👉బీజేపీ ఇక‌, బాబు ప‌క్ష‌మే.. రీజ‌న్ ఇదే.. !…👉ఆర్ఎస్ఎస్ కి ప్రకాష్ రాజ్ సవాల్….కాలిందా అంటూ సెటైర్లు !!!..👉సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం…👉జర్నలిస్టుల అరెస్టును ఖండించిన కేటీఆర్…👉రవి సంఘి బినామీ ఆస్తి 282 ఎకరాలను జప్తు చేసిన ఐటీ!* ..👉గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆవేదన …సిఐ తనను లం… అని తిట్టారని మహిళ ఆరోపణ ..👉తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్థాపానికి గురై యువకుడు ఆత్మహత్య…👉కుప్పంలో దారుణం…వివాహితపై ముగ్గురు యువ‌కుల గ్యాంగ్ రేప్‌..👉 ఎర్రగొండపాలెంలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారయత్నం చేసిన దుర్మార్గుడు…👉ప్రజల్లో విశ్వాసం పెంపే లక్ష్యంగా పని చేయాలి:పోలీసు శాఖ వార్షిక నేర సమీక్షా సమావేశంలో కలెక్టర్ పి.రాజాబాబు..

👉బీజేపీ ఇక‌, బాబు ప‌క్ష‌మే.. రీజ‌న్ ఇదే.. !

ఏపీలో కూట‌మిగా ఏర్ప‌డి.. ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హిస్తున్న కూట‌మి పార్టీల్లో బీజేపీ ఒక‌టి. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పార్టీల‌తో జ‌ట్టుక‌ట్టి బీజేపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఏపీలో కూట‌మిగా ఏర్ప‌డి.. ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హిస్తున్న కూట‌మి పార్టీల్లో బీజేపీ ఒక‌టి. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పార్టీల‌తో జ‌ట్టుక‌ట్టి బీజేపీ విజ‌యం ద‌క్కించుకుంది. 8 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఎంపీలు గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కారు. వాస్త‌వానికి ఉమ్మ‌డి ఏపీ సంగ‌తి ఎలా ఉన్నా.. విభ‌జ‌న త‌ర్వాత‌.. ఈ రేంజ్‌లో బీజేపీ ఏపీలో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఇదే తొలిసారి. అసెంబ్లీలో 8 మంది క‌మ‌లం పార్టీ నాయ‌కులు.. పార్ల‌మెంటుకు ముగ్గురు ఎన్నిక కావ‌డం ఆ పార్టీకి భారీ బూస్ట్ ఇచ్చింద‌నే చెప్పాలి. 15 ఏళ్ల త‌ర్వాత టెస్టు గెలుపు అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. కూట‌మిగానే బీజేపీ ఉంటుందా? అనే విష‌యంలో మాత్రం అనేక సందేహాలు ఉన్నాయి. 1) 2024 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ హామీల‌పై బీజేపీ మౌనంగా ఉంది. 2) కూట‌మిలో ఉన్న‌ప్ప‌టికీ.. కూట‌మిఅజెండాకు పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం. ఈ రెండు కార‌ణాల‌తో కూట‌మిలోనే బీజేపీ ఉన్న‌ప్ప‌టికీ.. అనేక సందేహాల‌కు అవకా శం ఇచ్చిన‌ట్టు అయింది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ కూడా.. అనుస‌రించిన విధానం.. త‌న‌కు మేలు జ‌రుగుతుందంటే.. ఏ ప‌నినైనా చేస్తుంద‌న్న వాద‌న ఉంది. దీంతో ఇప్పుడు కాకపోతే..వ చ్చే ఎన్నిక‌ల నాటికి అయినా.. బీజేపీ వైసీపీతో అంత‌ర్గ‌తంగా చేతులుక‌లిపే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డిచింది. దీనికి తోడు కూట‌మి నాయ‌కులు చంద్ర‌బాబు, ప‌వ న్ 15 ఏళ్ల కూట‌మి గురించి చెబుతున్నా.. బీజేపీ నాయ‌కులు స్పందించ‌లేదు. దీంతో బీజేపీ వ్య‌వ‌హారంపై అన్ని వ‌ర్గాల్లోనూ అనుమానాలు ఉన్నాయి. అయితే.. తాజాగా మారుతున్న ప‌రిణామాల‌తో బీజేపీ ఇక‌, సీఎం చంద్ర‌బాబును వ‌దిలి పెట్టే ప్ర‌సక్తి ఉండ‌ద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. అంత బ‌లంగా బాబే బీజేపీతో బంధం పెంచుకుంటున్నార‌ని చెబుతున్నారు. 1) బీజేపీ కోరిన‌వ‌న్నీ సీఎం చంద్ర‌బాబు చేస్తున్నారు. పార్టీ ఓటు బ్యాంకు, సీటు బ్యాంకుతో సంబంధం లేకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయ‌కుడు, మాజీ ప్ర‌ధాని అటల్ బిహారీ వాజ్ పేయి విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 2) రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ విగ్ర‌హానికంటే కూడా ముందే.. వాజ్ పేయి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించా రు. అంతేకాదు.. త్వ‌ర‌లోనే వాజ్ పేయి స్మృతి వ‌నాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా చంద్ర‌బాబు అనుమ‌తి ఇచ్చారు. ఈ ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు. 3) గురువారం వ‌ర‌కు జ‌రిగిన వాజ్ పేయి-మోడీ సుప‌రిపాల‌న యాత్ర‌లకు చంద్ర‌బాబు సంపూర్ణంగా స‌హ‌క‌రించారు. అంతేకాదు.. టీడీపీ నాయ‌కులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేలా ప్రోత్స‌హించారు. 4) ఎక్క‌డ అవ‌కాశం వ‌స్తే.. అక్క‌డ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విజ‌యాల‌ను, ఆయ‌న పాల‌న‌ను కూడా చంద్ర‌బాబు కొనియాడుతూ.. జోష్ నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 5) కేంద్రంతో ఎలాంటివివాదాలు పెట్టుకోకుండా.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను, వ‌న‌రుల‌ను తెచ్చుకుం టున్నారు. ఇలా.. బీజేపీతో బాబు బంధం వేసుకుంటున్న నేప‌థ్యంలో బీజేపీ నే ఇప్పుడు బాబు లేకుండా ఉండే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

