👉దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక రేప్ కేసులో బీజేపీ నాయకుడికి బెయిల్…👉తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులైన పెన్షనర్లను ఏరిపారేస్తుంది…!!…👉ఉద్యమ నేతపై పిడి చట్టం…సిపిఎం నాయకుడు అప్పలరాజు అరెస్ట్‌…👉సోయాబీన్ పంట‌ కొనుగోలుపై చేతులెత్తేసిన రేవంత్ స‌ర్కార్*👉నిజాయితీ అధికారికి వెండి పతాక నజరానా … DGP కమాండేషన్ డిస్క్ లో సిల్వర్ మెడల్ సాధించిన సీఐ క్రాంతి కుమార్👉 పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని దళితుడి ఇల్లు కూల్చేసిన కాంగ్రెస్ నాయకుడు…👉ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం* *డీటీసీగా పని చేస్తూ రూ.200 కోట్ల అక్రమాస్తులు*…* జిల్లా ఎస్పీ  పి.జగదీష్  ఆదేశాలతో స్థానిక కేశవ రెడ్డి స్కూల్ నందు అవగాహన సదస్సు…👉 విలువలతో కూడిన జీవనమే ఏసుప్రభు సందేశం : ఎమ్మెల్యే జెసి అస్మిత రెడ్డి…👉 రోడ్డుపైనే సర్జరీ చేసిన డాక్టర్లు.. నెటిజన్ల ప్రశంసలు…

  • 👉దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక రేప్ కేసులో బీజేపీ నాయకుడికి బెయిల్

 

బాధితురాలికి సీఆర్పీఎఫ్ భద్రత కొనసాగిస్తూ, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు… ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ ప్రాంతంలో 2017 సంవత్సరంలో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో బీజేపీ నాయకుడు కుల్దీప్ సింగ్ సింగార్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు … బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించడం, బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నాడని ఫిర్యాదుతో సింగార్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ఢిల్లీ హైకోర్టు …ఈ నేపధ్యంలో రేప్ కేసులో విధించిన యావజ్జీవ కారాగార శిక్షను రద్దు చేస్తూ, కొన్ని కఠిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి…నా తండ్రిని హత్య చేశారు, నాపై అత్యాచారానికి పాల్పడ్డారు, అలాంటి వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తారా, ఇదెక్కడి న్యాయం అంటూ వాపోయిన బాధితురాలు

👉సోయాబీన్ పంట‌ కొనుగోలుపై చేతులెత్తేసిన రేవంత్ స‌ర్కార్*

మేం కొన‌లేం… మీరే కొనాలంటూ కేంద్రానికి తేల్చి చెప్పిన ప్ర‌భుత్వం…సోయాబీన్ పంట‌ను కొనుగోలు చేయాల‌ని కేంద్రానికి మంత్రి తుమ్మ‌ల లేఖ‌…పంట కొనుగోలు భారాన్ని కేంద్రంపైనే మోపిన రాష్ట్ర‌ ప్ర‌భుత్వం

👉 నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని…ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు … జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం…గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీ, ఏంఐఏం పార్టీల తరపున ప్రచారం చేస్తాను..ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.. నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను – దానం నాగేందర్

👉 రైతులకు మళ్ళీ మొదలైన యూరియా కష్టాలు…మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో యూరియా బస్తాల కోసం బారులు తీరిన రైతులు…సరిపడా యూరియా ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రైతులు

👉నిజాయితీ అధికారికి వెండి పతాక నజరానా … DGP కమాండేషన్ డిస్క్ లో సిల్వర్ మెడల్ సాధించిన సీఐ క్రాంతి కుమార్..అనంతపురం .. ఎస్సై.. సీఐ వివిధ హోదాల్లో దాదాపు 14 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఆ సిఐకి వివాదారహితుడిగా పేరుంది… ప్రస్తుతం ఎస్ బి సీఐగా పనిచేస్తున్న క్రాంతి కుమార్ నిజాయితీ అధికారిగా విధులు నిర్వహిస్తూ పరిష్కారం కాని అనేక కేసులను పరిష్కరించి ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ వస్తున్నారు… జిల్లా ఎస్పీ సూచనలను అనుసరిస్తూ తన శాఖ పరిధిలో ఉన్న క్రింది స్థాయి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ… శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న క్రాంతి కుమార్ కు గత ఏడాది కంచు పతకం లభించగా… ఈ ఏడాది ఏకంగా సిల్వర్ మెడల్ దక్కించుకోవడంతో అనంతపురం పోలీస్ అధికారులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు…

