👉డిప్యూటీ సీఎం పదవికి పవన్ అనర్హుడు.. కేబినెట్ నుంచి తొలగించాలి: సీపీఐ నారాయణ…పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయన్న నారాయణ..రాజకీయాలు వదిలి సనాతన ధర్మం చూసుకోవాలని హితవు.. దిష్టి వంటి మాటలు మాట్లాడేవారికి రాజకీయాల్లో స్థానం లేదని వ్యాఖ్య…పవన్ కల్యాణ్ ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ పదవికి అనర్హుడని, ఆయన్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు.తెలుగు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ, ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని నారాయణ గుర్తుచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుమార్తెను ఏపీలోని భీమవరానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో పవన్ వ్యాఖ్యలు ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరిపైన నారాయణ విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో చేగువేరా తనకు ఆదర్శమని చెప్పిన పవన్, ఇప్పుడు సావర్కర్‌ను భుజానకెత్తుకుని ‘సనాతన ధర్మం’ అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా సనాతన ధర్మంపై ఆసక్తి ఉంటే, రాజకీయాలు వదిలిపెట్టి ఆ మార్గంలో వెళ్లవచ్చని సూచించారు. ‘దిష్టి తగిలింది’ వంటి మాటలు మాట్లాడే సనాతనవాదులకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు తగరని, ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు… జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు… జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 70లో ఉన్న సర్వే నంబర్ 403లో ఉన్న 600 గజాల ప్రభుత్వ స్థలంలో కంటైనర్ ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు అమర్చి కబ్జా చేసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీద్ .. రాయదుర్గంలోని ఒక స్తలం పత్రాలతో జూబ్లీహిల్స్ లో ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తున్నట్లు గుర్తించిన తహసీల్దార్…తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
**అఖండ2 సినిమా టికెట్ రేట్లు పెంచారు.. ఇలా రేట్లు పెంచడం వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది..ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు..సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేసి, సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ, సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు – సీపీఐ నారాయణ
👉కీలక అంశాలపై విస్తృత చర్చ*
*టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి*
*గాంధీ భవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం..*
*టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం*
*ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్న నేతలు*
తెలంగాణ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా అందరూ కృషి చేయాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి తెలిపారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్, తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నియమక పత్రాలు అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా నూతన డిసిసి అధ్యక్షులుగా ఎంపికైన సంజీవ్ ముదిరాజ్ అదేవిధంగా తదితర జిల్లాల నూతన డిసిసిలకు నియామక పత్రాలను లాంచనంగా అందజేశారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలకు టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం చేశారు. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ఏఐసీసీ కార్యక్రమాల అమలు, రాష్ట్రవ్యాప్త కాంగ్రెస్ కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై విస్తృత చర్చ చేసినట్టు తెలిపారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని గ్రామ-మండల స్థాయిలో మరింత బలపరుచుకునే ప్రణాళికలను ఈ సమావేశంలో ఖరారు చేసినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందించబోతున్నట్లు మిథున్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో భాగంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు, పీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మరియు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ని మర్యాద పూర్వకంగా కలిసిన సంజీవ్ ముదిరాజ్, శివసేన రెడ్డి, కె ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు..
🌟 ఐబొమ్మ రవికి పోలీసుల జాబ్ ఆఫర్.. తిరస్కరించిన నిందితుడు
ఐబొమ్మ రవికి సైబర్ క్రైమ్ విభాగంలో జాబ్ ఆఫర్
పోలీసుల ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిన రవి…
కరేబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతో రెస్టారెంట్ ప్లాన్…
సంపాదనలో రూ.17 కోట్లు ఎంజాయ్ చేయడానికే ఖర్చు…రూ. 3 కోట్లతో పాటు ఆస్తులను సీజ్ చేసిన పోలీసులు…కొత్త సినిమాలను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమను గడగడలాడించిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అతనికున్న సాంకేతిక నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు, ఏకంగా తమ శాఖలోనే ఉద్యోగం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ‘సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా? మంచి జీతం ఇస్తాం’ అని ఉన్నతాధికారులు అడిగినప్పటికీ, రవి దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది.
పోలీసులు ‘నీ ఐబొమ్మ కథ ముగిసింది, తర్వాత ఏంటి నీ ప్లాన్?’ అని ప్రశ్నించగా, రవి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు. కరేబియన్ దీవుల్లో ‘ఐబొమ్మ’ పేరుతోనే ఒక రెస్టారెంట్ ప్రారంభించి, భారతీయ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే కరేబియన్‌లోని అన్ని దేశాల్లో రెస్టారెంట్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సంపాదించిన డబ్బుతో ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు పైరసీ ద్వారా సంపాదించిన రూ. 20 కోట్లలో ఏకంగా రూ. 17 కోట్లను కేవలం ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేసినట్లు తేలింది. ఇకపై కూడా వారానికో దేశం తిరుగుతూ జీవితాన్ని ఆస్వాదిస్తానని అతను చెప్పినట్లు సమాచారం.
