👉తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో నకిలీ ఉద్యోగులు..👉చంద్రబాబు అసమర్థత వల్లే రైతుల ఆత్మహత్యలు: వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం…👉 గాంధీ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత….. 👉విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత : మెగా పేరెంట్స్ మీటింగ్ లో మంత్రి డాక్టర్ డోలా శ్రీ

👉తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో నకిలీ ఉద్యోగులు.. !!!😲😲😲 అవినీతి అధికారులతో కలిసి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల చేతివాటం..విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. మంత్రులు, అధికారుల పేచీల్లో ఫేక్ ఉద్యోగులు..ప్రతి నెలా శాలరీల పేరుతో రూ. కోట్ల ప్రజాధనం లూటీ..గత సర్కారు హయాంలో భారీగా చేరిన అక్రమ ఉద్యోగులు..గత ప్రభుత్వ హయాంలో కీలక వ్యక్తికి చెందిన ఏజన్సీ నుంచి భారీ గా రిక్రూట్మెంట్..ఆర్థిక శాఖ విచారణలో భాగోతం వెలుగులోకి..

*కారులో కోట్ల హవాలా నగదు*..*హైదరాబాద్*

బోయిన్పల్లి పరిధిలో కారులో భారీగా నగదు లభ్యం కావడం కలకలం రేపింది. బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కారు టైరు, సీట్ల కింద తరలిస్తున్న రూ.4 కోట్ల హవాలా నగదును పట్టుకున్నారు. దీన్ని తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై పోలీసులు ఏడాదిగా నిఘా ఉంచారు.

👉చంద్రబాబు అసమర్థత వల్లే రైతుల ఆత్మహత్యలు…  సినిమా టికెట్లకిచ్చే మద్దతు ధర.. రైతు పండించిన పంటకు ఇవ్వలేరా?… అరటి రైతు నాగలింగం ఆత్మహత్య రాష్ట్రంలో అన్నదాతల దుస్థితికి నిదర్శనం …వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం…***వెల్లుట్లలతో రైతు నాగలింగం అంత్యక్రియల్లో అనంత, శైలజానాథ్‌… కుటుంబ సభ్యులకు ఓదార్పు.. అండగా ఉంటామని భరోసా …రైతు నాగలింగం ఆత్మహత్యను వక్రీకరిస్తారా? : శైలజానాథ్‌… కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ …👉 ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత కారణంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. సినిమా టికెట్లకు మద్దతు ధర ఇచ్చే ఈ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అరటి ధరలు అమాంతం పడిపోవడంతో పంట సాగుకు చేసిన అప్పు తీర్చే మార్గం లేక శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం ఉదయాన్నే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఎల్లుట్ల గ్రామానికి వెళ్లి రైతు నాగలింగం కుటుంబాన్ని ఓదార్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రైతు నాగలింగం ఆత్మహత్య రాష్ట్రంలోని అన్నదాతల దయనీయ పరిస్థితిని ప్రతిబింబిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతాంగం అష్టకష్టాలు పడుతోందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక నష్టాలపాలై.. అప్పులబారి నుంచి బయటకు వచ్చే మార్గం లేక దయనీయ స్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1996 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జిల్లాలో రైతుల వలసలు, ఆత్మహత్యలు అధికంగా జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ అలాంటి పరిస్థితి వస్తోందని తాము హెచ్చరిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాను ఆత్మహత్యలకు నిలయంగా మార్చొద్దని ముఖ్యమంత్రి నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశామని, అయినా రైతులను ఆదుకునే చర్యలు తీసుకోలేదన్నారు. అరటి రైతు నాగలింగం ఆత్మహత్యను కూడా ప్రభుత్వం వక్రీకరిస్తుండడం బాధాకరమన్నారు. సినిమా టికెట్లకు మద్దతు ధర ప్రకటించే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు రైతు పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించలేరా? అని ప్రశ్నించారు. ‘‘మీ నిర్లక్ష్యం, మీ అసమర్థత, దద్దమ్మ ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు’’ అని ధ్వజమెత్తారు. రైతు నాగలింగం మృతదేహానికి చట్టానికి విరుద్ధంగా పోస్టుమార్టం నిర్వహించి పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారని దుయ్యబట్టారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని తెలిపారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుందని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. చావు పరిష్కార మార్గం కాదని, కుటుంబాలను అనాథలు చేసి వెళ్లిపోవద్దని కోరారు. కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి ఈనెల 8వ తేదీన కలెక్టరేట్‌ లేదా జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని తెలిపారు.

