👉ఆటవిక పాలన చెల్లదు… జనసేన చీఫ్‌, డిప్యూటి సిఎం పవన్‌ కల్యాణ్‌.వివాదస్పద వ్యాఖ్యలు .. 👉 *గోవిందా.. 50 కిలోల బంగారం మాయం!* *తిరుమల కొండపైనే కాదు.. కొండ కిందా వైకాపా హయాంలో అక్రమాలు???…👉జగన్ ఉడత ఊపులకు.. ఎవరు భయపడతారు?.. రఘురామకృష్ణరాజు…👉 *రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ మోసం కేసు: ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నేతలపై కేసు నమోదు*…. 👉విజయోత్సవ ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుండి వెళ్ళిన సర్పంచ్ కారు.. చిన్నారి మృతి…👉క్రీడా ప్రాంగణం ధాన్యం కొనుగోలు కేంద్రానికి 25 గుంటల భూమిని విరాళంగా ఇచ్చిన సర్పంచ్ (జనగామ జిల్లా)…👉సాయం కోసం “వైసీపీ సోషల్ వారియర్స్” ఆర్తనాదాలు !

👉 *గోవిందా.. 50 కిలోల బంగారం మాయం!*
*తిరుమల కొండపైనే కాదు.. కొండ కిందా వైకాపా హయాంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక వైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా.. తాజాగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది.

👉 *రూ.20 కోట్ల బంగారం డిపాజిట్ మోసం కేసు: ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నేతలపై కేసు నమోదు*…హైదరాబాద్, ఉప్పల్:


ఉప్పల్ కేంద్రంగా పనిచేస్తున్న సిరి గోల్డ్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పెట్టుబడుల పేరుతో భారీ మోసం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ.20 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.
ఈ సంస్థలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసంపూడి రవీంద్ర, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావులతో పాటు సంస్థ యాజమాన్యంపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.పెట్టుబడి పెడితే రోజువారీ లాభాలు ఇస్తామని నమ్మించి వేలాది మంది నుండి నగదు, బంగారం రూపంలో పెట్టుబడులు సేకరించిన ప్రమోటర్లు, తర్వాత చెప్పిన విధంగా లాభాలు ఇవ్వకపోవడమే కాకుండా మూల పెట్టుబడులను కూడా తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు
BNS సెక్షన్ 316(2), 318(4)లతో పాటు
BNS సెక్షన్ 3(5) కింద కోసంపూడి రవీంద్ర, నెల్లూరు కోటేశ్వరరావు సహా సిరి గోల్డ్ మర్చంట్స్ సంస్థ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.
ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపగా, మోసానికి సంబంధించిన పూర్తి వివరాలపై సీసీఎస్ పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. పెట్టుబడిదారుల సంఖ్య, ఆస్తుల లావాదేవీలు, బంగారం నిల్వలు, బ్యాంకు ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.
ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా దేశ భక్తి రామ భక్తి చెప్పుకునే వారే ఇలాంటి అవినీతి కి పాల్పడడం పై ప్రజలు బహిరంగంగా ఖండిస్తున్నారు..
👉విజయోత్సవ ర్యాలీలో ఏడేళ్ల చిన్నారిపై నుండి వెళ్ళిన సర్పంచ్ కారు.. చిన్నారి మృతి…
వికారాబాద్ జిల్లా పోడూరు మండలం రాకంచర్ల గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ కమ్లిబాయ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి…పర్మిషన్ లేకున్నా డీజే ర్యాలీ.. ర్యాలీలో చిన్నారి కుర్వా సౌజన్య(7)పై నుండి వెళ్ళిన సర్పంచ్ కారు…
తీవ్ర గాయాలైన చిన్నారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి…
మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు..ఆసుపత్రి ముందు బాధిత కుటుంబసభ్యులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం..ఇరువర్గాలను సముదాయించి పంపించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు
👉బంజారాహిల్స్‌లో కోటి రూపాయల క్రిప్టో మోసం*.
క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.1 కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని మోసం చేసిన ఘటన బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్ సమీపంలో చోటుచేసుకుంది. అత్తాపూర్‌కు చెందిన ఓ వ్యక్తిని, తనకు పరిచయం ఉన్న స్నేహితుడి ద్వారా ఇన్వెస్ట్మెంట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించారు.
ఓ మిడియేటర్ ద్వారా తాజ్ డెక్కన్ హోటల్ వద్ద కలిసిన నిందితుడు లాభాలు ఇప్పిస్తామని చెప్పి, పార్కింగ్ స్థలం నుంచి నగదు రూ.1 కోటి తీసుకుని పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
👉జగన్ ఉడత ఊపులకు.. ఎవరు భయపడతారు?.. రఘురామకృష్ణరాజు..