👉ఆర్ఎస్ఎస్ కి ప్రకాష్ రాజ్ సవాల్….కాలిందా అంటూ సెటైర్లు !!!ఆర్ఎస్ఎస్ మీద ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేసిందని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ మీద ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేసిందని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అంటే విషం అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థ పుట్టి వందేళ్ళు అయిందని దేశ సేవలో పాత్ర ఏమిటి అని నిలదీశారు స్వాతంత్రం పూర్వం పుట్టిన ఆర్ఎస్ఎస్ నుంచి ఎవరైనా దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారా అని ఆయన ప్రశ్నించారు. ఉంటే ఒకటి రెండు పేర్లు చెప్పాలని సవాల్ చేశారు. లాగులు ప్యాంట్లుగా : విశాఖలో సీఐటీయూ ఉత్సవాలకు హాజరైన ప్రకాష్ రాజ్ ఆర్ఎస్ఎస్ ఈ వందేళ్ళలో సాధించింది ఏంటి అంటే లాగుల నుంచి ప్యాంటుల దాకా రావడమే అని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ దేశం మనదని అంటారు కదా దేశానికి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అది ఒక సంస్థ కానే కాదని అన్నారు. బ్రహ్మ రాక్షసుడు ఆర్ఎస్ఎస్ అని ఆయన అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ ని వల్లభాయ్ పటేల్ నిషేధించారు, కానీ ఆయననే తమ సొంత నాయకుడిగా చెప్పుకుంటూ బీజేపీ మూడు వేల అడుగుల విగ్రహం పెట్టిందని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. కర్ర పట్టుకుని తిరుగుతుంటారని ఆర్ఎస్ఎస్ కవాతుని కూడా ప్రకాష్ రాజ్ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ లో ఒక్క మహిళా సభ్యురాలు అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. ఆడవాళ్ళను గౌరవించే సంస్థగా చెప్పుకుంటారు కదా ఎక్కడ అని నిలదీశారు. కొందరికి ఎన్ని ఏళ్ళు వచ్చినా బుద్ధి రాదని అలా ఆర్ఎస్ఎస్ కి వందేళ్ళు అయినా బుద్ధి రాలేదని ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సలైట్ ఆయన : ఇదిలా ఉంటే ప్రకాశ్ రాజ్ ని అర్బన్ నక్సలైట్ అని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం భీకరంగా సాగింది. తనపై విష్ణువర్ధన్ రెడ్డి చేసిన సుదీర్ఘ విమర్శలకు ప్రకాశ్ రాజ్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వెంటనే రియాక్ట్ అయ్యారు.. కాలిందా అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే నక్సలైట్ల ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శల మీద విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సినిమా డైలాగులు చెప్పడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు…  హెగ్డేవార్ పోరాడారు : ఆర్ఎస్ఎస్ గురించి విమర్శలు చేస్తూ చరిత్రను వక్రీకరించడం కాదని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కి స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర లేదంటారా 1921లో జైలుకెళ్లిన డాక్టర్ హెడ్గేవార్ చరిత్ర తెలుసుకోండని గుర్తు చేశారు. పటేల్ ఆర్ఎస్ఎస్ ని నిషేధించినా ఆధారాలు లేవని తేలాక ఆయనే బ్యాన్ తొలగించారని ఆయన చెప్పారు ఇక ఆర్ఎస్ఎస్ లో మహిళలు ఎంతో మంది ఉన్నారని రాష్ట్ర సేవికా సమితి ఏకంగా 50 ఏళ్లుగా లక్షల మంది మహిళలతో పనిచేస్తోందని ఆయన చెప్పారు ఇక ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తోంది అని అంటున్నారని దేశంలో విపత్తుల సమయంలో ఎవరు సేవ చేస్తున్నారో ప్రకాష్ రాజ్ తెలుసుకోవాలని అన్నాఉర్. లక్షలాది కార్యకర్తలు, తమ ప్రాణాలు తెగించి మానవత్వంతో సేవ చేస్తుందని చెప్పారు. అపుడు ఎందుకు ఖండించలేదు : మావోయిస్టులు గురించి ఉపన్యాసాలు దంచుతున్న ప్రకాష్ రాజ్ 2000 నుండి 2025 వరకు మావోయిస్టుల దాడుల్లో సుమారు 2,722 మంది పోలీసులు చనిపోయారు మరి అప్పుడు ఎందుకు ఖండించలేదని విష్ణు వర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నేడు జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టు నేతలే అడవిలో ఉన్న తోటివారి తుపాకులు హింసను ఆపమంటున్నారని ఆయన చెప్పారు. ప్రకాష్ రాజ్ లాంటి వారు వారిని రెచ్చగొడుతున్నారని కానీ ఆయన మాత్రం తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్లడం ఎందుకు వెళ్ళడంలేదని ప్రశ్నించారు. ఇక ప్రకాశ్ రాజ్ నక్సలైట్లను ఎన్‌కౌంటర్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. వాళ్లు కూడా మన ప్రజలే కదా అని అంటూ వారితో మాట్లాడి జనజీవన స్రవంతిలో కలపాలి కానీ హత్యలు చేయడమేంటి అని మండిపడ్డారు.

