👉 👉సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా..*
ఆర్బీఐ బోర్డు మీటింగ్ కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆర్బీఐ గవర్నర్..రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలను ప్రశంసించిన సంజయ్ మల్హోత్రా..
👉ఉత్తరాంధ్రలో రాజకీయ నాయకులు ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు..బాధాకరమైన విషయం ఏంటంటే అధికారులు వాళ్లపై చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు…విశాఖపట్నంలో ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

👉జగన్ పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా సంస్థలపై పిల్ వేసిందని, తాజాగా రహేజా ఐటీ పార్కుపైనా పిల్ దాఖలు చేసిందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులతో లక్షకు పైగా ఉద్యోగాలు వస్తాయని, పెట్టుబడులు అడ్డుకోవడం సబబా? అని ప్రశ్నించారు.
👉ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు వేగం పెంచిన ప్రభుత్వం … సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ టీమ్*
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అతి కీలకమైన చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తున్నప్పటికీ, కేసు చుట్టూ పెరుగుతున్న ఆరోపణలు, రాజకీయ వాదనలు, భిన్న కోణాలు నేపథ్యంలో ప్రభుత్వం మరో ప్రత్యేక దర్యాప్తు వ్యవస్థను ముందుకు తెచ్చింది. హైదరాబాదు పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను కొత్త విచారణ బృందానికి నేతృత్వంగా నియమిస్తూ, డీజీపీ శివధర్ రెడ్డి గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తు వేగాన్ని పెంచడం, కేసులో బయటపడుతున్న అంశాలను పలు కోణాల్లో సమగ్రంగా పరిశీలించడానికి సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చారు. ఈ బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్.ఎం. విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ కె. నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏడీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి (దర్యాప్తు అధికారి), నాగేందర్‌రావు (హెచ్‌ఎంఆర్‌ఎల్), సీహెచ్ శ్రీధర్ (టీజీ న్యాబ్)ను నియమించారు. వీరికి కేసు వివిధ భాగాలతో సంబంధం ఉన్న అంశాలపై ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు…ఈ కొత్త ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటుతో, దర్యాప్తు దిశ మరింత స్పష్టంగా మారనుందని భావిస్తున్నారు. ప్రభుత్వం స్పష్టంగా ఒక డెడ్‌లైన్ కూడా విధించింది. కేసు దర్యాప్తు ఒక నెలలో పూర్తి చేయాలి. ఈ వ్యవధిలో ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరివి, యంత్రాంగం ఎలా పనిచేసింది, ఆ ఆదేశాలు అమలకు ఎవరు ముందు వరుసలో ఉన్నారు,రాజకీయ ఆరోపణలకు తగిన ఆధారాలున్నాయా అనే అంశాలను స్పష్టంగా తేల్చాల్సి ఉంటుంది…ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, అధికార పక్షం వాటిని తిరస్కరిస్తోంది.ఈ పరిస్థితుల్లో విచారణను నిష్పక్ష పాతంగా, వేగవంతంగా, ఆధారాలతో ముగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన విధానాన్ని అవలంభించింది.ఈ దర్యాప్తు ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశముండటంతో, అందరి చూపు ఇప్పుడు సజ్జనార్ బృందం పనితీరుపై నిలిచింది.
👉పిల్లల చదువులపై ఎన్నికల ప్రభావం**టీచర్లకు స్కూల్ డ్యూటీనా? ఎన్నికల విధులా?**విద్యాసంస్థలకు అడ్డంకిగా మారుతున్న ఎన్నికలు*విద్యాభివృద్ధికి పలుఆటంకాలు*పంచాయతీ పోరు ఎలా ఉన్నా, ఉపాధ్యాయులకు మాత్రం అది శాపంగానే మారుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు విధులు కేటాయించడంతో విద్యార్థుల చదువులపై ప్రభావం పడుతోంది. ఎస్జిటీ, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను వారి స్కేల్ ఆధారంగా ఆర్వో, ఏఆర్వో, పీవో, వోపీవో విధులను కేటాయించారు. రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు విడతల పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. దీంతో పంచాయతీ పోరు పూర్తిగా ముగిసిపోనుంది. పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ చివరి నాటికి సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేయాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రివిజన్ తరగతులు నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.*
*బోధనేతర విధులతో ఇబ్బందులు*
*ఎన్నికల విధులు కేటాయించిన ఉపాధ్యాయులు 20 రోజులుగా బోధనకు దూరంగా ఉంటున్నారు. ఒక్కో పాఠశాల నుంచి విడతల వారీగా సగం మంది ఉపాధ్యా యులకు ఎన్నికల విధులు కేటాయించారు. ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు బోధనేతర విధులు యూడైస్ ప్లస్, ఎఫ్ ఆర్ ఎస్(ముఖ గుర్తింపు హాజరు), ఎన్హెచ్వీఆర్ (స్వచ్ ఏవం హరిత్ విద్యాల) రేటింగ్, ఎఫ్ఎ-2 మార్కుల నమోదు, సాంస్కృతిక, జాతీయ దినోత్సవాలు నిర్వహణతో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.*
*విధుల కేటాయింపులో గందరగోళం..*తెలంగాణలో జిల్లాల్లో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 7,766 మందిని ఎంపిక చేశారు. అందులో స్టేజ్-1 ఆర్వోలు 119 మంది, స్టేజ్-2 ఆర్వోలు 382 మంది, 3,305 మంది పీవోలు, 3,960 మంది వోపీవోలు, 24 మంది సూక్ష్మపరిశీలకులను నియమించారు.*
*ఉపాధ్యాయులకు ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించారు.*
*అయితే కొందరికి ఒకే విడత, మరికొందరికి మూడు విడతల్లోనూ విధులు కేటాయించడంపై ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. మూడు విడతలు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు మొత్తానికి పాఠ్యాంశాల బోధనకు దూరం అవుతున్నారు. దీంతో ఒక్కో ఉపాధ్యాయుడు రెండు, మూడు తరగతులను నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల విధులకు వెళ్తున్న ఉపాధ్యాయులు అలా ఇబ్బందులు పడితే, స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు.*
👉దారుణం..వెలుగులోకి వచ్చిన న్యూస్…. గర్భం దాల్చిన 8వ తరగతి బాలిక*
కడప (D), పులివెందుల (M) వేంపల్లిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చిన ఘటన కలకలం రేపింది.కుటుంబ సభ్యులు గర్భం దాల్చిన విషయాన్ని గోప్యంగా ఉంచగా, గురువారం పురిటి నొప్పులు రావడంతో ఇంటి వద్దే ప్రసవానికి ప్రయత్నించారు.పరిస్థితి విషమించడంతో బాలికను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
👉విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి.. నిర్లక్ష్య ప్రియాంక ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి…ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్..
