👉కల్తీనెయ్యి కేసులో టీడీపీ ఎమ్మెల్యే.. కీలక మలుపు! ఈ కారణంగానే మంగళవారం సీబీఐ సిట్ అధికారులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని విచారించి ఆమె సాక్ష్యాన్ని నమోదు చేసినట్లు చెబుతున్నారు. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లు ప్రతిపక్ష వైసీపీ నేతలు, వారి అనుచరుల చుట్టూ తిరిగిన ఈ కేసులో తొలిసారి అధికార టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి విచారణ ఎదుర్కొన్నారు.
గత ప్రభుత్వంలో టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా పనిచేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మంగళవారం సీబీఐ సిట్ విచారించడం చర్చనీయాంశం అవుతోంది. అప్పట్లో పాలక మండలి సభ్యురాలిగా ఉన్న ప్రశాంతిరెడ్డి నాలుగు నెలపాటు టీటీడీ పర్చేజ్ కమిటీలో పనిచేశారని అంటున్నారు. దీంతో ఆమె ఇచ్చే వివరాలు, వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంతిరెడ్డి ఇప్పటికీ టీటీడీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. గతంలోనూ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి టీటీడీలో సభ్యురాలిగా ఉండటంతో ఆమె వాంగ్మూలానికి ప్రాధాన్యం ఏర్పడిందని అంటున్నారు. ఈ కారణంగానే మంగళవారం సీబీఐ సిట్ అధికారులు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని విచారించి ఆమె సాక్ష్యాన్ని నమోదు చేసినట్లు చెబుతున్నారు. తిరుపతి నుంచి నెల్లూరు వచ్చిన సిట్ అధికారులు రోజంతా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నుంచి వివరాలు తెలుసుకుని ఆమె వాంగ్మూలం నమోదు చేశారని అంటున్నరు. వైసీపీ అధికారంలో ఉండగా, టీటీడీ సభ్యురాలుగా పనిచేసిన ప్రశాంతిరెడ్డి కొన్నాళ్లు కొనుగోలు కమిటీలో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. దీంతో కొనుగోళ్ల కమిటీ విధులు, బాధ్యతలు, పనిచేసే విధానంపై సిట్ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో నెయ్యి కల్తీ విషయం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి వచ్చింది? లేనిది? కూడా తెలుసుకున్నారు. ఎమ్మెల్యే చెప్పిన అన్ని అంశాలను నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు. పర్చేజ్ కమిటీలో 4 నెలలు పనిచేసినా తనకు కొనుగోళ్ల వివరాలు ఏవీ పెద్దగా తెలియవని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సీబీఐ సిట్ కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఆరున్నరేళ్ల క్రితం జరిగిన అంశాలు తనకు గుర్తు లేవని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచారణతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని అంటున్నారు. బయటకు చెప్పకపోయినా సీబీఐ సిట్ కు కావాల్సిన సమాచారం ఎమ్మెల్యే ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. విపక్షానికి చెందిన టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఇదే కేసు విషయమై గతంలో సీబీఐ విచారించింది. అయితే వారు తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని సిట్ అధికారులు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చే వాంగ్మూలం కేసు దర్యాప్తులో సీబీఐ సిట్ కు ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామం విపక్ష శిబిరంలో వాడివేడి చర్చకు కారణమైంది. విపక్షంలో ఎవరినైనా కార్నర్ చేసేలా ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ద్వారా స్కెచ్ వేస్తోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
👉విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు…
పోలీసు శాఖలో సుదీర్ఘ కాలంపాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది మరియు అధికారులకు ప్రకాశం జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం 6వ వార్షికోత్సవం సందర్భంగా పోలీస్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రిటైర్డ్ పోలీసులలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 14 మంది పోలీస్ అధికారులను మరియు వారి కుటుంబ సభ్యులను ఆయన శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ పోలీసు విధులు చాలా కష్టంతో కూడుకున్నవని, పోలీసులు విధి నిర్వహణలో వారి ఆరోగ్య ప్రాధాన్యత కంటే ప్రజా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వర్తించారని వారిని ఎస్పీ ప్రశంసించారు. గతంలో సాంకేతిక పరిజ్ఞానం లేదని అయినప్పటికీ అనేక ముఖ్యమైన దొంగతనం, దోపిడీ, హత్య కేసులు మరియు కీలక కేసులు సేదించడంలో ఎంతో నైపుణ్యత కనపరిచారన్నారు. సుదీర్ఘకాలంపాటు నిస్వార్థంగా సేవలు అందించినందుకు వారికి పోలీసు శాఖ తరపున ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల, సిబ్బంది అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని అన్నారు. రిటైర్డ్ పోలీసులను సన్మానించడం ఒక మంచి కార్యక్రమామని, ఇలాంటివి ప్రతి సంవత్సరం నిర్వహించడం ద్వారా విశ్రాంత ఉద్యోగులంతా గొప్ప సత్సంబంధాలతో మెలిగి ఉండడమే కాక క్రియాశీలక పోలీసులతో కూడా మమేకమయ్యేందుకు దోహద పడుతుందని పేర్కొన్నారు. విశ్రాంత పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం కృషి చేస్తానని, వారికి ఎలాంటి సమస్య ఉన్న సహాయం కావాలన్నా జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం విశ్రాంత పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ని శాలువతో సన్మానించి, మెమెంటోలను అందచేసినారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ సీతారామరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
👉తప్పుడు ఆధారాలు చూపించి రాష్ట్రపతి నుండి రూ.2 కోట్ల అవార్డు అందుకున్న తెలంగాణ ఐఏఎస్ అధికారి*
జల్ సంజయ్ పథకం ప్రకారం, జిల్లాలో వర్షపు నీరు ఒడిసి పట్టేందుకు నీరు నిల్వ చేసే కుంటలు నిర్మించిన వారికి అవార్డులు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం…
