👉15 నిమిషాల్లో సరుకులు డోర్ డెలివరీ.. అంబులెన్స్ ఆలస్యంతో మరణిస్తున్నా పట్టదు: జయా బచ్చన్*
🌟సరుకులు 15 నిమిషాల్లోపు ఇంటింటికి చేరుతున్నాయని అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ తెలిపారు. అయితే అంబులెన్స్‌ల ఆలస్యంతో రోగులు ఆసుపత్రికి చేరుకోలేక రక్తస్రావంతో మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
🌟 *అంబులెన్స్‌ల కోసం రోడ్లపై ప్రత్యేకంగా అత్యవసర లేన్లు ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.* బుధవారం రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా జయా బచ్చన్ ఈ అంశాన్ని లేవనెత్తారు.
🌟 2018లో సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రత్యేక అత్యవసర లేన్‌లు లేవు. ఈ విషాదాలను జాతీయ డేటా ఏదీ ట్రాక్ చేయదు’ అని అన్నారు.
👉తిరుమలలో మరో స్కాం.. !!! …స్పందించిన పవన్
తిరుమలలో పట్టువస్త్రాల స్కాంపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. కూటమి ప్రభుత్వ చర్యలతోనే టీటీడీలో జరుగుతున్న అక్రమాలన్నీ బయట పడుతున్నట్లు చెప్పారు. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోందని వ్యాఖ్యా నించారు. పరకామణి విషయంలోనూ జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన మతంలోనూ ఇలాగే జరిగి ఉంటే చిన్న విషయమేనని కొట్టిపారేసేవారా అని ప్రశ్నించారు.
👉ఇండిగో సంక్షోభం.. దిల్లీలో రూ.1,000 కోట్లు నష్టం*
* ఇండిగో సంక్షోభంతో దిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ వెల్లడించింది. విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్ ట్రావెలర్స్ రాకపోకలకకు అంతరాయం కలిగిందని పేర్కొంది. గత 10 రోజుల్లో దిల్లీ మార్కెట్లలో జనసంచారం దాదాపు 25% తగ్గిందని వివరించింది. దిల్లీ విమానాశ్రయం నుంచి నిత్యం 1.5 లక్షల ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారని.. అందులో సుమారు 50 వేల మంది వ్యాపారులు, బిజినెస్ ట్రావెలర్స్ ఉంటారని తెలిపింది.
👉యురేనియం ప్రభావిత గ్రామస్థులకు న్యాయం చేస్తాం..!** *జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి**కడప జిల్లా….** *కేకే కొట్టాల గ్రామ భూసేకరణకు యూసీ ఐ ఎల్ వారి అవసరం మేరకు చర్యలు.. వైయస్సార్ కడప జిల్లా, యురేనియం ప్రభావిత గ్రామస్థులకు నష్టం జరగకుండా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
బుధవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యు.సి.ఐ.ఎల్) సమస్యలపై మాజీ ఎమ్మెల్సీ బి.టెక్ రవి, ప్రాజెక్టు అధికారులు, పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారి, కేకే కొట్టాల గ్రామస్థులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యుసిఐఎల్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ లో నిర్వహించడం జరుగుతోందన్నారు. యురేనియం ప్రభావిత గ్రామస్థుల సమస్యలు,వారి ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తామన్నారు. స్థానిక సమస్యలను పరిగణన లోకి తీసుకుని,ప్రాజెక్టు అవసరాలు,నిర్వహణ సామర్థ్యం దృష్ట్యా.. కొత్త టెయిలింగ్ పాండ్ నిర్మాణం చేపట్టడానికి ముందే ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసి కేకే కొట్టాల గ్రామాన్ని భూసేకరణ చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. దీనిపై పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందుకు దాదాపు 6 నెలల సమయం పడుతుందన్నారు. అంతేకాకుండా నిర్వహణలో ఉన్న పాత టెయిలింగ్ పాండ్ ఎత్తును పెంచుకునేందుకు కానీ, ఏదైనా మరమ్మతులు చేపట్టేందుకు కానీ ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.దేశాభివృద్ధి, ఉత్పాదక ప్రయోజనాల కోసం.. స్థానికులు తమ సొంత భూములు, సొంత నివాసాలను వదులుకోవడం త్యాగంతో కూడుకున్న విషయమే అన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఊరిని కోల్పోతున్న యురేనియం ప్రభావిత గ్రామస్థులకు చట్టపరంగా,న్యాయ పరంగా జిల్లా యంత్రాంగం సహకరిస్తుందన్నారు.
