👉చంద్రబాబుపై జగన్ పెట్టిన ఎక్సైజ్ కేసు మూసివేత !
అధికారం ఉందని చంద్రబాబుపై కేసులు పెట్టాలని ఆరాటంతో ఏమీ లేకపోయినా కేసులు పెట్టించిన జగన్ కు ఇప్పుడు పరువు పోతోంది. ఆ కేసులకు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్లే కోర్టుకు వెళ్లి లిఖితపూర్వకంగా తెలియచేస్తున్నారు. దాంతో ఆ కేసుల్ని ఏసీబీ కోర్టు మూసివేస్తోంది. గత వారం ఫైబర్ నెట్ కేసుమూసివేయగా.. ఈరోజు ఎక్సైజ్ శాఖలో అక్రమాలంటూ పెట్టిన కేసును మూసివేశారు.
జగన్ రెడ్డి అధికారంలోకి 2019 లో వచ్చారు. వచ్చినప్పటి నుండి ఇష్టారీతిన లిక్కర్ దోపిడీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రజల ముందు పెడుతూండటంతో.. జగన్ రెడ్డి 2023లో .. 2014-19 లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని అప్పటి ఎండీ.. స్కాంలో బకరాగా వాడుకున్న వాసుదేవరెడ్డితో ఫిర్యాదు చేయించారు. తాడేపల్లి లో జరిగిన కుట్ర ప్రకారం కొల్లి రఘురామిరెడ్డి, మరికొంత మంది అధికారులు ఏ తప్పూ లేకపోయినా ఏదో జరిగిందని చెప్పి క్రియేట్ చేసి కేసు పెట్టారు.ఈ కేసులో ఏ1 గా సుధాకర్, ఏ2 కొల్లు రవీంద్, ఏ3 చంద్రబాబు పేర్లను ఏపీ సీఐడీ నమోదు చేసింది. రెండు బేవరేజీలు, మూడు డిస్టిలరీలకు లబ్ది చేకూర్చేందుకు మద్యం పాలసీని మార్చారని ఆరోపించారు. కానీ పాలసీ మార్చడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది కానీ తగ్గలేదని సీఐడీ తేల్చింది. అదే విషయాన్ని సీఐడీ కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు కేసును మూసివేసింది.
👉ఏపీలో జనవరి నుంచి రూ.25 లక్షల వైద్య బీమా*
ఏపీ పేదలకు శుభవార్త.. జనవరి నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం…ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు…శ్రీకాకుళంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ జనవరి నుండి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు.శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. కేవలం తన నియోజకవర్గంలోనే ఇప్పటివరకు సీఎం సహాయనిధి ద్వారా రూ. 2.10 కోట్ల విలువైన సాయాన్ని అందించినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో వైద్యం కోసం పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే రూ. 25 లక్షల వరకు వైద్య సహాయం అందించే పథకాన్ని సీఎం చంద్రబాబు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు.
👉పవన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం…TG: ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు…రాజకీయ దుమారాన్ని రేపాయి. పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లేకపోతే సినిమాలు ఆపేస్తామని తెలంగాణ మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా పవన్ సినిమాలు థియేటర్లలో ఆడనివ్వం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయం అంటే రెండున్నర గంటల సినిమా కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి విమర్శించారు.
👉నెల్లూరు లేడి డాన్…లేడీ డాన్ కామాక్షి ఇల్లు ధ్వంసం చేసిన స్థానికులు*
ఆమె చేసిన అరాచకాలు, చిన్న వయస్సు పిల్లలకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేసిన లేడి డాన్ ఇళ్లను విసిగి చెందిన బాధిత తల్లితండ్రులు,మరియు స్థానికులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం…నెల్లూరులోని RDT కాలనీలో స్థానికులు లేడీ డాన్ కామాక్షికి చెందిన ఐదు ఇళ్లను ధ్వంసం చేశారు..కామాక్షి తమను అనేక ఇబ్బందులకు గురిచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు..పెంచలయ్య హత్య కేసులో డిసెంబర్ 1న అరెస్ట్ అయిన ఆమెను తమ ప్రాంతానికి రానివ్వబోమని స్థానికులు హెచ్చరించారు..కామాక్షి ఇంటితో పాటు ఆమె అనుచరుల ఇళ్లను కూడా నేలమట్టం చేశారు.
