👉లోకేశ్ ఉగ్రరూపం.. 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఔట్! …👉సర్ ని బెంగాల్ లో అమలు చేయడంతో మమతా బెనర్జీ కలకత్తా కాళీ మాత అవతారం …👉ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు.. హోంమంత్రి అనిత*…👉ఫిల్మ్‌నగర్‌లో నకిలీ IPS అధికారి అరెస్ట్ ..👉సర్వీస్ గన్ తాకట్టు పెట్టిన హైదరాబాద్ ఎస్సై..

👉లోకేశ్ ఉగ్రరూపం.. 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఔట్! …సరిగా పనిచేయని 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులకు పార్టీ తరఫున నోటీసులు జారీ వివరణ తీసుకోవాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆదేశించారు…ఇటీవల కాలంలో ఎమ్మెల్యేల పనితీరును జాగ్రత్తగా గమనిస్తున్న అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ వరుసగా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్న 48 మంది ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇక అంతకు ముందు పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్.. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్ నిర్వహించాలని సూచనలు చేశారు. దీంతో ఎమ్మెల్యేల్లో కొంతవరకు మార్పు వచ్చినా, మరికొందరు యథావిధిగా నిర్లక్ష్యంగా ఉన్నారని పార్టీ అధిష్టానికి సమాచారం అందింది. దీంతో తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్.. తర్వాత జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించి పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో సరిగా పనిచేయని 25 మందికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఈ 25 మందిలో ఇద్దరు మంత్రులు కూడా ఉండటం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మంత్రి లోకేశ్ ఆగ్రహానికి గురైన ఆ 25 మంది పేర్లు బయటకు రాకపోయినా, ఈ జాబితాలో పేర్లు ఉంటున్న ఎమ్మెల్యేల భవిష్యత్తు మాత్రం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే సూచనలు ఉన్నాయని మాత్రం అంటున్నారు.నియోజకవర్గాల్లో తామే సుప్రీం అనుకుంటున్న ఎమ్మెల్యేలు.. పార్టీని కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని అధినేత, యువనేత ఆగ్రహంగా ఉంటున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవాలంటే కార్యకర్తలు, పార్టీని జాగ్రత్తగా చూసుకోవాలనేది ఇద్దరు ముఖ్యనేతల ఆలోచనగా చెబుతున్నారు. కానీ, కొందరు ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా, తమ తీరు మార్చుకోవడం లేదని, పార్టీని వెనక్కి నెట్టి తమ సొంత పనులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి లోకేశ్ అసంతృప్తి చెందుతున్నారని అంటున్నారు. తాజాగా జోనల్ ఇంచార్జిల సమావేశంలో కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారని అంటున్నారు. టీడీపీలో సభ్యత్వంతో పాటు బీమా కూడా కార్యకర్తలకు చేయిస్తున్నారు. ఎవరైనా కార్యకర్త ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం పార్టీ ప్రాధమిక కర్తవ్యంగా లోకేశ్ భావిస్తున్నారు. దీనివల్ల కార్యకర్తల కుటుంబాలకు భరోసా కలుగుతుందని ఆలోచిస్తున్నారు. ఇక ఇటీవల పార్టీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు 600 మంది చనిపోతే అందరికీ రూ.5 లక్షల చొప్పున బీమా డబ్బు మంజూరైంది. అయితే వీరిలో 75 మందికి బీమా మొత్తం ఇప్పటికీ అందజేయలేదు. దీనికి ఆయా ఎమ్మెల్యేలు సమయం కేటాయించకపోవడమే కారణంగా చెబుతున్నారు. ఈ విషయం తెలిసి మంత్రి లోకేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పార్టీకి కార్యకర్తలే అధినేతలు అని.. కార్యకర్తల కష్టంతోనే తాము గెలిచామన్న విషయాన్ని ఎమ్మెల్యేలు విస్మరిస్తే ఎలా అంటూ లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశాన్ని ఎమ్మెల్యేలకు తెలియజేసి వారి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సూచించారు.ఈ విషయం తెలిసి ఇద్దరు మంత్రులతో సహా 25 మంది ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు. పని ఒత్తిడి వల్ల కార్యకర్తలకు బీమా చెక్కులు అందజేయలేకపోయామని మౌఖికంగా వివరణ ఇచ్చుకున్నారని అంటున్నారు. అయితే మంత్రి లోకేస్ సీరియస్ వార్నింగు దృష్టిలో పెట్టుకుని లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సూచించినట్లు చెబుతున్నారు. కాగా, కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పదవుల్లోనూ నియమిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు పదవులు రాలేదని ఏ ఒక్కరూ నిరుత్సాహ పడొద్దని, అందరికీ న్యాయం చేసే పూచీ తనదని లోకేశ్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