కేకే కొట్టాల గ్రామస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం,ఉపాధి అవకాశాలను న్యాయబద్ధంగా కల్పిస్తామన్నారు. గతంలో పరిహారంతో పాటు ఇంకా కొంతమందికి పెండింగ్ లో వున్న ఉద్యోగ కల్పన కూడా త్వరలో క్లియర్ చేయాలని యూసీఐఎల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఏదైనా సామాజిక బాధ్యతగా యురేనియం ప్రభావిత గ్రామాల్లో మౌలిక అవసరాలను కల్పించేందుకు ఇంకా మెడికల్ క్యాంపులు, వైద్య సదుపాయాలు, పారిశుద్ద్య అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని, ఆ దిశ గా ఆయా గ్రామ ప్రజలకు సహకారం అందించాలని యూసీయల్ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పులివెందుల ఆర్డిఓ చిన్నయ్య, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్, యుసీఐఎల్ సూపరింటెండెంట్ ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్, పీకే నాయర్, తదితరులు పాల్గొన్నారు.
👉డబ్బుల పంపిణీని అడ్డుకున్నందుకు దాడి..ఎక్లాస్ ఖాన్ పేట 1వ వార్డు సభ్యుడు జింకల యాదయ్య.. కేశంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…*మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కుమారుడు మురళి తదితరులపై ఆరోపణలు*…తల దాచుకునేందుకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ ఇంట్లోకి వచ్చినా ఆగని దాడి*…*మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ కారు ధ్వంసం…*కేశంపేట పోలీస్ స్టేషన్లో పలువురిపై కేసు నమోదు*.. దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ నేతలు…*నిర్భయంగా ఓటు వేయండి.. ఎవరికి భయపడకూడదు*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో బుధవారం ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన ఒకటో వార్డు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జింకల యాదయ్యపై బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు దాడి చేసినట్లు కేశంపేట పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి చెందిన ఒకటో వార్డు అభ్యర్థి జింకల యాదయ్య బుధవారం ఒకటో వార్డులో కొందరు ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లి చూడగా అక్కడ డబ్బులు పంపిణీ జరుగుతుందని ఈ డబ్బు పంపిణీ చేయొద్దని తాను అడ్డుకోగా అదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చిన్న కుమారుడు ఎల్గనమోని మురళి, ఎల్గనమోని హరి శేఖర్, ఎల్గనమోని శ్రీహరి, ఎల్గనమోని మహేందర్, దండే రమేష్, పృధ్వీ రాజ్, ఎల్గనమోని వివేక్ వర్ధన్, ఎల్గనమోని శివ మరి కొంతమంది పెద్ద ఎత్తున తనపై దాడికి పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తను ప్రాణ భయంతో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదవ్ ఇంట్లోకి ప్రవేశించి తలదాచుకునేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారని తనపై దాడి చేశారని బాధితుడు జింకల యాదయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కాపాడేందుకు శ్రీధర్, శ్రీనివాస్, గిరిధర్, కృష్ణ యాదవ్ అడ్డుకునే ప్రయత్నం చేయగా వారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కు చెందిన కారు అద్దాలు పగలగొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చర్య తీసుకోవాలని బాధితుడు జింకల యాదయ్య పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
*ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకే..*
ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఒకటవ వార్డు అభ్యర్థి జింకల యాదయ్య పై దాడి సమంజసం కాదని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, మైనార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం, మహబూబ్, అనిల్ కుమార్, చిన్న, ఇసాక్ తదితరులు దాడిని ఖండించారు. బుధవారం సాయంత్రం గ్రామానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ఈ పని చేశారని వారు ఆరోపించారు. డబ్బులు పంపిణీ చేయకూడదని చెప్పినందుకు ఒకటో వార్డు అభ్యర్థి జింకల యాదయ్య పై విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారని అతను ప్రాణభయంతో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య యాదవ్ ఇంటికి వెళ్లినప్పటికీ కూడా వదలకుండా గోడలు దూకి మరి ఇంట్లోకి ప్రవేశించి అతనిపై దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి దాడులకు స్వస్తి పలకాలని కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది. నియోజకవర్గంలో ఓడిపోతున్నామన్న భయంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంట్లోకి దూరి మరి దర్జాగా దాడులు చేశామని సమాజంలో బయానక వాతావరణం సృష్టించే సంకేతాల కోసమే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు. గ్రామంలో ప్రజలు భయపడకుండా నిర్భయంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. చట్టం ఎవరిని వదిలిపెట్టదని నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ప్రజలు ఇలాంటి దాడుల పట్ల అప్రమత్తంగా ఉండి అందరూ ఐకమత్యంతో ఇలాంటి దాడులను ఖండించి ముందుకు సాగాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సబబు కాదని సూచించారు. గ్రామంలో బయానక వాతావరణ సూచించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తప్పకుండా చర్యలు చట్టం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు..
👉సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్లతో ఆత్మీయ భరోసా కార్యక్రమం..*ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా, బాండ్లను పంపిణీ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందన్న కేటీఆర్ …కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ లకు రూ.1560 కోట్లు అప్పు బాకీ ఉందన్న కేటీఆర్…ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ లకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్..
👉గుంటూరు డీసీసీబీ నల్లపాడు బ్రాంచ్‌లో బోగస్ రుణాల వ్యవహారంపై కేసులు నమోదు.*
*గుంటూరుకు చెందిన వైసీపీ కీలక నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాల్పురం రాము) సహా 14 మందిపై క్రిమినల్ కేసులు నమోదు.*
*మాజీ సీఈవో టి.కృష్ణవేణి, నల్లపాడు బ్రాంచ్ మాజీ మేనేజర్ దేవరకొండ అరుణకుమారిపై కూడా కేసులు.*
*పాలకవర్గ సభ్యులు 11 మంది, అప్ప్రైసర్ యర్రంశెట్టి ఈశ్వర్ ప్రసాద్‌పైనా క్రిమినల్ కేసులు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు….*నల్లపాడు బ్రాంచ్‌లో రూ.22 కోట్లపైనే అక్రమాలు జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడి.*
*బోగస్ రుణాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.. ఇప్పటికే మాజీ సీఈవోలు కృష్ణవేణి, అజయ్‌కెశోర్‌లు సస్పెండ్…*సహకార శాఖలో కలకలం రేపిన ఈ కేసు నమోదు.. మంగళగిరి, కురగల్లు పీఏసీఎస్ లలో కూడా రైతుల సొమ్ము స్వాహా చేయడం చర్చనీయాంశంగా మారింది.*
🌟పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు: రిజిస్టర్ పోస్ట్ ద్వారా FIR నమోదుకు మార్గం!*
చాలామంది ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి సంకోచిస్తుంటారు లేదా భయపడుతుంటారు. అయితే, నేరానికి గురైనప్పుడు లేదా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు న్యాయం పొందడం ప్రతి పౌరుడి హక్కు. ఈ నేపథ్యంలో, భారతీయ చట్టం ప్రజలకు ఒక ముఖ్యమైన వెసులుబాటును కల్పిస్తోంది: రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు, మరియు పోలీసులు దానిపై విచారణ జరిపి, అవసరమైతే ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేయాలి.