👉ఏపీ లిక్కర్ స్కామ్ సొమ్ముతో ముంబైలో బంగారం.. సిట్ విచారణలో గుట్టు విప్పిన నిందితుడు అనిల్ చోఖ్రా….సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడి… ముడుపుల సొమ్మును ముంబైలో బంగారం, నగదుగా మార్చినట్టు నిందితుడి అంగీకారం…షెల్ కంపెనీల ద్వారా రూ.78 కోట్లు దారి మళ్లించినట్లు వెల్లడి!!!
దుబాయ్ లింకులతో నల్లధనాన్ని వైట్‌గా మార్చినట్లు తెలిపిన అనిల్ చోఖ్రా..వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక రహస్యాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ఏ-49వ నిందితుడిగా ఉన్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రా, సిట్ విచారణలో ముడుపుల సొమ్మును ఎలా దారి మళ్లించిందీ వివరించినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (ఏ-1)కి చెందిన బినామీ డిస్టిలరీల నుంచి వచ్చిన రూ.78 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బంగారం, నగదు రూపంలోకి మార్చినట్లు చోఖ్రా అంగీకరించినట్టు సమాచారం.సిట్ విచారణలో చోఖ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఊరూపేరూ లేని వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సేకరించి ముంబైలో 30కి పైగా షెల్ కంపెనీలను సృష్టించారు. ఆదాన్, లీలా, ఎస్‌పీవై ఆగ్రోస్ వంటి డిస్టిలరీల నుంచి వచ్చిన డబ్బును ఈ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు. ఆ తర్వాత ముంబైలోని చాముండ బులియన్స్ యజమాని చేతన్ కుమార్, ఇతర గోల్డ్ డీలర్ల సిండికేట్ ద్వారా ఆ సొమ్ముతో బంగారం కొనుగోలు చేశారు. చివరిగా, దుబాయ్‌లో ఉన్న చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక నెట్‌వర్క్‌ను ఉపయోగించి మొత్తం నల్లధనాన్ని వైట్‌గా మార్చినట్లు చోఖ్రా వివరించినట్టు తెలిసింది.
👉పెంచలయ్యను హత్య చేసిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలి …రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం అరికట్టాలి జనవిజ్ఞాన వేదిక డిమాండ్… నెల్లూరు జిల్లా ప్రజానాట్య మండలి కళాకారుడు కే పెంచలయ్యపై గంజాయి మాఫియా దాడి చేసి హత్య చేయడాన్ని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష-ప్రధాన కార్యదర్శులు కే యస్ లక్ష్మణరావు(మాజీ ఎమ్మెల్సీ) తవ్వా సురేష్, మద్యపానం, డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎన్.సూర్యనారాయణలు ఖండించారు. పెంచలయ్యను హత్య గావించిన గంజాయి ముఠాను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గంజాయి, మత్తుమందులకు బానిసలై అనేకమంది విద్యార్థులు, యువత చదువులు, భవిష్యత్ ను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఉద్యమించి, ప్రాణాలర్పించిన పెంచలయ్య కుటుంబానికి ప్రభుత్వం భద్రతా, భరోసా కల్పించాలని వారు కోరారు. ఇప్పటికైనా రాష్ట్రవ్యాప్తంగా మద్యపానం, డ్రగ్స్ పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావు, సురేష్, సూర్యనారాయణలు కోరారు.
👉🏻మోస్ట్ వాంటెడ్.. ఆర్థిక నేరస్తుల ‘బర్త్ డే’ పార్టీ.. కేంద్రానికి సెగ! వారిద్దరూ పలు బ్యాంకులను మోసం చేశారు. వందల కోట్ల రూపాయల ధనాన్ని ఎగవేశారు. ఎంచక్కా.. దేశం విడిచి వెళ్లిపోయారు. పైగా.. తరచుగా కవ్విస్తున్నారు కూడా. వారిద్దరూ పలు బ్యాంకులను మోసం చేశారు. వందల కోట్ల రూపాయల ధనాన్ని ఎగవేశారు. ఎంచక్కా.. దేశం విడిచి వెళ్లిపోయారు. పైగా.. తరచుగా కవ్విస్తున్నారు కూడా. వీరిపై దేశంలో అనేక కేసులు కూడా నమోదయ్యాయి.
