👉కేటీఆర్ అఖిలేష్ …వేరే ప్లాన్ ఉందా ?… 👉 జనసేనలోకి వైసీపీ విజయసాయిరెడ్డి? …👉హైదరాబాద్ బోరబండాలో డ్రగ్స్ వినియోగంపై ఈగిల్ ఫోర్స్ దాడులు…👉మెస్సీ టూర్.. ‘పెద్ద స్కాం’ అన్న మహిళ !…👉ఏపీలో బంగారు గనులు.. జొన్నగిరిలో మొదలైన తవ్వకాలు…👉వేములవాడలో దొంగనోట్ల కలకలం..👉మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పొట్లూరి స్రవంతి*..పవర్ గ్రిడ్డు కాంట్రాక్టుల దౌర్జన్యం (నంద్యాల )

👉కేటీఆర్ అఖిలేష్ …వేరే ప్లాన్ ఉందా ? తెలంగాణాలో పర్యటనకు వచ్చిన యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎక్కువగా గడుపుతున్నారు అని అంటున్నారు.

*కేటీఆర్ అఖిలేష్ …వేరే ప్లాన్ ఉందా ?

తెలంగాణాలో పర్యటనకు వచ్చిన యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎక్కువగా గడుపుతున్నారు అని అంటున్నారు. ఆయన వచ్చీ రావడం తోనే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఇక ఆ తరువాత అంతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనే గడుపుతూ వచ్చారు. ఆయనతో కలిసి ప్రెస్ మీట్ ని అటెండ్ చేశారు. కాలం ఒక్కలా ఉండదని చెబుతూ బీఆర్ఎస్ మళ్ళీ పవర్ లోకి వస్తుందని ఆశలు కల్పించారు. ఇక కేటీఆర్ సైతం అఖిలేష్ యాదవ్ ని పొగిడేశారు.

*కలిసి భోజనం : కట్ చేస్తే రెండవ రోజున కూడా ఈ ఇద్దరూ మంచి మిత్రులుగా మారిపోయారు. కలసి హైదరాబాద్ లోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్న భోజనం చేయడం విశేషం. ఈ ఇద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ హుషారుగా కనిపించారు. అలాగే భోజనం రుచులను ఒక వైపు ఆస్వాదిస్తూనే మరో వైపు వర్తమాన రాజకీయాల గురించి ఇద్దరూ చర్చించుకోవడం కనిపించింది. ఇదిలా ఉంటే కేఫ్ లో మంచి రుచికరమైన భోజనం లభించిందని అంతా బాగుందని అఖిలేష్ యాదవ్ కేఫ్ యజమానిని మెచ్చుకున్నారు. ఇక ఈ ఇద్దరు నేతలు కలిసి బీఆర్ఎస్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఇంటికి కూడా వెళ్ళారు.

*ఇండీ మిత్రుడుండగా : ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో బీఆర్ఎస్ అయితే లేదు, ఆ పార్టీ జాతీయ రాజకీయాలలో తటస్థంగా ఉంటోంది. ఇక కాంగ్రెస్ తెలంగాణ లో అధికారంలో ఉంది అంతే కాదు ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఎస్పీ భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయి. ఇంకో వైపు చూస్తే తెల్లారి లేస్తే కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ విపక్ష రాజకీయం గట్టిగా చేస్తూ ఉంటుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీఆర్ఎస్ ని ప్రతిపక్షంగా భావించి బలంగా టార్గెట్ చేస్తూంటుంది. అలాంటి రాజకీయ నేపథ్యం తెలంగాణ లో ఉంది.