రవి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 3 కోట్లతో పాటు హైదరాబాద్‌లోని ఫ్లాట్, విశాఖపట్నంలోని ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. అయితే, అతనికి త్వరలోనే బెయిల్ లభించే అవకాశం ఉందని పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది
👉ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను కడతేర్చిన కసాయి తమ్ముడు…😲
అప్పులు తీర్చడానికి మానసిక పరిపక్వత లేని అన్నపై రూ.4 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, టిప్పర్ లారీతో తొక్కించి హత్య చేసిన తమ్ముడు…
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మూడేళ్ల కిందట రెండు టిప్పర్లను కొనుగోలు చేసి, వాటిని అద్దెకు ఇస్తూ జీవనం కొనసాగిస్తున్న మామిడి నరేష్(30) అనే వ్యక్తి …
ఇటీవల వ్యాపారం సరిగ్గా నడవక తీవ్ర అప్పుల పాలవడంతో, తనతో పాటు ఇంట్లో ఉంటున్న మానసిక పరిపక్వత లేని అన్న వెంకటేష్(37) పేరిట ఇన్సూరెన్స్ పాలసీ చేయించి అతన్ని హత్య చేసి, వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్న నరేష్…ఈ పథకంలో భాగంగా రెండు నెలల నుండి అన్న పేరు మీద వేర్వేరు సంస్థల నుండి దాదాపు రూ.4.14 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలు చేయించిన తమ్ముడు…
ఇదే సమయంలో తనకు ఇవ్వాల్సిన రూ.7 లక్షలు ఇవ్వాలని నరేష్‌పై ఒత్తిడి తెస్తున్న రాకేష్(28) అనే వ్యక్తికి, తన కుట్రకు సహకరిస్తే అదనంగా రూ.13 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పించిన నరేష్…
తన పథకంలో భాగంగా రూ.2 లక్షలు ఇస్తానని ప్రదీప్ అనే టిప్పర్ డ్రైవర్‌ను ఒప్పించడంతో, గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని వెంకటేష్‌కు ఫోన్ చేసి పిలిచిన డ్రైవర్…డ్రైవర్ పిలుపు మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన వెంకటేష్‌ను టిప్పర్ కింద జాకీ పెట్టాలని, కింద పడుకోబెట్టి, టిప్పర్ ముందుకు నడిపిన నరేష్…
తలపై నుండి టిప్పర్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన వెంకటేష్…
ప్రమాదవశాత్తు మరణించాడని నరేష్ తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు…
ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించేందుకు వచ్చి, నరేష్ ఇచ్చే సమాధానాలపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు
ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, వెంకటేష్‌ను తన తమ్ముడు నరేష్ హత్య చేసినట్లు నిర్ధారించి, నరేష్, రాకేష్, ప్రదీప్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
👉 హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో కలకలం.
ఓ ఆటోలో కనిపించిన ఇద్దరు యువకుల మృతదేహాలు.
మృతులు జహంగీర్, ఇర్ఫాన్‌గా గుర్తింపు.
ఇద్దరు యువకుల మృతిపై పోలీసుల విచారణ.
స్టెరాయిడ్స్ ఓవర్ డోస్ తీసుకోవడంతోనే మృతి చెందారని అనుమానాలు.
🌟ఒకే చట్టం ఒకే పోలీస్🌟🌟
దేశంలో పోలీసుల వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయా?
పోలీసు వ్యవస్థ ప్రక్షాళన కాబోతుందా?
దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ పోలీసు స్టేషన్ లో అయినా కేసు నమోదు చేసుకోవచ్చా?
అవును అనే చెప్తున్నాయి విశ్వసనీయ వర్గాలు
**ఇక నుండి రాష్ట్ర పోలీసులు అన్ని ఒకే గొడుగు కిందికి రాబోతున్నాయి.**
ఆంధ్రా పోలీస్, తెలంగాణ పోలీస్, కర్ణాటక పోలీస్ ఉండవు ఇక. భారత దేశం మొత్తం ఒకే వ్యవస్థ అదే **భారత్ పోలీస్** రాష్ట్రాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సమాచారం.
అన్ని రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థ ను ఒకే గొడుగు కిందకి తీసుకొని వస్తె నేరాలు ఘోరాలు కూడా తగ్గుతాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
**ఏదైనా అంతా మన మంచికే జరుగుతుంది**