👉 దేశవ్యాప్తంగానే పోరు : సర్ ని బెంగాల్ లో అమలు చేయడంతో మమతా బెనర్జీ కలకత్తా కాళీ మాత అవతారమే ఎత్తారు. ఆమె ఆగ్రహంగా బీజేపీని ఈసీని కలిపి మరీ విమర్శిస్తున్నారు. ఎన్నికలు ప్రజాస్వామికంగా నిర్వహించకుండా చేస్తున్న నిర్వాకం ఇదని ఫైర్ అవుతున్నారు. అవసరం అనుకుంటే తాను దేశవ్యాప్తంగా సర్ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తాను అని ఆమె కేంద్ర ప్రభుత్వానికి ఈసీకి సవాల్ చేశారు. అయితే సర్ వంటి ఎన్నికల ప్రక్రియను రాజ్యాంగపదవిలో ఉన్న మమతకు తగదని బీజేపీ నేతలు అంటున్నారు. అక్రమ చొరబాటుదారులు వలసదారుల ఓట్లను తొలగిస్తే మమతకు వచ్చిన ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు ఇదీ సన్నివేశం : బీహార్ లో ఏకంగా సర్ పేరుతో 50 లక్షలకు పైగా ఓట్లను తీసి పక్కన పెట్టారు. ఇక పశ్చిమ బెంగాల్ లో కూడా లక్షలలోనే అక్రమ ఓటర్లు ఉన్నారని బీజేపీ భావిస్తోంది. వారి అండతోనే తృణమూల్ కాంగ్రెస్ వరసబెట్టి మూడు సార్లు అధికారంలోకి వచ్చింది అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈసారి అక్రమ ఓటర్లు తొలగిపోతే గెలుపు తమదే అని అంటున్నారు. మూడు సార్లు గెలిచిన మమతకు యాంటీ ఇంకెంబెన్సీ తారస్థాయిలో ఉందని అదే తమకు విజయం సమకూరుస్తుందని అంటున్నారు. మొత్తానిక్ సర్ అన్న పులి మీద మమత స్వారీ అయితే చేస్తున్నారు అదే సమయంలో బీజేపీతో హోరాహోరీ తలపడుతున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

👉ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు.. హోంమంత్రి అనిత*రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష… శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతన్న మంత్రి అనిత …నేర నియంత్రణకు టెక్నాలజీ, వసతుల కల్పనలో రాజీ పడబోమని వెల్లడి… త్వరలో అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు అందిస్తామని హామీ…రాష్ట్రంలోని శాంతిభద్రతల ప్రస్తుత పరిస్థితి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, టెక్నాలజీ వినియోగం, పోలీసు విభాగానికి చెందిన మానవ వనరులు, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు త్వరలోనే కొత్త వాహనాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అనిత ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రజల రక్షణ విషయంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని, శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఆమె పునరుద్ఘాటించారు.

👉ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ట్రాఫిక్ సమస్యలపై ఆటో డ్రైవరులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ*

ప్రకాశం జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు, ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ శివప్రసాద్  రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ఆటో యూనియన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద తరచుగా ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు బ్లాకేజ్ మరియు ప్రయాణికుల రాకపోకలకు కలిగే అంతరాయం గురించి వివరంగా చర్చించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు నిర్దేశిత ప్రదేశాల్లోనే ఆటోలను నిలుపుకోవాలని, రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని ఆర్‌ఎస్‌ఐ  సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, రైల్వే స్టేషన్ ప్రాంతం ఎప్పుడూ క్రమబద్ధంగా ఉండేలా అందరూ సహకరించాలని తెలిపారు.ఈ సమావేశంలో RPF సిబ్బంది కూడా పాల్గొని ట్రాఫిక్ నిర్వహణలో సమన్వయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజల భద్రత మరియు సౌకర్యం కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు.

* *లేడి డాక్టర్లు దుస్తులు మార్చుకుంటుండగా ఫోటో తీసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు*గుంటూరు కాటూరి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ లో లేడీ డాక్టర్స్ డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు వీడియోలు తీసిన ఆర్ వెంకట సాయి అనే కాంపౌండర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంగళవారం డిఎస్పి భానోదయ మాట్లాడుతూ…, ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ నరహరి వెళ్లి ఫోన్ స్వాధీనం చేసుకున్నారని..,ఫోన్ లోని రెండు వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

