ప్రజాక్షేత్రం లో తీర్పు కోరే దమ్ముందా ?… సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అనిల్ రెడ్డి….👉దొంగా-పోలీస్ దోస్తీ.. పల్నాడు జిల్లాలో చెలరేగిపోయిన ముఠా…!!!.. 👉బర్త్ డే పార్టీ.. దువ్వాడ మాధురి శ్రీనివాస్‌ బంధువుకు నోటీసులు* …👉ముంబైలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్..👉గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం బిల్లు!*.. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు (ప్రకాశం జిల్లా)…👉ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ముఠా… పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు..

👉 జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూపాయి డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ పీపీపీ మోడల్ ద్వారా 80 వేల కోట్ల ప్రజల సొమ్మును ….ప్రైవేటు పరం చేయడాన్ని సవాలు చేస్తూ…….నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అన్న ధైర్యం మీకుంటే……13 జిల్లాలో…..జిల్లాకు ఒకరి చొప్పున రాజీనామా చేసి …..ప్రజాక్షేత్రం లో తీర్పు కోరే దమ్ముందా అని సూటిగా కూటమి ప్రభుత్వాని ప్రశ్నించిన…… రూపాయి డాక్టర్ అనిల్ రెడ్డి….వైసీపీ రాష్ట్ర కార్యదర్శి.

👉బర్త్ డే పార్టీ.. దువ్వాడ మాధురి శ్రీనివాస్‌ బంధువుకు నోటీసులు*

వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహించిన బర్త్ డే పార్టీలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ విషయం రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి 10 విదేశీ మద్యం బాటిళ్లు, ఐదు హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ పార్టీకి హాజరైన దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు మాధురి, ఆమె బంధువు అమలాపురం ప్రాంతానికి చెందిన పార్థసారథిలను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ పార్టీలో వీరితో పాటు మరో 26 మంది పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ బర్త్ డే పార్టీపై మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి మాధురి బంధువు పార్థసారధికి నోటీసు ఇచ్చారు పోలీసులు. కోర్ట్ కేస్ విచారణ ఉన్నప్పుడు రావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. అయితే ఈ ఈవెంట్ నిర్వహించింది పార్థసారధి కావడంతో ఆయనపై మాత్రమే కేస్ నమోదు చేశారు. అనుమతి లేకుండా పార్టీలో విదేశీ, మద్యం హుక్కా వాడారని నోటీసులో మొయినాబాద్ పోలీసులు పేర్కొన్నారు..

👉ముంబైలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్.. పాక్ ISI ఆదేశాల మేరకు కార్యకలాపాలు*

ముంబైలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదులను సాజన్, మనీష్ బేడీగా గుర్తించారు.ప్రాథమిక విచారణలో వీరు పాకిస్తాన్ ISI ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీరు పథకాలు రచించినట్టు తెలుస్తోంది.అలాగే, ఈ ఉగ్రవాదులు అర్మేనియా నుంచి తమ కార్యకలాపాలను ఆపరేట్ చేస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి ఆదేశాలు తీసుకుంటూ భారత్‌లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భద్రతా అధికారులు పేర్కొన్నారు. దేశ భద్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.

👉ప్రేమ పేరుతో పాశవికం* యువతిని గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు.. తలను వెంట తీసుకెళ్లి పరారీ*

యూపీలోని సహరాన్‌పూర్‌ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విభేదాలు తలెత్తడంతో యువతి ప్రియుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి చంపిన అనంతరం యువతి తలను తనతో తీసుకెళ్లి నిందితుడు పరారయ్యాడు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.నిందితుడి అరెస్టుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

👉సీతారామపురంలో ఉద్రిక్తత.. ఎన్నికల అధికారిని గదిలో బంధించిన గ్రామస్థులు* తెలంగాణ..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల హడవుడి నడుస్తుంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం.. సీతారామపురం గ్రామంలో ఎన్నికల అధికారి నాగరాజు ను గ్రామస్థులు ఓ గదిలో బంధించారు. ఎన్నికల అధికారి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఉపసర్పంచ్ పదవిని ముందుగానే ప్రకటించారని గ్రామస్థులు ఆరోపిస్తునున్నారు. నాగరాజు వ్యవహారంపై గ్రాస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ని గదిలో బంధించారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటే.. ఓడిన అభ్యర్థులు కొన్నిచోట్ల ఆందోళన చేస్తున్నారు. తమ వద్ద డబ్బు తీసుకొని వేరే వాళ్లను గెలిపించారని ఆరోపిస్తూ.. తిరిగి డబ్బు చెల్లించాల్సిందిగా ఓటర్లను ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులపై ఓడిన అభ్యర్థులు దాడులకు పాల్పడుతున్నారు. వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓడిన అభ్యర్థిపై గెలిచిన అభ్యర్థి బంధువులు దాడికి పాల్పడ్డారు.కామారెడ్డి జిల్లా సోమార్‌పేటలో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి బాలరాజును గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ తో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సర్పంచ్ గా గెలిచిన పాపయ్య తమ్ముడు చిరంజీవికి, ఓడిన బాలరాజు వర్గంతో గొడవలు జరిగాయి. ఆది మనసులో పెట్టుకొని చిరంజీవి ట్రాక్టర్ తో ప్రత్యర్థులపై తన కక్ష్యతీర్చుకున్నాడు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..

