👉 జిల్లాల పునర్విభజనపై సర్వత్ర హర్షం.. కొన్ని మార్పులు చేర్పులు అవసరం అంటున్న ప్రజలు ..👉బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం..రూ. 29 వేల కోట్ల ఆస్తులు గుర్తింపు…👉జగన్ కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు : బొత్స…👉సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ …రామగిరి మండలం డిప్యూటీ తహశీల్దార్ రవి ఇంట్లో విషాదం 👉. 👉శాసన సభ్యులు  ముత్తుముల  కృషి ఫలితం గా గిద్దలూరు నియోజక వర్గం మార్కాపురం డివిజన్ లోనే …

👉 జిల్లాల పునర్విభజనపై ఏపీ ప్రజల హర్షం.. కానీ కొన్ని మార్పులు చేర్పులు అవసరం అంటున్న ప్రజలు  … కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేస్తూ గతంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ సరిగా సాగలేదన్న విమర్శల గురించి తెలిసిందే.. తాము అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ చిక్కుముడుల్ని విప్పదీసి.. ఒక క్రమపద్దతిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తాజాగా మూడు కొత్త జిల్లాల్ని.. ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించటం తెలిసిందే. మరి..దీనిపై ఏపీ ప్రజల స్పందన ఏంటి? ..వారెలా రియాక్టు అవుతున్నారు? … తాజా నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. జిల్లాల పునర్విభజన.. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు అంశంపై కొన్నిచోట్ల హర్షం వ్యక్తమవుతుంటే.. మరికొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.మార్చిన వాటిపైనే కాదు.. మార్చని వాటిపైనా కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు మదనపల్లె జిల్లాలో పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు.. చౌడేపల్లె.. సదుం.. సోమల మండలాల్ని కలపటంపై ఆ ప్రాంత ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. రొంపిచెర్ల.. పులిచెర్ల మండలాల్ని చిత్తూరు జిల్లాల్లో కంటిన్యూ చేస్తున్న అంశాన్ని పులిచెర్ల మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. రొంపిచెర్ల వాసులు మాత్రం తమకు పక్కనే ఉన్న పీలేరు రెవెన్యూ కేంద్రంలో కాకుండా చిత్తూరులో ఉంచటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ** ప్రస్తుతం చిత్తూరు జిల్లాల్లో ఉన్న నగరి.. నిండ్ర.. విజయపురం మండలాల్ని తిరుపతి జిల్లాల్లో కలిపేస్తామని సీఎం చంద్రబాబు.. మంత్రి లోకేశ్ లు హామీ ఇచ్చారు. తిరుపతిలో కలపాలని క్యాబినెట్ సబ్ కమిటీ కూడా సిఫార్సు చేసింది కానీ అమలు కాకపోవటంపై మూడు మండలాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాలు మార్పులు చేర్పులపై మొత్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. **ప్రకాశంతో పాటు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయటంపై ఓకే అని చెబుతుంటే.. కనిగిరి డివిజనన్ లో కలపటంపై మాత్రం గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గిద్దలూరుకు కనిగిరి కి మధ్య 100 కిలోమీటర్లకు పైగా దూరం ఉండగా కంభం బిిిపే ట అర్ధవీడు మండలాాలకు  సైతం 100 నుండి 180 కిిిలోమీటర్ల పైగా  దూరం ఉంది ..  **  మదనపల్లె జిల్లాపై  హర్షం వ్యక్తమవుతూ.. అందరూ హ్యాపీ అన్నట్లుగా రియాక్షన్ వస్తోంది. **నెల్లూరుకు దూరంగా గూడూరు.. వెంకటగిరి ఉన్నట్లుగా చెబుతున్నారు. మడకశిర డివిజన్ పై సానుకూలత వ్యక్తమవుతుంటే.. సిద్దవటం, ఒంటిమిట్ట మండలాల్ని అన్నమయ్య జిల్లాలో చేర్చటంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గన్నవరం.. పెనమలూరు నియోజకవర్గాల్నిఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న మాట వినిపిస్తోంది. గూడురు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు.. లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ అమలుకాకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. తొలి నుంచి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కొనసాగిన నేపథ్యంలో విద్య.. వైద్యం.. వ్యాపార సంబందాలు ఎక్కువ. దీంతో ప్రత్యేక అనుబంధం ఉంది. అదే సమయంలో లాజిస్టిక్స్ పరంగా చూసినా.. గూడూరు నుంచి నెల్లూరు 36కిలోమీటర్లు అయితే.. తిరుపతి 110 కి.మీ. ఇలా ఏ యాంగిల్ లో చూసినా తిరుపతి జిల్లాలోకొనసాగటం అసౌకర్యంగా ఉందన్న మాట వినిపిస్తోంది. నెల్లూరు పరిధిలోని కలువాయి.. సైదాపురం.. రాపూరు మండలాల్ని తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మూడు మండలాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ** కలువాయి నుంచి నెల్లూరుకు 70కి.మీ అయితే గూడురు 80కి.మీ. జిల్లా కేంద్రమైన తిరుపతి ఏకంగా 160కి.మీ. దూరంలో ఉంది. రావూరు నుంచి నెల్లూరుకు 60కి.మీ. అయితే తిరుపతికి 90కి.మీ. ఇక.. సైదాపురం విషయానికి వస్తే నెల్లూరుకు 50కి.మీ. దూరంలో ఉంటే అదే తిరుపతి అయితే ఏకంగా 130కి.మీ. ఉంది. దీంతో ఈ మూడు మండలాల్ని నెల్లూరులోనే కంటిన్యూ చేయాలని కోరుతున్నారు. క్రిష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం.. పెనమలూరు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయకపోవటంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెనమలూరు పరిధిలోని పెనమలూరు, కంకిపాడు మండలాలలోని గ్రామాలు గ్రేటర్‌ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. గ్రేటర్‌లో విలీనం కావని తెలిసినా.. ఎన్టీఆర్‌ జిల్లాలో కలవకపోయినా.. ఈ ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. **అదే సమయంలో కడప జిల్లావాసులకు ఒంటిమిట్టతో విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడు ఒంటిమిట్టను అన్నమయ్య జిల్లాలో చేర్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒంటిమిట్ట మండల కేంద్రం నుంచి కడపకు 25 కి.మీ. ఉంది. అన్నమయ్య జిల్లాకు మార్చడంతో రాయచోటికి పోవాలంటే 90 కి.మీ ప్రయాణించాలి. రెండు బస్సులు మారాలి. సిద్దవటం, ఒంటిమిట్టలను కడప జిల్లాలోనే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. మరి.. ఈ మార్పులు చేర్పులపై కూటమి సర్కారు ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.

