👉జగన్ పై బిజెపి ఎటాక్ … కొత్త డ్రామా నా ???…👉హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గన్‌మెన్‌ ఆత్మహత్యాయత్నం..👉 ప్రభాకర్ రావును విచారిస్తున్న సజ్జనార్ సిట్…గ్రీన్ఫీల్డ్ హైవేను దూరం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు – మార్కాపురం ఎమ్మెల్యే కందుల..జిల్లా ఏర్పాటు G.O వచ్చే వరకు ప్రజా ఉద్యమం కొనసాగాల్సిందే: మార్కాపురం జిల్లా వెలుగొండ జలాల సాధన సమితి నాయకులు,న్యాయవాది చెన్ను శివప్రసాద రావు …👉 పొదిలి గిద్దలూరులలో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు*  

👉 ప్రభాకర్ రావును విచారిస్తున్న సజ్జనార్ సిట్…
తెలంగాణ… సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పుంచుకుంది. ఈ కేసు దర్యాప్తుకు ఏర్పాటైన హైదరాబాద్ సీపీ సజ్జనార్ సిట్ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తోంది. కేసు నమోదైన తర్వాత కీలక ఆధారాలైన హార్డ్ డిస్కులు, ఎలక్ట్రానిక్ డేటా, ఫోన్లు, ల్యాప్టాప్లు ఏం చేశారనే దానిపై ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయమే పీఎస్కు చేరుకున్న సిట్ అధికారులు వారం రోజులపాటు విచారించనున్నారు.
👉 హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ గన్‌మెన్‌ ఆత్మహత్యా యత్నం..!!!
హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో గన్‌మెన్‌ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు గన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
గన్‌మెన్‌ కృష్ణ చైతన్య ఇంట్లోనే తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే చైతన్యను ఆస్పత్రిలో చేర్చారు.ప్రస్తుతం  చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు చైతన్య ఇటీవలే ఓ బెట్టింగ్‌ యాప్‌లో భారీగా డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం. దాంతో ఏర్పడ్డ ఆర్థిక సమస్యలే ఈ అఘాయిత్యానికి కారణంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది?

👉జగన్ పై బిజెపి ఎటాక్ … కొత్త డ్రామా నా ???

ఏపీలో బీజేపీ రాజకీయ పాత్ర ఎంత… ఓట్ల సీట్ల వాటా ఎంత అన్నది ఒక చర్చ… దానిని పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో బీజేపీ అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తోంది అన్నది మాత్రం వాస్తవం… ఏపీలో బీజేపీ రాజకీయ పాత్ర ఎంత ఓట్ల సీట్ల వాటా ఎంత అన్నది ఒక చర్చ. దానిని పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో బీజేపీ అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తోంది అన్నది మాత్రం వాస్తవం. అది 2014 నుంచి కొనసాగుతోంది. బీజేపీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఏపీ రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. ఇక 2014లో టీడీపీ జనసేనతో బీజేపీకి పొత్తు ఉంది. అయినా 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీని పెద్దగా ఎటాక్ చేసింది లేదు, వైసీపీ సైతం బీజేపీని పల్లెత్తు మాట అన్నదీ లేదు. ఇది ఒక రాజకీయ చిత్రంగా సాగింది. అలా చూస్తే మూడు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నా కూడా బీజేపీదే కీ రోల్ అన్నది అర్ధం అవుతోంది అని చెబుతారు.*** వైసీపీ రాజ్యంలో :  2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ రాజ్యం ఏపీలో సాగింది. ఆ సమయంలో కూడా ఎంతో దోస్తులుగా ఈ రెండు పార్టీలు ఉన్నాయని ప్రచారం అయితే సాగింది. 2024లో కూటమితో కలిసి బీజేపీ తిరిగి పొత్తు పెట్టుకుని గెలిచించి. ఇపుడు ఏపీలో ఎన్ డీయే ఉంది, కేంద్రంలో ఎన్డీయే ఉంది. ఈ రెండు ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ గా కూడా చెప్పుకుంటున్నారు. అయినా సీన్ అయితే ఏపీలో పెద్దగా మారింది లేదని అంటున్నారు. ఏపీలో వైసీపీని టీడీపీ జనసేన ఎక్కువగా విమర్శిస్తూంటాయి. కానీ బీజేపీ నుంచి అయితే పెద్దగా విమర్శలు అయితే రావడం లేదని ఒక చర్చ అయితే ఉంది. ఈ క్రమంలో తాజాగా చూస్తే కనుక ఢిల్లీలో జరిగిన ఏపీ బీజేపీ ఎంపీల మీట్ లో సాక్షాత్తూ ప్రధాని మోడీ కూడా దిశా నిర్దేశం చేశారు అన్న మాట బయటకు వచ్చింది. ఏపీలో వైసీపీ మీద ఎటాక్ స్టార్ట్ చేయమని కోరారని కూడా చెప్పుకున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం తో పాటు బయట కూడా వైసీపీ మీద విమర్శలు చేయాలని సూచించారు అని కూడా చెప్పుకున్నారు. మరి ఈ ప్రచారం జరిగినా కూడా ఏపీ నుంచి అయితే ఏ బీజేపీ నేత కూడా వైసీపీ మీద విమర్శలు అయితే చేసింది లేదని అంటున్నారు.