AP: ‘జగన్ బెదిరిస్తే.. ఎవరు భయపడతారు. ? ఇలాంటి ఉడత ఊపులకు భయపడే రోజులు పోయాయి. వైద్య కళాశాలల పీపీపీ విధానం సూపర్ హిట్ అవుతుంది… లీజుకు తీసుకునే వాళ్లను అరెస్టు చేస్తామంటూ బెదిరిస్తే.. భయపడేవాళ్లు లేరు. ‘ అంటూ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
🌟🌟🌟ఆటవిక పాలన చెల్లదు… జనసేన చీఫ్‌, డిప్యూటి సిఎం పవన్‌ కల్యాణ్‌ పూనకాల లోడింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. పూనకం పూనితే తానేమిటో ..  అప్పుడప్పుడు తాను ఏమి మాట్లాడుతున్నానన్న విచక్షణ కోల్పోతుంటారు. అదే పరంపరలో శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనను ఈ రాష్ట్రంలో అమలు చేయాలన్న వివాదాస్పద వ్యాఖ్య చేశారు.  కొందరికి ‘యోగి’ ట్రీట్‌మెంటే కరెక్టని తీర్పునిచ్చారు. రౌడీలు, వారి వెనకున్న వారి డేటాను 48 గంటల్లో సేకరించి రాజకీయ నిర్ణయం తీసుకుంటే అంతే సంగతులని ప్రతిపక్ష వైసిపినుద్దేశించి బహిరంగంగా హెచ్చరించారు. ‘తాట తీస్తాం, రోమాలు తీసి కూర్చోబెడతాం, ఏ కీలుకు ఆ కీలు విరిచి మూలన కూర్చోబెడతాం, గీత దాటితే చేతుల్లో గీతలు తీసేస్తాం’ అంటూ యోగి రాజ్యాంగాన్ని ఒప్పజెప్పారు. బిజెపి సి.ఎం యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో యు.పి రాష్ట్రాన్ని అస్సలు క్రైమే జరగని, క్రిమినల్స్‌ లేని శాంతివనంగా అభివర్ణించాలన్న అభిలాష పవన్‌ మాటల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. ***కాగా మోడీ ప్రభుత్వం, అమిత్‌షా నిర్వహణలోని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదికలు దేశంలోనే అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రం యు.పి. అని ఘోషిస్తున్నాయి. 2023లో ఎనిమిది లక్షల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ. బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి. తాను పుస్తకాల పురుగునని వల్లించే పవన్‌ దృష్టికి ఈ కఠోర సత్యాలు రాకపోవడం విడ్డూరమే!
యోగి జమానాలో అరాచకాలకు యు.పి.అడ్డాగా తయారైందనడానికి రోజూ మీడియాలో రిపోర్టవుతున్న వార్తా కథనాలే నిదర్శనం. క్రిమినల్స్‌ ఏరివేత పేరిట విచ్చలవిడి బూటకపు ఎన్‌కౌంటర్లకు లెక్కేలేదు. ఆ రాష్ట్రంలో నడుస్తున్నది పోలీస్‌రాజ్‌ తప్ప అంబేద్కర్‌ రాజ్యాంగం ప్రబోధించిన ప్రజాస్వామ్య పాలన కాదు. మహిళలు, దళితులు, మైనార్టీలే లక్ష్యంగా రాజ్యహింసకు, ప్రైవేట్‌ గ్యాంగ్‌ల దాడులకు హద్దుపద్దు లేదు… కిడ్నాప్‌లు, గన్‌ కల్చర్‌, కుల, మత ఘర్షణలు, ఖాప్‌ పంచాయితీలలో దారుణ హింసాత్మక అమానవీయ శిక్షలు, ఆయుధాలతో వీధుల్లో మతోన్మాదుల స్వైర విహారం ఎక్కడ చూసినా కనిపిస్తాయి. గో రక్షణ పేరుతో గూండాల పాశవిక హత్యలు, మూక దాడులు చెప్పనలవికాదు. **విశాఖపట్నంలో టన్నుల కొద్ది గోమాంసాన్ని ఓ టిడిపి నాయకుడే రవాణా చేస్తూ పట్టుబడగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలు శూన్యము. కనీసం టిడిపి నాయకులలో ఎవరు కూడా ఇప్పటివరకు నోరెత్తకపోవడం,ఇక సనాతన ధర్మమంటూ హిందువులపై ఎవరో ఏదో చేస్తున్నారంటూ ప్రతి సభలో గింజుకునే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ కూడా కిమ్మనక పోవడం పై సర్వత్ర విమర్శలు నేను వస్తున్నాయి. ఇదే పని వైకాపా నాయకులలో ఎవరైనా చేసి ఉంటే టిడిపి వారు నానా హంగామా చేసి ఉండేవారు.