*రైతు నాగలింగం కుటుంబానికి న్యాయం చేయాలి*

ప్రభుత్వం రైతు నాగలింగం కుటుంబానికి న్యాయం చేయాలని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైజలనాథ్‌ కోరారు. రూ.25 లక్షల పరిహారం అందించాలన్నారు. అరటి పంటకు ధరల్లేక రైతు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. తమ మాట వినకపోతే ఆర్థిక సాయం కూడా అందదు అంటూ కొందరు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. కూటమి పాలనలో ఇన్సూరెన్స్‌ లేదు, ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు, అరటి పంటను కొనేవాళ్లు లేరు అని అన్నారు. ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అవుతోందని దుయ్యబట్టారు. అర్ధరాత్రి పోస్టుమార్టం చేసి పంపడం ఏంటని ప్రశ్నించారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. తక్షణం ప్రభుత్వం అరటి పంటను కొనుగోలు చేయాలన్నారు.

👉 గాంధీ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత….బీసీల హక్కుల కోసం ఆత్మహత్యయత్నం చేసుకున్న సాయి ఈశ్వర చారీ మృతి…అధికారికంగా ప్రకటించకుండా పోస్ట్ మార్టంకు తరలించేందుకు యత్నం చేసిన పోలీసులు…అడ్డుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మలన్న…డెత్ డిక్లరేషన్ చేసిన తరువాతే పోస్ట్ మార్టం చేయాలని మల్లన్న డిమాండ్…

👉 విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా తీసుకువస్తున్న సంస్కరణలే దీనికి నిదర్శనం అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం కొణిజేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ( మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ -3.0) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు వీరికి ఘన స్వాగతం పలుకుగా ముందుగా స్కూల్ ప్రాంగణంలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలవేసి వీరు పుష్పాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్, పుస్తక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు.తరగతి గదుల్లో విద్యార్థులతో మంత్రి, కలెక్టర్ కూర్చుని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు.   ఈ సందర్భంగా హాజరైన తల్లిదండ్రులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో కొత్తగా రూ.92.5 కోట్లతో అదనపు తరగతి గదులను వివిధ పాఠశాలలకు మంజూరు చేశామన్నారు. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభమవుతాయి అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందేలా ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేశామని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని, సమగ్ర అంశాలతో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు, యూనిఫారాలు, బూట్లు ఇస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పాఠశాలల్లో క్రమంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణ పైనా  ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ‘ లీప్ ‘ యాప్ ద్వారా ఆయా విషయాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వందరోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడం ద్వారా పరీక్షల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా సహకరించాలని ఆయన సూచించారు.     కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ విద్యార్థుల పురోగతి గురించి ప్రత్యక్షంగా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునేందుకు ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను కూడా తల్లిదండ్రులు ఈ సందర్భంగా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుందన్నారు. స్మార్ట్ విద్యా బోధనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఉపాధ్యాయులకు కూడా విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించి వారి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు. అభ్యున్నతి దిశగా విద్యార్థులను తీసుకెళ్లడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుందని కలెక్టర్ చెప్పారు.   డీఈవో కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ తరఫున జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదువుకొని ఈ స్థాయికి వచ్చానన్నారు. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులు విశ్వాసం ఉంచాలని ఆమె సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లా బ్రహ్మయ్య మాట్లాడుతూ గత ఏడాది సాధించిన ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, కొండపి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ కళావతి, సమగ్ర శిక్ష ఏపీసి అనిల్ కుమార్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ వెంకట్రావు, కమిటీ కోఆప్షన్ సభ్యులు రామా కామయ్య, ఇతర అధికారులు, స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. గత ఏడాది పదవ తరగతి, ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు తెలుగు టీచర్ ఝాన్సీ లక్ష్మీబాయి తన సొంత డబ్బులతో చేసిన ఆర్థిక సహాయాన్ని విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ అందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి, కలెక్టర్, ఇతర అధికారులు భోజనం చేశారు.    దీనికి ముందుగా కందులూరు పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ – టీచర్స్ కార్యక్రమంలోనూ మంత్రి, కలెక్టర్ పాల్గొన్నారు.

👉పేద ప్రజలు వైద్యం కోసం ఆర్ధిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో పెద్దఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శుక్రవారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 78 మంది లబ్ధిదారులకు రూ.66 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ  మాట్లాడుతూ, పేద ప్రజలు వైద్యం కోసం ఆర్ధిక ఇబ్బందులు పడరాదనే ఉద్దేశ్యంతో పెద్దఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 1245 మంది లబ్దిదారులకు 9 కోట్ల 70 లక్షల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించినట్టు తెలిపారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుని ఆరోగ్య పరిస్థితిని డిజిటలైజేషణ్ చేసి సంజీవిని పధకం ద్వారా ప్రజల ఆర్ధిక భారాన్ని తగ్గిస్తూ 25 లక్షల రూపాయల వరకు ఇన్సురెన్స్ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలను అందిస్తూ వైద్య ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అన్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!