*1. ప్రత్యక్షంగా వెళ్లాల్సిన అవసరం లేదు:*సాధారణంగా ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, అక్కడి అధికారులకు తమ సమస్యను వివరించి, ఫిర్యాదు పత్రాన్ని అందజేయాలని భావిస్తారు. కానీ, చట్టం ప్రకారం, మీరు ప్రత్యక్షంగా స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫిర్యాదును రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపినప్పటికీ, దానిని పోలీసులు స్వీకరించి, తగిన చర్యలు తీసుకోవాలి.
*2. రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు ఎలా చేయాలి?*
*వివరాల నమోదు:* మీ ఫిర్యాదును స్పష్టంగా, సంక్షిప్తంగా మరియు పూర్తి వివరాలతో వ్రాయండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం, సంబంధిత వ్యక్తుల పేర్లు, సాక్ష్యాలు వంటివి తప్పకుండా పేర్కొనండి.
*రుజువులు జతచేయడం:* మీ ఫిర్యాదుకు మద్దతుగా ఏవైనా పత్రాలు, ఫోటోలు, వీడియోలు లేదా ఇతర రుజువులు ఉంటే వాటిని జతచేయండి. ఇది మీ ఫిర్యాదుకు బలాన్ని చేకూరుస్తుంది.
*అక్నాలెడ్జ్‌మెంట్ కార్డు:*
రిజిస్టర్ పోస్ట్ పంపేటప్పుడు “అక్నాలెడ్జ్‌మెంట్ డ్యూ” (Acknowledgement Due) సేవను ఉపయోగించుకోండి. దీనివల్ల మీ ఫిర్యాదు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందినట్లు మీకు అధికారిక రసీదు లభిస్తుంది. ఇది భవిష్యత్తులో అవసరమైతే ఒక ముఖ్యమైన రుజువుగా ఉపయోగపడుతుంది.
*సరైన చిరునామా:* మీరు ఫిర్యాదు చేయదలిచిన పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్) లేదా ఉన్నతాధికారుల చిరునామాను సరిగ్గా వ్రాసి పంపండి.
*3. పోలీసుల బాధ్యత:* రిజిస్టర్ పోస్ట్ ద్వారా అందిన ఫిర్యాదును కూడా పోలీసులు తీవ్రంగా పరిగణించాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, cognizable offence (పోలీసులు వారెంట్ లేకుండా అరెస్టు చేయగల నేరం)కు సంబంధించిన ఫిర్యాదు అందినప్పుడు, పోలీసులు తప్పనిసరిగా FIR నమోదు చేయాలి. ఒకవేళ పోలీసులు చర్య తీసుకోకపోతే, మీరు ఉన్నతాధికారులను లేదా కోర్టును ఆశ్రయించవచ్చు.
*ముగింపు:* ఈ సౌలభ్యం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి భయపడేవారికి, శారీరక ఇబ్బందులు ఉన్నవారికి లేదా మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి ఎంతో ఉపయోగపడుతుంది. న్యాయం పొందడంలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఈ విధానం రూపొందించబడింది. కాబట్టి, మీ హక్కులను తెలుసుకుని, అవసరమైనప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
👉ఆస్తికోసం తల్లిదండ్రులను అమానుషంగా హత్య చేసిన పాగోలు కిరణ్ చంద్ర అనే వ్యక్తికి జీవిత ఖైదు, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ బాపట్ల జిల్లా సెషన్స్ జడ్జి శ్యాంబాబు బుధవారం తీర్పు ఇచ్చారు.గత ఏడాది డిసెంబర్ 14వ తేదీ రాత్రి అప్పికట్లలో ఈ హత్యలు జరిగాయి.పోలీసులు పక్కా ఛార్జ్ షీట్ వేయడంతో పాటు, ప్రాసిక్యూషన్ ముద్దాయి నేరాన్ని కోర్టులో రుజువు చేయడంతో అతనికి జీవిత ఖైదు పడిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు.ముద్దాయికి కఠిన శిక్ష పడేటట్లు చేసిన పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని ఆయన అభినందించారు.కిరణ్ చంద్ర గతంలో చీరాల పోస్టాఫీస్ లో ఉద్యోగం చేసేవాడు*