👉ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం*..*డీటీసీగా పని చేస్తూ రూ.200 కోట్ల అక్రమాస్తులు..*ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసు*…మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు*కిషన్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ*….*31 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు*

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న అధికారులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. కేసు నమోదు చేసి దాడులు నిర్వహించి ఆస్తుల చిట్టా బయటకు తీస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇళ్లు, కార్యాలయాలు సహా స్వగ్రామం నిజాంపేట మండలం బల్కంచల్క తండాలో దాడులు చేశారు. 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌లోని కిషన్‌ ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితుల సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు.

మొత్తం రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా. ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి. ఆ మధ్య నీటిపారుదలశాఖ ఇంజినీర్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినా, వాటన్నిటి కంటే కిషన్‌ ఆస్తిపాస్తులే అధికమని అంచనా.సోదాల సమయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయమే బోయిన్‌పల్లిలోని కిషన్‌ ఇంటి తలుపుతట్టారు. విశ్వసనీయ సమాచారంమేరకు. ఆ సమయంలో కిషన్‌ కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయారు. బయటికి వచ్చాక సోదాలు ప్రారంభించగా ఆస్తుల పత్రాలేవీ లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానమొచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్‌ సెల్‌ఫోన్‌లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది. సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని ఓ దుకాణానిది కావడంతో విచారించారు. కిషన్‌ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు. అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలు అప్పగించినట్లు విచారణలో తేలడంతో వాటిని తెప్పించి స్వాధీనం చేసుకున్నారు.

*మొదటి నుంచి అవినీతి ఆరోపణలే : 1994లో అసిస్టెంట్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో అడుగుపెట్టిన కిషన్‌పై మొదటి నుంచి అవినీతి ఆరోపణలున్నాయి. బోధన్‌లో మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అక్కడే మద్నూర్‌లో చెక్‌పోస్ట్‌ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్‌లోనూ ఎంవీఐగా పనిచేశారు. తాజా సోదాల్లో నిజామాబాద్‌లో అక్రమాస్తులు బహిర్గతం కావడంతో తొలినాళ్లలోనే వాటిని కూడబెట్టినట్లు బహిర్గతమైంది. ఆ తర్వాత మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవోగా కిషన్ పని చేశారు. ఏడాదిక్రితమే మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌గా వెళ్లారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడాబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.నిజామాబాద్‌లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50శాతం వాటా, 3వేల చదరపు గజాల విస్తీర్ణంలోని రాయల్‌ఓక్ ఫర్నిచర్‌షాప్‌లో ఓనర్‌షిప్, అశోకటౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయభూమి, 4వేల గజాల్లో పాలీహౌజ్, నిజామాబాద్‌ మున్సిపాలిటి పరిధిలో 10 ఎకరాల వాణిజ్య స్థలం ఉన్నట్లు నిర్ధారించారు. కిషన్‌ బ్యాంకు ఖాతాలో రూ. 1.37 కోట్లు, బ్యాంకు లాకర్లలో కిలోకు పైగా బంగారం, రెండు కార్లు ఉన్నట్లు తేల్చారు. కిషన్‌ కూడబెట్టిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.200 కోట్లపైగానే ఉంటుందని అంచనాకి వచ్చారు. సోదాల అనంతరం ఆయన్ను అరెస్టు చేసి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

