👉క్షమాభిక్ష కోరిన ఇజ్రాయెల్ ప్రధాని.. అసలేం జరిగింది….!!! అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అధ్యక్షుడు ఐజక్ హట్జాగ్ కు అధికారికంగా విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ కు ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పని చేసిన బెంజమిన్ నెతన్యాహు.. తాజాగా తన ఖాతాలో మరో రికార్డ్ నమోదు చేసుకున్నారు. అయితే అది అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులకు సంబంధించినది కావడం గమనార్హం. ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ చరిత్రలో విచారణకు హాజరైన ఏకైక ప్రధానమంత్రిగానూ ఆయన నిలిచారు. అసలేం జరిగిందనేది ఇప్పుడు చూద్దామ్..!
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ అధ్యక్షుడు ఐజక్ హట్జాగ్ కు అధికారికంగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. దీనిని అసాధారణ అభ్యర్థనగా అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. వాస్తవానికి నెతన్యాహు మూడు వేర్వేరు కేసుల్లో మోసం, నమ్మకద్రోహం, లంచాలు స్వీకరించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో.. సంపన్న రాజకీయ మద్దతుదారులకు ఆయన అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఏ కేసులోనూ దోషిగా తేలలేదు. మరోవైపు మొదటినుంచీ ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఈ నేపథంలోనే.. దేశాని తీవ్రంగా విభజించిన దీర్ఘకాలంగా కొనసాగుతున్న విచారణను ముగించడానికి.. అవినీతి ఆరోపణల నుంచి తనకు క్షమాపణ ఇవ్వాలని ఆదివారం ఆ దేశ అధ్యక్షుడిని ప్రధాని నెతన్యాహు కోరారు. అయితే.. ఇది వెంటనే అతని ప్రత్యర్థుల నుంచి ఖండనలకు దారి తీసింది. ఇది ఇజ్రాయెల్ ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరుస్తుందని అంటున్నారు. నెతన్యాహు కోసం ప్రెసిడెంట్ కు ట్రంప్ లేఖ!: మరోవైపు.. బెంజమిన్ నెతన్యాహు కోసం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాశారు. ఈ సందర్భంగా ట్రంప్.. అవినీతి కేసును రాజకీయ, అన్యాయమైన ప్రాసిక్యూషన్ అని పిలిచారు. దేశాన్ని తీవ్రంగా విభజించిన అవినీతి విచారణలో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహును క్షమించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా… గత మూడు సంవత్సరాల భయంకరమైన క్లిష్ట సమయాలను దాటుతూ.. గొప్ప ఇజ్రాయెల్ దేశం, అద్భుతమైన యూదు ప్రజలు ముందుకు సాగుతున్నప్పుడు.. యుద్ధ సమయంలో బలీయమైన, నిర్ణయాత్మక ప్రధానమంత్రిగా ఉండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ను శాంతి కాలంలోకి నడిపిస్తున్న బెంజమిన్ నెతన్యాహును పూర్తిగా క్షమించమని నేను మిమల్ని కోరుతున్నాను అని ట్రంప్ లేఖలో రాశారు.
👉 ‘ఆ స్థితిలో నేను లేను’… విజయ్ గురించి కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు! అవును… వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయం ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ సారి ఎన్నికల్లో అధికార డీఎంకే, విపక్ష అన్నా డీఎంకేలతో పాటు సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పోటీ చేయబోతోంది. ఈ సమయంలో తమిళనాడు రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా విజయ్ పాలిటిక్స్ కి సలహాలు ఇవ్వడంపై కమల్ హాసన్ ఆసక్తికరంగా స్పందించారు. అవును… వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయం ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విజయ్ టీవీకే పార్టీ ఎంట్రీతో ఇది మరింత రసవత్తరంగా మారిందని అంటున్నారు. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి విజయేనని టీవీకే పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి అరుణ్ రాజ్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సమయంలో… కేరళలో నిర్వహించిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేచర్ ఫెస్టివల్ కు నటి మజూ వారియర్ తో పాటు సెంట్రిస్ట్ పార్టీ మక్కల్ నీది మైయం (ఎంఎన్ఎం)పార్టీ వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా… 2026లో నిర్వహించనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న విజయ్ కు ఏమైనా సలహాలిస్తున్నారా? అనే ప్రశ్నను ఎదుర్కొన్నారు కమల్….దీనిపై స్పందించిన ఆయన… తాను సలహా ఇచ్చే స్థితిలో లేనని.. తాను ఎప్పుడూ సలహా తీసుకోలేదని.. బహుశా నా సోదరుడికి సలహా ఇవ్వడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చని అన్నారు. ఇదే సమయంలో.. అనుభవం మన కన్నా గొప్ప గురువని,అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పించలేరని.. మనుషులకు పక్షపాతం ఉండోచ్చు కానీ, అనుభవానికి అది ఉండదని కమల్ అభిప్రాయపడ్డారు. ఇక.. ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ కొత్త సినిమా “జన నాయగన్”. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెత్తుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. మరోవైపు.. ఈ ఏడాది ప్రారంభంలో చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే.