👉అనంతపురం లో దారుణం … శారద నగర్ లో తల్లి, కొడుకు మృతి..తల్లి అమూల్య ఇంట్లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని మృతి, కొడుకు సహస్ర గొంతు కోసి ఉండడంపై అనుమానం.రామగిరి మండలం డిప్యూటీ తహశీల్దార్ రవి ఇంట్లో విషాదం  … ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…అమూల్య మరణం వెనుక విస్తు, పోయే నిజాలు!!

50 లక్షల కట్నం 50 తులాల బంగారం.. భారీగా పెళ్లి!!హంగు ఆర్భాటాలు వరకట్నంలో భాగంగా స్థలాలు…ఇన్ని సమకూర్చినప్పటికీ వేధింపులు మాత్రం తగ్గలేదు!!!బాధ్యతాయుత డిప్యూటీ ఎమ్మార్వో గా బాధ్యతలు చేపడుతూ వరకట్న వేధింపులు గురిచేయడంపై తీవ్ర స్థాయిలో గత కొన్ని సంవత్సరాలుగా ఆవేదన చెందుతున్న అమూల్య…వరకట్న వేధింపులకు తాళలేక, తల్లిదండ్రులకి చెప్పుకోలేక తాను చనిపోతూ కొడుకుని తండ్రి వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది… సాదాసీదా వ్యక్తులు అవగాహన లోపం ఉన్న పల్లెటూరి రైతులు వరకట్న వేధింపులకు గురి చేశారంటే తెలియనితనంతో చేశారని చెప్పొచ్చు!!…డైరెక్ట్ గా గ్రూప్ టు అధికారిగా,, సెలెక్ట్ అయిన రవికుమార్ ఇలా వరకట్న వేధింపులకు గురి చేయడం పై, ఒక్కసారిగా అనంతపురం నగర ప్రజలు విస్తు పోయారు!…రవికుమార్ పై కఠిన చర్యలు తీసుకొని ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలని బంధువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

