👉 నాడు అలా నేడు ఇలానా… సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు… అంబటి రాంబాబు..జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టం ప్రవేశ పెడితే ఇది అన్యాయం, అక్రమం అని మేం అధికారంలోకి వస్తే ఈ సిస్టంను 100 రోజుల్లో తీసివేస్తామని, సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేస్తామని ప్రగల్భాలు పలికాడు చంద్రబాబు… 18 నెలలు గడిచినా ఆ పని చేయకపోగా మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు.
👉 తమిళనాడులో బీజేపీ పాచిక పారేనా … బీజేపీకి తమిళనాడు గేట్లు క్లోజేనా ?
తమిళనాడులో బీజేపీ అధికారం అన్నది నెవర్ అని డీఎంకే అంటోంది. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే చాలా సీరియస్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ విస్తరణ అన్నది మోడీ అమిత్ షా కొంత వరకూ చేయగలిగారు కానీ పూర్తి స్థాయిలో మాత్రం అది సాగడం లేదు, మెల్లగా కర్ణాటకలో పాగా వేసారు. 2018 నుంచి 2023 వరకూ అధికారంలో ఉన్నారు. అయితే మరో రాష్ట్రంలో అధికారం అందుకునే దరి దాపులలో కూడా బీజేపీ ఈ రోజున లేకపోవడమే కమల విలాపం అని అంటున్నారు. తెలంగాణాలో 2028 మిషన్ అని పెట్టుకున్నా ఇపుడు అక్కడ కూడా ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే పొత్తు పార్టీగానే ఉంటోంది. తమిళనాడులో ఎలా : ఇక తమిళనాడు అంటేనే ఎన్నో సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలకు అలాగే మఠాలకు పీఠాలకు ఆలవాలంగా ఉంటుంది బీజేపీ హిందూత్వ కార్డు మాత్రం అక్కడ ఎందుకో వర్కౌట్ కావడం లేదు. అన్నా డీఎంకేతో మైత్రీబంధం కొన్ని సీట్లను తెచ్చుకునేలా చేస్తోంది కానీ అధికారంలో భాగం అయ్యేలా కూడా దారి చూపించడం లేదు. ఈ నేపధ్యంలో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సంకీర్ణ ప్రభుత్వంలో చేరి తన బలాన్ని పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. అందుకే అన్నా డీఎంకేతో కలసి పొత్తులతో ముందుకు సాగుతోంది. అయితే మధ్యలో కొత్తగా విజయ్ టీవీకే పార్టీ వచ్చింది. ఇక అధికార డీఎంకే సైతం బలంగానే ఉంది. దాంతో ఈ ట్రయాంగిల్ ఫైట్ లో అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఎలా నెగ్గుకుని వస్తుందన్నదే చర్చగా ఉంది.
నెవర్ అంటున్న డీఎంకే : తమిళనాడులో బీజేపీ అధికారం అన్నది నెవర్ అని డీఎంకే అంటోంది. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే చాలా సీరియస్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీకి తమిళనాడులో ఏ మాత్రం చోటు లేదని తేల్చేశారు. ఎక్కడైనా మీకు ఓకే ఏమో కానీ తమిళనాడులో మాత్రం అసలు కుదరదు అంటూ గేట్లు క్లోజ్ చేశారు ఆయన ఇంతలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం అమిత్ షా చేసిన ప్రకటన అని అంటున్నారు. ఇక తమ తరువాత టార్గెట్ తమిళనాడు అని అమిత్ షా తాజాగా చేసిన ప్రకటనకు అంతే స్ట్రాంగ్ గా స్టాలిన్ రిప్లై ఇచ్చారు అన్న మాట. రాజకీయ సన్నివేశం : ఇక తమిళనాడులో చూస్తే విజయ్ పార్టీ టీవీకేకి జనాదరణ ఉంది. అయితే అది గెలిచే స్థాయిలో లేదు, అలాగే అన్నాడీఎంకేకి క్యాడర్ బేస్ ఉంది కానీ ఇమేజ్ ఉన్న నాయకులు లేరన్న లోటు ఉంది. బీజేపీకి చూస్తే క్యాడర్ కూడా పెద్దగా లేదు, లీడర్లు ఉన్నా అంత దూకుడు ప్రదర్శించే వారు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2026 మేలో కనుక అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అధికార డీఎంకే యాంటీ ఓట్లు చీలి మరోసారి స్టాలిన్ సీఎం అయ్యే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషణలు అయితే ఉన్నాయి. ఇక రెండవ అతి పెద్ద పొలిటికల్ ఫోర్స్ గా విజయ్ టీవీకే పార్టీ ఆవిర్భవించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు అయితే బీజేపీ ఆశలు చూస్తే విజయ్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కకుండా ఉన్న నేపథ్యంలో తమ కూటమి మద్దతుతో ప్రభుత్వం వచ్చే చాన్స్ ఉందేమో అన్నట్లుగా చూస్తున్నారని అంటున్నారు.