*10 నెలల వ్యవధిలో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు : ప్రజల ప్రాణాలకు, రహదారి భద్రతకు అత్యంత కీలకమైన రవాణాశాఖలో యథేచ్ఛగా అవినీతి దందా సాగుతోంది. 10 నెలల వ్యవధిలో ఇద్దరు జిల్లా స్థాయి అధికారులపై ఏసీబీ కేసులు నమోదవడం అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది. డ్రైవింగ్‌ లైసెన్స్, బండి రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీ, వాహనం ఫిట్‌నెస్‌ ఇలా ఏ పనికావాలన్న రవాణాశాఖ కార్యాలయాల్లో అధికారిక ఛార్జీలతో పాటు అదనంగా ఇవ్వాల్సిందే. ప్రతి సేవకి, ఫైల్‌కి ఒక రేటు ఉంటుంది. ఆ మేరకు కోడ్‌ ఉంటుంది. అందులో ఏజెంట్‌ ఎవరు, వచ్చే లంచం ఎంతన్న వివరాలుంటాయి…కోడ్‌ ఉన్న దరఖాస్తులైతే నిమిషాల్లో పనైపోతుంది. ఏజెంట్‌ ద్వారా కాకుండా నేరుగా వెళ్తే సిబ్బంది కొర్రీలపై కొర్రీలు వేస్తూ రోజుల తరబడి తిప్పించుకుంటారు. ఈ అక్రమాల్లో జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్లు, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌లు కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లంచాలు డిమాండ్‌ చేసే ప్రభుత్వ అధికారులపై వాట్సప్‌ నెంబర్‌ 9440446106 కు ప్రజలు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.

👉తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులైన పెన్షనర్లను ఏరిపారేస్తుంది…!!*

పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి రాగా.. ప్రభుత్వం సోషల్ అడిట్ మరింత కఠినంగా చేయాలని ఆదేశించింది. ఈ ఆడిట్ లో *వేలాది పెన్షన్లు అనర్హులకు అందుతున్నట్టు తేల్చింది.* ప్రస్తుతం వీరందరికీ పెన్షన్లు కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే *ప్రభుత్వం ముందుగా పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాల్లో 20 వేల శాంపిల్స్ వడపోయగా..అందులో 2 వేళా మంది అనర్హులుగా తేలింది…😇* ధనవంతులు, 50 ఏళ్ళు నిండని వాళ్ళు, వైకల్యం లేకున్నా దివ్యాంగ పెన్షన్లు, చనిపోయినవాళ్లపై ఇతరులు అక్రమంగా ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. *త్వరలోనే ఈ ప్రాజెక్టుకు అన్ని జిల్లాలలకు విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.*

👉 పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని దళితుడి ఇల్లు కూల్చేసిన కాంగ్రెస్ నాయకుడు… సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నిల్చున్న తన తల్లికి ఓటు వేయలేదని, దళితుడు బేగరి రాములు ఇంటిని జేసీబీతో కూల్చివేసిన కాంగ్రెస్ నేత ప్రసాద్ రెడ్డి…పంచాయతీ నుండి అనుమతులు తీసుకున్నా, అన్ని పత్రాలు ఉన్నా కూడా అన్యాయంగా తాను కట్టుకుంటున్న ఇల్లును ప్రసాద్ రెడ్డి కూల్చేశాడని ఆవేదన వ్యక్తం చేసిన బేగరి రాములు…అధైర్య పడవద్దని బేగరి రాములుకు అన్ని విధాలుగా అండగా ఉండి, ఆదుకుంటామని హామీ ఇచ్చిన హరీష్ రావు … సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, కాంగ్రెస్ నేత ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరిన హరీష్ రావు

👉ప్రేమ పేరుతో యువకుడి దాడి… యువతిపై హింస..* నడిరోడ్డుపైనే యువతిని లాగుతూ దాడి చేసిన యువకుడు..నవీన్ కుమార్ అనే యువకుడి నుంచి యువతిపై దాడి, వేధింపులు..2024లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు–యువతి..