👉సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి కేసు కొట్టివేయొద్దు: హైకోర్టును కోరిన సీబీఐ

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితురాలిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి….విచారణలోనే నేరం రుజువవుతుందని సీబీఐ వాదన… పాత నేరానికి కొత్త చట్టం కింద అనుమతి చెల్లదన్న శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది… తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసిన ధర్మాసనం… ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై కేసును ఈ దశలో కొట్టివేయవద్దని సీబీఐ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఆమె నేరం చేశారా లేదా అనేది సీబీఐ కోర్టులో జరిగే విచారణలోనే తేలుతుందని, అందువల్ల ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించరాదని స్పష్టం చేసింది.శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని గుర్తుచేశారు. అనుమతి ఇచ్చారా లేదా అన్నదే ముఖ్యం కానీ, ఎప్పుడు ఇచ్చారనేది కాదని పేర్కొన్నారు. ఈ కేసు నేరుగా లంచం తీసుకున్న వ్యవహారం కాదని, ఇది నేరపూరిత దుష్ప్రవర్తనకు సంబంధించినదని కోర్టుకు వివరించారు.అయితే, శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదిస్తూ ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. పాత నేరానికి కొత్తగా సవరించిన అవినీతి నిరోధక చట్టం ప్రకారం డీవోపీటీ అనుమతి ఇవ్వడం చెల్లదని వాదించారు. దాన్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడం కూడా సరైంది కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

👉బడా బాబుల స్విస్ ఖాతాలపై ఉక్కుపాదం.. రూ. 29 వేల కోట్ల ఆస్తులు గుర్తింపు…విదేశాల్లో రహస్య ఆస్తులు కూడబెట్టిన 24,678 మందిని గుర్తించిన ఐటీ శాఖ…వీరి ఆస్తుల విలువ రూ. 29,208 కోట్లుగా అంచనా…అంతర్జాతీయ ఒప్పందాలతో బడా బాబుల గుట్టురట్టు..డిసెంబర్ వరకు ఐటీ శాఖ డెడ్‌లైన్…తప్పితే 30 శాతం పన్ను.. రూ.10 లక్షల జరిమానా… విదేశాల్లో రహస్యంగా ఆస్తులు కూడబెట్టిన వారికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ఉచ్చు బిగిస్తోంది. స్విట్జర్లాండ్‌తో సహా పలు దేశాలతో కుదిరిన సమాచార మార్పిడి ఒప్పందం (AEOI) ఆధారంగా విదేశాల్లో లెక్కచూపని ఆస్తులు కలిగిన 24,678 మందితో కూడిన జాబితాను ఐటీ శాఖ సిద్ధం చేసింది. వీరికి విదేశాల్లో సుమారు రూ.29,208 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ఆస్తులతో పాటు వీరు దాదాపు రూ.1,089.88 కోట్ల విదేశీ ఆదాయాన్ని కూడా తమ ఐటీ రిటర్న్‌లలో చూపలేదని అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి అందిన సమాచారాన్ని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేసిన రిటర్న్‌లతో పోల్చి చూడటం ద్వారా ఈ బడా బాబుల గుట్టు రట్టయింది. ఈ జాబితాలో పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లోగా సవరించిన ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయాలంటూ త్వరలోనే వీరందరికీ ఎస్ఎంఎస్‌లు, ఈమెయిళ్ల ద్వారా ఐటీ శాఖ హెచ్చరికలు జారీ చేయనుంది. గడువులోగా స్పందించని వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అటువంటి వారిపై 30 శాతం పన్ను విధించడంతో పాటు చెల్లించాల్సిన పన్నుపై అదనంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

