👉రండి.. మా ముత్తాత గురించి చ‌ర్చిద్దాం: మోడీకి ప్రియాంక అదిరిపోయే కౌంట‌ర్‌ !!! …👉 సీఎం రేవంత్ కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం…👉సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే: ఏపీ సీఎం చంద్రబాబు…👉డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన బీజేపీ మంత్రి సోదరుడు…👉మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ రేప్.. నిందితుడి పై ఫోక్సో కేసు నమోదు.. 👉కుక్కల దాడిలో వ్యక్తి మృతి…. 👉నెల్లూరులో బస్ డ్రైవర్, కండక్టర్ పై బ్లేడ్లతో దాడి… నిందితులతో పరేడ్ చేయించిన పోలీసులు*

👉రండి.. మా ముత్తాత గురించి చ‌ర్చిద్దాం: మోడీకి ప్రియాంక అదిరిపోయే కౌంట‌ర్‌ అయితే.. ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్న స‌మ‌యంలో బీజేపీ స‌భ్యులు తీవ్ర‌స్థాయిలో ఎదురు దాడి చేశారు. ఒక‌ర‌కంగా.. లోక్‌స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం సృష్టించారు. స‌మావేశాల్లో సోమ‌వారం లోక్‌స‌భ‌లో ఆస‌క్తిక‌ర ఘ‌ట్టం జ‌రిగింది. జాతీయ గేయం వందేమాత‌రంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వందేమాత‌రం గేయాన్ని చిదిమేశార‌ని.. దీనిలో పంక్తుల‌ను కుదించి అవ‌మానించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. వందేమాత‌రంపై చ‌ర్చ‌లో సుమారు 45 నిమిషాల పాటు ప్ర‌ధాని మాట్లాడారు. ఇందిర‌మ్మ స‌హా.. నెహ్రూ పాల‌న‌ల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. సాయంత్రం అదే లోక్‌స‌భ‌లో మాట్లాడిన కాంగ్రెస్ నాయ‌కురాలు, వైనాడ్‌(కేర‌ళ‌) ఎంపీ ప్రియాంక గాంధీ.. ప్ర‌ధాని మోడీ స‌హా బీజేపీ నాయ‌కుల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. “ఎప్పుడు ఏ అంశంపై చ‌ర్చ జ‌రిగినా.. మా ముత్తాత‌(నెహ్రూ) ప్ర‌స్తావ‌న లేకుండా ఉండ‌డం లేదు.

మాకంటే ఎక్కువ‌గా ఆయ‌న‌ను మీరు(బీజేపీ) క‌ల‌వ‌రిస్తున్నారు. మంచిదే. కానీ, దేశంలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. వాటిని వ‌దిలేసి.. మా ముత్తాత చుట్టూ మీరు తిరుగుతున్నారు. ప్ర‌జ‌లు, వారి స‌మ‌స్య‌లు, దేశ భ‌విత‌వ్యాన్ని కూడా ఫ‌ణంగా పెడుతున్నారు. ఇది మీకు విన‌సొంపుగా ఉంటుంది(నెహ్రూపై విమ‌ర్శ‌లు)“ అని వ్యాఖ్యానించారు. ఇదేస‌మ‌యంలో ప్రియాంక గాంధీ కీల‌క సూచ‌న చేశారు. త‌ర‌చుగా ఏ చ‌ర్చ వ‌చ్చినా నెహ్రూ గురించి ప్ర‌సంగించ‌డం ఎందుక‌ని.. వందేమాత‌రం గేయంపై ఏ విధంగా అయితే చ‌ర్చ పెట్టారో.. అలానే త‌న ముత్తాత‌(నెహ్రూ)పైనా ఒక రోజు రోజంతా చ‌ర్చ పెట్టాల‌ని ఆమె సూచించారు. “ఆ రోజు పూర్తిగా మీరు నెహ్రూ గురించి ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారో.. అంతా చెప్పేయండి.. ఏం తిట్టా లని అనుకుంటున్నారో అంతా తిట్టేయండి. ఇక్క‌డితో ఛాప్ట‌ర్ క్లోజ్ అయిపోతుంది. అంతేకానీ.. ప్ర‌తిసారీ చ‌ర్చ‌ల్లో నెహ్రూ ప్ర‌మేయం ఎందుకు? ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు లేవా?. వాటిని ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌రం లేదా“ అని ప్రియాంక ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్న స‌మ‌యంలో బీజేపీ స‌భ్యులు తీవ్ర‌స్థాయిలో ఎదురు దాడి చేశారు. ఒక‌ర‌కంగా.. లోక్‌స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం సృష్టించారు. అయిన‌ప్ప‌టికీ ప్రియాంక గాంధీ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా ప్ర‌సంగించ‌డం.. మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆమె చుర‌క‌లు అంటించ‌డం గ‌మ‌నార్హం. దీనిపై లోక్‌స‌భ స్పీక‌ర్ చిరున‌వ్వులు చిందించారు. మ‌రోవైపు.. బీజేపీ స‌భ్యుల ఆందోళ‌న‌ను కాంగ్రెస్ ప‌క్ష స‌భ్యులు త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ స‌భ్యులు అరుస్తుంటే వారించ‌రా? అని ప్ర‌శ్నించారు.

