👉అమరావతి భూసేకరణపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు…అమరావతి:
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమరావతి రాజధాని భూసేకరణ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, అమరావతి భూములు రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లోకి వెళ్తున్నాయని ఆమె ఆరోపించారు. *రెండో విడతలో ప్రభుత్వం సుమారు 17 వేల ఎకరాల భూమిని సేకరిస్తోందని, ఇది రైతుల కోసం కాదు – అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయమని ఆమె విమర్శించారు….*మొదటి దశ పనులు పూర్తి కాకుండానే రెండో విడత భూసేకరణ ప్రారంభించడం అన్యాయమని షర్మిల మండిపడ్డారు. అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలు, ఖర్చులు, భూసేకరణ వివరాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
👉నెల్లూరు పట్టణం వేదాయపాళెం సమీపంలో ఆర్ డి టీ కాలనీలో సిపిఎం కార్యకర్త యువనాయకుడు, కళాకారుడు కామ్రేడ్ కె. పెంచలయ్య హత్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు.
అసాంఘిక గంజాయి గూండాల దాడిలో హత్యకు గురైన పెంచలయ్య మృతికి సంతాపం ప్రకటించారు. హత్య చేసిన గూండాలను పట్టుకుని కట్టినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేసారు. ఆ ప్రాంతంలో గంజాయి బారిన పడకుండా యువతను చైతన్య పరుస్తున్నందున ఓర్చుకోలేని గంజాయి వ్యాపారం చేస్తున్న ముఠా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇలాంటి ముఠాలను కఠినంగా అణచి వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.
👉జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమాన్ని చేపడతాం
నందవరం శ్రీనివాసులు,జిల్లా అధ్యక్షులు
ఏపిజేయు యూనియన్.
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కమిటీ వారి ఆదేశాల మేరకు ఏపీజేయు జిల్లా అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు అధ్యక్షతన గౌరవ సభ్యులు నరసింహ మూర్తి, కె.శ్రీనివాసులు,శివశంకర్, ప్రేమ్ కుమార్, తబల శ్రీనివాసులు ఏపిజేయు జర్నలిస్టు యూనియన్ నంద్యాల జిల్లా కమిటీ సభ్యత్వం గుర్తింపు కార్డులను స్థానిక ఏపీజేయు యూనియన్ నంద్యాల జిల్లా కార్యాలయంలో శనివారం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నందవరం శ్రీనివాసులు మాట్లాడుతూ, నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్క జర్నలిస్టు సంక్షేమం, అభివృద్ధి కోసం ముందడుగు వేస్తుందనీ ,ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్న జర్నలిస్టులతో చర్చించి సభ్యులుగా చేర్పించి జర్నలిస్టు అభ్యున్నతికి కృషిచేస్తామని తెలిపారు. అదేవిధంగా నంద్యాల జిల్లాలోని జర్నలిస్టుల పై దాడులు,దౌర్జన్యాలు,హత్యలకు పాల్పడుతున్న వారి పై కేసులు పెడితే రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు తప్పు దోవ పట్టించి కేసులను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇస్తున్న అక్రిడేషన్ కార్డులను ఇవ్వకుండా కాలయాపన చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొక వైపు రాష్ట్రంలో ఒక పెద్ద జర్నలిస్టు యూనియన్ అని చెప్పుకుంటున్న యూనియన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లేకుండా జర్నలిస్టు యూనియన్ ను నడుపుతున్నారని, అక్రిడేషన్ కమిటీలో ఉన్న కొన్ని జర్నలిస్టు యూనియన్లను తొలగించాలని విజయవాడ నగరంలో సమాచారం శాఖలో పిర్యాదు చేయడం జరిగిందనీ తెలిపారు. నంద్యాల జిల్లాలో ఏపీజేయు యూనియన్ లో ఉన్న ప్రతీ ఒక్క జర్నలిస్టుల సహకారంతో ఏపిజేయు యూనియన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
👉 మహిళలతో అసభ్యకరంగా వైసీపీ పార్టీ లీగల్ సెల్ న్యాయవాది డ్యాన్సులు*షోషల్ మీడియాలలో తెగ వైరల్ …
యానిమల్ సినిమాలో బాబీడియోల్ గ్లాసుతో చేసిన డ్యాన్స్ స్టెప్పులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదే పాటకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ సభ్యుడు వెంకటేశ్వరశర్మ…,తలపై రూ.500 నోట్ల కట్టలు పెట్టుకుని అమ్మాయిలతో డ్యాన్స్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, హోటల్ మంచంపై పడుకుని, ఒంటిపై కరెన్సీ నోట్ల కట్టలతో ఆయన చేసిన విన్యాసాల వీడియోలు కూడా కలకలం సృష్టిస్తున్నాయి…ఈ వీడియో పై అతను స్పందన తెలుపాల్సి ఉంది….
👉*షోషల్ మీడియా లలో వైరల్ అవుతున్న వైసీపీ పార్టీ మాజీ మినిస్టర్ విడదల రజనీ పార్టీ కి గుడ్‌బై! అనే గాసిప్స్…!
మాజీ మంత్రి విడుదల రజిని వైసీపీకి గుడ్‌బై చెప్పనున్నట్లు షోషల్ మీడియా సాక్షి గా టాక్ తెలుస్తోంది.2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, విడదల రజిని నియోజకవర్గాన్ని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు మార్చారు.అక్కడ ఆమె ఘోర పరాజయం పాలయ్యారు.తిరిగి మళ్లీ ఆమె చిలకలూరిపేట వచ్చారు.అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమెను రేపల్లె నియోజకవర్గానికి వెళ్లమని ఆదేశించారట.అయితే, దానికి రజిని నిరాకరిస్తున్న ట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఆమె పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అని షోషల్ మీడియా లలో టాక్ నడుస్తోంది.. ఈ వార్త పై ఆమె స్పందన తెలుపాల్సి ఉంది
👉కేజీ అరటి రూపాయి.. 🍌 డజను రూ.60!
AP: మూడేళ్లుగా టన్ను అరటి రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
👉ఏఎంఆర్ సంస్థపై కార్మికుల తిరుగుబాటు..ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరం వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం, కార్మికులు ఆందోళన…ఏఎంఆర్ సంస్థ కి చెందిన చెక్ పోస్ట్ కంటైనర్ ధ్వంసం…అడ్డగోలు వసూళ్లకి వ్యతిరేకంగా నిరసన…ఏఎంఆర్‌కి వ్యతిరేకంగా టీడీపీకి చెందిన వారు సైతం ఆందోళన.ఏఎంఆర్ పేరుతో ప్రభుత్వం దోచుకుంటుదని నిరసన.
👉వాసవి నిర్మాణ సంస్థ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఫ్లాట్ ఓనర్ల నిరసన…హైదరాబాద్ – బాచుపల్లిలోని వాసవి గ్రూప్ అపార్ట్‌మెంట్ ఎదురుగా ఆందోళనకు దిగిన ఫ్లాట్ ఓనర్లు…2024 సంవత్సరంలో అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కనీస పురోగతి లేదని, తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఫ్లాట్ ఓనర్లు