👉 రోడ్డుపైనే సర్జరీ చేసిన డాక్టర్లు.. నెటిజన్ల ప్రశంసలు

ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సర్జరీ చేశారు. కేరళలో జరిగిన ప్రమాదంలో లీనూ అనే వ్యక్తి గాయపడి శ్వాస ఆడక ఇబ్బంది పడ్డారు. అదే సమయంలో వచ్చిన డా. థామస్ పీటర్, దిదేయా థామస్, మనూప్ ఫ్లాష్తోట్ వెలుతురులో బ్లేడ్, స్ట్రాతో సర్జరీ చేసి ఆసుపత్రికి తరలించే వరకూ ప్రాణాలను నిలబెట్టారు. లినూ చికిత్స పొందుతూ మృతి చెందినప్పటికీ వైద్యులు చేసిన పనికి ప్రశంసలు దక్కుతున్నాయి.

👉 విలువలతో కూడిన జీవనమే ఏసుప్రభు సందేశం : ఎమ్మెల్యే జెసి అస్మిత రెడ్డి

విలువలతో కూడిన జీవనశైలి ఉండాలని ఏసుప్రభువు బోధించారని ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి తెలిపారు… ఆయన క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు… యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, త్యాగం, మానవత్వ విలువలు మనందరి జీవితాలకు మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతి కుటుంబం ఆనందంతో, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే తెలిపారు🎄✨

👉సైబర్ నేరాలలో చిక్కకుండా ఉండాలంటే అవగాహన, అప్రమత్తత అవసరం..* జిల్లా ఎస్పీ  పి.జగదీష్  ఆదేశాలతో స్థానిక కేశవ రెడ్డి స్కూల్ నందు అవగాహన సదస్సు నిర్వహించిన అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులు

* సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ,, మహిళా చట్టాలు, గంజాయి తదితర అంశాలపై అవగాహన చేసిన నాల్గవ పట్టణ సి.ఐ* విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, శక్తియాప్ ప్రయోజనాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను సరైన మార్గంలో ఉపయోగించకపోవడం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, గంజాయి వినియోగం వల్ల ఆరోగ్యానికి మరియు భవిష్యత్తుకు కలిగే నష్టాలు, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, మరియు పోక్సో చట్టాల ప్రాముఖ్యతను తెలియజేశారు.* అత్యవసర సేవల కోసం డయల్ 100/ 112 సేవలను వినియోగించే విధానాన్ని వివరించి, ఈ సదస్సుల ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

👉ఉద్యమ నేతపై పిడి చట్టం…సిపిఎం నాయకుడు అప్పలరాజు అరెస్ట్‌…ఉదయాన్నే ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు …అరెస్టు చేసి సెంట్రల్‌ జైలుకు తరలింపు… అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా నిరసనలు