చివరికి వాలంటైన్స్‌ డే రోజున పార్క్‌లలో బలవంతంగా యువతీయువకులకు పెళ్లిళ్లు చేస్తున్న వైనాలనేకం. నేరస్తులుగా అభియోగాలు మోపబడ్డ మైనార్టీల నివాసాలను బుల్డోజర్లతో ప్రభుత్వమే కూల్చివేతలకు పాల్పడటం నిత్యకృత్యమైంది.***యోగి సర్కార్‌ ఈ దుర్మార్గ చర్యలను సాక్షాత్తూ సుప్రీంకోర్టు తప్పుబట్టాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది.***కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో నేరాలు పెరుగుతున్నాయని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందారు. ఆస్తి తగాదాల్లో, సివిల్‌ కేసుల్లో అధికారుల జోక్యం ఎక్కువగా ఉందని పవన్‌ అదే వేదికపై అసహనం వెలిబుచ్చారు. ఎ.పి లో గణనీయంగా నేరాలు జరుగుతున్నాయని ఎన్‌సిఆర్‌బి పేర్కొంది. మహిళలపై నేరాల్లో, ఎస్‌.సి, ఎస్‌.టి లపై అఘాయితాల్లో ఎ.పి పై స్థానాల్లోనే ఉంది. రాష్ట్రంలో నేరాలు పెరగడానికి ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా?.*** గంజాయి రహిత రాష్ట్రం చేస్తామని కూటమి ప్రతిజ్ఞ తీసుకోగా ఏ మూలన చూసినా గంజాయి వాసన గుప్పుమంటోందనడానికి ఈగల్‌ టీంలకు పట్టుబడుతున్న నిల్వలే సాక్ష్యం. ఎ.పి లో మహిళలు, ఆడ పిల్లలు 30 వేల మంది అదృశ్యమయ్యారని పవన్‌ ఆరోపించగా, అధికారంలో కొచ్చాక ఎంత మంది ఆచూకీ కనిపెట్టి కుటుంబాలకు అప్పగించారో తెలీదు. వందల కోట్ల రూపాయల ఆర్థిక నేరం చేశారన్న ఒక మాజీ ఎంపీపై సిబిఐ దర్యాప్తునకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ప్రస్తుతం కూటమిలోనే ఉన్న ఆ నేత వ్యవహారంపై పవన్‌ స్పందనేమిటో? శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచిన మన రాష్ట్రంలో యోగి ట్రీట్‌మెంట్‌కు ఎంతమాత్రం ఆస్కారం లేదు. ఇక్కడి ప్రజలు అటువంటి ఆటవిక పాలనను వ్యతిరేకిస్తారు. మత సామరస్యం కోరుకుంటారు. బిజెపిని, మోడీని స్తుతించే క్రమంలో వారి ప్రాపకం కోసం ఎ.పి లో యోగి ట్రీట్‌మెంట్‌ను పవన్‌ ముందుకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రజాస్వామ్య విలువలపై లౌకిక స్వభావం కలిగిన పార్టీగా చెప్పుకుంటున్న టిడిపి, ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌ ‘యోగి’ ట్రీట్‌మెంట్‌ వ్యాఖ్యలపై ఏమంటారో!… వేచి చూడాలి మరి…
👉సాయం కోసం “వైసీపీ సోషల్ వారియర్స్” ఆర్తనాదాలు !
