👉కంటైనర్ ను ఆపింది ఏఎస్ఐ కుమారుడే..!😲😲
చిలకలూరిపేట గ్రామీణ బైపాస్ లో ఈ నెల నాలుగున ఘోర ప్రమాదం..ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి చిక్కుముడి వీడింది..ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న భారీ కంటైనర్ ను ఓ కారులో వెళ్తున్న వ్యక్తి ఆపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు*
*కంటైనర్ ను ఆపిన వ్యక్తి నరసరావుపేట డిఎస్పీ కార్యాలయంలో పనిచేసే ఏఎస్ఐ కుమారుడే అని గుర్తించారు*. *ట్రాక్టర్ల లోడ్ కంటైనర్ ను పక్కన ఆపాలని కారులో నుంచి దిగి చేతితో సైగ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడింది*.
*బ్రేక్ ఇన్స్పెక్టర్ గా అవతారం ఎత్తి జాతీయ రహదారులు బైపాస్ లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏఎస్ఐ కుమారుడి లీలలు బయటకు వస్తున్నాయి*. *2023లో తక్కువ ధరకే బంగారం పేరిట కారు 40 లక్షలతో ఉడాయించాడు*ఇందులో తండ్రి హస్తం కూడా ఉందని అప్పట్లోనే నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఈ కేసు ఎస్పీ వద్ద ఉంది కుర్రాళ్లతో ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు గంజాయి సరఫరా విక్రయాలు చేస్తూ కాలేజీ విద్యార్థులను మత్తులోకి దింపుతున్నాడు,వేరు,వేరు చోట్ల రిజిస్టర్ అయిన ఖరీదైన కార్లు ఇతను వద్ద ఐదు ఉన్నాయి*.
*ఇవి ఎలా సంపాదించాడు ఎవరి పేరు రిజిస్టర్ అయి ఉన్నాయనేది పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది*
*పలుకుబడి ఉపయోగించుకొని కొన్నేళ్లుగా నరసరావుపేట లోనే పోస్టింగ్ వేయించుకుంటూ కుమారుడి నేరాలకు తండ్రి సహకరిస్తున్నట్లు పోలీస్ శాఖలోని చర్చ నడుస్తుంది*ఆదివారం చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు ఏఎస్ఐ కుమారుడిని నరసరావుపేట నుంచి తీసుకెళ్లి రహస్యంగా విచారిస్తన్నట్లు సమాచారం*
👉నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం: మీర్‌చౌక్ ఏసీపీ* …తెలంగాణ : హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‌చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. ‘శనివారం సా.6.30 తర్వాత మహిళ ఏసీపీ కార్యాలయానికి వచ్చింది. ఆమెతో మాట్లాడే క్రమంలో నాతో సీసీ, హోంగార్డ్ ఉన్నారు. మహిళ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆరోపణలపై విచారణ జరిపిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని శ్యామ్ సుందర్ తెలిపారు.
👉భార్యతో వివాహేతర సంబంధం.. భర్తను చంపిన ప్రియుడు అరెస్ట్* ఆంధ్రప్రదేశ్ : పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులో గత నెల 24న జరిగిన పెద్దబాజీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు బాలసుబ్రమణ్య చారి, రాంబాయమ్మలను ఈ నెల 6న అరెస్టు చేసినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. హత్యకు గురైన పెద్దబాజీ భార్యతో బాలసుబ్రమణ్య చారికి వివాహేతర సంబంధం ఉందని, దీనిపై వివాదం నడుస్తుండటంతోనే బాజీని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడని, దీనికి నిందితుడి అత్త సహకరించినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య షేక్. జబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
👉పిచ్చి కుక్క స్వైర విహారం.. 36 మందిపై దాడి*తెలంగాణ
రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ పట్టణంలో పిచ్చి కుక్క స్వైర విహారంతో 36 మంది గాయపడ్డారు. రోడ్డుపై కనిపించిన వారిందరిని పిచ్చి కుక్క కరుచుకుంటూ వెళ్లింది. దాంతో ఆగ్రహించిన బాధితులు కుక్కను చంపివేశారు. పిచ్చి కుక్క దాడిలో గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. 36 మందిని కుక్క కరిచిందని.. వారికి చికిత్స అందించామని వైద్యులు వెల్లడించారు.