👉జర్నలిస్టుల అరెస్టును ఖండించిన కేటీఆర్… ప్రజాస్వామిక పరిరక్షణ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఏడవ గ్యారంటీ ఇదేనా?

ప్రజల గొంతుక జర్నలిస్టులను అరెస్టు చేయడం, నిర్బంధించడం కాంగ్రెస్ నిరంకుషత్వానికి నిదర్శనం… జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం – కేటీఆర్

👉MNREGA ఒక పథకం కాదు.. ఒక సంస్కరణ..ఈ పథకం వల్ల మినిమమ్ కూలీ వచ్చేది…ఈ డైరెక్ట్ రైట్ బేస్డ్ పథకాన్ని మోడీ సర్కార్ తీసేసింది…సమాఖ్య వ్యవస్థను మోడీ ప్రభుత్వం నీరుగారుస్తోంది…కేంద్రం నిర్ణయం వల్ల పేదలకు అనేక సమస్యలు వస్తాయి… సంబంధిత మంత్రిని అడగకుండానే ప్రధాని కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది..కేంద్ర ప్రభుత్వంలో వన్ మ్యాన్ షో నడుస్తోంది..అదానీ, అంబానీలకు దోచిపెట్టడానికే ఇదంతా చేస్తున్నారు- రాహుల్ గాంధీ👉మేడ్చల్ జిల్లా :-

సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ గేమ్స్ కి అలవాటు పడి ఓ యువకుడి ఆత్మహత్య..రవీందర్(24) తాను ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడి పెట్టి మోసపోయానని వీడియో రికార్డ్…తన చావుకు ఎవరు బాధ్యులు కాదని,సూరారం లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడిన రవిందర్.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సూరారం పోలీసులు