*స్థానిక వేడి ఉండగా :  ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ని ఓడించాలని తాము గెలిచి తీరాలని బీఆర్ఎస్ చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కీలక సమయంలో ఇండియా కూటమి మిత్రుడుగా హైదరాబాద్ వచ్చిన ఎస్పీ ధినేత అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం అయితే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది అని అంటున్నారు. అయితే ఎస్పీ కాంగ్రెస్ యూపీలో మంచి మిత్రులు. అందువల్ల ఆ దోస్తీ అలాగే ఉంటుంది అని అంటున్నారు. ఇపుడు బీఆర్ఎ కొత్త చెలిమి మీదనే అంతా ఆలోచిస్తున్నారు. మరి ఇండీ కూటమిలోకి బీఆర్ఎస్ ని తీసుకుని రావాలని చూస్తున్నారా లేక ఎస్పీని తెలంగాణాలో విస్తరించే క్రమంలో బీఆర్ఎస్ ని మంచి మిత్రుడుగా చేసుకోవాలని ఆలోచిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది

👉హైదరాబాద్ బోరబండాలో డ్రగ్స్ వినియోగంపై ఈగిల్ ఫోర్స్ దాడులు…
గంజాయి సేవిస్తున్న 8 మంది అరెస్ట్..
6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్..
డ్రగ్ పరీక్షల్లో టీహెచ్‌సీ ఉన్నట్లు నిర్ధారణ
డ్రగ్స్ సరఫరాదారుల కోసం గాలిస్తున్న పోలీసులు.
👉 జనసేనలోకి వైసీపీ విజయసాయిరెడ్డి? *షోషల్ మీడియా లలో తెగ వైరల్ … వైఎస్ జగన్ కు షాక్ తగలనుంది.మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేనలో చేరబోతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.గతంలో పవన్‌పై తీవ్ర విమర్శలు చేసిన VSR, ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే పవన్ అభిమతాన్ని సమర్థించారు.అంతేకాక, ‘గత 20 ఏళ్లుగా పవన్ పరిచయం, ఆయన అభిమానిని’ అని ప్రకటించారు.
ఈ మార్పు వెనుక జనసేనలో చేరిక లేదా కేసుల నుంచి రక్షణ కోసమేనా అనే అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లో రేకెత్తిస్తున్నాయి.ఈ వార్త పై VSR స్పందించే సమయం ఆసన్నమైంది..కోల్కతా స్టేడియంలో గందరగోళానికి VIPలే కారణం. మెస్సీ స్టేడియానికి రాగానే పొలిటీషియన్స్, సెలబ్రిటీలు, వారి సన్నిహితులు చుట్టుముట్టారు. ఆటోగ్రాఫ్స్, సెల్ఫీలంటూ హడావిడి చేశారు. దీంతో క్రౌడ్ కంట్రోల్ కష్టమని పర్సనల్ సెక్యూరిటీ టీమ్ మెస్సీని బయటకు తీసుకెళ్లింది. అభిమానంతో వేల రూపాయలతో టికెట్స్ బుక్ చేసుకుని ఎంతో దూరం వచ్చిన ఫ్యాన్స్ మెస్సీ వెళ్లిపోయాడని తెలిసి ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు.
👉మెస్సీ టూర్.. ‘పెద్ద స్కాం’ అన్న మహిళ 😲😲😲
కోల్కతాలో మెస్సీ టూర్పై ఓ మహిళా అభిమాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘చాలా నిరాశకు గురయ్యాం. ఈ వీకెండ్లో మెస్సీని చూస్తామని పిల్లలు ఎంతో ఆశపడ్డారు. కానీ అతడిని చూడనివ్వకుండా వీఐపీలు చుట్టుముట్టారు. నాకు తెలిసి ఇదంతా స్కాం కావచ్చు’ అని మండిపడ్డారు. అంతలోనే ఆమె పక్కనున్న కొడుకు కూడా ‘బిగ్ స్కాం’ అంటూ అరవడం గమనార్హం.
చిన్నారులను నిరాశపర్చిన నిర్వాహకులపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
👉 షాకింగ్ వీడియో.. క్లాస్ రూము లో  కుప్పకూలిన అమ్మాయి…విద్యార్థుల్లోనూ గుండెపోటు మరణాలు సంభవించడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కోనసీమ (D) రామచంద్రాపురంలో పదో తరగతి స్టూడెంట్ క్లాస్ రూమ్లోనే కుప్పకూలిపోయింది. క్లాస్ వింటున్న విద్యార్థిని సిరికి ఒక్కసారిగా వెక్కిళ్లు మొదలయ్యా యి. అంతలోనే ఆమె స్పృహతప్పి కింద పడిపోయింది. స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు~£
👉వేములవాడలో దొంగనోట్ల కలకలం..*
మహిళా పొదుపు సంఘంలో నకిలీ నోటు..
పురపాలక సంఘం పరిధిలో మహిళా పొదుపు సంఘములో రెండవసారి సంఘటన ..
వరుస సంఘటనలతో భయాందోళన గురవుతున్న సంఘం ప్రతినిధులు..
