👉పార్లమెంట్ వేదికగా బీజేపీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు…
ఎన్నికల సంఘం ఎంపిక ప్యానెల్ నుంచి సీజేఐని ఎందుకు తొలగించారు?…2024 ఎన్నికలకు ముందు ఈసీకి చట్టపరమైన రక్షణ ఎందుకు ఇవ్వబడింది?…45 రోజుల్లోపు సీసీటీవీ ఫుటేజ్‌లను నాశనం చేయడానికి ఏంటి తొందర?…బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఓటు చోరీకి సాధనంగా మారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
👉 *అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: ఏపీ హోంమంత్రి అనిత భరోసా..హోంమంత్రి అనితతో భేటీ అయిన అగ్రిగోల్డ్ బాధితులు…కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్…గత ప్రభుత్వం న్యాయం చేయడంలో విఫలమైందని ఆరోపణ…ప్రతి బాధితుడికి న్యాయం చేస్తామని మంత్రి అనిత భరోసా…
అగ్రిగోల్డ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని బాధితుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సచివాలయంలో నిన్న హోంమంత్రి వంగలపూడి అనితతో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ యూనియన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని, ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి అనిత హామీ ఇచ్చారు.ఈ సమావేశం అనంతరం యూనియన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. 8 రాష్ట్రాల్లోని బాధితుల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.7,386 కోట్లు వసూలు చేసి మోసం చేసిందని తెలిపారు. బాధితులకు న్యాయం చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నాటి సీఐడీ చీఫ్ కేసును నీరుగార్చారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ సాయం అందక రాష్ట్రంలో సుమారు 600 మంది బాధితులు, 500 మంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో 9.50 లక్షల మందికి రూ.3,080 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే కొందరు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను అడ్డుకుంటున్నారని నాగేశ్వరరావు అన్నారు. 14 వేల మంది బాధితులు కొనుగోలు చేసిన స్థలాలను అటాచ్‌మెంట్ల నుంచి తొలగించాలని కోరారు. ఈ కేసుపై వెంటనే సిట్ ఏర్పాటు చేసి, ఆరు నెలల్లోగా న్యాయం చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.బాధితుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి అనిత, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బాధితులు అధైర్యపడి ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ఆమె భరోసా ఇచ్చారు.
👉 ” నేనే రాజు … నేనే మంత్రి ” …ఇంజనీరింగ్ కాలేజీ ఇష్యూ … ప్రధాన మంత్రి ఆఫీసుకు…వైసీపీ నేత ఆలూరు సాంబా శివ రెడ్డీ ఫై ప్రిన్సిపాల్ కంప్లైంట్. ▪ఆ నేత పై భారీగా ఆరోపణలు …*శింగనమల నియోజకవర్గం:*
▪️బ్యాంకులను మోసం చేసిన సాంబా. ▪️నకిలీ ఉద్యోగ స్లిప్పులు … నకిలీ ఉద్యోగులతో భారీగా రుణాలు. *▪️వైసీపీ నేత ఫై … సంచలన వ్యాఖ్యలు చేసిన కాలేజ్ ప్రిన్సిపాల్.*…కాలేజీ అడ్డం పెట్టుకొని … వందల కోట్లు స్కాం …❓* వ్యవస్థను సైతం తన గుప్పెట్లో పెట్టుకున్న వైసీపీ నేత, మరి కొద్ది సంవత్సరాల్లో చీఫ్ మినిస్టర్ స్తాయిలో చూస్తారు …❓…▪️ఇంజనీరింగ్ కాలేజీ ఇష్యూ ఫై స్పంచిన ప్రధాన మంత్రి కార్యాలయం…❓*
👉 కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
స్కూలు పిల్లలను తీసుకెళ్తున్న ఆటో బోల్తా పడి పదవ తరగతి విద్యార్థి మృతి, మరో 14 మంది విద్యార్థులకు గాయాలు….
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామం నుండి ఖండే గ్రామం ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తుండగా బోల్తా పడిన ఆటో…
ఈ ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి ప్రణవ్(15) అక్కడికక్కడే మృతిచెందగా, గాయాలపాలైన మరో 14 మంది విద్యార్థులు…
ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉 తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ నాయకులు హత్య చేసిన ఘటనపై కేటీఆర్ ఆగ్రహం…
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌లతో మాట్లాడి పరిస్థితులను ఆరా తీసిన కేటీఆర్…
అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న అరాచకాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు…
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం…కార్యకర్తలలు ఎవరు అధైర్యపడొద్దు.. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం… మరణించిన కార్యకర్త కుటుంబానికి మరియు గాయపడిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుంది.. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్..