👉మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసులో కీలక వివరాలు వెల్లడించిన వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్*

హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ డ్రగ్స్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌ప్రీత్ నిందితుడిగా ఉన్నట్లు స్పష్టం చేశారు.డ్రగ్స్ కేసులో అమన్‌ప్రీత్‌ను ఏ7 నిందితుడిగా గుర్తించినట్లు తెలిపారు. అమన్‌ప్రీత్‌తో పాటు మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వెల్లడించారు.ఈనెల 19వ తేదీన నితిన్ సింగానియా, శ్రానిక్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. విచారణలో నితిన్, శ్రానిక్‌ల నుంచి అమన్‌ప్రీత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తేలిందన్నారు. అమన్‌ప్రీత్ గతంలోనూ డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన చరిత్ర ఉందని డీసీపీ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తప్పవని, కేసులో ఎవరినీ ఉపేక్షించబోమని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు.

👉 మేం ఇండియాకు వెళ్లం: బంగ్లా హిందువులు…దాడులు జరుగుతున్నా తాము ఇండియాకు వెళ్లబోమని ఢాకాలోని హిందువులు NDTVతో స్పష్టం చేశారు. ‘మేము హిందువులమనే కారణంతోనే రాడికల్ ఇస్లామిస్టులు మాపై దాడి చేస్తున్నారు. మమ్మల్ని భారతీయ ఏజెంట్లు అని పిలుస్తున్నారు. ఇండియాకు వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. దానికి మేం ఒప్పుకోం. మేము భారతీయులం కాదు. బంగ్లాదేశీ హిందువులం. ఇక్కడే పుట్టాం.. ఇక్కడే చస్తాం. ఇది మా దేశం. యూనస్ ప్రభుత్వం విఫలమైంది’ అని పేర్కొన్నారు~£

👉గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆవేదన …సిఐ తనను లం… అని తిట్టారని మహిళ ఆరోపణ ..

తన కుమారుడిపై అన్యాయంగా గంజాయి కేసు నమోదు చేశారనీ మహిళ ఆరోపణలు …5 రోజులు క్రితం తన కొడుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి నిర్బందించి ,చిత్ర హింసలకు గురిచేసి ఈరోజు గంజాయి తీసుకువచ్చి ఫోటోలు తీసి కేసు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు చేసిన మహిళ … జరిగిన ఘటనపై ఉన్నత అధికారులు విచారణ నిజ నిజాలు తేల్చాలని తల్లిదండ్రుల డిమాండ్…తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళ గంటపాటు హల్ చల్ చేసింది. తన కుమారుడితో పాటు మరి కొంతమంది యువకులపై అక్రమ కేసు బనాయిస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యింది.ఇంట్లో ఉన్న తన కొడుకుని తీసుకు వెళ్లి పోలీసులు అక్రమ గంజాయి కేసు నమోదు చేస్తున్నారని ఆరోపణలు చేసింది. తన కుమారుడి కోసం పోలీస్ స్టేషన్ కు వెళితే తనను లంజ అంటూ బూతులు తిట్టారని మహిళ ఆరోపణలు చేసింది. తన కుమారుడు గంజాయి తాగి ఉండొచ్చు కాని గంజాయి అమ్ముతున్నారనీ కేసు నమోదు చేయడం అన్యాయమని మహిళ ఆవేదన. నమ్మకంగా ఇంట్లో ఉన్న వారిని తీసుకువెళ్లి 5 రోజులు నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేసి కేసు ఒప్పుకోవాలని వేధిస్తున్నారని మహిళ తెలిపింది. అటుగా వెళ్తున ఓ టీడీపీ మాజీ కౌన్సిలర్ కాళ్లు పట్టుకుని తనకు పట్టుకుని తన కొడుకుపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేస్తున్నారని పోలీసులతో మాట్లాడి న్యాయం చేయాలని మహిళ కాళ్లు పట్టుకుని ప్రాధేయ పడటం గమనార్హం.. ఇదిలా ఉంటే పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలుప్తున మహిళతో సిఐ నీలాంటి వాళ్ళను నేను చాలా మందిని చూసాను ఏమి చేయాలో మాకు తెలుసు kఅంటూనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించెందని సదురు మహిళ పై కేసు నమోదు చేయాలని సిబ్బందికి సిఐ తెలపడం గమనార్హం..