👉మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పొట్లూరి స్రవంతి*..ఏపీ…నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి తన మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.కలెక్టర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు.
గిరిజన బిడ్డ అయిన తనను ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారని, తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఈ పరిణామం నెల్లూరు రాజకీయాల్లో కలకలం రేపింది.
👉ఏపీలో బంగారు గనులు.. జొన్నగిరిలో మొదలైన తవ్వకాలు*… జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో పసిడి వెలికితీత పనులు…టన్ను మట్టి నుంచి 2 గ్రాముల వరకు బంగారం ఉత్పత్తి అంచన..పదేళ్లలో 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ…దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్న వేళ, సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను ‘జియో మైసూర్’ అనే సంస్థ చేపట్టింది…జొన్నగిరి, పగిడిరాయి గ్రామాల పరిసర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) కొన్నేళ్ల క్రితమే నిర్ధారించింది. దీంతో ప్రభుత్వం సుమారు 1,477 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు జియో మైసూర్ కంపెనీకి అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి.
అధికారుల అంచనా ప్రకారం ఈ ప్రాంతంలో ఒక టన్ను మట్టిని శుద్ధి చేస్తే 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం లభించే అవకాశం ఉంది. ఇందుకు సుమారు రూ. 5 వేల వరకు ఖర్చవుతుందని తెలుస్తోంది. మరోవైపు, వెయ్యి టన్నుల ముడి ఖనిజం నుంచి 700 గ్రాముల బంగారాన్ని వెలికితీయడం సాధ్యమవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా రానున్న పదేళ్లలో సుమారు 6 వేల టన్నుల బంగారం ఉత్పత్తి చేయాలని జియో మైసూర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతంలో దాదాపు కోటి టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు బ్లాక్‌లో భూమికి 180 మీటర్ల లోతున 6.8 టన్నుల పసిడి ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం అధునాతన యంత్రాలను వినియోగిస్తూ, రోజుకు 1000 టన్నుల ఖనిజాన్ని శుద్ధి చేస్తున్నారు.
👉నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతకలాయ పల్లి గ్రామంలో పవర్ గ్రిడ్డు కాంట్రాక్టులు చీని తోట ఉన్న రైతు తోటలో చీనీ కాయలు కాసే చెట్లని పెకిలించి వేయడమేకాకుండా మేమిస్తూన్న డబ్బులు మీరు తీసుకోవాలి మీరు అడిగినట్లుగా డబ్బులు మేము ఇవ్వం అని రైతులను ఇబ్బంది పెడుతున్న అక్కడి పవర్ గ్రిడ్ అధికారులు.
👉బ్యాలెట్‌ పేపర్లు బహిర్గతం ఘటనలో ఎనిమిది మంది పీవోల సస్పెన్షన్‌*
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఓ మురుగు కాలువలో బ్యాలెట్‌ పేపర్లు బహిర్గతం అయిన ఘటనలో పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించిన ఎనిమిది మంది పీవో (ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌) లను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ఈ ఘటనపై చిట్యాల ఎంపీడీవో ఎస్‌.పి.జయలక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎండీవో, ఆర్వో, ఇతర సిబ్బంది సమక్షంలో ఆర్డీవో అశోక్‌రెడ్డి విచారణ నిర్వహించారని, పోలైన ఓట్లకు, కౌటింగ్‌ సమయంలో ఉన్న ఓట్లు సరిపోయాయని కలెక్టర్‌ తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయి, గెలిచిన అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే ఈ ఘటన జరిగిందని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు..

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!