర్మన్ గోపిరెడ్డి జీవన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, ఎంపీడీఓ వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్ ఎల్. వెంకటేశ్వర్లు, అనుమలపల్లె టీడీపీ నాయకులు సిరిగిరి వెంకటపతి, మాజీ సర్పంచ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ భూపని కాశయ్య, సిరిగిరి శ్రీహరి, మాజీ సర్పంచ్ రామ కోటయ్య, టీడీపీ నాయకులు పాపిశెట్టి శ్రీనివాసులు, బాకీ శివ, మండల ప్రధాన కార్యదర్శి యాసం లక్ష్మిరెడ్డి, మాజీ జడ్పీటీసీ బత్తిని వెంకటేశ్వర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు..
👉పాడి పరిశ్రమల అభివృద్దే లక్ష్యంగా గోకులాల నిర్మాణం.. పాడి, పంటల అభివృద్దే దేశాభివృద్ధి…
గోకులం పథకం కింద షెడ్ల నిర్మాణానికి పశువుల పెంపకందార్లకు 90శాతం, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందార్లకు 70 శాతం చొప్పున రాయితీలు..ఉపాధి హామీ పథకం కింద రాయితీ..పశుపోషకుల్లో ఆనందం.. రూ.2 లక్షలతో నిర్మించనున్న గోకులానికి భూమి పూజ చేసిన గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాడిరైతుల సంక్షేమాభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు మండలం, కంచిపల్లె పంచాయతీ, రాజుపేట గ్రామంలో కాకర్ల రంగయ్య అనే రైతు “VB G RAM G” ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 2 లక్షలతో నిర్మించనున్న గోకులం షెడ్డు భూమి పూజ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై గోకులం షెడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మినీ గోకులం షెడ్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, గత వైసీపీ పరిపాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి రావడంతో వాటికి పూర్వవైభవం తెచ్చేందుకు అడుగులు వేస్తోందన్నారు. గ్రామాల్లో పశుపోషణ, కోళ్లు, గొర్రెలు, మేకలు పెంపకానికి మెరుగైన వసతి కల్పిస్తూ, పెంపకందార్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పశువుల నివాసానికి కొద్దిపాటి స్థలం ఉంటే మినీగోకులం పేరిట షెడ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. పాడి రైతులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 90 శాతం సబ్సిటీ తో ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని ఆర్హులైన ప్రతి ఒక్క పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పశువుల షెడ్ల నిర్మాణానికి రైతులు సహకరించి తద్వారా పశువుల పెంపకం అభివృద్దితో దేశాభివృద్ధికి తోడ్పడాలన్నారు. పశు సంవర్ధక శాఖ మరియు జాతీయ లైఫ్ స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో ఔత్సాహిక రైతులకు, పశువుల పెంపకం దారులకు నిరుద్యోగులకు ప్రోత్సాహంగా ప్రభుత్వము అనేక రుణాలు అందజేస్తుందన్నారు. వీటిని ప్రతీ ఒక్క పశువుల పెంపకం రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సన్న ,చిన్నకారు రైతులు రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే ఆర్ధిక రుణాలను అంది పుచ్చుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి రుణాల పై అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సన్న, చిన్న, కారు రైతులకు ప్రోత్సాహకరమైన ఋణాలు అందుబాటులో ఉన్నాయి అని వాటిపై అవగహన పెంచుకొని ఋణాలను పొందాలని తద్వారా వ్యాపారాభివృద్ధి చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని రైతులకు పిలుపు నిచ్చారు. రైతులకు, ఋణాల పై అవగహన మరియు వాటి లబ్ధిపై, వాటిని పొందే విధానంపై బ్యాంకర్స్, మరియు, అగ్రికల్చర్, ఇతర ప్రభుత్వ అధికారులు కలిసి ప్రతీ నెల ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు, ముఖ్యంగా పశువుల పెంపకం దారులకు ఋణాలను అందించే భాద్యత మీ పై ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులకు ఆదేశించారు. అలాగే ఆధునిక ప్రపంచంలో వ్యాపారంలో పోటీ పడాలంటే ఆధునిక టెక్నాలజీ జోడించి వ్యాపారం చేస్తే ఆర్ధిక ఫలాలు లాభాలు అంది పుచ్చుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, ఎంపీడీఓ సీతారామయ్య, APO శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ బుడతా మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, స్థానిక నాయకులు దప్పిలి శ్రీనివాసరెడ్డి, సూర్య నారాయణ రెడ్డి, మండల నాయకులు నంది శ్రీను, సొసైటీ బ్యాంకు చైర్మన్ ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, మరియు సర్పంచులు మాజీ సర్పంచులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు..
👉ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మెప్మా సిబ్బంది*
గిద్దలూరు పట్టణంలోనీ మెప్మా సిబ్బంది మరియూ పొదుపు సంఘాల మహిళలు నూతన సంవత్సర సందర్భంగ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే తో కేక్ కట్ చేపించి పేద విద్యార్థుల కోసం పుస్తకాలు & పెన్నులు బహుకరించారు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో మీరు మీకు కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని అన్నింటిలో విజయం కలగాలి అని శుభాకాంక్షలు తెలియచేశారు*