👉 *బీ కేర్ ఫుల్..పొలాలకి వెళ్లే వారు…ఊరి చివర ఉండేవారు.,మిద్దె,గుడిసె ఇళ్లలో ఉండే వాళ్ళు….ఈ చిన్న పురుగు తో జాగ్రత్త లేదా…తీవ్ర పరిణామాలు తప్పవు…..ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. ఈ కీటకం చిన్నదే కానీ ప్రాణాలు సైతం తీస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిందే..!*
మూడేళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ ఇప్పుడు ఏపీని వణికిస్తోంది. ఇప్పటికే.. చిత్తూరు, కాకినాడ, విశాఖ,పల్నాడు, విజయనగరం జిల్లాల్లో కేసులు బయటపడ్డాయి. విశాఖలో రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి.అంతేకాదు… మరణాలు సంభవిస్తుండటం తెగ టెన్షన్ పెడుతోంది.
పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఇంటర్ విద్యార్థిని జ్యోతి మరణించగా… లేటెస్ట్‌గా మరొకరు మృతిచెందారు. గుంటూరు GGHలో స్క్రబ్ టైఫస్ చికిత్స పొందుతూ ధనమ్మ అనే వృద్దురాలు మరణించింది. తీవ్ర జ్వరం, విరేచనాలతో గత నెల 18న ఆస్పత్రిలో చేరిన ధనమ్మకు అప్పట్నుంచి చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఆమె ప్రాణాలు నిలబెట్టేందుకు డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. చివరకు ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విజయనగరంలోనూ మూడు రోజుల క్రితం మరో మహిళ ప్రాణాలు కోల్పోయింది.ఇక లేటెస్ట్‌గా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయి. అనారోగ్యంతో ఇందిరా కాలనీకి చెందిన అమరేశ్వరి ఆస్పత్రిలో చేరింది. ఇటు పామర్రులోని కోరముక్కువారిపాలెంకు చెందిన మానస అనే మరో మహిళ కూడా జ్వరంతో బాధ పడుతోంది. గుడ్లవల్లేరులో రక్త పరీక్షలు చేయగా స్క్రబ్ టైఫస్ అని నిర్ధారించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారుఅలాగే ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య నాలుగు అయ్యింది. ఫలితంగా డాక్టర్లు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..ఇప్పటికే దోమలు తెగ కుట్టేస్తున్నాయ్. సందట్లో సడేమియాల్లా ఇలాంటి స్ర్కబ్ వైరస్‌లు వచ్చేస్తున్నాయ్. సో… మరో రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందేనల్లిని పోలిన కీటకం కుట్టడంతో స్కబ్ టైఫస్ వ్యాధి సోకుతందని డాక్టర్లు పేర్కొంటున్నారు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడం, జ్వరం, వాంతులు,తల, ఒంటి నొప్పులు, పొడి దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది..మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు.. కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాలమీదికి తెస్తుంది. అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పన్లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగానూ ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్. బీఅలర్ట్.
👉 ఏపీలో ఉపాధ్యాయులను నిరంతరం మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నట్టు యూటీఎఫ్ ఆక్షేపించింది.
రెండో శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవుల్లో కూడా టీచర్లతో పనులు చేయించడం అన్యాయం అని పేర్కొంది. రోజుకో కొత్త స్కీమ్ పేరుతో ఒత్తిడి పెంచుతున్నారని, టెన్త్ బోధించే ఉపాధ్యాయులకు విశ్రాంతి లేకుండా పనిచేయించడం బాధాకరమని తెలిపింది. టెన్త్ 100% పాస్ రేటు కోసం రోజూ సాయంత్రం పరీక్షలు పెట్టి మార్కులు అప్లోడ్ చేయించడం టీచర్లను మానసికంగా వేధించడమే అని UTF విమర్శించింది.