ఎస్‌.రాయవరం (అనకాపల్లి) : ఆయన ప్రజా ఉద్యమ నేత. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరు బాట పట్టారు. ప్రజలను కదలించారు. ఈ క్రమంలో ఎన్నో సార్లు సర్కారు దమనకాండకు గురయ్యారు. లాఠీ దెబ్బలు…అరెస్ట్‌లకు ఏమాత్రం వెనుకంజవేయలేదు. అయితే, దీనినే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నేరంగా పరిగణించింది. ప్రాణాలు తీయడానికి వెనుకాడని గంజాయి గూండాల మీద, ప్రజలను భయోత్పాతానికి గురిచేసే రౌడీ షీటర్లమీద, ఆడపిల్లలను అమానుషంగా కబళించే మానవమృగాల మీద సైతం పెట్టని ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పిడి) చట్టాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం నాయకులు ఎం.అప్పలరాజుపై బనాయించింది. బుధవారం ఉదయాన్నే అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం ధర్మవరం గ్రామానికి భారీ సంఖ్యలో పోలీసులను పంపి ఆయన్ను అరెస్ట్‌ చేసింది. పెద్ద ఎత్తున మంచు కమ్ముకుని ఉండే ఉదయం ఏడు..ఏడన్నర గంటల ప్రాంతంలోనే పదుల సంఖ్యలో అప్పలరాజు ఇంటిని చుట్టుముట్టి, ఒక్కసారిగా లోనికి ప్రవేశించారు. ఊహించని ఈ పరిణామానికి షాక్‌కు గురైన ఆయన భార్య లక్ష్మి, తల్లి లచ్చమ్మ ‘ఇదేమన్యాయం’ అని ప్రశ్నిస్తుండగానే వారి చేతిలో కొన్ని కాగితాలుపెట్టి అక్కడినుండి తరలించారు. ఏం జరుగుతోందో, ఎలా జరుగుతోందో ఇరుగు పొరుగు వారికి కూడా తెలియకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. ఆయన్ను అక్కడి నుండి తరలించిన తరువాతే అప్పలరాజుపై పిడి చట్టం బనాయించి, తరలించిన విషయం స్థానికులకు తెలిసింది. ఇటీవల ముఖ్యమంత్రి లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరొచ్చినా అప్పలరాజును గృహ నిర్బంధం చేస్తున్నారు. చూసిన కొద్దిమంది గ్రామస్తులు ఇదీ అలాంటిదేననుకున్నారట. ఉదయాన్నే అప్పలరాజును అరెస్ట్‌ చేసిన పోలీసులు పలు సెక్షన్లు పెట్టి, పీడీ యాక్ట్‌ కింద అరెస్టు చేసి విశాఖలోని కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ డిటెన్షన్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ఈ ఏడాది ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌ 12 మధ్య మూడు నెలల కాలంలో అప్పలరాజు ఏడు పర్యాయాలు అరెస్టు అయినట్టు పేర్కొన్నారు. హత్యాయత్నం, అక్రమ సమూహం, అక్రమ ప్రవేశం వంటి కేసులు అతనిపై నమోదై ఉన్నట్టు తెలిపారు. ఆయనపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచి అంటే 2013 మేలో నమోదైన కేసు మొదలు తాజాగా రాజయ్యపేటలో బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమించిన కేసు వరకూ 19 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. 1986 సెక్షన్‌ 3 (1) (2) ఆర్‌/డబ్ల్యు 2 (జి) కింద చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు విడుదలయ్యే వరకూ అప్పలరాజును కేంద్ర కారాగారంలో ఉంచాలని ఆదేశించారు.

*సిపిఎం ఖండన…అప్పలరాజుపై ప్రభుత్వ, పోలీసు చర్యను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం ఓ ప్రకటనలో ఖండించారు. ఉమ్మడి విశాఖపట్నం, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న అప్పలరాజును చట్టవిరుద్ధంగా నిర్బంధించడం దారుణమని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయని పేర్కొన్నారు. అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్టును తక్షణం రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు అనకాపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో డిమాండ్‌ చేశారు. అప్పలరాజును విశాఖ కేంద్ర కారాగారం వద్ద లోకనాథం పరామర్శించారు. ఎస్‌.రాయవరం మండలం ధర్మవరంలో అప్పలరాజు కుటుంబ సభ్యులను బుధవారం రాత్రి సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణతో కలసి లోకనాథం పరామర్శించి ధైర్యం చెప్పారు.

*అనకాపల్లి జిల్లాలో నిరసనల వెల్లువ…అప్పలరాజుపై అక్రమంగా పీడీ యాక్టు పెట్టి అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. సిపిఎం ఆధ్వర్యంలో అనకాపల్లి బాటా సెంటర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎస్‌.రాయవరం మండలం అడ్డురోడ్డులోనూ, దేవరాపల్లి, కశింకోట మండల కేంద్రాల్లోనూ, నర్సీపట్నంలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

👉పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి లో శ్రీ ఆంజనేయ రెసిడెన్సి లాడ్జిపై పోలీస్ రైడ్.. ఐదు జంటలు ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలింపు.. లాడ్జి నిర్వాహకుడు ఆంజనేయులును అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..

👉 బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తున్న లేడీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ …చిక్కడపల్లిలో డ్రగ్ నెట్వర్క్ గుట్టురట్టు …ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుష్మిత …తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా…నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు …వీరి వద్దనుండి ఎండిఎంఏ, LSD బాటిల్స్, OG కుష్ స్వాధీనం …4 లక్షల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!