👉హ్యాట్సాఫ్ అనిల్ అగర్వాల్ …21,000 కోట్ల రూపాయల విరాళం… బీహార్ నుంచి లండన్ వెళ్లి స్థిరపడిన, వైశ్య కులానికి చెందిన అనిల్ అగర్వాల్ భారత దేశంలో ఉన్నత విద్యా వ్యాప్తి కోసం 21,000 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.ఈ డబ్బుతో Oxford University కంటే పెద్ద విశ్వవిద్యాలయయాలు స్థాపించి వాటిని No profit – No loss పద్ధతి లో నడపాలని కోరారు. ఇప్పటివరకు భారత దేశంలో విద్య కోసం ఇచ్చిన విరాళాల లో ఇదే అతిపెద్ద విరాళమని అంటున్నారు…
👉నంద్యాల : శ్రీశైలంలో దొంగల ముఠా హల్‌చల్.*
*అర్థరాత్రి షాపుల్లోకి చొరబడి దొంగతనం చేస్తున్న ముఠా.*
*శ్రీశైలంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్‌లోని సీసీ కెమెరాల్లో దొంగల ముఠా వీడియోలు రికార్డు.* పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానిక వ్యాపారులు.*
**బ్రహ్మంగారి మఠం ఉపాధి కార్యాలయంలో రక్తపు అడుగుల కలకలం..కడప జిల్లా..
ఉదయం స్వీపర్ తలుపులు తెరవగానే కనబడ్డ రక్తపు మరకలు..భయాందోళనకు గురై అధికారులకు సమాచారం ఇచ్చిన స్వీపర్..ఉపాధి అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు..విచారణ చేపట్టిన బ్రహ్మంగారిమఠం ఎస్సై శివప్రసాద్..మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
👉కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట ఇత్తడి పరిశ్రమ కార్మికుల సాధక బాధలను స్వయంగా తెలుసుకునేందుకు మైదుకూరుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన మైదుకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏపీ రవీంద్ర.
👉మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం*
రంగారెడ్డి జిల్లా:
రాచకొండ కమిషనరేట్‌కు చెందిన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ నుండి మందమల్లమ్మ చౌరస్తా ప్రధాన రహదారి వద్ద, దాదు నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
అధిక వేగంతో వస్తున్న కారు ఆకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
👉కుల్సుంపుర ఏసీపీ మునావర్‌పై తీవ్రమైన చర్య: అవినీతి ఆరోపణలతో హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్*

హైదరాబాద్ పోలీస్ వ్యవస్థలో మరోసారి క్రమశిక్షణా చర్యలు చోటుచేసుకున్నాయి. కుల్సుంపుర ఏసీపీ మునావర్‌ను తక్షణమే హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఏసీపీ మునావర్‌పై పలు తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి
• అవినీతి వ్యవహారాలు
• భూ వివాదాల్లో జోక్యం
• కేసుల తారుమారు
• స్టేషన్ల వారీగా వసూళ్ల కోసం ప్రత్యేక టీంల ఏర్పాటు
ఈ ఆరోపణల నేపథ్యంపై కమిషనర్ స్థాయి వరకు ఫిర్యాదులు చేరడంతో, సీపీ స్వయంగా విషయంపై కఠినంగా స్పందించినట్లు సమాచారం.
పోలీసు సిబ్బందిని అవమానించే విధంగా మునావర్ ప్రవర్తించాడన్న ఆరోపణ కూడా కమిషనర్ దృష్టికి వెళ్లడంతో, విచారణను వేగవంతం చేశారు. అందిన ఫ్యాక్ట్-ఫైండింగ్ రిపోర్ట్ ఆధారంగా మునావర్‌ను ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి హెడ్‌క్వార్టర్స్‌కు పంపించారు.
పోలీసు శాఖలో క్రమశిక్షణ, పారదర్శకతకు భంగం కలిగించే ఏ చర్యనైనా సహించబోమన్నది ఈ నిర్ణయంతో స్పష్టమైందని వర్గాలు చెబుతున్నాయి.
👉సికింద్రాబాద్‌లో దారుణం..!!*
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన తమ కూతురు(13) అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి..
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్ పరిధిలోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..
ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ బస్టాండ్ పరిధిలో సంచరిస్తున్న బాలికను, మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడిన నలుగురు..ఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఇద్దరికి 19 ఏళ్లు.. మరో ఇద్దరికి 17 ఏళ్లు.. పోక్సో కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించి, మైనర్లను జువైనల్ హోంకు తరలింపు..!!
👉అమీన్‌పూర్‌లో దారుణం: ప్రేమ వ్యవహారంపై శ్రావణసాయి హత్య*
యువతి బంధువుల ఆగ్రహానికి బలి అయిన యువకుడు..‘పెళ్లి విషయం మాట్లాడుదాం’ అంటూ ఇంటికి పిలిచి నరమేధం..సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని లక్ష్మీనగర్‌లో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానిక యువకుడు శ్రావణ సాయిను దారుణంగా హతమార్చిన ఘటనతో ప్రాంతం కలకలం రేగింది. యువతి పట్ల ప్రేమతో ఉండటాన్ని యువతి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ‘పెళ్లి విషయం మాట్లాడుకోవాలి’ అని చెప్పి శ్రావణసాయిని ఇంటికి పిలిపించిన యువతి తల్లిదండ్రులు, బంధువులు అక్కడే అతడిపై దాడి చేసి తీవ్రమైన గాయాలతో హతమార్చినట్లు సమాచారం.పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కలకలం రేపిన హత్యతో అమీన్‌పూర్ ప్రాంతంలో తీవ్ర ఆవేదన నెలకొంది.
👉 సికింద్రాబాద్‌లో దారుణం..!!*
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీన తమ కూతురు(13) అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి..
సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలిక సికింద్రాబాద్ పరిధిలోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..
ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ బస్టాండ్ పరిధిలో సంచరిస్తున్న బాలికను, మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడిన నలుగురు..ఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఇద్దరికి 19 ఏళ్లు.. మరో ఇద్దరికి 17 ఏళ్లు.. పోక్సో కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించి, మైనర్లను జువైనల్ హోంకు తరలింపు..!!