నోట్: గంజాయి లాంటి మహమ్మారి సమాజానికి హానికరమే కానీ గంజాయి అమ్మేవారిని కాకుండా అమాయకులపై కేసులు నమోదు చేయడం ఆపాలని కోరుతున్న తల్లిదండ్రులు..

👉ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మండలంలో దారుణం…చిల్లర షొప్ కి తినుబండారాల కోసం వచ్చిన ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారయత్నం చేసిన దుర్మార్గుడు… అతని నుండి ఓ బాలిక తప్పించుకొని తల్లిదండ్రులకు పిర్యాదు…అక్కడే ఉన్న మరో బాలిక పై అత్యాచారం చేసిన పిక్కిలి ఆంజనేయులు అనే వ్యక్తి…పిక్కిలి ఆంజనేయులు పై పోలీసులకు పిర్యాదు చేసిన తల్లిదండ్రులు…పిక్కిలి అంజనేయులును అరెస్ట్ చేసి యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు…నిందితుడిపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు…కోర్టులో హాజరుపరచనున్న యర్రగొండపాలెం పోలీసులు.

👉చిత్తూరు జిల్లా… కుప్పంలో దారుణం…వివాహితపై ముగ్గురు యువ‌కుల గ్యాంగ్ రేప్‌.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అత్యాచారం ఘటన… బాధితురాలికి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు…కుప్పం పోలీస్ స్టేషన్ లో బాధితురాలి భర్త మణి ఫిర్యాదు… కేసు నమోదు…కుప్పం మండలం N.కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామంలో ఘటన..పోలీసులు అదుపులో ఇద్దరు నిందితులు..? పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్న పోలీసులు.. విషయం బయటకు చెప్తే.. మీ కుటుంబాన్ని అంతం చేస్తాం…నిందితులు బాధిత మహిళ భర్త మ‌ణి ని బెదిరించినట్లు సమాచారం…దీంతో నా భార్య విషయం బయటకు చెప్పలేక 10 రోజులుగా మానసికంగా కుంగిపోయిందని ఆవేద‌న‌.

👉మహబూబ్ నగర్….ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన…రాజాపూర్ మండలం మల్లేపల్లి గ్రామంలో యువకుడు ఆత్మహత్య… మా అమ్మ వల్లే నేను చనిపోతున్నాను అంటూ వీడియో చేసి ఉరివేసుకున్న వడ్డే నరసింహ…తల్లి తిట్టడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్న గ్రామస్తులు…తల్లి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్థాపానికి గురైన నరసింహ….ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే నరసింహ…నరసింహ మోడల్ పేరుతో ఇంస్టాగ్రామ్ ఐడి….గ్రామంలో విషాద ఛాయలు….నిన్న గ్రామంలో నరసింహ అత్యక్రియలు…తల్లివల్లే నరసింహ చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు…

👉రవి సంఘి బినామీ ఆస్తి 282 ఎకరాలను జప్తు చేసిన ఐటీ!*

సంఘి బ్రదర్స్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగారు. కానీ తర్వాత కుటుంబ పంచాయతీలతో కిందపడిపోయారు. ఇప్పుడు ఆ బ్రదర్స్ లో ఒకరైన రవి సంఘి ఇన్వెస్టర్స్ ను మోసం చేసి కంపెనీ ఆస్తులను బినామీగా మార్చుకున్న విషయాన్ని ఐటీ గుర్తించి జప్తు చేసింది.

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ, ఒమర్ ఖాన్ దాయిరా గ్రామాల్లోని 282 ఎకరాల భూమిని ఐటీ శాఖ బినామీ నిరోధక విభాగం తాత్కాలికంగా జప్తు చేసింది. మార్కెట్ విలువ ప్రకారం ఈ భూముల ధర సుమారు రూ. 2,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ 282 ఎకరాల భూమిని బినామీ ఆస్తిగా నిర్ధారిస్తూ 17 ప్రోవిజనల్ అటాచ్‌మెంట్ ఆర్డర్లను జారీ చేసింది. ఈ భూములను సంఘీ ఇండస్ట్రీస్ మాజీ ప్రమోటర్లు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం బినామీల పేరిట మళ్లించినట్లు ఐటీ శాఖ దర్యాప్తులో తేలింది.