👉జగన్ కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు-బొత్సా సత్యనారాయణ …అన్ని విషయాలను గవర్నర్ కు వివరించాం…మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ల చేతిలో ఉండకూడదు… పేదలకు మేలు జరగాలనే వైఎస్ జగన్ మెడికల్ ‘కాలేజీలను తీసుకొచ్చారు…వైద్య రంగాన్ని YS జగన్ అభివృద్ధి చేశారు… కోవిడ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం…జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో ముందుకెళ్లాం… ప్రజల ఆరోగ్యం కోసం వైఎస్ జగన్ వైద్య రంగానికి నిధులు కేటాయించారు.. ఐదు మెడికల్ కాలేజీలు మా హయాంలో పూర్తయ్యాయి

👉దోమల కోసం వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనం*

ఏపీ.. దోమల నివారణకు వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకరమైన మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్‌కు పంపగా..ఈ అగరబత్తీల్లో ప్రాణాంతక రసాయనం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఈ అగరబత్తీలను వాడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

👉కామారెడ్డి లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ రైలు రోకో…  *అరెస్టు చేసే క్రమంలో కవితక్క చేతికి గాయాలు* కవిత గారి వాహనం తప్ప మరో వాహనం కూడా వెంట వెళ్లకుండా కామారెడ్డిలో నిలిపివేసిన పోలీసులు.. పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి నాయకుల ఆందోళన

👉ఆన్‌లైన్‌లో ఫుడ్‌, నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!*

కుళ్లిన కూర‌గాయ‌లు, ప్రూట్స్.. ఎక్స్‌పెరీ డేట్ అయిపోయిన ఆహారప‌దార్థాలు… వెలుగులోకి ఆన్‌లైన్ డెలివ‌రీ సంస్థ‌ల బాగోతం .. బ్లింకిట్‌, బిగ్ బాస్కెట్‌, జెప్టో, స్విగ్గీ, అమెజాన్‌, ప్లిప్‌కార్ట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల త‌నిఖీలు…ఈ త‌నిఖీల్లో భారీగా కుళ్లిన ప్రూట్స్, ఎక్స్‌పెరీ డేట్ అయిపోయిన ప‌దార్థాలు గుర్తింపు.. 76 కిలోల కుళ్లిన కూర‌గాయ‌లు, కాలం చెల్లిన ఆహార‌పదార్థాల్ని అక్కడే పారేయించిన అధికారులు .. మొత్తం 32 సంస్థలకు నోటీసులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు

👉ఒక్కో కేసుకు ఒక్కో రేటు.. పాతబస్తీ సీఐ వసూళ్ల దందా…కమిషనరేట్ లోపల ఉండే గాడ్ ఫాదర్ అండతోనే రెచ్చిపోతునట్లు ఆరోపణలు

హైదరాబాద్ – పాతబస్తీ సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ, విచ్చలవిడిగా అక్రమాలకు, అవినీతి దందాలకు పాల్పడుతున్న సీఐ.. భూ దందాలు, నిందితులను కేసు నుండి తప్పించడం, అక్రమాలకు పాల్పడుతున్న ముఠాల నుండి వసూళ్లు చేయడమే సదరు సీఐ పనిగా పెట్టుకున్నాడని స్థానికుల ఆరోపణలు…ఇటీవల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, స్కూళ్లు, రెస్టారెంట్లు, బార్లు, షాపుల నుండి దాదాపు రూ.20 లక్షలు వసూలు చేసిన సదరు సీఐ…ఇటీవల ఒక పెళ్లి బరాత్‌లో, కత్తులు తిప్పుతూ హల్చల్ చేసిన యువకుల వీడియో వైరల్ అవ్వడంతో, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఉన్నతాధికారులు..ఈ కేసులో అమాయకులను ఇరికించి, నిందితులను తప్పించేందుకు రూ.2.5 లక్షల లంచం తీసుకున్నట్లు సమాచారం…అర్ధరాత్రి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను స్టేషన్ కానిస్టేబుళ్లు అరెస్టు చేయగా, సీఐ సదరు కానిస్టేబుళ్లపై మండిపడుతూ ముఠాను ఎలాంటి కేసు లేకుండా వదిలిపెట్టాడని స్టేషన్ సిబ్బంది ఆరోపణలు..అయితే ఇదంతా కమిషనరేట్ లోపల ఉండే తన గాడ్ ఫాదర్ అండతోనే చేస్తున్నాడని చర్చించుకుంటున్న పోలీస్ వర్గాలు …ఇలాంటి అవినీతి పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు

👉  రైతులను ధనవంతులను చేయటమే మా ప్రభుత్వ లక్ష్యం – మార్కాపురం శాసనసభ్యులు  కందుల నారాయణ రెడ్డి … మార్కాపురం పెదారికట్ల …

శుక్రవారం కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల లో మార్కాపురం శాసనసభ్యులు  కందుల నారాయణరెడ్డి  ఆధ్వర్యంలో” రైతన్న మీకోసం” కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు  కందుల నారాయణరెడ్డి  మాట్లాడుతూ అప్పటి వైసిపి పాలకులు నూతన జిల్లాల Possession ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని అప్పట్లో 63 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు,నిరాహార దీక్షలు నిర్వహించామని చివరకు పోలీసులను అడ్డుపెట్టి తమని అరెస్టు చేశారని గుర్తు చేశారు. అప్పడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మార్కాపురం లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న చోటే మార్కాపురం నూతన జిల్లాను ఇస్తామని హామీ ఇచ్చారని ఆ హామీకి కట్టుబడి ఇప్పుడు మార్కాపురం జిల్లా ప్రకటించారని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటారని అన్నారు.  గత వైసిపి పాలకులు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసామని కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రాజెక్టును ప్రారంభించారని ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా మోసం చేశారుఅని వచ్చే ఏడాదిలోపు మార్కాపురం ప్రాంతానికి వలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఈ కొనకనమిట్ల మండలంలో సుమారు మూడు వేల కోట్ల రూపాయలతో రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మిస్తున్నామని త్వరలో వందలాది మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని అన్నారు.మొన్నటికి మొన్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నియోజకవర్గంలో 32965 మంది రైతులకు దాదాపు 65 కోట్ల తొంబై ఐదు లక్షల రూపాయలు రైతులు ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని అన్నారు. మొన్నటికి మొన్న సంభవించిన తుఫాన్ వచ్చినప్పుడు ఒకపక్క తెలుగుదేశం కార్యకర్తలు, ఒకపక్క అధికారులు నియోజకవర్గంలో ఎక్కడ ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం లేకుండా కాపాడగలిగామని అన్నారు.  కానీ ఈ వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ ఊర్లో బిర్యాని పట్నాలు పంచుతూ సంతకాల సేకరణ చేపట్టారని ప్రజలు తుఫాన్ తో ఇబ్బంది పడుతుంటే వీరికి సంతకాల సేకరణ అవసరమా అని అన్నారు. ఇక నిరుద్యోగ యువత కోసం 9 లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో సుమారు నాలుగు లక్షల 70 వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చామని గుర్తు చేశారు.  ఇక రైతులు పంట మార్పిడి పద్ధతులు అనుసరించి వ్యవసాయం చేయాలని తమ పంట ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు అమ్మాలని సూచించారు.   అనంతరం మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలుగుదేశం నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు. ప్రారంభించారని ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా మోసం చేశారని వచ్చే ఏడాదిలోపు మార్కాపురం ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు.అదేవిధంగా ఈ కొనకనమిట్ల మండలంలో సుమారు మూడు వేల కోట్ల రూపాయలతో రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మిస్తున్నామని త్వరలో వందలాది మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని అన్నారు.    మొన్నటికి మొన్న అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నియోజకవర్గంలో 32965 మంది రైతులకు దాదాపు 65 కోట్ల తొంబై ఐదు లక్షల రూపాయలు రైతులు ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు.  మొన్నటికి మొన్న సంభవించిన తుఫాన్ వచ్చినప్పుడు ఒకపక్క తెలుగుదేశం కార్యకర్తలు, ఒకపక్క అధికారులు నియోజకవర్గంలో ఎక్కడ ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం లేకుండా కాపాడగలిగామని అన్నారు.  కానీ ఈ వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ ఊర్లో బిర్యాని పట్నాలు పంచుతూ సంతకాల సేకరణ చేపట్టారని ప్రజలు తుఫాన్ తో ఇబ్బంది పడుతుంటే వీరికి సంతకాల సేకరణ అవసరమా అని అన్నారు.ఇక నిరుద్యోగ యువత కోసం 9 లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో సుమారు నాలుగు లక్షల 70 వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చామని గుర్తు చేశారు.    ఇక రైతులు పంట మార్పిడి పద్ధతులు అనుసరించి వ్యవసాయం చేయాలని తమ పంట ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు అమ్మాలని సూచించారు.   అనంతరం మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు కృతజ్ఞతగా l ముఖ్యమంత్రి  చంద్రబాబు  చిత్రపటానికి తెలుగుదేశం నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు.