👉 సీఎం రేవంత్ కాన్వాయ్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం… హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై పేలిన‌ జామర్ వాహనం టైర్… డ్రైవర్ అప్రమత్తతతో త‌ప్పిన‌ పెను ప్రమాదం…గతంలోనూ రేవంత్ కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనే…  సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఎగ్జిట్ 17 వద్ద వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్‌లోని జామర్ వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో ప్రమాదం తప్పింది.ఈ ఘటనతో కాన్వాయ్‌లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జామర్ వాహనానికి స్టెప్నీ టైర్‌ను అమర్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్‌లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా, వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్‌లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో కాన్వాయ్‌లోని వాహనాల భద్రతపై అధికారులు దృష్టి సారించారు.

👉సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే: ఏపీ సీఎం చంద్రబాబు…ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు

ఆర్టీసీ సేవలు మెరుగుపరచాలని, డ్రోన్ల వినియోగం పెంచాలని నిర్దేశం…రిజిస్ట్రేషన్ పత్రాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపేలా చర్యలు…’మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్’పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన… వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పారదర్శక పాలన అందించడంతో పాటు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా అన్ని సేవలను అందించాలని సీఎం నిర్దేశించారు. ఇందుకు ‘మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్’ను సమర్థంగా వినియోగించుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అవి వెంటనే తమ పద్ధతి మార్చుకుని ఆన్‌లైన్‌ బాట పట్టాలని చంద్రబాబు అన్నారు..  ఈ సందర్భంగా పలు శాఖలకు ముఖ్యమంత్రి నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెంట్లను కొరియర్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పంపాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్లలో, ముఖ్యంగా టాయిలెట్ల వద్ద పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతుందని, వాటి సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పారు. పురుగు మందుల వాడకాన్ని తగ్గించేందుకు డ్రోన్లను ఎలా ఉపయోగించవచ్చో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

👉డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన బీజేపీ మంత్రి సోదరుడు…మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు..బీజేపీ మంత్రి ప్రతిమ బాగ్రి సోదరుడు అనిల్ బాగ్రి నుండి తమకు డ్రగ్స్ వచ్చాయని పోలీసులకు తెలిపిన నిందితులు.. దీంతో అనిల్ బాగ్రి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు .. తన సోదరుడి డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిన విషయంపై స్పందించమని అడగగా, జర్నలిస్టుల మీద మండిపడుతూ వెళ్లిపోయిన బీజేపీ మంత్రి ప్రతిమ బాగ్రి

👉మైనర్ బాలికపై ర్యాపిడో ఆటో డ్రైవర్ రేప్.. నిందితుడి పై ఫోక్సో కేసు నమోదు.. తిరుపతి .. ఓ కళాశాలలో విద్యనభ్యసిస్తూ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న విద్యార్థి.. ఓ హాస్టల్ నుండి మరొక హాస్టలకు షిఫ్ట్ అవుతూ ఆటో డ్రైవర్ తో పరిచయం..ఫోన్ లో పరిచయం పెంచుకున్న ఆటో డ్రైవర్ ఏదైనా సహాయం కావాలంటే చేస్తానంటూ వల..ధన సహాయం చేస్తానంటూ మైనర్ బాలికను మభ్యపెట్టి ఆటో డ్రైవర్ మాయ మాటలతో రూమ్ కు తీసుకెళ్లి అత్యాచారం. బయట చెపితే చంపేస్తానంటూ విద్యార్థిని బెదిరింపులకు గురిచేసిన ఆటో డ్రైవర్.. స్నేహితురాలితో కలిసి మైనర్ బాలిక అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. నిందితుడుపై క్రైమ్ నెంబర్ 448/2025 ఫోక్సో యాక్ట్ 2012 క్రింద కేసు నమోదు.. నిందితుడిని పట్టుకొనే పనిలో అలిపిరి పోలీసులు.

👉అయ్యో…మాయదారి వీధి కుక్కలు ఎంత పని చేశాయి….అర్థరాత్రి ఇంటికెళ్తుండగా వెంటపడ్డ కుక్కలు….తప్పించుకునే ప్రయత్నం లో …ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు😱

బైక్‌ ఇంటికెళ్తుండగా.. కుక్కలు వెంబడించడంతో.. వాటిని తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి.. బైక్‌పై నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రాయచోటిలోని లక్ష్మీపురంలో నివాసం ఉండే ఫజిల్ (42) ఆదివారం రాత్రి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్ స్టేషన్ దారి గుండా ద్విచక్ర వాహనంపై తన ఇంటికి వెళుతున్నాడు. అయితే అతన్ని చూసిన కొన్ని వీధికుక్కలు.. బైక్‌ను వెంబడించాయి.దీంతో ఏం చేయాలో అర్థం కాక.. కుక్కల నుంచి తప్పించుకునేందుకు తన వాహనాన్ని అతి వేగంగా నడపాడు ఫజిల్.. ఈ క్రమంలో అనుకోకుండా ఎదురుగా ఉన్న గుడిని బలంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన ఫజిల్ అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే విషయాన్ని పోలీసులు తెలియజేశారు. సమాచారం అందుకున్న రాయచోటి ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేమాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణంలో రోడ్లపై ఎక్కడికక్కడ కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని అనేకసార్లు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా వారిలో మాత్రం ఎటువంటి చలనం లేదని పట్టణవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రావస్త నుంచి బయటికి వచ్చి మరో ప్రాణం బలి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

👉నెల్లూరులో బస్ డ్రైవర్, కండక్టర్ పై బ్లేడ్లతో దాడి… నిందితులతో పరేడ్ చేయించిన పోలీసులు*

నెల్లూరులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై కత్తులతో దాడి… బైక్ పక్కకు తీయమన్నందుకు దుండగుల ఘాతుకం… నిందితులను అరెస్ట్ చేసి నడిరోడ్డుపై నడిపించిన పోలీసులు.. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!