ఐటీ శాఖ దర్యాప్తు ప్రకారం.. ఈ భూ లావాదేవీల్లో సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ , ఇన్‌కార్ రియల్టీ ప్రాజెక్ట్స్, వెంకటేశ్వర రియల్టీ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. ఇన్‌కార్ రియల్టీ సంస్థను కేవలం ఒక బినామీదారుగా గుర్తించారు. రవి సంఘీ , ఆయన కుటుంబ సభ్యులు వివిధ ట్రస్టులు, భాగస్వామ్య సంస్థల ద్వారా ఈ భూములపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నట్లు ఆధారాలు లభించాయి. సంఘీ ఇండస్ట్రీస్‌ను మరో పెద్ద సంస్థ కొనుగోలు చేయడానికి ముందే, కంపెనీకి చెందిన విలువైన భూములను తక్కువ ధరకు తమ సొంత సంస్థలకు మళ్లించాలని ప్రమోటర్లు పథకం వేసి అమలు చేశారు…సెబీ నిబంధనల ప్రకారం.. కంపెనీ టర్నోవర్‌లో 10 శాతం కంటే ఎక్కువ విలువైన ఆస్తులను విక్రయించాలంటే షేర్ హోల్డర్ల అనుమతి తప్పనిసరి. దీన్ని తప్పించుకోవడానికి కేవలం రూ. 84 కోట్లుగా భూమి విలువను చూపించి ఇన్‌కార్ రియల్టీకి అమ్మేశారు. సంఘీ ఇండస్ట్రీస్‌లో తమ వాటాలను అమ్ముకోగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని తిరిగి తమకే చెందిన వెంకటేశ్వర రియల్టర్స్ లోకి పెట్టుబడిగా తెచ్చారు. అదే రోజు ఆ నిధులను ఇన్‌కార్ రియల్టీకి పంపి, అక్కడి నుండి సంఘీ ఇండస్ట్రీస్‌కు చెల్లింపులు జరిగినట్లు చూపారు.కంపెనీ మేనేజ్‌మెంట్ నుండి తప్పుకున్నాక, భూముల విలువను రూ.218 కోట్లకు పెంచుతూ రెక్టిఫికేషన్ డీడ్లు చేశారు. ఈ ప్రక్రియ కోసం మార్ఫింగ్ చేసిన ఫోటోలు, 2024లో తయారు చేసి 2023 నాటివిగా చూపిన ఫోర్జరీ వాల్యుయేషన్ రిపోర్టులను వాడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. సాధారణ ఇన్వెస్టర్లను, మైనారిటీ షేర్ హోల్డర్లను మోసం చేస్తూ కంపెనీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశమని ఐటీ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఈ 282 ఎకరాల భూమిపై ఎటువంటి విక్రయాలు లేదా నిర్మాణాలు జరగకుండా ఐటీ శాఖ అటాచ్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారం రియల్ ఎస్టేట్ మరియు కార్పొరేట్ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతోంది.

👉సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఘరానా మోసం…కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీకి చెందిన ముంతాజ్ బేగం అనే మహిళ చనిపోగా, ఆమె పేరుతో వచ్చిన లేబర్ ఇన్సూరెన్స్ చెక్కును విత్ డ్రా చేసి డబ్బును కాజేసిన కాంగ్రెస్ నాయకులు…విషయం తెలిసి అడగగా, రూ.50 వేలు ఇచ్చి మిగతా అమౌంట్ ఇవ్వకుండా రోజులు గడుపుతున్నారని మృతురాలి కూతురు నసీమా ఆవేదన…తనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని రూ.5000 తీసుకొని మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్న బాధితురాలు

👉సీఐ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్యయత్నం…. పల్నాడుకు చెందిన ధాన్యం వ్యాపారి (ఆర్యవైశ్య) భార్య కోడూరి జ్యోతిని బెదిరించి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి సెల్లో వేసే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు…*

👉ప్రజల్లో విశ్వాసం పెంపే లక్ష్యంగా పోలీసులు పని చేయాలి…నేరాల నియంత్రణతో పాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి.

ఎస్సీ, ఎస్టీ ప్రజలు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు…సంబంధిత చట్టాలు పక్కాగా అమలయ్యేలా జవాబుదారీతనంతో పని చేయాలి…. విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగించాలి… పోలీసు శాఖ వార్షిక నేర సమీక్షా సమావేశంలో కలెక్టర్ పి.రాజాబాబు.. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమిష్టిగా పని చేయాలని పిలుపు..శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలను వివరించిన జిల్లా ఎస్పీ  వి.హర్షవర్ధన్ రాజు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!