👉శాసన సభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి  కృషి ఫలితం గా గిద్దలూరు నియోజక వర్గం మార్కాపురం డివిజన్ లోనే….*
మార్కాపురం జిల్లా ఏర్పాటు విషయంలో గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆశలు ఇక ఫలించాయి. అయితే నియోజకవర్గంలోని ఆరు మండలాలు కనిగిరి డివిజన్‌లో కలుస్తాయనే అనుమానాలు, ఆందోళనలు ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో, ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కారం కోసం    అశోక్ రెడ్డి  నిరంతరంగా కృషి చేశారు.గత కొంతకాలంగా ఆయన పలుమార్లు అధికారులను, మంత్రులను, ముఖ్యంగా  ముఖ్యమంత్రి ని వ్యక్తిగతంగా కలిసి గిద్దలూరు నియోజకవర్గానికి అన్యాయం జరగకుండా చూడాలని, అభివృద్ధి దృష్ట్యా ఈ ప్రాంతంలోని ఆరు మండలాలు మార్కాపురం డివిజన్‌లోనే కొనసాగాలనే విషయాన్ని స్పష్టంగా వివరించారు. గిద్దలూరు ప్రజల ఆకాంక్షలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా అవసరాలు అన్నింటినీ సమగ్రంగా వివరించి, ప్రజా ప్రయోజనాలను సమర్థవంతంగా ప్రతిపాదించారు.అశోక్ రెడ్డి  పట్టుదల, ప్రజల తరఫున చేసిన నిరంతరమైన పోరాటం చివరకు ఫలించింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలను మార్కాపురం డివిజన్‌లోనే కొనసాగించేలా సానుకూలంగా అంగీకరించారు. ఈ ఈ కీలక నిర్ణయం గిద్దలూరు ప్రాంతానికి పరిపాలనా సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా చేరడానికి దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.గిద్దలూరు ప్రజల హక్కుల కోసం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కృషి చేస్తాను అని ఎమ్మెల్యే  ముత్తుముల అశోక్ రెడ్డి  తెలిపారు.
🌟చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే ముత్తుముల*

*పశ్చిమ ప్రకాశం ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛ “మార్కాపురం జిల్లా” ను కూటమి ప్రభుత్వం ప్రకటించటంతో గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు  ముత్తుముల అశోక్ రెడ్డి  సీఎం చంద్రబాబు నాయుడు  చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి  మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు  ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూతన జిల్లాగా మార్కాపురం ను ఏర్పాటు చేయటం జరిగిందని, వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎప్పటికి రుణపడి ఉంటారన్నారు. మార్కాపురం జిల్లా సాధనలో ప్రధాన భూమిక పోసించిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి పట్టణ నాయకులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు..

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!