విద్యార్థినిని సాటి విద్యార్థి వేధింపులకు గురిచేయడం పై విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ, యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని మేము బలీయంగా విశ్వసిస్తున్నామన్నారు. ఈ నిర్లక్ష్య పూరిత వైఖరి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఘటన జరిగిన ప్రియాంక ప్రైవేటు పాఠశాలను సందర్శించి విచారణ జరపకపోవడం, విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించకపోవడం ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులు తమ అసమర్థత, నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారు. ఈ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పలుమార్లు జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి జిల్లాలో విద్యార్థులలో నెలకొన్న భయానక పరిస్థితులపై, విద్యార్థులకు భరోసా మరియు మనోధైర్యం నింపేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించినప్పటికీ పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారుల వైఫల్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము.
👉రేవంత్ కూల్ పాలిటిక్స్ – కేటీఆర్ ఫ్రస్ట్రేషన్*
రాజకీయాలు అంటే మైండ్ గేమ్. ఎవరు ఎక్కువగా మైండ్ గేమ్ ఆడతారో వారిదే ఎక్కువగా పైచేయి అవుతుంది. ఈ మైండ్ గేమ్ ను అర్థం చేసుకోలేక ఫ్రస్ట్రేషన్ కు గురైతే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. విజయాలతో కూల్ గా ఉన్న రేవంత్.. మైండ్ గేమ్ గట్టిగా ఆడుతున్నారు. దీన్ని కేటీఆర్, హరీష్ రావు తట్టుకోలేక పోతున్నారు. ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఈ పరిస్థితి ని కాంగ్రెస్ మరింత అనుకూలంగా మల్చుకుంటోంది
**బీఆర్ఎస్‌లో మరిన్ని సమస్యలు సృష్టించేలా రేవంత్ వ్యాఖ్యలు…తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించడానికి ప్రెస్మీట్ పెట్టారు. మెజార్టీ సీట్లు సాధించారు కాబట్టి ఆయన చాలా కూల్ గా మాట్లాడారు. రాజకీయంగా బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయాలో అలాంటివి చేశారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ ఒక్క ఎన్నికలోనూ గెలవలేదని అన్నారు. అదే సమయంలో హరీష్ రావు పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. వెంటనే హరీష్ రావు కంగారుగా స్పందించారు. కేటీఆర్‌కు తనకు మధ్య మిత్రభేదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎప్పటికీ తన గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా ఉంటాయని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తున్నారు. హరీష్ పై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో హరీష్ ఒత్తిడికి గురవుతున్నారు.
*ఫ్రస్ట్రేషన్ కు గురై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్…పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పుకుంటున్న బీఆర్ఎస్‌లో ఏ మూల కూడా ఆ జోష్ కనిపించడం లేదు. కేటీఆర్ పదే పదే ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు . కేసీఆర్ కంటే పెద్ద వయసు ఉన్న పోచారంను పట్టుకుని చనిపోవడమే మేలని వ్యాఖ్యానించారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపైనా అదే విధంగా నోరు పారేసుకుంటున్నారు. బీఆర్ఎస్ వైపు నుంచి అంతా క్లీన్ గా ఉండి అలా మాట్లాడినా ఓ అర్తం ఉంటుంది కానీ.. పదేళ్ల పాటు ఏ పార్టీని వదలకుండా.. చివరికి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన అలా మాట్లాడటం మాత్రం అభ్యంతరకరంగానే ఉంటుంది. పంచాయతీలు గెలిచామని కాంగ్రెస్ కు ప్రజలు షాకిచ్చారని ప్రచారం చేస్తున్నప్పుడు దానికి తగ్గ రాజకీయాలు చేయాలి. కానీ రేవంత్ రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు.
🌟రేవంత్ ను ఎదుర్కోవాలంటే కేసీఆర్ రావాల్సిందేనా?
ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ తంటాలు పడుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సిరిసిల్లలో ఆయన మెజార్టీ పంచాయతీలను కోల్పోయారు. కానీ హరీష్ రావు మాత్రం మెజార్టీ పంచాయతీలను సిద్ధిపేటలో గెల్చారు. గజ్వేల్ లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు కేసీఆర్ రావాల్సిందేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. 21వ తేదీన పార్టీ ఎల్పీ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం తర్వాత కేసీఆర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారా మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోతారా అన్నది క్లారిటీ వస్తుంది. కేడర్ మాత్రం కేసీఆర్ రావాలని.. అప్పుడే రేవంత్ కు కౌంటర్ ఇవ్వగలుగుతామని అనుకుంటున్నారు.