👉ఫిల్మ్‌నగర్‌లో నకిలీ IPS అధికారి అరెస్ట్ .. హైదరాబాద్: ఫిల్మ్‌నగర్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. శశికాంత్ అనే వ్యక్తి ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అంటూ గత కొంతకాలంగా బిల్డర్లు, వ్యాపారులను మోసం చేస్తున్నట్టు విచారణలో బయటపడింది. పోలీసుల సమాచారం ప్రకారం, శశికాంత్ ఇద్దరు గన్‌మెన్లను అద్దెకు పెట్టుకొని నిజమైన అధికారిలా వ్యవహరిస్తూ బిల్డర్లను బెదిరించినట్లు తెలుస్తోంది. ‘స్పెషల్ ఆఫీసర్’ అని చెప్పుకుంటూ పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.బిల్డర్లు ఇచ్చిన ఫిర్యాదులు, సేకరించిన ఆధారాల మేరకు పోలీసులు శశికాంత్‌ను ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా, గన్‌మెన్లను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.      👉సర్వీస్ గన్ తాకట్టు పెట్టిన హైదరాబాద్ ఎస్సై.. అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్…బెట్టింగ్ అప్పుల ఊబిలో చిక్కుకున్న అంబర్‌పేట్ ఎస్సై…రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం స్వాహా… సర్వీస్ గన్‌ను కూడా తాకట్టు పెట్టినట్లు తీవ్ర ఆరోపణలు… ఎస్సై భాను ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్…    హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది. బెట్టింగ్ వ్యసనంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు, కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది.వివరాల్లోకి వెళ్తే, ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారులు తొక్కాడు. ఓ రికవరీ కేసులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.అంతేకాకుండా, భాను ప్రకాశ్ వద్ద ఉండాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై వారు నిలదీయగా, ఎస్సై నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో లోతుగా విచారించగా, బంగారంతో పాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఎస్సై భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

7k network
Recent Posts

👉ప్రైవేట్ బుక్స్ కొనాలని ప్రైవేట్ స్కూళ్ల ఒత్తిడి* …ప్రైవేట్ స్కూళ్లు TC ఇవ్వకుంటే గుర్తింపు రద్దు… డి ఈ ఓ రేణుక…👉హైదరాబాద్‌లో నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్‌.* …👉ఇక పేదోడికీ ఖరీదైన వైద్యం.. మెడికల్ మార్జిన్లపై ప్రభుత్వం ఉక్కుపాదం..!…👉గుంటూరు GGH ,ఆసుపత్రిలో పోలీసుల కళ్లుగప్పి జంప్! ఖైదీ పరార్ వెనుక షాకింగ్ నిజాలు!*

మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!!!👉అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు*…👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య..(వరంగల్ జిల్లా)..👉హైద‌రాబాద్‌లో డిఫెన్స్ మ‌ద్యం ప‌ట్టివేత‌…👉ఏసీబీ వలలో ఎస్సైలు.. 👉మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్య (వరంగల్)..👉మే 4న కృష్ణా జలాలపై *మార్కాపురంలో* *వైఎస్సార్సీపీ సదస్సు*

👉క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..👉ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్..👉 స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో బయటికి వస్తున్న సంచలన విషయాలు …*బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఒడిస్సా వాసి!!!….*20 మందికి పైగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిన గుంటూరు యువకుడు…👉వి.ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ముత్తుముల ..

👉ఎన్డీయేకు చీకటి రోజు: ప్రియాంకా గాంధీ*…👉కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…👉వైయస్ జగన్ కుటుంబంపై తప్పుడు ప్రచారం.. యూట్యూబ్ ఛానళ్లపై వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు …👉నా ఇంటిపై దాడి చేసిన వారిని, కస్టడీలో నాతో దురుసుగా ప్రవర్తించిన పోలీసుల్ని వదిలిపెట్టను: మాజీ మంత్రి అంబటి…👉చిలకలూరిపేట మున్సిపాలిటీలో కళ్లు చెదిరే స్కామ్! రూ.34 లక్షల స్వాహా.. 👉ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాచర్ల ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ ఘన విజయం… 👉 జాతీయ అవార్డు అందుకున్న “స్పందన” విద్యాసంస్థలు*…👉అక్రమ రేషన్ బియ్యం తరలింపులో విద్యార్థి సంఘం నేత**ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్ పై కేసు నమోదు..👉నకిలీ రసీదులతో దందా

👉 ఇరాన్ పై మళ్లీ అమెరికా ఉక్కుపాదం..👉 ఎల్.పీజీ గ్యాస్ సరఫరా పునరుద్ధరణకు నాలుగేళ్లు పడుతుందా?…👉స్వీయ జనగణన కార్యక్రమంలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు… 👉 బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల ధర్నా…👉 దళిత క్రైస్తవులను ఎస్సీ ల జాబితాలో కొనసాగించాలి…సిపిఎం…👉జనగణన-2027 ప్రక్రియ ‘స్వీయ గణన’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి.. మంత్రి డోలాశ్రీ….👉 ట్రాఫిక్ సిబ్బందికి సమ్మర్ కిట్ల అందజేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్… 👉నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టిన ప్రకాశం జిల్లా పోలీసులు… 👉 కంభం లోని ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు…👉 ఇంటర్మీడియట్ ఫలితాలలో మార్కాపురం జిల్లా కంభం గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ ..

👉 మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు: హెర్మూజ్ జలసంధి వద్ద థాయ్‌లాండ్ నౌకపై ఇరాన్ దాడి! …👉నేటి నుంచే హర్మూజ్‌ దిగ్బంధనం: అమెరికా*…👉కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు…👉చిలకలూరిపేటలో అడ్వకేట్ దారుణ హత్య*…*నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు*…👉పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి!*…👉ఉప్పల్ ఇండియన్ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా బారులు తీరిన జనాలు… నెల రోజులుగా అందని గ్యాస్… …👉అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి !!!