👉చరిత్రలో ఎన్నడూ రీతిలో హైదరాబాద్ లో ‘ఆపరేషన్ కవచ్’👉ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకోని పోలీసులు….👉తహసీల్దార్ కార్యాలయం ఎదుట శవంతో ధర్నా…👉విద్యార్థిని కుటుంబానికి రూ. 3 లక్షల రూపాయల చెక్కు అందచేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల

👉చరిత్రలో ఎన్నడూ రీతిలో హైదరాబాద్ లో ‘ఆపరేషన్ కవచ్’: సజ్జనార్….ఆపరేషన్ కవచ్ పేరుతో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెల్లడి…రాత్రి 10 గంటల నుంచి నాకాబందీ నిర్వహిస్తున్నామన్న సజ్జనార్… 5,000 మంది పోలీసు సిబ్బందితో ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు

హైదరాబాద్ నగరంలో ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో నాకాబందీ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కమిషనరేట్ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేసే దిశగా, రాత్రి 10 గంటల నుంచి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ చరిత్రలోనే మొదటిసారి దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామన్నారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో శాంతిభద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నట్లు చెప్పారు. ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తిగా సహకరించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

👉ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకోని పోలీసులు… ఐబొమ్మ రవి కేసు విషయంలో పోలీసులకు స్పష్టత ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఇప్పటికి రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారు. మూడో సారి కూడా కస్టడీకి కావాలని పిటిషన్ వేసి మూడు రోజుల అనుమతి తెచ్చుకున్నారు. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ప్రశ్నించాల్సి ఉంది. అనూహ్యంగా పోలీసులు యూటర్న్ తీసుకున్నారు. ఆయనను కస్టడీకి తీసుకోకుండా కోర్టులో పిటిషన్ వేశారు. మూడురోజుల సమయం సరిపోదని ఆ పిటిషన్ సారాంశం…మూడో సారి కస్టడీకి అనుమతి పొంది… మూడు రోజులు సరిపోదని పిటిషన్ వేయడం పోలీసులకే చెల్లింది. ఇంకా కొన్ని రోజులు కావాలని అడిగేందుకు ఇప్పుడు కస్టడీకి తీసుకోకపోవడం కూడా విచిత్రంగా ఉంది. కావాలంటే మూడు రోజులు ప్రశ్నించి తర్వాత ఇంకా సమాచారం రాబట్టాలని ఉందని పిటిషన్ వేసుకోవచ్చు. కానీ అలా చేయలేదు.అసలు కస్టడీకే తీసుకోలేదు. దీని వెనుక బెయిల్ రాకుండా చేయాలన్న వ్యూహం ఉందన్న అనుమానాలు రవి తరపు లాయర్లలో వ్యక్తమవుతున్నాయి…మూడు రోజుల కస్టడీకి వచ్చినందున కస్టడీ పూర్తయిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని కోర్టు చెప్పింది. మూడురోజుల కస్టడీ తీసుకుంటే తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులాగే..టెక్నికల్ అంశాలతో ముడిపడిన పైరసీ కేసునూ సాక్ష్యాలతో నిరూపించడం సాధ్యం కాకపోవచ్చు. బలమైన ఆధారాలు దొరికాయో లేదో స్పష్టతలేదు. ఆయన పైరసీ చేయలేదని .. టెలిగ్రామ్ లో కొన్నారని పోలీసులు చెబుతున్నారు. అక్కడే కేసు తేలిపోయిందని లాయర్లు అంటున్నారు. అయితే ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

👉విద్యార్థిని కుటుంబానికి రూ. 3 లక్షల రూపాయల చెక్కు అందచేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల

అర్ధవీడు మండలం, వెలగలపాయ గ్రామానికి కొటారి మనోహరమ్మ ల కుమార్తె కొటారి కర్ణ రాచర్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతుండగా ఆగష్టు 16 వ తేదీన ఆనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. జరిగిన సంఘటనను గిద్దలూరు శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు డోలా  శ్రీబాల వీరాంజనేయ స్వామి  దృష్టికి తీసుకెళ్లారు.. వెంటనే స్పందించిన మంత్రి  ప్రభుత్వం నుండి రూ. 3,00000-00 అక్షరాల మూడు లక్షల రూపాయలు మంజూరు చేయించారు. గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి  శనివారం ఉదయం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చెక్కును చిన్నారి కొటా కర్ణ, తల్లి మనోహరమ్మ వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో అర్ధవీడు మండల టీడీపీ నాయకులు బియ్యాల నారాయణ, పాఠశాల ప్రిన్సిపాల్ మేరీ మంజులదేవి పాల్గోన్నారు..
👉తహసీల్దార్ కార్యాలయం ఎదుట శవంతో ధర్నా
గుంటూరు జిల్లా కారంపూడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం ఉద్రిక్తత నెలకొంది. పొలం సంబంధిత వివాదంలో రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన బత్తుల ముసలయ్య (45), తండ్రి కోటయ్య అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ముసలయ్య మృతదేహాన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు ఉంచి బంధువులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు.
👉తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం…ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లైంగికంగా వేధించి లోబర్చుకొని, గర్భిణీని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్…అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఆ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించిన మరో ప్రొఫెసర్…ఆ దృశ్యాలను చూపించి బెదిరించి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన మరో ప్రొఫెసర్… జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని…కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన వైస్ ఛాన్సలర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి…విశ్వవిద్యాలయం నుండి ఒరిస్సాకు వెళ్ళిపోయిన విద్యార్థిని… స్థానిక పోలీస్ స్టేషన్‌లో లక్ష్మణ్ కుమార్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యూనివర్సిటీ స్టాఫ్…బాధిత విద్యార్థినిని ఫిర్యాదు చేయమని సూచించిన పోలీసులు…..

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!