*ఇక జగన్ మీద విమర్శలు చేయాలి అంటే నాడూ నేడూ బీజేపీలో ఒక ఒక్క ఫైర్ బ్రాండ్ లీడర్ గా సత్యకుమార్ యాదవ్ ని చెబుతారు. ఆయన పార్టీ నేతగా ఉన్నపుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు తీవ్రమైన విమర్శలు చేశారు. ఇపుడు చూస్తే ఆయన కూటమిలో మంత్రిగా ఉన్నారు. దాంతో ఇపుడు కూడా ఆయన పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ధాటీగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా చూస్తే కనుక ఆయన జగన్ కి బిగ్ సవాల్ నే చేశారు. మెడికల్ కాలేజీల ఇష్యూలో నన్ను ముందు అరెస్ట్ చేసి జైలులో వేయించగలవా జగన్ అంటూ చాలెంజ్ చేస్తూ మాట్లాడారు. పీపీపీ మోడల్ అన్నది చాలా మంచిది అంటూ కూడా ఆయన గట్టిగానే వాదించారు… వైసీపీ ఫేవర్స్ ఎవరూ లేరని : మరి బీజేపీలో అయితే ఆయన స్థాయిలో ఇతర నాయకులు ఎందుకు రెస్పాండ్ అవడం లేదు అన్నది చర్చగా ఉంది. అయితే ఏపీలో వైసీపీ ఫేవర్స్ ఎవరూ లేరని అంటున్నారు. కానీ ఎవరి ఆలోచనలు వారివని, అలాగే పదవులు రాని వారు కొందరు ఉంటే వచ్చినా సరైన ప్లేస్ మెంట్ లేదని ఆలోచించేవారు మరి కొందరు అని, ఇంకొందరు అయితే తమ పార్టీ ప్రభుత్వంలో జూనియర్ పార్టనర్ కదా తాము ఎందుకు అన్నింటికీ ముందుడి మాట్లాడాలన్న నిర్లిప్తత లో ఉంటున్నారు అని అంటున్నారు. మొత్తం మీద ఏపీ బీజేపీ నేతల ఈ వైఖరి కారణంగా బీజేపీకి వైసీపీకి మధ్యలో ఏదో ఉందన్న ప్రచారానికి మాత్రం బలం చేకూరుతోంది అని అంటున్నారు.

👉 గత పాలకులు మార్కాపురం నియోజకవర్గానికి గ్రీన్ఫీల్డ్ హైవేను దూరం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు- మార్కాపురం ఎమ్మెల్యే కందుల ..