అయితే బీజేపీ ఆశలు చూస్తే విజయ్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నా ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ దక్కకుండా ఉన్న నేపథ్యంలో తమ కూటమి మద్దతుతో ప్రభుత్వం వచ్చే చాన్స్ ఉందేమో అన్నట్లుగా చూస్తున్నారని అంటున్నారు.
స్టాలిన్ ధీమా : ఇకపోతే సీఎం స్టాలిన్ ధీమా కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఎన్నో ఎన్నికలకు ఆయన చూసి ఉన్నారు. ఈసారి డీఎంకే మీద ఉన్న వ్యతిరేకత ఏదైనా చీలిపోతుంది. పైగా తమ ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత అయితే లేదని ఆయన భావిస్తున్నారు. అన్నా డీఎంకే 2021 కంటే కూడా ఇపుడు ఇంకా బలహీనపడిందని ఊహిస్తున్నారు. బీజేపీకి పెద్దగా బలం లేదని ఆ పార్టీతో జతకట్టి అన్నా డీఎంకే ఇంకా వీక్ అయిందని కూడా లెక్క వేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ కొత్త పార్టీతోనే పోరు ఉంటుందని డీఎంకే భావిస్తోంది అయితే విజయ్ పార్టీకి సంస్థాగతంగా బలం పెద్దగా లేదు, దాంతో టీవీకే ఇబ్బందులు దానికి ఉన్నాయి ఇవన్నీ వెరసి తమకు కంఫర్టబుల్ మెజారిటీతో మరోసారి జనాలు పట్టం కడతారని స్టాలిన్ లెక్క వేసుకుంటున్నారు. అందుకే బీజేపీని తమిళనాడులోకి రానీయమని సవాల్ చేస్తున్నారు.
👉ఒకేసారి ఏడు బస్సులకు మంటలు.. మృతులు, క్షతగాత్రుల వివరాలివే!… ఈ సమయంలో సహాయక చర్యలు దాదాపు పూర్తయ్యాయని చెప్పిన శ్లోక్ కుమార్.. ఇప్పటివరకూ నలుగురు మరణించినట్లు నిర్ధారించబడిందని వెల్లడించారు.