👉గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్రం బిల్లు!*

*దిల్లీ: గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లు ప్రతులను సోమవారం లోక్‌సభలో సభ్యులకు ఇచ్చింది. ఈమేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గ్రామీణ ఉపాధికి ప్రత్యామ్నాయ పథకాన్ని కూడా తెరపైకి తీసుకురానున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం.. పూజ్య బాపు గ్రామీణ్‌ రోజ్‌గార్ యోజనగా మార్చింది. అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది.

👉ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి విలువ**ముంబయి: అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి విలువ మరింత తగ్గి ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే మారకపు విలువ 26 పైసలు పతనమై రూ.90.75 వద్దకు చేరుకుంది.

👉దొంగా-పోలీస్ దోస్తీ.. పల్నాడు జిల్లాలో చెలరేగిపోయిన ముఠా…!!! చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మరణానికి కారణమైన దొంగల ముఠా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మరణానికి కారణమైన దొంగల ముఠా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఠా నాయకుడైన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడికి పల్నాడు జిల్లాకు చెందిన కొందరు పోలీసు అధికారుల మద్దతు ఉందనే తాజా సమాచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా నిందితుడు వెంకటనాయుడితో చేతులు కలిపారన్న ఆరోపణలతో చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐ రహంతుల్లాను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హైవేపై వాహనాలను దొంగిలించడం, వాహనదారులను దోచుకున్న దొంగల గ్యాంగ్ కు ఎస్ఐ పూర్తిస్థాయిలో సహకరించారని ఉన్నతాధికారులకు నిర్ధారించారు. అంతేకాకుండా వెంకటనాయుడు గ్యాంగ్ దొంగిలించిన కార్లలో నాలుగింటిని ఎస్ఐ రహంతుల్లా కుటుంబ సభ్యులతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇందులో ఒక కారు ఎస్ఐ వాడుతున్నట్లు సమాచారం. ఆర్టీఓ అధికారులు అంటూ హైవేపై వాహనాలను ఆపుతూ దోచుకుంటున్న నిందితులు.. ఐదుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేసిన పోలీసులు.. వెంకటనాయుడు గ్యాంగ్ ను గుర్తించారు. కేసును తొలుత రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు గ్యాంగ్ కు స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లడంతో ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఉన్నతాధికారులను రంగంలోకి దింపి మొత్తం కూపీ లాగడంతో ఎస్ఐ రహంతుల్లా బాగోతం బయటపడిందని చెబుతున్నారు. నిందితులు చాలా కాలంగా హైవేపై కార్లు దొంగిలిస్తున్నారని, వాటినే తమ దోపిడీలకు వాడుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని వాహనాలను విక్రయించగా, అందులో కొన్ని పల్నాడు జిల్లాలో తిరుగుతున్నాయని అంటున్నారు.నిందితుడు వెంకటనాయుడు అరెస్టు తర్వాత అతడి వద్ద కార్లు కొనుగోలు చేసిన వారు హడలిపోతున్నారు. ఏఎస్ఐ కుమారుడు అన్న కారణంతో వాహనాలు కొనుగోలు చేశామని, అవి దొంగిలించినవని ఇప్పుడే తెలిసిందని పలువురు పోలీసుల ఎదుటకు వచ్చి చెబుతున్నారని అంటున్నారు. నిందితులు దొంగిలించిన రెండు కార్లకు ఫాస్టాగ్ పెట్టుకుని నిత్యం హైవేపై తిరుగుతూ ఆర్టీవో పేరుతో చాలాకాలంగా వసూళ్లకు పాల్పడుతున్నా, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. ఎస్ఐ రహంతుల్లాతోపాటు డిపార్ట్మెంటులో మరికొందరు నిందితులకు సాయం చేస్తున్నారా? అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి.ప్రధానంగా పోలీసుశాఖకు చెందిన ఏఎస్ఐ కుమారుడు అన్న ధీమాతో ఎక్కువ మంది పోలీసులు నిందితుడు వెంకటనాయుడుతో సన్నిహితంగా మెలిగారని చెబుతున్నారు. అంతేకాకుండా అతడి వద్ద చౌకగా వస్తున్నాయని కార్లు కూడా కొనుగోలు చేశారని అంటున్నారు. ఇలాంటి వారంతా నిందితుడు అరెస్టు తర్వాత నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల మరణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన వెంటనే నిందితుడు వెంకటనాయుడు బాగోతాలు బయటకు వచ్చాయని, ఈ క్రమంలో కార్ల చోరీని తొక్కిపెట్టాలని కొందరు పోలీసులు ప్రయత్నించారని ప్రచారం జరుగుతోంది. కానీ పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో మొత్తం బయటపడిందని అంటున్నారు.