👉నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ …నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ ఈవోడబ్ల్యూ … ఈడీ ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పేర్లు ..ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపిస్తున్న ఈడీ.
👉గంపలగూడెం: యువతిపై సామూహిక అత్యాచారం – ఇద్దరు నిందితుల అరెస్ట్
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో సంఘటన కలకలం రేపింది. స్థానిక మారుతి షోరూంలో పనిచేస్తున్న ఓ యువతిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… విధులు ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయంలో నిందితులు ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని మద్యం తాగించి మత్తులో అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను వదిలేశారు.ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, తక్షణమే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు ముగిసిన తర్వాత వెల్లడిస్తామని తెలిపారు….
👉 కామ్రేడ్ పెంచలయ్య హత్య కేసులో నిందితులను అరెస్ట్ .. వివరాలు వెల్లడించిన నెల్లూరు రూరల్ డీఎస్పీ
కల్లూరుపల్లిలో ఈ నెల 28న జరిగిన పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలు కామాక్షమ్మ సహా మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కె.పెంచలయ్య (38) ఆర్డిటీ కాలనీలో ఉండేవారు. సమాజ స్పృహతో వ్యవహరించే ఆయన.. ఆర్డీటీ కాలనీలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉండకూడదనే నిబంధన పెట్టారు.అరవ కామాక్షమ్మ తన అనుచరులతో కలిసి స్థానికంగా నేర కార్యకలాపాలు కొనసాగిస్తుండేది. ఈ క్రమంలోనే పెంచలయ్యపై కోపం పెంచుకున్న ఆమె అనుచరులు కత్తులతో అతడిని పొడిచి హతమార్చారు. ఈ ఘటన అనంతరం ఆమె ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. 25 కిలోల గంజాయితోపాటు కొన్ని కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.ఈ కేసుకు సంబంధం ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఏడు కత్తులు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. కామాక్షమ్మను గంజాయి కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఆమె సోదరుడు జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరారీలో ఉన్న ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు…
👉వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో ఠాగూర్ సినిమా వైద్యం.. చనిపోయిన వ్యక్తికి మూడు గంటలు చికిత్స అందించిన హాస్పిటల్ వైద్యులు …😲😲😲 చావు కబురు చల్లగా చెప్పిన డ్యూటీ లేడీ డాక్టర్. .. డాక్టర్ల వ్యక్తిగత బౌన్సర్ల తో పేషంట్ బంధువులపై దాడి… బాడీ కోసం 80000 రూపాయలు డిమాండ్ చేసిన హాస్పటల్ యాజమాన్యం…. హాస్పటల్ వద్ద పేషంట్ బంధువులు ఆందోళన…. గందరగోళం నేపథ్యంలో సంతకం పెట్టి బాడీని తీసుకువెళ్లండి అని చెప్పిన సిబ్బంది.. న్యాయం కావాలంటూ హాస్పటల్ ముందు బైఠాయించిన మృతుడి బంధువులు..
👉సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ళలో దారుణం.. పల్నాడు జిల్లా…తల్లి ,కోడుకు పై కత్తితో దాడి..ఇంట్లోకు ప్రవేశించి తల్లి ,కొడుకు ను గొంతు గొసిన గుర్తు తెలియని దుండగులు .. కొడుకు సాంబశివరావు మృతి ,తల్లి కృష కమారి పరిస్థితి విషమం..నిందితులను పట్టుకున్న పోలీసులు …నకరికల్లు మండలం చాగల్లు గ్రామం వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం… పోలీసులు గ్రామస్తులకు మధ్య తోపులాట …తమకు అప్పగించాలని గ్రామస్తులు గొడవ…గ్రామస్తులు నిందితలను చితకబాదే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు.. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు…నిందితులు మైనర్లు గా సమాచారం
👉ఢిల్లీ ఎయిర్‌పోర్టుపై హ్యాకర్ల కుట్ర.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జీపీఎస్ స్పూఫింగ్‌కు పాల్పడిన హ్యాకర్లు.. విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పంపి గందరగోళం సృష్టించే ప్రయత్నం.. జీపీఎస్ స్పూఫింగ్‌ను నిర్ధారించిన విమానయాన శాఖ.. రన్‌వే నెంబర్ 10పై వచ్చిన విమానాలను తప్పుడు జీపీఎస్ సిగ్నల్ అందినట్లు నిర్ధారణ..గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రకటన.
👉ఎయిడ్స్ పట్ల అవగాహనతోనే ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించగలమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా సోమవారం ఉదయం జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రితో పాటు ఎంపీ . మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్ పి.రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 700 మందితో ప్రకాశం భవనం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని అతిథులు జెండా ఊపి, గాలిలోకి బెలూన్లు వదిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ మాట్లాడుతూ నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గణనీయంగా కేసులు తగ్గాయన్నారు. సమాజం నుంచి ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి సంక్రమణ, వ్యాప్తిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎన్జీవో కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
👉వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా…*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెనువెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ* *కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని 7వ బ్లాక్,12వ,13,15 బ్లాక్ లలో మాజీ ఎమ్మెల్యే,వైయస్సార్ సీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