ఈ పథకానికి సంబంధించి, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో పూర్తి స్థాయిలో జల్ సంజయ్ పథకానికి సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు తప్పుడు ఆధారాలు చూపించి, ప్రెసిడెంట్ చేతుల మీదుగా రూ.2 కోట్ల అవార్డు అందుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్…
పనులు చేసిన ఫొటోలు పెట్టకుండా, జాతీయ జెండా ఫోటో అప్లోడ్ చేసిన దీపక్ కుమార్…పనులు చేసిన ఆధారాలు చూపకుండా, జాతీయ జెండా ఫోటో పెడితే రూ.2 కోట్ల అవార్డు ఎలా ఇస్తారంటూ నెటిజన్ల మండిపాటు…
👉 ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ లో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు తోపాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మరియు మంత్రి డోల బాల వీరాంజనేయులు తోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లా కోసం 63 రోజుల్లో పాటు జిల్లా కోసం పాటుపడి ఈరోజుకి సాధించామని జిల్లాగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మరియు లోకేష్ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఇకనుంచి మార్కాపూర్ రాన్ని మార్కాపురం జిల్లాగా పిలుచుకుందాం అని మార్కాపూర్ లో పూర్ ఉంది పూర్ కాకుండా మార్కాపురంలో అంతపురం ఉంది మార్కాపురం గా పిలుచుకుందాం అని అన్నారు. అలాగే నూతన జిల్లా కలెక్టర్ కి మరియు ఎస్పీ మార్కాపురం జిల్లా మొదటిసారిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందన తెలిపారు. జిల్లాగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కందుల నారాయణరెడ్డి కంటతడి పెడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. అనంతరం మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా చూస్తామని అన్నారు. అలాగే మార్కాపురం జిల్లా సాధించడంలో కందుల నారాయణరెడ్డి ఎంతో కృషి ఉందని అన్నారు మార్కాపురం సంబంధించిన నిధులు తో మార్కాపురం అభివృద్ధి పరుస్తామని అన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ జెండా ఆవిష్కరించి అనంతరం నూతన బాధ్యతలు స్వీకరించారు.
👉 మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి *
👉నూతన మార్కాపురం జిల్లా ఇంచార్జ్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వి.హర్షవర్థన్ రాజు,
నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటంతో బుధవారం మార్కాపురం డి.ఎస్.పి కార్యాలయం లో ఏర్పాటు చేసిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఇన్చార్జి ఎస్పి వి.హర్షవర్ధన్ రాజు, తో కలిసి గౌరవ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ పి. రాజాబాబు, మారీ టైం బోర్డు దామచర్ల సత్య , మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి , ఎర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు, మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నూతనంగా మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై నిరంతర నిఘా, గంజాయి–డ్రగ్స్ పూర్తిస్థాయి నిర్మూలన, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మహిళలు మరియు చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
నూతన జిల్లాకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జిల్లా అభివృద్ధి మరియు ప్రజల భద్రత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కార చర్యలు చేపడతామన్నారు… మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి బాధితుడికి తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే గుట్కా, గంజాయి, నాటు సారా వంటి అసాంఘిక కార్యకలాపాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని తెలిపారు.అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయం పరిసర ప్రాంతాలు, పాత బిల్డింగ్, పాత పోలీస్ క్వార్టర్స్‌లను పరిశీలించి, పోలీస్ పరిపాలన కార్యాలయాలకు ఉపయోగపడేలా యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి మార్కాపురం పట్టణంలోని పట్టు పరిశ్రమ శాఖ, ఎస్‌వీకేపీ కళాశాల పరిసరాలను కూడా పరిశీలించారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బీ ఇన్‌స్పెక్టర్ దేవప్రభాకర్, మార్కాపురం సీఐ సుబ్బారావు, త్రిపురాంతకం సీఐ అసన్, కనిగిరి సీఐ శ్రీనివాసులు, వైపాలెం సీఐ అజయ్ కుమార్, పామూరు సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
👉మత్తు రహిత సమాజం – సురక్షిత బాల్యం దిశగా కీలక అడుగు,కనిగిరి మోడల్ స్కూల్‌లో యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, శక్తి యాప్, సైబర్ భద్రతపై జిల్లా పోలీసుల విస్తృత అవగాహన*…
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి పట్టణంలోని మోడల్ స్కూల్‌లో ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మత్తు పదార్థాల నివారణ (Anti-Drugs), గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, శక్తి యాప్ వినియోగం, అలాగే సైబర్ భద్రత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమాన్ని వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గారు నిర్వహించి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలు, బాలల భద్రతకు సంబంధించిన గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్ ఉపయోగించే విధానం గురించి వివరించారు.అదేవిధంగా, సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలనే విషయాలపై కూడా విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించి, సురక్షితమైన భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని పోలీసులు తెలిపారు.
👉 ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం దోర్నాల పరిధిలో అక్రమ బెల్ట్ షాపులపై ఎస్సై వెంకట రమణయ్య* తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి నుండి 1 ఫుల్ బాటిల్, 19 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్సై వెంకట రమణయ్య తెలిపారు….