మార్కాపురం  ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి   మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఆదివారం రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయవిధానాల్లో పెరటితోటలపెంపకంపై సంబంధిత అధికారులతో ముందుగాప్రసంగించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలోఐదేళ్ల  జగన్మోహన్రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్నివిధాల దివాలా తీసిందన్నారు. ప్రస్తుతంరాష్ట్రానికివస్తున్న  పరిశ్రమల యజమానులను రాష్ట్రానికి రానివ్వకుండా మోకాలడ్డు పెడుతున్నారన్నారు.గతప్రభుత్వహయాంలో జిల్లాల విభజన జరిగిందన్నారు. అన్ని విధాల అభివృద్ధిలో వెనుకబడినపశ్చిమప్రాంతమైన మార్కాపురం జిల్లాగా ప్రకటించడంలోవివక్షత చూపించారన్నారు. అప్పట్లో మేము ప్రతిపక్షంలోఉండి అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలనుకలుపుకొని జిల్లాసాధన కోసం సుమారు 63రోజులపాటు రిలేనిరాహారదీక్షలు చేయడం జరిగిందన్నారు.ఆసమయాలలోపోలీసులతోమమ్ములనుదీక్షలుచేయకుండా లాటిలను ఉపయోగించి మా పై అక్రమ కేసులుబనాయించి పోలీస్స్టేషన్లో బంధించడంజరిగిందన్నారు. అన్ని గ్రామాల్లోనిప్రజలు బాగా ఆలోచించి ఏ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏ ప్రభుత్వం ఉపయోగపడటం లేదన్నది గమనించాలన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానాన్ని చూసి వైకాపా వాళ్లు జీర్ణించుకోలేక కోటిసంతకాల సేకరణ అనే నినాదంతో మెడికల్ కాలేజీలపై గ్రామగ్రామాన తప్పట్లతో మేళ తాళాలతో ఊరేగుతున్నారన్నారు. అలాంటి వారికి మీరేతగిన బుద్ధి చెప్పాలని కోరారు. కూటం ప్రభుత్వం పై మీ  ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉన్నట్లయితే రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం రైతు సోదరులందరూ రసాయనక ఎరువులు ఎక్కువగా వాడటం మూలాన భూమితోపాటు, మన ఆరోగ్యాలు కూడాచెడిపోయి అనారోగ్యానికి గురవుతున్నారు. పూర్వం వ్యవసాయదారులు ఎలా పంటలకు ప్రకృతి విలువలతో కూడినఎరువులనుఉపయోగిస్తున్నారో వాటిని వాడి ఆదాయంతో పాటుమనఆరోగ్యాలుకాపాడుకోవాలి అన్నారు. సీజనల్గా పండించే పంటలకు గిట్టుబాటు ధరలుకలిగే విధంగాప్రభుత్వంకలిగిస్తుందిఅన్నారు. సంబంధిత అధికారులను రైతులు పండించే పంటలపై వారి సలహాల ప్రకారం ఎరువులను ఉపయోగించి లాభసాటిగా మారాలన్నారు. రైతు డీలా పడినట్లు అయితే దేశమే అన్నివిధాల నష్టపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందిస్తారన్నారు, ప్రతి రైతుడిమాండ్ తో కూడిన పంటలను సాగుచేసుకోవాలన్నారు,వ్యవసాయ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అగ్రిటెక్లాంటి పరిస్థితి కల్పించిందన్నారు. రైతులు బాగుపడాలంటే ఫుడ్ ప్రాసెసింగ్లాంటివిధానాలను అలవర్చుకోవాలని రాష్ట్రప్రభుత్వం 13వేల కోట్ల రూపాయలతో 38 ఫుడ్ప్రాసెసింగ్పరిశ్రమలనుఏర్పాటు చేసిందన్నారు.ఈపరిశ్రమలను 175 నియోజకవర్గాలలో ప్రవేశపెట్టినట్లు  తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తుంది అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను సంబంధిత అధికారులతోనమోదు చేయించుకుని కరువుకాటకాలకు సంబంధించినప్పుడు కేంద్రప్రభుత్వం నుండి పసలు బీమా లాంటి పథకాల ద్వారా రైతులు ఆర్థికంగా నిలుదొక్కుంటారన్నారు. రాష్ట్రప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో, సూపర్ హిట్ అయింది అన్నారు. 20లక్షలఉద్యోగాలుకల్పించేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అన్నారు. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లి ఏ ప్రభుత్వం మంచిదో మీరే బేరీజు చేసుకోవాలన్నారు. ప్రజా తీర్పుకు మించిన తీర్పు మరొకటి లేదన్నారు. అనంతరం పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాలవాంఛ అయిన మార్కాపురం ను జిల్లాగా ప్రకటించిన  ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు  చిత్ర పటానికిగ్రామమహిళలు, టిడిపి నాయకులు ఘనంగా క్షీరాభిషేకం చేశారు.

👉*ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు*

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గిద్దలూరు మాజీ శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు పొదిలి పట్టటణంం లో  జన్మదిన శుభాకాంక్షలు తెలియపారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి జగనన్న కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొని జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

👉 మాజీ ముఖ్యమంత్రి,  వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గిద్దలూరు పట్టణంలోని నరవ రోడ్డు లో గల భాస్కర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఇంచార్జ్ కె.పి.నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి ,ఎంపీపీలు కడప లక్ష్మీ వంశీధర్ రెడ్డి ,షేక్ కాశీం బీ ,మేడురి వెంకట్ రావు ,వేగినాటి ఓసుర రెడ్డి ,జెడ్పీటీసీలు పగడాల శ్రీరంగం,బండ్లమూడి వెంకట రాజయ్య ,మండల కన్వీనర్లు ఏరువ రంగా రెడ్డి ,మానం బాలి రెడ్డి,గొంగటి చెన్నారెడ్డి ,మేరీగ. రవికుమార్ ,యాలం మురళి కృష్ణ ,బత్తెం ఓబుల్ రావు ,రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు బొర్రా కృష్ణ రెడ్డి ,అబ్దుల్ గఫార్ ఘోరీ ,కడప వంశీధర్ రెడ్డి,వేమిరెడ్డి రామచంద్ర రెడ్డి,చేరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ,సూరా స్వామి రంగా రెడ్డి ,జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు పల్లెబోయిన వెంకట రాజు,ఇసుకల ఓబయ్య,సీనియర్ నాయకులు నాగేళ్ల వెంగయ్య చౌదరి,బాదం గోపాల్ ,భూమా నరసింహ రెడ్డి,ఎదురు శ్రీనివాస రెడ్డి,నగర పంచాయతీ కౌన్సిలర్లు ఖాతా నరసింహ రెడ్డి,వినుకొండ మరియమ్మ ,పోలేపల్లి శివ మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై 53 కేజీల కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