👉 ప్రకాశం జిల్లా ఒంగోలు …అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా  ఒంగోలులోని సీ.వి.ఎన్ రీడింగ్ రూమ్ సర్కిల్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి సోమవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్ విజయ్ కుమార్, గిద్దలూరుశాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి  బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మ అర్పణ దినోత్సవoగా గత సంవత్సరం అధికారికంగా ప్రక టించడం జరిగిందన్నారు.జిల్లా కలెక్టర్ రాజా బాబు మాట్లాడుతూ, ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయ ని అన్నారు. మహాత్మాగాంధీ చేపట్టిన స్వాతంత్ర్య ఉద్యమంలో పొట్టి శ్రీరాములు చురుకుగా పాల్గొన్నారన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

👉అమరజీవి పొట్టి శ్రీరాములు  వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ*

త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు  ఉద్యమస్ఫూర్తి నేటికీ మార్గదర్శకం: ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు… అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 73 వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బంది శ్రీరాములు చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షతో ఆత్మార్పణ చేసి అమరుడయ్యాడని, ఆయన బలిదానం ఫలితంగా 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించిందని, తద్వారా భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. గాంధీ మార్గాన్ని అనుసరించి అనేక జాతీయ ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించారని, సత్యం, అహింస అనే ఆశయాలతో హరిజనుల ఉద్ధరణకు కృషి చేశారని, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని జిల్లా ఎస్పీ  కొనియాడారు. గొప్ప దేశభక్తుడు, సమాజసేవకుడు, పీడిత ప్రజల పక్షపాతి, అసలైన గాంధేయవాది అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఉద్యమస్ఫూర్తి, కార్యదీక్ష, త్యాగనిరతి నేటి తరానికి గొప్ప ఆదర్శమని తెలిపారు. మహానుభావుల త్యాగాలు, ఆదర్శాలను స్మరించుకోవడం ద్వారా దేశభక్తి, సేవాభావం మరింత పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ వి.వి.రమణ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్,డీటీసీ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ఆర్ఐ రమణరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

👉రోడ్డు ప్రమాదాల నివారణకు ముందడుగు: రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి హెల్మెట్, ఓవర్ స్పీడ్‌ పై అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు*

ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు Road Safety Warriorsతో కలిసి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానంగా హెల్మెట్ ధరించడం, అధిక వేగంతో వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాల పాటింపు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని పోలీసులు వివరించారు.అలాగే, రోడ్డు భద్రతలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు సూచించారు. రోడ్ సేఫ్టీ వారియర్స్ ప్రజలతో మమేకమై, భద్రతా సూచనలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ప్రజల భద్రత, సురక్షిత రవాణా వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తారని తెలిపారు.

👉ఇంధన పొదుపు పై విస్తృత స్దాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు పట్టణంలో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ భవన్ వద్ద నుంచి చర్చి సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్దులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజలకు, యువతకు విద్యుత్ పొదుపు గురించి అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ ను పొదుపుగా వినియోగించడంతో పాటు భద్రంగా వినియోగించాలన్నారు. సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచాలన్నారు.(ప్రకాశం జిల్లా ఒంగోలు)

👉ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ముఠా…చోరీలకు పాల్పడుతున్న మహిళల ముఠాను గమనించిన ప్రయాణికులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగింత….నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు….కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొన్నూరు రూరల్ పోలీసులు…గుంటూరు జిల్లా పొన్నూరు

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!