👉హైదరాబాద్‌లో మరో దారుణ హత్య
గన్‌తో కాల్చి, కత్తులతో దాడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హతమార్చిన దుండగులు
హైదరాబాద్ – జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా ప్రాంతం సాకేత్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట రత్నం(54) అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన దుండగులు…గన్‌తో కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
👉ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్!*
*గంట ఆలస్యమైతే ఆబ్సెంట్ ఎందుకయ్యారంటూ మెసేజ్!*
*ఎఫ్ఆర్ఎస్ ఆధారంగా మెసేజ్ పంచాలని భావిస్తున్న అధికారులు*
*ఇప్పటికే ఎపిలో అమలులో ఉన్న విధానం*
*తెలంగాణలోనూ అమలుకు పాఠశాల విద్యాశాఖ యోచన*
*రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆలస్యంగా వచ్చే వారికి పాఠశాల విద్య శాఖ అధికారులు షాక్ ఇవ్వనున్నారు. గంట ఆలస్యమైతే ఉపాధ్యాయులకి మెసేజ్ వెళ్లనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల అధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల్లో విద్యార్థులతో పాటు, సిబ్బంది హాజరు కోసం ఫేషియల్ రిక్నగేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్)ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎఫ్ఆర్ఎస్ అమలు మూలంగా పాఠశాలలకు రెగ్యులర్ గా హాజరుకాని 3 విద్యార్థుల పేరెంట్స్, వారంలో ఎక్కువ రోజులు హాజరు కాని విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లవాడు పాఠశాలకు హాజరు కాలేదని తెలుపుతూ మెసేజ్ లను పంపిస్తున్నారు. తాము రెగ్యులర్ గా స్కూల్ రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ లు వెళుతుండటంతో విద్యా ర్థులు క్రమం తప్పకుండా పాఠశాలకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇటు విద్యార్థులతో పాటు.. అటు ఉపాధ్యా యుల హాజరు కూడా గణనీయంగా పెరిగింది. విద్యార్థుల హాజరు 70 నుంచి 75 శాతం వరకు ఉంటుండగా.. టీచర్లు అటెండెన్స్ సుమారు 80 నుంచి 85 శాతం వరకు ఉంటుంది. విద్యార్థులు పాఠశాలకు హాజరు కాకపోతే వారి తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపిస్తున్నట్టుగానే.. పాఠశాలకు అనుమతి లేకుండా హాజరుకానీ ఉపాధ్యాయులకు కూడా మెసేజ్ లు పంపించాలనే యోచనలో పాఠశాల విద్య శాఖ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.*
దీంతోపాటు పాఠశాలు ప్రారంభమైన తరువాత గంట లోపుగా ఉపాధ్యాయుల హాజరు లేకపోతే.. వెంటనే ఆయా ఉపాధ్యాయులకి సంబంధిత పాఠశాల హెడ్మాష్టర్(హెచ్ఎం) ద్వారా గానీ లేకపోతే మండల విద్యాధికారి (ఎంఈవో) గానీ ఎందుకు పాఠశాలకు హాజరుకాలేదని పేర్కొంటూ మెసేజ్ చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలు స్తోంది. తద్వారా ఆ ఉపాధ్యాయుడు, ఉపాధ్యా యురాలు పాఠశాలకు రాకపోవడానికి కారణం సెలువు తీసుకున్నారా? లేకపోతే ఆలస్యంగా వస్తామని అనుమతి తీసుకున్నారా? అదికాకపోతే ఇంకేదైనా కారణం ఉందా? అనేది ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు తనకు వచ్చిన మెసేజ్ కు ఇచ్చే సమాధానం ఆధారంగా ఉన్నతా ధికారులు తెలుసుకునే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు సెలవు తీసుకోకుండా, అనుమతి లేకుండా పాఠశాలకు హాజరుకాకుండా ఉండే పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులు ఇటువంటి నిర్ణయం తీసుకోన్నుట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 26,417 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉండగా.. వాటిలో సుమారు 1.08 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు.*