👉అర్ధవీడు మండల కాకర్ల డ్యాం వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ జగనన్న జన్మ దిన సందర్భంగా వేడుకలు* …ఈ కార్యక్రమానికి హాజరైన అర్ధవీడు మండల వైఎస్ఆర్సీపీ పబ్లిక్ వింగ్ అధ్యక్షులు నారు ఆదినారాయణ రెడ్డి, కాకర్ల గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నాగిరెడ్డి పాండు రంగారెడ్డి, కాపు నాయకులు కొప్పుల గోపీ గారు కాకర్ల ఎంపిటిసి పెరికె గౌరీ మరియు కార్యకర్తలు అభిమానులు*

👉మార్కాపురం జిల్లా – పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల హక్కు …. ** జిల్లా ఏర్పాటు G.O వచ్చే వరకు ప్రజా ఉద్యమం కొనసాగాల్సిందే… ** కరవు-కాటకాలు, ఉపాధి వలసలకు నిలయంగా ఉన్న డివిజన్ ప్రాంతాలు..** జిల్లా సాధనకు ఈ అవకాశం పోతే మళ్ళీ ఎప్పుడో…??** కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఐక్యతతో జిల్లా సాధనకు ముందుకు రావాలి…** త్వరలో మంత్రివర్గ సమావేశం ముందుకు జిల్లా ప్రతిపాదన….?? …మార్కాపురం జిల్లా వెలుగొండ జలాల సాధన సమితి నాయకులు,న్యాయవాది చెన్ను శివప్రసాద రావు

అమరావతి : రాష్ట్రంలో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ప్రక్రియ తుదిదశ లో ఉంది. మార్కాపురం జిల్లా ఏర్పాటు డిమాండ్ ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల్లో ఉంది.

1971లో కర్నూల్ జిల్లా నుంచి మార్కాపురం డివిజన్ ను వేరుచేసి నప్పుడే ఈ డివిజన్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి ఉండాల్సింది, కానీ జరగలేదు. ఇప్పుడయినా మార్కాపురం డివిజన్ ను జిల్లాగా ఏర్పాటు చేసి డివిజన్ లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా తెలుగుదేశం-జనసేన – బీజేపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి….కర్నూలు జిల్లాలో వున్నప్పుడు, ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ లోని అనేక ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు సుమారు 120 నుంచి 170 కి. మీ. దూరంలో వున్నాయి. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి, పాలనా అవసరాలకు దూర మయ్యారు… *రాష్ట్రంలోనే వివిధ రంగాల్లో వెనుకబడ్డ మార్కాపురం ప్రాంతం కరవు, ఉపాధి వలసలకు పేరు గాంచింది.  కావున, ఈ ప్రాంతం అభివృద్ధికి నూతన జిల్లా ఏర్పాటు అత్యంత అవసరం. ఉన్నత విద్య, మెరుగైన వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విస్తరణ నూతన జిల్లా ఏర్పాటుతోనే సాధ్యం….*త్వరలో మంత్రి వర్గ సమావేశం లో జిల్లా ప్రతిపాదన పై చర్చ :  త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో నూతన జిల్లా ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి తిరిగి అభ్యంతరాలు స్వీకరించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని సమాచారం.  దేశంలో జనగణన నేపథ్యంలో వచ్చే డిసెంబరు 31వ తేదీ లోగా నూతన జిల్లాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.  కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్, మండలాల ఏర్పాటు, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పుపై ప్రభుత్వం 7 గురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జిల్లాల వారీగా వివిధ వర్గాలు, ప్రజా సంఘాల నుంచి కలెక్టర్లు వినతులు స్వీకరించారు.ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధుల నుంచి మంత్రులకు కూడా నేరుగా అర్జీలు అందాయి. మొత్తంగా సుమారు 200 వరకు అర్జీలు ఉపసంఘానికి అందాయని తెలుస్తోంది….మార్కాపురం జిల్లా ఏర్పాటు చంద్రబాబు నాయుడు హామీ :  అధికారంలోకి వస్తే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికల సభలో, ఆ తర్వాత హామీ ఇచ్చారు. జిల్లా ఏర్పాటు కోసం అనేక దశాబ్దాల నుంచి ప్రజల్లో ఉన్న డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటామని ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు… ఈ నేపథ్యంలో నూతన జిల్లా ఏర్పాటు జీవో విడుదల అయ్యే వరకు ప్రజా ఉద్యమం కోనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!