ఇటీవల హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు వద్ద ఘోర అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఒకేసారి ఏడు బస్సులు, మూడు కార్లు ఢీకొన్న ఘటన యమునా ఎక్స్ ప్రెస్ వే పై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం నలుగురు మృతి చెందగా, 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అవును… యూపీలోని మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. మధుర జిల్లాలోని బాల్డియో పోలీస్ స్టేషన్ పరిధిలోని మైల్ స్టోన్ 127 సమీపంలోని యమునా ఎక్స్ ప్రెస్ వే లోని ఆగ్రా-నొయిడా స్ట్రెచ్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత నాలుగు బస్సులకు మంటలు అందుకోవడంతో బాధితులు సజీవ దహనం అయ్యారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి! గాయపడిన వారందరనీ ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన మధుర ఎస్.ఎస్.పీ. శ్లోక్ కుమార్… తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో దృశ్యమానత తక్కువగా ఉండటం అల్ల సుమారు ఏడు బస్సులు, మూడు చిన్న వాహనాలు ఒకదానికొనటి ఢీకొన్నాయని తెలిపారు. ఢీకొన్న తర్వాత వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయని వెల్లడించారు. ఈ సమయంలో సహాయక చర్యలు దాదాపు పూర్తయ్యాయని చెప్పిన శ్లోక్ కుమార్.. ఇప్పటివరకూ నలుగురు మరణించినట్లు నిర్ధారించబడిందని వెల్లడించారు. గాయపడిన 25 మందిని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ వే పూర్తిగా బ్లాక్ చేయబడిందని.. ట్రాఫిక్ వెనుక నుంచి మళ్లించబడిందని.. ప్రభుత్వ వాహనాలను ఉపయోగించి మిగిలిన ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపామని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన మధుర రూరల్ ఎస్పీ సురేష్ చంద్ర రావత్.. మొదటి మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయని.. ఆ తర్వాత ఏడు బస్సులు వాటిపైకి దూసుకుపోయాయని తెలిపారు. ఈ సమయంలో పదకొండు యంత్రాలు సంఘటన స్థలంలో ఉన్నాయని.. మంటలను ఇప్పుడు అదుపులోకి తెచ్చారని.. ఇప్పటివరకూ నాలుగు మృతదేహాలను వెలికితీశారని తెలిపారు.
👉నల్లగా ఉన్నవాని వేధిస్తున్న భర్త….అత్తగారింట దీక్షకు దిగిన కోడలు*…పల్నాడు జిల్లా వినుకొండలో నల్లగా ఉన్నావంటూ భార్యను వేధిస్తున్న భర్త…అదనపు కట్నం కోసం అత్తమామల ఒత్తిడి ..ఇంటి నుంచి గెంటేయడంతో అత్తింటి ముందు బాధితురాలి నిరసన…భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసిన పోలీసులు… పల్నాడు జిల్లా వినుకొండలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. నల్లగా ఉన్నావంటూ భర్త, ఇంట్లోకి అడుగుపెట్టాక అశుభాలు జరుగుతున్నాయంటూ అత్తామామలు ఓ నవవధువును తీవ్రంగా వేధించారు. కట్నం సరిపోలేదంటూ ఇంటి నుంచి గెంటేయడంతో, బాధితురాలు న్యాయం కోసం అత్తింటి ముందు నిరసన దీక్షకు దిగింది.
వివరాల్లోకి వెళితే.. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గోపి లక్ష్మికి, వినుకొండ పట్టణానికి చెందిన కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్ 4న వివాహం జరిగింది. వివాహ సమయంలో గోపి లక్ష్మి తల్లిదండ్రులు రెండు ఎకరాల పొలం అమ్మి రూ.12 లక్షల నగదు, 25 సవర్ల బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. పెళ్లయిన రెండు నెలల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది.
ఆ తర్వాత అసలు వేధింపులు మొదలయ్యాయి. భర్త కోటేశ్వరరావు “నల్లగా ఉన్నావు” అంటూ హేళన చేయడం ప్రారంభించాడు. అత్తమామలు వెంకటేశ్వర్లు, శేషమ్మ కూడా అదనపు కట్నం తేవాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంపై పెద్దమనుషులతో మాట్లాడించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశారు.
దీంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గోపి లక్ష్మి తన అత్తింటి ముందు ఆందోళన చేపట్టారు. ఆమె నిరసన తెలుపుతుండగానే ఇంట్లోవాళ్లు తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు.
👉 ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ACB సోదాలు*…ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన బిల్డింగ్ డివిజన్ డి ఇ శ్రీనివాస్…ఓయూలో సివిల్ కాంటాక్టర్ వద్ద రూ. 11,000 లంచం డీమాండ్ చేసిన శ్రీనివాస్..ఇంకా రెండు నెలల్లో రిటైర్ అవనున్న శ్రీనివాస్