వారే.. ఒకరు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధిపతి విజయ్ మాల్యా, మరొకరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ. వీరిద్దరూ.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్. నేరస్తుల జాబితాలో వీరిద్దరూ ఉన్నారు. వీరిని భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నాలు కొన్నాళ్లుగా సాగుతున్నా అవి ఫలించడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో జైళ్లను తయారు చేయాలని.. తమకు అందించే వైద్య, ఆహారం ప్రపంచ స్థాయిలో ఉండాలని.. స్థానిక కోర్టుల్లో సదరు ఆర్థిక నేరస్తులు .. పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ కొనసాగుతూ నే ఉంది. ఇదిలావుంటే.. తాజాగా ఈఇద్దరు నేరస్తులు కలిసి.. భారీ ఎత్తున బర్త్ డే పార్టీ చేసుకున్నారు. పుట్టినరోజు ఒక్కరిదే అయినా.. భాగస్వామ్యం మాత్రం ఇద్దరిదీ. లలిత్ మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన సతీమణి ఇచ్చిన భారీ విందు పార్టీకి విజయ్ మాల్యా కూడా హాజరయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ లండన్‌లోనే సురక్షితంగా ఉన్నారు.*** ఈ క్రమంలో లండన్‌లోని మేఫెయిర్‌లో ఉన్న ఖరీదైన మ్యాడాక్స్ క్లబ్‌లో మోడీ సతీమణి రీమా భారీ విందు ఇచ్చారు. అత్యంత తక్కువ మంది సన్నిహితుల మధ్యే ఈ పార్టీ జరిగినా.. దీనికి సంబంధిం చిన విజువల్స్, ఫొటోలు లీకయ్యాయి. ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా చర్చకు వచ్చింది. ఇంత జరుగుతున్నా.. మోడీ సర్కారు వారిని తీసుకురాలేక పోయిందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. “లండన్‌లో వారు ఖుషీగా ఉన్నారు. పార్టీలు కూడా చేసుకుంటున్నారు. కానీ, మోడీ మాత్రం వారి వంక కన్నెత్తి చూడరు. పన్నెత్తి పలకరించరు.“ అని కాంగ్రెస్ ఎంపీలు వ్యాఖ్యానించారు. ఇవీ..మోసాలు! విజయ్ మాల్యా, లలిత్ మోడీలు భారీ ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనల కేసుల్లో లలిత్ మోడీపై కేసులు నమోదయ్యాయి. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఈడీ ఆరోపించింది. ఈయన 2010లోనే దేశాన్ని వీడి వెళ్లిపోయారు. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. ఇక, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి, వ్యాపార వేత్త.. విజయ్ మాల్యా ఎస్ బీఐ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేశారన్న కేసులు వెంటాడుతున్నాయి. దీంతో వీరిద్దరినీ కేంద్ర ప్రభుత్వం 2020లోనే ఆర్థిక నేరస్తుల జాబితాలో చేర్చింది.
👉హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ దాడులు…వుడ్ బ్రిడ్జి హోటల్ యజమాని..
BRS నేత హర్షద్ అలీ ఖాన్‌ను విచారించిన అధికారులు
పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ హోటళ్లపై ఐటీ సోదాలు
భారీగా నగదు, డాక్యుమెంట్స్ గుర్తించిన ఐటీ శాఖ
వీరితో సంబంధాలు ఉన్న హోటళ్లపై ఫోకస్ పెట్టిన ఐటీ.
👉హయత్‌నగర్‌లో దారుణం…ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు…చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు…. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని శివగంగ కాలనీలో, ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన 10 వీధి కుక్కలు… సమయానికి స్పందించి, బాలుడిని రక్షించి, ఆసుపత్రికి తరలించిన కాలనీ వాసులు…నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నగర వాసులు
👉ఫుడ్ పాయిజన్.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం*
* గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహంలో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