వైసీపీ కార్యకర్తలు సాయం కోసం అల్లాడిపోతున్నారు. వైసీపీ కోసం విదేశాల్లోఉన్నా కెరీర్ ను నిర్లక్ష్యం చేసి మరీ పార్టీ కోసం పని చేస్తూ బ్రెయిన్ స్ట్రోక్ కు గురైతే కనీసం పార్టీ నుంచి పట్టించుకునేవారు లేకపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి వారు పెరిగిపోతున్నారు. కానీ పార్టీ నుంచి మాత్రం సాయం అందకపోవడంతో వారిని ఆందోళనకు గురి చేస్తోంది.సాయం కోసం కృష్ణారెడ్డి అనే కార్యకర్త కుటుంబం ఎదురుచూపు చదువు కోసమో.. ఉద్యోగం కోసమో అమెరికాకు వెళ్లిన కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త.. అక్కడి నుంచి సోషల్ మీడియా వారియర్ గా పని చేస్తూంటారు. కూటమి నేతలను ట్రోల్ చేయడం, అసభ్యంగా పోస్టులుపెట్టడం వంటివి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కామన్ కాబట్టి విదేశాల్లో ఉన్నా అవన్నీ చేస్తూంటాడు. అయితే హఠాత్తుగా అతను బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
*వెయ్యి డాలర్లు ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ…
డల్లాస్‌లో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు కృష్ణారెడ్డికి వైద్య సాయం కోసం వెయ్యి డాలర్లు ఇచ్చారు. ఆయన వ్యక్తిగతంగా సాయం చేశారు. కృష్ణారెడ్డి వైద్య ఖర్చుల భారం భారీగా ఉండటంతో, ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ‘GoFundMe’ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. రెండున్నర లక్షల డాలర్లు సాయంకావాలని కోరుతున్నారు. కొంత మంది స్పందిస్తున్నారు. కానీ పార్టీ పరమైన సాయం ఇంకా ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పార్టీ కోసం పనిచేసిన కృష్ణారెడ్డికి సహాయం చేయాలని ఆయన కుటుంబసభ్యులు ఎన్ఆర్ఐ వైసీపీ శ్రేణులు, అభిమానులను కోరుతున్నారు.
*పదుల సంఖ్యలో కృష్ణారెడ్డి లాంటి వారు !
అమెరికాలోనే కాదు.. ఏపీలోనూ వైసీపీ కార్యకర్తలు ఇలాంటి కష్టాల్లో పడితే పట్టించుకునేవారు లేకుండా పోయింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు శ్యామ్ కలకడ అనే సోషల్ మీడియా వారియర్ ను అలాగే వదిలేయడంతో ఆయన చనిపోయారు. ఇప్పుడు విపక్షంలో ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. చివరికి ఎవరికి వారు లోకేష్ సాయం కోరుతూ ట్వీట్లు పెట్టి కొంత మంది సాయం పొంది ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ వైసీపీ నుంచి మాత్రం ఎలాంటి మద్దతూ లభించడం లేదు. ఇది వారి క్యాడర్ ను బాధిస్తోంది.
👉ఏపీలో పలుచోట్ల ACB అధికారుల సోదాలు…
విజయనగరం, విశాఖ, ఎన్టీఆర్‌, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తనిఖీలు…
భోగాపురం సబ్ రిజిస్ట్రార్‌ రామకృష్ణ, సహ ఉద్యోగులు,..
మరో ప్రైవేట్‌ ఉద్యోగి నివాసాల్లో ACB అధికారుల తనిఖీలు…విశాఖలోని 4 ప్రాంతాల్లో ACB సోదాలు…
పెందుర్తి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు… ఎన్టీఆర్‌: ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ACB సోదాలు…సత్యసాయి: చిలమత్తూరులో ACB అధికారుల తనిఖీలు…అనంతపురం: చిలమత్తూరు సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
👉 బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ దూకుడు…
వేగంగా సాగుతున్న సెలబ్రిటీల విచారణ…మరి కాసేపట్లో సీఐడీ ముందు హాజరుకానున్న సెలబ్రిటీలు మంచు లక్ష్మి, భయ్యా సన్నీ యాదవ్, రీతు చౌదరి
👉విశాఖ:…రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగంలో అవినీతి తిమింగలాల భరతం పడుతున్న ఏసీబీ…
గత నెల రాష్ట్ర వ్యాప్తంగా సబ్జజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 4 క్రిమినల్ కేసులు నమోదు…ఈనేపథ్యంలో విశాఖలోని జగదాంబ సెంటర్, విజయనగరం జిల్లా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ల, కార్యాలయ సిబ్బందికి సంబంధించిన నివాసాల్లో ఏసీబీ సోదాలు… ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారని గుర్తించిన ఎసీబీ సోదాల్లో కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు స్వాధీనం
👉 జనగామ జిల్లా:-
దేవరుప్పుల మండలం పెద్దతండా లో బుధవారం నూతన సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన రాధ కోక్యనాయక్ అనంతరం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట మేరకు క్రీడా ప్రాంగణం ధాన్యం కొనుగోలు కేంద్రానికి 25 గుంటలు భూమిని విరాళంగా ఇచ్చారు. అట్టి స్థలాన్ని జెసిపి సహాయంతో చదును చేయించారు. తండాలో రోడ్డుపై నిలిచిన డ్రైనేజీ నీటి సమస్యను వారి దృష్టికి రాగా గ్రామ పంచాయతీ సిబ్బంది సాయంతో తొలగించారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!